development - Praja Mantalu

ఎన్ని విమర్శలు చేసినా జగిత్యాల అభివృద్ధి ఆగదు: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
జగిత్యాల, ఆగస్టు 30 (ప్రజా మంటలు):

జగిత్యాల నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎన్ని విమర్శలు చేసినా అభివృద్ధి పనులు ఆగబోవని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. శనివారం జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన సీనియర్ నాయకుడు తాటిపర్తి జీవన్‌రెడ్డి చేసిన విమర్శలకు స్పందించారు.

జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు విమర్శలుగా కాకుండా ద్వేషపూరితంగా ఉన్నాయని ఎమ్మెల్యే ఆరోపించారు. కార్యకర్తలను పక్కన పెట్టి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రహస్యంగా కలుస్తూ మరోవైపు రాజకీయంగా భిన్నమైన వ్యాఖ్యలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. గత పదేళ్లపాటు కేసీఆర్‌ను తీవ్రంగా విమర్శించిన జీవన్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పాలాభిషేకం చేశారని గుర్తుచేశారు.

ప్రజల కోసం పనిచేస్తున్న తనను ‘ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ’గా అభివర్ణించడం విడ్డూరంగా ఉందని సంజయ్ కుమార్ అన్నారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేయడం కూడా ప్రైవేట్ కంపెనీ నడపడం అవుతుందా అని ప్రశ్నించారు.

ఇందిరమ్మ కాలనీపై 17 ఏళ్ల తర్వాతే దృష్టి

2008లో శంకుస్థాపన చేసిన ఇందిరమ్మ కాలనీని ఇన్నేళ్లుగా పట్టించుకోలేదని ఎమ్మెల్యే విమర్శించారు. 17 ఏళ్ల తర్వాత తాను కాలనీ సమస్యలపై దృష్టి సారించి ఇళ్ల నిర్మాణం చేపట్టానని తెలిపారు. ప్రభుత్వంతో సమన్వయంతో పనిచేయడం వల్ల అర్బన్ హౌసింగ్ కాలనీకి రూ.34 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు.

రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు 1,500 చొప్పున డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరైతే, జగిత్యాల నియోజకవర్గంలో మాత్రం సుమారు 4,500 ఇళ్ల నిర్మాణంలో తన పాత్ర ఉందని పేర్కొన్నారు. ఇతర నియోజకవర్గాల్లో మంజూరైన ఇళ్లలో సగం కూడా నిర్మించలేదని ఆయన అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీగా ఎనిమిది నెలలు ఉన్న సమయంలో ఇందిరమ్మ కాలనీ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం జీవన్‌రెడ్డి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాలనీ వాసులకు ఉగాది నాటికి బూరెలు తినిపిస్తానని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు.

రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిందనేది వాస్తవమని, అయితే వాటి నిర్మాణం విషయంలో స్థానికంగా ఎంత పని జరిగిందన్నదే ముఖ్యమని సంజయ్ కుమార్ అన్నారు.

వైద్య, విద్య రంగాలకు ప్రాధాన్యం

జగిత్యాల వైద్య కళాశాల ఏర్పాటులో తన కృషి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. తెలంగాణలో వైద్య కళాశాల, ఆసుపత్రి, నర్సింగ్ కళాశాల ఒకే ప్రాంతంలో ఉన్న జిల్లాగా జగిత్యాల నిలిచిందన్నారు. 334 మంది వైద్యులు, 366 మంది నర్సులు, 730 పడకల ఆసుపత్రికి అనుమతులు వచ్చినట్లు తెలిపారు.

నియోజకవర్గంలో ప్రస్తుతం 3,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొనసాగుతోందని, కొన్ని ఇళ్లు పూర్తయ్యాయని చెప్పారు. మరో 2,000 ఇళ్లు మంజూరయ్యాయని వెల్లడించారు. సుమారు రూ.200 కోట్లతో యంగ్ ఇండియా సమీకృత పాఠశాల పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

గొల్లపల్లి రోడ్డులో మహిళా డిగ్రీ కళాశాల విషయంలో ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో జీవన్‌రెడ్డి ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. తాటిపల్లి–చల్గల్ ఎత్తిపోతల పథకం పనుల పరిస్థితి ఏమిటో కూడా ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.

కొత్త బస్టాండ్ పెట్రోల్ బంక్ వివాదంపై ప్రశ్నలు

జగిత్యాల కొత్త బస్టాండ్, పెట్రోల్ బంక్ వివాదానికి సంబంధించి కూడా ఎమ్మెల్యే స్పందించారు. జీవన్‌రెడ్డి అనుచరులు మున్సిపల్‌లో ఉన్న సమయంలోనే సంబంధిత అనుమతులు ఇచ్చారా లేదా అని ప్రశ్నించారు. పాత బస్టాండ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోల్ బంక్ అంశంపై తాను ఆలస్యం చేశానని విమర్శిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది పాటు ఎమ్మెల్సీగా ఉన్న జీవన్‌రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అంతకుముందు మంత్రిగా ఉన్న సమయంలో ఎందుకు పరిష్కరించలేదని నిలదీశారు.

గత నాలుగేళ్లుగా కాంట్రాక్టర్లకు బిల్లులు సకాలంలో రాకపోవడంతో అనేక అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఎమ్మెల్యే తెలిపారు. తుఫిడ్క్ నిధులు గత ప్రభుత్వం మున్సిపల్‌లో డిపాజిట్ చేయకపోవడం వల్ల కొన్ని పనులు ప్రారంభం కాలేదని పేర్కొన్నారు.

విమర్శలకు గత చరిత్రే సమాధానం

ప్రతి అభివృద్ధి పనిని విమర్శించాలనుకుంటే గతంలో జరిగిన వ్యవహారాలపై పూర్తి చిట్టా తన వద్ద ఉందని సంజయ్ కుమార్ అన్నారు. తనపై విమర్శలు చేసే ముందు గతంలో జరిగిన రాజకీయ పరిణామాలు, అభివృద్ధి పనుల పరిస్థితిని ప్రజలకు వివరించాలని సూచించారు.

తన హయాంలో అభివృద్ధి కంటే అణచివేత ధోరణికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని జీవన్‌రెడ్డిపై ఆరోపణలు చేశారు. మాజీ జెడ్పీ చైర్మన్‌పై విజిలెన్స్ కేసు పెట్టించారని, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిని భూ కబ్జాదారుడిగా విమర్శించారని గుర్తుచేశారు. దశాబ్ద కాలం కేసీఆర్‌ను తీవ్రంగా విమర్శించిన విషయాలను ఇప్పుడు మర్చిపోయారా అని ప్రశ్నించారు.

జగిత్యాల ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ప్రతిరోజూ అభివృద్ధి పనులకు భూమిపూజలు చేస్తున్నామని, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఎన్ని విమర్శలు చేసినా జగిత్యాలలో అభివృద్ధి మాత్రం ఆగదని ఆయన అన్నారు.

ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజంగి నందయ్య, సీనియర్ నాయకుడు బండ శంకర్, మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కొత్త మోహన్, కౌన్సిలర్లు ప్రశాంత్ రావు, పిట్ట ధర్మరాజు, మాజీ వైస్ చైర్మన్ మన్సూర్, నాయకులు కప్పల శ్రీకాంత్, రామకృష్ణారెడ్డి, మ్యానపురి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

సిద్ధిపేటలో భారీ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం – నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం
సిద్ధిపేట, మార్చి 22 (ప్రజా మంటలు):

ప్రజా పాలనలో భాగంగా నిర్వహిస్తున్న రైతు ఉత్సవాల కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం సిద్ధిపేట జిల్లాలో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

. ఈ సందర్భంగా నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో రూ.300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించి రాష్ట్ర రైతులకు అంకితం చేశారు.. అదనంగా ఆయిల్ పామ్ రిఫైనరీ యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు..
ఇదే సమయంలో జిల్లాలో మొత్తం రూ.775.72 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సీఎం మంత్రులతో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు..

. అనంతరం ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సభలో రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను విడుదల చేశారు..
🔹 సిద్ధిపేట నియోజకవర్గంలో ముఖ్య కార్యక్రమాలు:
నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం (రూ.300 కోట్లు)
సిద్దిపేట మున్సిపాలిటీలో నీటి సరఫరా, డ్రైనేజీ ప్రాజెక్టులు (రూ.141.34 కోట్లు)
ఎన్సాన్‌పల్లిలో జిల్లా జైలు భవనం ప్రారంభం (రూ.78 కోట్లు)
50 పడకల ఆయుష్ ఆసుపత్రి ప్రారంభం (రూ.15 కోట్లు)
సెంట్రల్ మెడిసిన్ స్టోర్ ప్రారంభం (రూ.3.60 కోట్లు)
గట్లమల్యాలలో PHC భవనం ప్రారంభం (రూ.1.43 కోట్లు)
అంబేద్కర్ నగర్‌లో UPHC భవనం ప్రారంభం (రూ.1.43 కోట్లు)
🔹 గజ్వేల్ నియోజకవర్గంలో కార్యక్రమాలు:
కొండపాకలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ (రూ.200 కోట్లు)
మర్కూక్‌లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ మౌలిక వసతులు (రూ.16.62 కోట్లు)
మర్కూక్‌లో మండల కార్యాలయాల సముదాయం ప్రారంభం (రూ.8.65 కోట్లు)
జగదేవ్‌పూర్‌లో మండల కార్యాలయాల సముదాయం ప్రారంభం (రూ.9.65 కోట్లు)
ఈ కార్యక్రమాలతో సిద్ధిపేట జిల్లా అభివృద్ధి దిశగా మరింత వేగంగా ముందుకు సాగుతుందని అధికారులు పేర్కొన్నారు. రైతులకు ఆదాయ వనరులు పెంపొందించడంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ కీలక పాత్ర పోషించనుందని భావిస్తున్నారు.

అధికార పార్టీ అండతోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే సంజయ్ కుమార్
రాయికల్, ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు):

రాయికల్ మండలం ఆలూరు, రాజ్‌నగర్ గ్రామాల్లో మహిళా సమాఖ్య భవనాల నిర్మాణానికి రూ.10 లక్షల చొప్పున మంజూరు కాగా, ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ భూమిపూజ నిర్వహించారు.

మహిళలు ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షిస్తూ, గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్య, వైద్య రంగాలతో పాటు మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. అధికార పార్టీ అండతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.

గ్రామాల్లో ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండటంతో మహిళా స్వయం సహాయక సంఘాలకు శాశ్వత భవనాల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మహిళలకు గౌరవం, భద్రత, ఆత్మవిశ్వాసం కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.

యావర్ రోడ్డు విస్తరణ, పట్టణ అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల, ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు):

జగిత్యాల మోతే రోడ్డులోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ, జగిత్యాల–రాయికల్ పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనే తన లక్ష్యమన్నారు.

2021లో జగిత్యాల పట్టణంలో 12 జోన్ల పరిధిలో 121 సర్వే నంబర్లను మార్చి, యావర్ రోడ్డుపై ఉన్న ప్రాంతాలను రెసిడెన్షియల్, కమ్యూనికేషన్ జోన్ నుంచి కమర్షియల్ జోన్‌గా మార్పు చేసినట్లు తెలిపారు. యావర్ రోడ్డును 100 అడుగుల రోడ్డుగా అభివృద్ధి చేశామని, జోన్ల మార్పుతో చట్టబద్ధ అనుమతులు లభిస్తున్నాయని చెప్పారు.

జగిత్యాల ప్రజల చిరకాల కోరిక అయిన యావర్ రోడ్డు విస్తరణ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని, భూమి కోల్పోయే వారికి TDR (ట్రాన్స్‌ఫర్ ఆఫ్ డెవలప్‌మెంట్ రైట్స్) ద్వారా నష్టపరిహారం చెల్లించనున్నట్లు తెలిపారు. 2023లో 100 అడుగుల రోడ్డుకు సంబంధించిన జీఓ, TDR అంశంపై ప్రభుత్వం నుంచి హామీ లభించిందన్నారు.

నిన్న గుమ్లాపూర్ సభలో యావర్ రోడ్డు విస్తరణతో పాటు ఇంటిగ్రేటెడ్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం, మినీ స్టేడియానికి స్థలం కేటాయిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని వెల్లడించారు. అధికార పార్టీ అండతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు.

అభివృద్ధి పనులను అడ్డుకునే విధంగా ఆరోపణలు చేయడం తగదని, ప్రభుత్వం తో కలిసి ప్రజలకు పనిచేసే కౌన్సిలర్లను గెలిపించాలని ప్రజలను కోరారు. యావర్ రోడ్డు విస్తరణకు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రికి జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సమావేశంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ధర్మపురిలో అభివృద్ధి పనుల శంకుస్థాపన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం
ధర్మపురి, జనవరి 21 (ప్రజా మంటలు):

ధర్మపురి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు హెలిప్యాడ్ వద్ద ఘన స్వాగతం లభించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి వచ్చిన డిప్యూటీ సీఎంకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల MLA సంజయ్ కుమార్, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి స్వాగతం పలికారు.

జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాల్లో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కూడా పాల్గొని అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల విస్తరణకు ఈ పనులు దోహదపడతాయని నేతలు పేర్కొన్నారు.

గత ప్రభుత్వం పాలమూరును పట్టించుకోలేదు – డీకే అరుణ
జడ్చర్ల, జనవరి 17 (ప్రజా మంటలు):

గత ప్రభుత్వం పాలమూరు అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రజలను మోసం చేసిందని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు.

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లిలో రూ.200 కోట్లతో నిర్మించనున్న రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (IIIT) భూమిపూజ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.

ఎన్నికల సమయంలో వేదికపై ఉన్నవారంతా తన ఓటమికి గట్టిగా పనిచేశారని, అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేస్తామని అన్నారు. పాలమూరు అభివృద్ధికి కేంద్రం తరపున పూర్తి సహకారం అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులను సమన్వయంతో ఉపయోగించుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను మంజూరు చేయాలని కోరారు. పాలమూరు అభివృద్ధి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని డీకే అరుణ స్పష్టం చేశారు.