koppula - Praja Mantalu

గురుకులాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం నిర్లక్ష్యం- కొప్పుల
జగిత్యాల, ఆగస్టు 24 (ప్రజా మంటలు):

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అందించిన విద్యా అవకాశాలను ప్రస్తుత ప్రభుత్వం దెబ్బతీస్తోందని విమర్శించారు. సోమవారం జగిత్యాల జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్‌ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, మార్క్‌ఫెడ్‌ లోక బాపురెడ్డి తదితర బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలే ప్రధాన ఆధారమని, రాష్ట్రంలో దాదాపు 2,000 పాఠశాలలు మూతపడటం లేదా సక్రమంగా పనిచేయకపోవడంతో అడ్మిషన్లు సుమారు 1.26 లక్షల మేర తగ్గాయని కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. కేసీఆర్‌ హయాంలో 1,023 గురుకులాలను ఏర్పాటు చేసి 7 నుంచి 8 లక్షల మంది విద్యార్థులకు ఒక్కొక్కరిపై ఏడాదికి సుమారు రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తూ నాణ్యమైన విద్య అందించామని తెలిపారు.

ప్రస్తుత ప్రభుత్వ హయాంలో గురుకులాల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు, నాణ్యమైన భోజనం కూడా అందడం లేదని ఆయన ఆరోపించారు. వివిధ కారణాలతో 107 మంది విద్యార్థులు మృతి చెందినప్పటికీ వాటికి దారితీసిన కారణాలను సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం ప్రభుత్వం చేయడం లేదని విమర్శించారు. గురుకుల వ్యవస్థను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం దానిని నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరిస్తోందని అన్నారు.

కేసీఆర్‌ హయాంలో గురుకుల పాఠశాలలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ప్రస్తుత ముఖ్యమంత్రి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గురుకుల వ్యవస్థను దెబ్బతీస్తున్నారని ఆయన ఆరోపించారు. గురుకులాల్లో సరైన సౌకర్యాలు లేకపోవడంతో పిల్లలను అక్కడ చేర్పించేందుకు తల్లిదండ్రులు భయపడుతున్న పరిస్థితి ఏర్పడిందన్నారు.

‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్’ విధానం తీసుకురావడం వెనుక ఉన్న గురుకుల వ్యవస్థను బలహీనపరిచే ఉద్దేశాన్ని ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కో నియోజకవర్గానికి సుమారు రూ.15,600 కోట్ల అంచనా వ్యయంతో కొత్త భవనాల నిర్మాణం చేపట్టడం ద్వారా నాయకులు, కాంట్రాక్టర్లకు ప్రయోజనం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఉన్న గురుకులాలను అభివృద్ధి చేయకుండా కొత్త విధానాల పేరుతో విద్యార్థులను, విద్యా వ్యవస్థను గందరగోళానికి గురిచేయడం సరికాదన్నారు.

ఎస్సీ, ఎస్టీ పేద విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చిన బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ పథకం ద్వారా వేలాది మందికి ప్రయోజనం కలిగిందని తెలిపారు. 2014 నాటికి సుమారు 9,000 మందికి ఉన్న అవకాశాలను తమ ప్రభుత్వ హయాంలో 26,000 మందికి విస్తరించామని చెప్పారు. ప్రస్తుతం ఈ పథకానికి సంబంధించి రాష్ట్రంలోని 236 పాఠశాలలకు సుమారు రూ.250 కోట్ల బకాయిలు ఉన్నాయని, వాటిని ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.

ఫీజులు చెల్లించకపోవడంతో కొన్ని విద్యాసంస్థలు విద్యార్థులను గేట్ల వద్ద నిలబెడుతున్నాయని, సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయని కొప్పుల ఈశ్వర్ అన్నారు. పుస్తకాలు, దుస్తులు, షూలు కూడా విద్యార్థులే కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.11,300 కోట్లకు చేరుకున్నాయని, దీంతో విద్యార్థులు ధర్నాలు, రాస్తారోకోలకు దిగాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు.

పాలిటెక్నిక్‌ విద్యా వ్యవస్థపై ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 97 కూడా విద్యార్థుల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలోని 59 ప్రభుత్వ, 97 ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల ద్వారా గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద విద్యార్థులకు లభిస్తున్న విద్యా అవకాశాలను ఈ నిర్ణయం దెబ్బతీస్తుందని అన్నారు. పాలిటెక్నిక్‌ రెండో సంవత్సరం పూర్తి చేసిన అనంతరం నేరుగా బీటెక్‌లో చేరే అవకాశాలు కూడా విద్యార్థులు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.

పాలిటెక్నిక్‌ విద్యా వ్యవస్థను లేబర్‌ డిపార్ట్‌మెంట్‌లోని ఐటీఐలు, స్కిల్‌ యూనివర్సిటీతో అనుసంధానం చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. దీనివల్ల విద్యార్థులతో పాటు అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ లెక్చరర్ల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో 400 మందికి పైగా కాంట్రాక్ట్‌ లెక్చరర్లను పర్మినెంట్‌ చేసి, ప్రమోషన్లు కల్పిస్తూ పాలిటెక్నిక్‌ వ్యవస్థను బలోపేతం చేశామని తెలిపారు.

జీవో 97ను వెంటనే రద్దు చేసి పాలిటెక్నిక్‌ విద్యా వ్యవస్థను యథాతథంగా కొనసాగించాలని బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయకుండా, సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

ప్రభుత్వ వ్యవస్థలు బలహీనపడటంతో పేదలు, కూలీలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలే ఎక్కువగా నష్టపోతున్నాయని ఆయన అన్నారు. సామాన్యుల పిల్లల చదువు, భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్న పరిస్థితిపై ప్రజలు, మేధావులు, విద్యావంతులు ఆలోచించాలని కొప్పుల ఈశ్వర్ కోరారు.

సారంగాపూర్, బీర్పూర్ మండలాల అభివృద్ధికి నిరంతరం కృషిచేశాం - మాజీ మంత్రి జీవన్ రెడ్డి
రోల్లవాగు ప్రాజెక్ట్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా అభివృద్ధి

రోల్లవాగు నిర్మాణ జాప్యం మత్సకారుల శాపంలా మారింది

జగిత్యాల (గ్రామీణ) అక్టోబర్ 27 (ప్రజా మంటలు):

సారంగపూర్ మండల కేంద్రంలో పత్రిక సమావేశంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి  మాట్లాడుతూ,గత ప్రభుత్వ ప్రజాప్రతినిధులే రోళ్లవాగు జాప్యానికి కారకులని,సారంగాపూర్ మండలాన్ని అభివృద్ధి చేయడానికి పెద్దలు కొండా మల్ల రెడ్డి  చాలా కృషి చేశారని అన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మండలంలో ఇంటర్ స్థాయి విద్య  అవకాశాలు లేని చోట, మండలానికి ఒక కళాశాల ఏర్పాటు చేయాలని భావించి,సారంగాపూర్ మండలంలో 2 జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేశారు. బీర్పూర్ మరియు సారంగాపూర్ మండలాలకు గుర్తింపు వచ్చింది అంటే దానికి కారణం కమ్మునూరు కలమడుగు గ్రామాల మధ్యలో గల గోదావరి నదిపై గల బ్రిడ్జి అని అన్నారు.

మన ప్రాంతానికి వాణిజ్యపరంగా మేలు కలిగితే,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వుట్నూరు కడెం జన్నారం ప్రాంత గిరిజనులకు ఆదివాసులకు విద్య వైద్య సదుపాయాలకు ఉత్తర ద్వారం తలుపులు తెరిచినట్టయిందని అన్నారు.

రోల్లవాగు ప్రాజెక్ట్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా అభివృద్ధి

రాజుల చెరువు (రోల్లవాగు) ను శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ డిస్ట్రిబ్యూషన్ కాల్వల ఏర్పాటు సమయంలో బీర్పూర్ ప్రాంతంతో పాటుగా ధర్మపురి మండలానికి సాగునీటి ఎద్దటి కలగకుండా చూడాలని ఈ రాజుల చెరువును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 0.25 TMC నిలువ సామర్థ్యంతో రోళ్లవాగు ప్రాజెక్టుగా రూపొందించి ఎస్సారెస్పీలో ఇది అంతర్భాగంగా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా దీన్ని రూపొందించడం జరిగిందాని తెలిపారు.

జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఇంకా ఇలా తెలిపారు:

సాగునీటితో పాటుగా త్రాగునీరు కూడా అందించాలని రక్షిత మంచినీటి సరఫరా చేయాలని  ఈ ఫిల్టర్ బెడ్ సౌకర్యం ఎక్కడ లేకుండే కానీ బీర్పూర్ లో ఏర్పాటు చేశాం .

తెలంగాణ ఏర్పడిన తర్వాత కెసిఆర్ కరీంనగర్ కు మొట్టమొదటిసారి పర్యటనకు వచ్చినప్పుడు, నేను శాసన సభ్యునిగా ఉన్న సమయంలో రాయికల్ మండలం బోర్నపల్లి మరియు కడెం మండలం బెల్లాల గ్రామాల మధ్యలో గల గోదావరి నదిపై వంతెన నిర్మిస్తే ఈ ప్రాంతానికి భవిష్యత్తు వేసినట్టు అవుతాం అని కెసిఆర్ గారికి విజ్ఞప్తి చేయడంతో వెంటనే 70 కోట్లు మంజూరు చేసినారు.

కొప్పుల ఈశ్వర్ ధర్మపురి శాసనసభ్యులుగా ఉన్న సమయంలో రోళ్లవాగు ఆధునికరణ అనేది తెరమీదకి తీసుకువచ్చి 60 కోట్లతో మంజూరై 153 కోట్లకు వెళ్ళింది ఇప్పుడు.

బోర్నపల్లి వంతెన దాదాపుగా రెండు మూడు సంవత్సరాలలో పూర్తి చేసుకుని వినియోగంలోకి తెచ్చాం.రాజకీయ ప్రాతినిధ్యం ఎవరిది ఉన్న నిర్మాణంలో మాత్రం అలసత్వం. ఈ నిర్మాణ అలసత్వ కారణంగా మత్స్యకారుల కోట్లాది రూపాయల మత్స్య సంపద కోల్పోయింది.

బీర్పూర్ మండలం నర్సింహులపల్లి, తుంగూరు, తాళ్ల ధర్మారం గ్రామాల భూముల్లో ఇసుక మేటలు వేయగా రైతులు వాటిని తొలగించడానికి భూమి దరకు సమానంగా ఖర్చయింది

రోల్లవాగు నిర్మాణ జాప్యం మత్సకారుల శాపంలా మారింది

అప్పటి అలసత్వాన్ని ప్రభుత్వ వైపల్యమా లేక  ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులను అనడమా? ఎవరిని  అనడమో కానీ ఆ అలసత్వంతో నిర్మాణం జాప్యం కావడంతో ఇటు మత్స్యకారులు తీవ్ర నష్టపోయినారు. పది సంవత్సరాల నుండి అక్కడ చేపల పెంపకం అవకాశం కోల్పోయారు.

కొప్పుల ఈశ్వర్ మంత్రిగా ఉన్న సమయంలో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో బీర్పూర్ లో మేము నాలుగు గంటలు ధర్నా చేశాం. ఎస్సారెస్పీ అధికారులు దిగివచ్చి రెండో పంటకు నీరు విడుదల చేస్తామని చెప్పడంతో మేము ధర్నా విరమించాం

ఉమ్మడి రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిని మా బాధ్యతగా భావించి చేశాంటిఆర్ఎస్ పార్టీ హయాంలో కూడా మేము ఆ రోజు ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా మా బాధ్యత మేము నిర్వహించాం

వాస్తవంగా పనులు నిలిచిపోవడానికి కారణం పెండింగ్ బిల్స్ చెల్లింపు లేకపోవడం.తిరిగి మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే జిల్లా ఇంచార్జ్ మంత్రిగా ఉన్న ఉత్తంకుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకు వెళ్ళగానే గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న 30 కోట్ల బిల్లులను చెల్లింపు చేశాం

.25 TMC నిల్వకు అదనంగా 1 TMC ప్రతిపాదన ఉన్నదో అదనపు నిల్వ సామర్థ్యానికి రెవెన్యూ ల్యాండ్ ముంపుకు గురవుతుంది దానికి అదనంగా ఫారెస్ట్ ల్యాండ్ ముంపుకు దాదాపు 800 ఎకరాలు ముంపుకు గురవుతుంది

రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ ముంపుకు గురవుతున్నదో దానికి ప్రతిగా రెవెన్యూ ల్యాండ్ ఇవ్వాలి ప్రతిపాదించడం లోపల అప్పటి ప్రాతినిధ్యం చొరవ చూపెట్టక లేకపోవడంతోని ఈ జాప్యం జరిగింది

కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత పెండింగ్ బిల్స్ తో పాటుగా అటవీ శాఖకు చెందిన భూమి ముంపుకు గురవుతుందో దానికి ప్రతిగా పెగడపల్లి మండల నంచర్ల గొల్లపల్లి మండల చందోలి దట్నూర్ ప్రాంతం నుండి సబ్ స్యూడ్ ల్యాండ్ రెవెన్యూకు ప్రతిపాదించడంతో పాటుగా ప్రిన్సిపల్ చీఫ్ ఫారెస్ట్ నుండి ఢిల్లీకి ప్రతిపాదన పోతుంది దాని అనుమతి కేంద్ర ప్రభుత్వం నుండి రావాలి