political controversy - Praja Mantalu

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్ – మార్చి 3 వరకు రిమాండ్
క్యాతనపల్లి, ఫిబ్రవరి 18 (ప్రజా మంటలు):

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను క్యాతనపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. మున్సిపల్ చైర్మన్ ఎంపిక సందర్భంగా జరిగిన గందరగోళంలో పోలీసులపై దాడి చేశారనే ఆరోపణలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల సమాచారం ప్రకారం, చైర్మన్ ఎన్నికల సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో విధుల్లో ఉన్న పోలీసులతో వాగ్వాదం చోటుచేసుకొని, దాడి జరిగినట్లు కేసు నమోదు చేశారు.

అరెస్టు అనంతరం బాల్క సుమన్‌ను స్థానిక కోర్టులో హాజరుపరచగా, కోర్టు మార్చి 3వ తేదీ వరకు రిమాండ్ విధించింది. ఈ ఘటనపై మరింత విచారణ కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు.

రాజకీయ వర్గాల్లో ఈ అరెస్టు చర్చనీయాంశమైంది. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అధికారిక ప్రకటనల ద్వారా వెలువడాల్సి ఉంది.

ఏ పార్టీ తెలవని ఎమ్మెల్యే బీ-ఫారం ఎలా ఇస్తారు? – కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం సహించం: మాజీ మంత్రి టీ. జీవన్ రెడ్డి
జగిత్యాల, జనవరి 19 (ప్రజా మంటలు):

తాను ఏ పార్టీకి చెందినవాడో కూడా స్పష్టత లేని ఎమ్మెల్యే, మున్సిపల్ ఎన్నికలలో బీ-ఫారం ఇవ్వడం గురించి మాట్లాడడం విడ్డూరమని మాజీ మంత్రి టీ. జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ మిత్రుల కలయిక సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ, రాజ్యాంగ నిబంధనలు, నైతిక విలువల గురించి ఏ పార్టీలో ఉన్నాడో తెలియని వ్యక్తి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

2014లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బోర్నపల్లి వంతెన కోసం తాను విజ్ఞప్తి చేయగా, కేసీఆర్ సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో నీ జోక్యం ఏమిటని ప్రస్తుత ఎమ్మెల్యేను ఆయన నిలదీశారు.

టిడిపి శాసనసభ రద్దు చేసిన అనంతరం తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు, 1984 పార్లమెంట్ ఎన్నికల తర్వాత అదే ఏడాది డిసెంబర్‌లో కాంగ్రెస్‌లో చేరానని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే మా హక్కులకు అడ్డుపడుతున్నారని, తమ హక్కుల కోసమే తాము మాట్లాడుతున్నామని అన్నారు.

జగిత్యాలలో మాత్రమే జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే రూ.15 కోట్ల విలువైన పనులు సింగిల్ టెండర్ ద్వారా, మూడు శాతం అధికంగా, అగ్రిమెంట్ లేకుండా చేపట్టడం ఇదేనా అభివృద్ధి పనుల్లో పారదర్శకత అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా ఇది మీ బాధ్యత కాదా అని సూటిగా నిలదీశారు.

గత పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వారికి గుర్తింపు ఇవ్వాలన్నదే తమ విజ్ఞప్తి అని తెలిపారు. టికెట్ల విషయమై నిర్ణయం పార్టీ అధిష్టానం తీసుకుంటుందని, కాంగ్రెస్ పార్టీ టికెట్లపై మాట్లాడే అర్హత ఎమ్మెల్యేకు లేదని తీవ్రంగా వ్యాఖ్యానించారు. పదేళ్లు కష్టపడ్డవారు అవకాశాలు పొందాలా? లేక అవకాశవాదులా? అని ప్రశ్నించారు.

చొక్కా రావు హయాంలో తాను జగిత్యాల కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జిగా పనిచేశానని గుర్తు చేశారు. అలాగే యావర్ రోడ్డు విస్తరణ కోసం కలెక్టర్‌కు లేఖ రాస్తే ఎమ్మెల్యే అడ్డుపడిన కారణంగానే ఆ పనులు జాప్యం అయ్యాయని ఆరోపించారు.