water - Praja Mantalu

నంది మేడారం పంప్‌హౌస్‌లో నాలుగు బాహుబలి పంపులు ప్రారంభం
కరీంనగర్, జూలై 29  (ప్రజా మంటలు):

కాళేశ్వరం ద్వారా 12,600 క్యూసెక్కుల నీటి ఎత్తిపోతలు
ఎడతెరిపి వర్షాల నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2 పరిధిలోని పెద్దపల్లి జిల్లా నంది మేడారం పంప్‌హౌస్‌లో నాలుగు బాహుబలి పంపులను అధికారులు బుధవారం ప్రారంభించారు. ఒక్కో పంపు ద్వారా 3,150 క్యూసెక్కుల చొప్పున మొత్తం నాలుగు పంపులతో 12,600 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు.
నంది మేడారం పంప్‌హౌస్‌లో నాలుగు, రామడుగు గాయత్రి పంప్‌హౌస్‌లో మరో నాలుగు పంపులను ఆగస్టు 2వ తేదీ వరకు నిరంతరాయంగా నిర్వహించేందుకు మొత్తం 948.24 మెగావాట్ల విద్యుత్ సరఫరాను ప్రభుత్వం కోరినట్లు అధికారులు తెలిపారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు బుధవారం సాయంత్రం 6 గంటల నాటికి 75,328 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు నీటిమట్టం 144.22 మీటర్లకు చేరగా, 20.1754 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గాను ప్రస్తుతం 11.1105 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
ప్రాజెక్టు నుంచి మొత్తం 12,875 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇందులో నంది మేడారం పంప్‌హౌస్ ద్వారా 12,600 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తుండగా, ప్రాజెక్టులోని 62 గేట్లలో ఒక్క గేటును కూడా ఇప్పటివరకు ఎత్తలేదు. వరద పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నారు.

డబుల్ బెడ్రూం లబ్ధిదారుల సమస్యలపై జిల్లా కలెక్టర్‌కు హనుమండ్ల జయశ్రీ వినతి
జగిత్యాల డిసెంబర్ 27 (ప్రజా మంటలు):

జగిత్యాల పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించి మౌలిక వసతుల లేమితో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తాజా మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.

డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ, అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూరకపోవడంతో లబ్ధిదారులు ఇళ్లలోకి ప్రవేశించలేకపోతున్నారని, డిసెంబర్ 31 లోపు ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా ఇంట్లో నివసించాలనే ఆదేశాలు ఉన్నాయని అధికారులు చెప్పడం వల్ల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు.

ఇళ్లలోకి ప్రవేశించేందుకు అవసరమైన విద్యుత్ కనెక్షన్లు, ఇతర చిన్నపాటి పనులు ఇంకా పూర్తికాలేదని, అంతేకాకుండా శుభకార్యాలు నిర్వహించేందుకు అనుకూలమైన ముహూర్తాలు లేకపోవడంతో చాలా మంది గృహప్రవేశం చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. కనుక మానవతా దృష్టితో ఫిబ్రవరి నెలాఖరు వరకు గడువు ఇవ్వాలని కోరారు.

అలాగే కొంతమంది లబ్ధిదారులు ఇప్పటికే డబుల్ బెడ్రూం ఇళ్లలోకి వెళ్లినా, రవాణా సౌకర్యం లేకపోవడంతో మళ్లీ జగిత్యాల పట్టణానికి వచ్చి అద్దె ఇళ్లలో నివసించాల్సి వస్తోందన్నారు. బస్సు సదుపాయం లేకపోవడంతో రోజుకు రూ.200 వరకు ఆటో ఖర్చు అవుతుండటంతో ఆర్థిక భారం పెరుగుతోందని తెలిపారు. పిల్లలను పాఠశాలలకు పంపించుకోవడం కూడా కష్టంగా మారిందన్నారు.

వెంటనే డబుల్ బెడ్రూం కాలనీలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని, తద్వారా లబ్ధిదారులు అక్కడే నివసించే వీలుంటుందని హనుమండ్ల జయశ్రీ జిల్లా కలెక్టర్‌ను కోరారు.