Congress Telangana - Praja Mantalu

ఆడబిడ్డగా పార్టీ పెట్టిన.. రాష్ట్రం అజెండా మార్చుతా -కల్వకుంట్ల కవిత
సికింద్రాబాద్‌లో టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ.. ఉచిత విద్య, వైద్యమే లక్ష్యం: కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, జూలై 1 (ప్రజా మంటలు):

సికింద్రాబాద్‌లోని సీతాఫల్ మండిలో తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) జెండాను పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో అజెండా మారాల్సిన అవసరం ఉందన్నారు. పేదలు, మధ్యతరగతి ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని చెప్పారు.

తెలంగాణ ఏర్పడి ఎన్నేళ్లు గడిచినా పేదల జీవన పరిస్థితుల్లో ఆశించిన మార్పు రాలేదని ఆమె వ్యాఖ్యానించారు. అధికారంలోకి వస్తే పేదలపై విద్య, వైద్య ఖర్చు భారం లేకుండా పూర్తిగా ఉచిత సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. యువత స్వయం ఉపాధి కోసం రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు రుణాలు అందించే విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు.
ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని కవిత ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, కొత్త పెన్షన్లు, ఆరు గ్యారంటీల అమలుపై ప్రశ్నలు లేవనెత్తారు. పేదల అవసరాల కంటే భారీ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు.
ఉద్యమకారులకు భూములు ఇస్తామని ప్రకటించి అమలు చేయలేదని ఆరోపించిన ఆమె, ఉప్పల్ భగాయత్‌లో భూపోరాటం నిర్వహించి ప్రభుత్వ భూమిని ఉద్యమకారులకు కేటాయించే ఉద్యమం చేపడతామని వెల్లడించారు.
అనంతరం మెహదీపట్నంలో నిర్వహించిన జాబ్ మేళాలో పాల్గొన్న కవిత, యువత షార్ట్‌కట్‌ల కంటే నైపుణ్యాభివృద్ధి, కష్టపడి పనిచేయడంపైనే దృష్టి పెట్టాలని సూచించారు. ఉద్యోగ ఇంటర్వ్యూలలో నిజాయితీగా వ్యవహరించాలని, కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

జగిత్యాల అభివృద్ధే నా లక్ష్యం – అసత్య ఆరోపణలకు ప్రజలే సమాధానం చెబుతారు: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
విమర్శించే ముందు గతాన్ని గుర్తుంచుకోవాలి

ఉద్దేశపూర్వక ఆరోపణలు, హింసా రాజకీయాలు వద్దు

జగిత్యాలకు అత్యధిక నిధులు – అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారు

(సిరిసిల్ల రాజేందర్ శర్మ)

జగిత్యాల, జనవరి 18 (ప్రజా మంటలు):

జగిత్యాల మోతే పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడారు. జగిత్యాల అభివృద్ధి కోసం నిధుల విషయంలో ముఖ్యమంత్రిని కలిసిన అనంతరం, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తనపై అసత్య ఆరోపణలు చేసి కార్యకర్తలను రెచ్చగొట్టి తన ఇల్లు, హాస్పిటల్‌పై దాడులు చేయించారని ఆరోపించారు. కనీసం వివరణ కూడా అడగకుండా ఉద్దేశపూర్వకంగా తనపై ఆరోపణలు చేశారని అన్నారు.

జగిత్యాలకు అత్యధిక నిధులు – అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారు

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత డబుల్ బెడ్‌రూం ఇళ్ల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని, ముఖ్యమంత్రిని కలిసిన తర్వాతే రూ.34 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. జగిత్యాల, రాయికల్ పట్టణాల్లో ప్రతి వార్డులో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, రాష్ట్రంలో అత్యధిక నిధులు జగిత్యాలకే వచ్చాయని స్పష్టం చేశారు.
“ప్రజలు అభివృద్ధి కోరుకుంటారు కానీ హత్య రాజకీయాలు కాదు. ‘నరికేస్తా, చంపేస్తా’ అనే మాటలు రాజ్యాంగానికి విరుద్ధం. సీనియర్ నాయకులు హింసను ప్రోత్సహించకుండా ప్రజలకు ఆదర్శంగా నిలవాలి” అని ఎమ్మెల్యే అన్నారు.

విమర్శించే ముందు గతాన్ని గుర్తుంచుకోవాలి

బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడి రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేస్తూ, గతంలో టీడీపీ, ఇతర పార్టీల్లో పనిచేసిన చరిత్ర అందరికీ తెలుసన్నారు. కోరుట్లకు రావాల్సిన ఇంజనీరింగ్ కాలేజీని హైదరాబాద్‌కు తరలించారని, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ అమ్మకంపై కూడా ప్రశ్నించారు.
తాను ప్రభుత్వం తో కలిసి పనిచేసిన అంశంపై చట్టానికి మాత్రమే జవాబు ఇస్తానని, సీనియర్ నాయకులకు ప్రశ్నించే నైతిక హక్కు లేదని వ్యాఖ్యానించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని పిలుపునిచ్చారు.

ఈ మీడియా సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, మాజీ ఏఎంసీ చైర్మన్ కోలుగురి దామోదర్ రావు, సీనియర్ నాయకులు గట్టు సతీష్, అబ్దుల్ ఖాదర్, ముజాహిద్, అడువల లక్ష్మణ్, దుమాల రాజ్ కుమార్, శ్రీనివాస్, తిరుమలయ్య, కూసరి అనిల్, తోట మల్లికార్జున్, పద్మావతి పవన్, బద్దం లత, వద్ధి శ్రీలత, గుర్రం రాము, పంబల రాము, బోడ్ల జగదీష్, బిక్షపతి, రంగు మహేష్, కోరె గంగమల్లు, ఫుర్ఖాన్, ఫారూఖ్, శరత్ రావు, అహమ్మద్, జావేద్, నరేందర్, మతీన్ తదితరులు పాల్గొన్నారు.