eshwar - Praja Mantalu

సారంగాపూర్, బీర్పూర్ మండలాల అభివృద్ధికి నిరంతరం కృషిచేశాం - మాజీ మంత్రి జీవన్ రెడ్డి
రోల్లవాగు ప్రాజెక్ట్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా అభివృద్ధి

రోల్లవాగు నిర్మాణ జాప్యం మత్సకారుల శాపంలా మారింది

జగిత్యాల (గ్రామీణ) అక్టోబర్ 27 (ప్రజా మంటలు):

సారంగపూర్ మండల కేంద్రంలో పత్రిక సమావేశంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి  మాట్లాడుతూ,గత ప్రభుత్వ ప్రజాప్రతినిధులే రోళ్లవాగు జాప్యానికి కారకులని,సారంగాపూర్ మండలాన్ని అభివృద్ధి చేయడానికి పెద్దలు కొండా మల్ల రెడ్డి  చాలా కృషి చేశారని అన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మండలంలో ఇంటర్ స్థాయి విద్య  అవకాశాలు లేని చోట, మండలానికి ఒక కళాశాల ఏర్పాటు చేయాలని భావించి,సారంగాపూర్ మండలంలో 2 జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేశారు. బీర్పూర్ మరియు సారంగాపూర్ మండలాలకు గుర్తింపు వచ్చింది అంటే దానికి కారణం కమ్మునూరు కలమడుగు గ్రామాల మధ్యలో గల గోదావరి నదిపై గల బ్రిడ్జి అని అన్నారు.

మన ప్రాంతానికి వాణిజ్యపరంగా మేలు కలిగితే,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వుట్నూరు కడెం జన్నారం ప్రాంత గిరిజనులకు ఆదివాసులకు విద్య వైద్య సదుపాయాలకు ఉత్తర ద్వారం తలుపులు తెరిచినట్టయిందని అన్నారు.

రోల్లవాగు ప్రాజెక్ట్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా అభివృద్ధి

రాజుల చెరువు (రోల్లవాగు) ను శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ డిస్ట్రిబ్యూషన్ కాల్వల ఏర్పాటు సమయంలో బీర్పూర్ ప్రాంతంతో పాటుగా ధర్మపురి మండలానికి సాగునీటి ఎద్దటి కలగకుండా చూడాలని ఈ రాజుల చెరువును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 0.25 TMC నిలువ సామర్థ్యంతో రోళ్లవాగు ప్రాజెక్టుగా రూపొందించి ఎస్సారెస్పీలో ఇది అంతర్భాగంగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా దీన్ని రూపొందించడం జరిగిందాని తెలిపారు.

జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఇంకా ఇలా తెలిపారు:

సాగునీటితో పాటుగా త్రాగునీరు కూడా అందించాలని రక్షిత మంచినీటి సరఫరా చేయాలని  ఈ ఫిల్టర్ బెడ్ సౌకర్యం ఎక్కడ లేకుండే కానీ బీర్పూర్ లో ఏర్పాటు చేశాం .

తెలంగాణ ఏర్పడిన తర్వాత కెసిఆర్ కరీంనగర్ కు మొట్టమొదటిసారి పర్యటనకు వచ్చినప్పుడు, నేను శాసన సభ్యునిగా ఉన్న సమయంలో రాయికల్ మండలం బోర్నపల్లి మరియు కడెం మండలం బెల్లాల గ్రామాల మధ్యలో గల గోదావరి నదిపై వంతెన నిర్మిస్తే ఈ ప్రాంతానికి భవిష్యత్తు వేసినట్టు అవుతాం అని కెసిఆర్ గారికి విజ్ఞప్తి చేయడంతో వెంటనే 70 కోట్లు మంజూరు చేసినారు.

కొప్పుల ఈశ్వర్ ధర్మపురి శాసనసభ్యులుగా ఉన్న సమయంలో రోళ్లవాగు ఆధునికరణ అనేది తెరమీదకి తీసుకువచ్చి 60 కోట్లతో మంజూరై 153 కోట్లకు వెళ్ళింది ఇప్పుడు.

బోర్నపల్లి వంతెన దాదాపుగా రెండు మూడు సంవత్సరాలలో పూర్తి చేసుకుని వినియోగంలోకి తెచ్చాం.రాజకీయ ప్రాతినిధ్యం ఎవరిది ఉన్న నిర్మాణంలో మాత్రం అలసత్వం. ఈ నిర్మాణ అలసత్వ కారణంగా మత్స్యకారుల కోట్లాది రూపాయల మత్స్య సంపద కోల్పోయింది.

బీర్పూర్ మండలం నర్సింహులపల్లి, తుంగూరు, తాళ్ల ధర్మారం గ్రామాల భూముల్లో ఇసుక మేటలు వేయగా రైతులు వాటిని తొలగించడానికి భూమి దరకు సమానంగా ఖర్చయింది

రోల్లవాగు నిర్మాణ జాప్యం మత్సకారుల శాపంలా మారింది

అప్పటి అలసత్వాన్ని ప్రభుత్వ వైపల్యమా లేక  ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులను అనడమా? ఎవరిని  అనడమో కానీ ఆ అలసత్వంతో నిర్మాణం జాప్యం కావడంతో ఇటు మత్స్యకారులు తీవ్ర నష్టపోయినారు. పది సంవత్సరాల నుండి అక్కడ చేపల పెంపకం అవకాశం కోల్పోయారు.

కొప్పుల ఈశ్వర్ మంత్రిగా ఉన్న సమయంలో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో బీర్పూర్ లో మేము నాలుగు గంటలు ధర్నా చేశాం. ఎస్సారెస్పీ అధికారులు దిగివచ్చి రెండో పంటకు నీరు విడుదల చేస్తామని చెప్పడంతో మేము ధర్నా విరమించాం

ఉమ్మడి రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిని మా బాధ్యతగా భావించి చేశాంటిఆర్ఎస్ పార్టీ హయాంలో కూడా మేము ఆ రోజు ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా మా బాధ్యత మేము నిర్వహించాం

వాస్తవంగా పనులు నిలిచిపోవడానికి కారణం పెండింగ్ బిల్స్ చెల్లింపు లేకపోవడం.తిరిగి మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ఉన్న ఉత్తంకుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకు వెళ్ళగానే గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న 30 కోట్ల బిల్లులను చెల్లింపు చేశాం

.25 TMC నిల్వకు అదనంగా 1 TMC ప్రతిపాదన ఉన్నదో అదనపు నిల్వ సామర్థ్యానికి రెవెన్యూ ల్యాండ్ ముంపుకు గురవుతుంది దానికి అదనంగా ఫారెస్ట్ ల్యాండ్ ముంపుకు దాదాపు 800 ఎకరాలు ముంపుకు గురవుతుంది

రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ ముంపుకు గురవుతున్నదో దానికి ప్రతిగా రెవెన్యూ ల్యాండ్ ఇవ్వాలి ప్రతిపాదించడం లోపల అప్పటి ప్రాతినిధ్యం చొరవ చూపెట్టక లేకపోవడంతోని ఈ జాప్యం జరిగింది

కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత పెండింగ్ బిల్స్ తో పాటుగా అటవీ శాఖకు చెందిన భూమి ముంపుకు గురవుతుందో దానికి ప్రతిగా పెగడపల్లి మండల నంచర్ల గొల్లపల్లి మండల చందోలి దట్నూర్ ప్రాంతం నుండి సబ్ స్యూడ్ ల్యాండ్ రెవెన్యూకు ప్రతిపాదించడంతో పాటుగా ప్రిన్సిపల్ చీఫ్ ఫారెస్ట్ నుండి ఢిల్లీకి ప్రతిపాదన పోతుంది దాని అనుమతి కేంద్ర ప్రభుత్వం నుండి రావాలి