educationist - Praja Mantalu

చరిత్రలో, చరిత్రతో కలిసి నిలిచిన జగిత్యాల మహోన్నత చరిత్రకారుడు, విద్యా శిఖరం
- సిహెచ్ వి ప్రభాకర్ రావు. సీనియర్ జర్నలిస్ట్

🔹 ప్రారంభ జీవితం మరియు నేపథ్యం
డా॥ జైశెట్టి రమణయ్యగారు 9 మే 1938న జగిత్యాలలో జన్మించారు. నిండు జీవితం అనుభవించి, 88 ఏళ్ల వయసులో,  శ్రీరామనవమి, మార్చ్ 27, 2026 రోజున పరమపదించారు. నడిచే గ్రంథాలయంగా చెప్పుకొనే రమణయ్య గారి మరణం జగిత్యాల విద్యావేత్తలకు, సమాజాసేవకులకు తీరని లోటు. నిజాం పాలనలో పుట్టి, స్వాతంత్య్రానంతర భారతదేశ మార్పులను అనుభవిస్తూ ఎదిగిన తొలి తరం విద్యావంతుల్లో ప్రముఖులు. సామాన్య కుటుంబంలో జన్మించిన ఆయన చిన్ననాటి నుంచే కష్టాలను ఎదుర్కొంటూ విద్యను ఆశ్రయించి జీవితాన్ని నిర్మించుకున్నారు.
🔹 విద్య ద్వారా సాధించిన అద్భుత ఎదుగుదల
పదిహేడవ యేట సింగిల్ టీచర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించిన ఆయన, ఆర్థిక పరిమితుల మధ్యనే చదువును కొనసాగించారు. MA, B.Ed, M.Phil, Ph.D. వంటి ఉన్నత విద్యలను సాధించి లెక్చరర్‌, రీడర్ స్థాయికి ఎదిగారు. ఒకేసారి ఉపాధ్యాయుడిగా, విద్యార్థిగా, కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ సాధించిన ఈ ప్రయాణం అసాధారణమైనది.
🔹 చరిత్రకారుడిగా విశిష్ట కృషి
రమణయ్యగారు ఉత్తర తెలంగాణ చరిత్ర పరిశోధనలో విశేష కృషి చేశారు. దేవాలయాలు, శిలాశాసనాలు, పురావస్తు ఆధారాలను సేకరించి చారిత్రక విశేషాలను వెలుగులోకి తీసుకువచ్చారు. “దక్షిణ భారతదేశంలో దేవాలయాలు”, “కరీంనగర్ జిల్లా చరిత్ర, సంస్కృతి” వంటి పుస్తకాలు ఆయన పరిశోధనా ప్రతిభకు నిదర్శనం. మొత్తం 20కి పైగా చరిత్ర గ్రంథాలను రచించారు.
🔹 డైరీలు – చారిత్రక సంపదగా మారిన జీవితం
అరవై సంవత్సరాల పాటు నిరంతరంగా డైరీలు రాయడం ఆయన ప్రత్యేకత. ఈ డైరీలు వ్యక్తిగత జీవితానికి మాత్రమే కాకుండా సమకాలీన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాలను కూడా నమోదు చేశాయి. ఇవే ఆయన “స్వంత ఎదుగుదల” స్వీయ చరిత్రకు పునాది అయ్యాయి.   ఎనిమిది దశాబ్దాల జగిత్యాల చరిత్రకు, ఆయన డైరీలు ప్రత్యక్ష సాక్షాలు.
🔹 విజయాలు మరియు పురస్కారాలు
రమణయ్యగారు అనేక గౌరవాలు అందుకున్నారు. 1961లో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా రజత పతకం అందుకున్నారు. “వాసవీ నవరత్న”, “పౌరరత్న” వంటి బిరుదులు పొందారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ చరిత్రకారుడిగా గుర్తింపు పొందారు. అంతేకాక, తన ఖర్చులతో 500 మందికి పైగా ప్రతిభావంతులను సత్కరించడం ఆయన సేవా మనసును తెలియజేస్తుంది.
🔹 వ్యక్తిత్వం మరియు ప్రభావం
ఆయన గొప్ప వక్త, ఆదర్శ ఉపాధ్యాయుడు. వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దారు. వారిలో కొందరు ఉన్నత పదవులు, న్యాయమూర్తులు, రాజకీయ నాయకులుగా ఎదిగారు. విద్యార్థులతో సాన్నిహిత్యం, సమాజంపై చైతన్యం కలిగించడం ఆయన ప్రత్యేకత.
🔹  గొప్పతనానికి మూల కారణం
స్వయంకృషి, క్రమశిక్షణ, జ్ఞానాసక్తి, సేవాభావం – ఇవే ఆయన గొప్పతనానికి కారణాలు. వ్యక్తిగత విజయాన్ని సమాజాభివృద్ధితో అనుసంధానం చేయడం ఆయన విశిష్ట లక్షణం. భారత ప్రధాని పివి నరసాయిమహారాయాఉ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి లాంటి వారితో పాటు తెలంగాణ ఉద్యమనేత, తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు తొ సన్నిహిత సంబందాలు ఉన్న మహనీయుడు. తెలంగాణ చరిత్రను ఎందరో ఉద్యమకారులకు పరిచయం చేసిన మహా మనీషి.
•    ఉపాద్యాయులకు సన్మానాలు:
ఎంతగా ఎదిగినా, తన మూలాలను మారిచిపోకుండా, పదేళ్ళ బాలునితో పాటు, మహా మేధావుల వరకు అనాదరిని సందేఉశతి తో చూసిన గొప్ప వ్యక్తిత్వం ఆయనది. ఉపద్యాయునిగా జీవితం ప్రారంభించిన రమణయ్య, తనకు సమాజమాలో గౌరవం సంపాదించిపెట్టిన వృత్తిపట్ల నిజాయితీగా ఉంటూ, ఆ వృత్తిలో ఉన్న వారిని గౌరవించడానికి కంకనమ కట్టుకొన్నారు. తాను అధ్యాపక వృత్తి నుండి విశ్రాంతి పొందినా, నిబడ్డతతో దాదాపు రెండు దశాబ్దాలపాటు ప్రతి ఉపాధ్యాయ దినోత్సవం రోజున పదుల సంఖ్యలో ఉపాధ్యాయులను సన్మానించి, ఆదూయపక వృత్తి పట్ల, అధ్యపకులపట్ల తనకున్న గౌరవాన్ని తెలియజేశాడు.

డా॥ జైశెట్టి రమణయ్యగారి జీవితం ఒక సాధారణ వ్యక్తి అసాధారణ శిఖరాలను ఎలా అధిరోహించగలడో చూపించే ప్రేరణాత్మక గాథ. ఆయన రచనలు, సేవలు, విలువలు భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా నిలిచే అమూల్య సంపద.

తెలంగాణ విద్యా కమిషన్‌పై వివాదం: అర్హతలే ప్రశ్నార్థకమా?
రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంస్కరణల పేరుతో ప్రయోగాలా?

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ సమర్పించిన “తెలంగాణ విద్యా విధానం–2026” నివేదిక రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ కమిటీకి పరిపాలనా అనుభవం ఉన్నవారు ఉన్నప్పటికీ, స్కూల్ లేదా యూనివర్సిటీ స్థాయిలో బోధన అనుభవం ఉన్న అసలైన విద్యావేత్తలు లేరనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం విద్యాశాఖను నేరుగా పర్యవేక్షిస్తున్నప్పటికీ, విద్యా విధానం రూపకల్పనలో సబ్జెక్ట్ నిపుణుల భాగస్వామ్యం లేకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. ఎడ్యుకేషన్‌లో పీహెచ్‌డీ చేసినవారు, స్కూల్ సిలబస్ రూపకల్పనలో అనుభవం ఉన్న నిపుణులు, చైల్డ్ సైకాలజీపై పట్టున్న వ్యక్తులు కమిటీలో లేరని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
కమిటీ చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నియామకం జరిగిన విషయం కూడా విమర్శలకు దారితీసింది. పరిపాలనా అనుభవం వేరు, విద్యా బోధన అనుభవం వేరు అనే వాదన బలపడుతోంది.

TRSMA ఆరోపణలు

యాదగిరి శేఖర్ రావు (TRSMA రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు) స్పందిస్తూ కమిటీలో నిజమైన విద్యావేత్తలే లేరని విమర్శించాడు.స్కూల్ పిల్లలకు పాఠాలు చెప్పిన అనుభవం ఉన్నవారు ఎవరున్నారు?

ఎడ్యుకేషన్‌లో పీహెచ్‌డీ చేసిన నిపుణులు ఎవరున్నారు?
కోర్ సబ్జెక్టుల్లో పట్టున్న సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ ఎవరున్నారు?
అనే ప్రశ్నలను లేవనెత్తాడు. విద్యావ్యవస్థపై కనీస అవగాహన లేకుండా తీసుకునే నిర్ణయాలు విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తాయని పేర్కొన్నాడు.

TRTF అభ్యంతరాలు

తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (TRTF) కూడా నివేదికపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేష్, ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి సంయుక్త ప్రకటనలో పలు అంశాలను ప్రస్తావించారు.

1️⃣ RTE-2009 ఉల్లంఘన?
“మూడు గ్రామాలకు ఒక పాఠశాల” ప్రతిపాదన విద్యాహక్కు చట్టం (RTE-2009) ఆత్మకు విరుద్ధమని పేర్కొన్నారు. ప్రతి కిలోమీటర్ పరిధిలో పాఠశాల ఉండాలన్న నిబంధనకు ఇది భిన్నమని, గ్రామీణ పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

2️⃣ ప్రభుత్వ బడుల నిర్వీర్యం
గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ‘సక్సెస్’ పాఠశాలలు, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ‘మోడల్ స్కూల్స్’, కేసీఆర్ ప్రభుత్వం ‘గురుకులాలు’ ప్రవేశపెట్టిన ఉదాహరణలను ప్రస్తావిస్తూ, ప్రతి ప్రభుత్వం కొత్త పేర్లతో ప్రయోగాలు చేస్తోందని విమర్శించారు. ఇప్పుడు ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ (TPS)’ పేరుతో ఉన్న వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు.

3️⃣ ఉపాధ్యాయుల వేతనాలపై వ్యాఖ్యలు
ఉపాధ్యాయుల వేతనాలు మార్కెట్ రేట్ల కంటే ఎక్కువగా ఉన్నాయని కమిషన్ వ్యాఖ్యానించడం దారుణమని పేర్కొన్నారు. ఇది వేతన సవరణ కమిటీ పరిధిలోకి వచ్చే అంశమని, విద్యా కమిషన్ దీనిపై వ్యాఖ్యానించడం తగదని అన్నారు.

4️⃣ పదోన్నతుల వ్యవస్థ మార్పు
హెడ్ మాస్టర్ పోస్టుల్లో 50% డైరెక్ట్ రిక్రూట్‌మెంట్, భవిష్యత్తులో 100% ప్రత్యక్ష నియామకాలు చేపట్టాలని సిఫార్సు చేయడం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల పదోన్నతులకు అడ్డంకిగా మారుతుందని పేర్కొన్నారు.
MEO నియామకాల్లో సీనియారిటీ విధానం రద్దు చేసి రాత పరీక్షలు, ఇంటర్వ్యూలు పెట్టడం రాజకీయ జోక్యానికి దారితీస్తుందని హెచ్చరించారు.

5️⃣ AAS పై ప్రభావం
6/12/18/24 ఏళ్ల ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్‌ను పనితీరుతో ముడిపెట్టడం ఉపాధ్యాయుల్లో అస్థిరత కలిగిస్తుందని పేర్కొన్నారు.
ప్రధాన విమర్శల సారాంశం
విద్యావేత్తల ప్రాతినిధ్యం లేకుండా విద్యా విధానం రూపకల్పన
RTE చట్ట ఆత్మకు విరుద్ధ ప్రతిపాదనలు
ఉపాధ్యాయుల హక్కులపై ఆంక్షలు
సీనియారిటీ వ్యవస్థ రద్దు
ప్రభుత్వ బడుల బలోపేతం కంటే నిర్మాణాత్మక మార్పుల పేరుతో ప్రయోగాలు

తుది విశ్లేషణ
విద్యా సంస్కరణలు చేయాలంటే గ్రౌండ్ లెవెల్ అనుభవం ఉన్న టీచర్లు, సబ్జెక్ట్ నిపుణులు, విద్యా పరిశోధకులను భాగస్వామ్యం చేయాలి. పరిపాలనా కమిటీలు మాత్రమే ఆధారంగా తీసుకుని తీసుకునే నిర్ణయాలు విద్యా వ్యవస్థలో అసంతృప్తి పెంచే ప్రమాదం ఉంది.
తెలంగాణ విద్యా కమిషన్ నివేదికపై ప్రభుత్వం విస్తృత చర్చలు జరిపి, ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తల అభిప్రాయాలు తీసుకుని తుది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

విద్యా–పారిశ్రామిక రంగాలకు వెలుగు నింపిన మహనీయుడు కాసుగంటి సుధాకర్‌రావు అస్తమయం
జగిత్యాల, డిసెంబర్ 26 (ప్రజా మంటలు)

జగిత్యాల జిల్లాకు గర్వకారణంగా నిలిచిన ప్రముఖ విద్యావేత్త, పారిశ్రామిక వేత్త, సామాజిక సేవా ధురీణుడు కాసుగంటి సుధాకర్‌రావు(80) అకాల మరణం జిల్లావ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. తన జీవితమంతా సమాజ హితానికే అంకితం చేసిన ఈ మహనీయుడు గురువారం (డిసెంబర్ 25) రాత్రి హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన అస్తమయం విద్య, పరిశ్రమ, సేవ అనే మూడు రంగాలకు తీరని లోటుగా మారింది.

మాజీ శాసన సభ్యులు కాసుగంటి లక్ష్మీ నరసింహరావు కుమారుడు,దాతృత్వానికి మారుపేరైన కాసుగంటి లక్ష్మీ నారాయణరావు మనమడు అయినా ఎలాంటి గర్వంలేని నిరాడంబర సుధాకరావు మృతికి ప్రముఖులు తమ సంతాపం తెలిపారు.

జగిత్యాలలో తొలి తరం పారిశ్రామికవేత్తలలో ఒకరిగా గుర్తింపు పొందిన సుధాకర్‌రావు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ఊపిరిపోసే లక్ష్యంతో గోదావరి వ్యాలీ ఇండస్ట్రీస్ ను స్థాపించి వందలాది కుటుంబాలకు ఉపాధి కల్పించారు. గ్రామీణ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా తన వ్యాపార ప్రస్థానాన్ని నడిపిన ఆయన, కేవలం లాభాపేక్షతో కాకుండా సామాజిక బాధ్యతతో పరిశ్రమలను నిర్మించారు.

విద్యారంగంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయాలు. భారతీయ నాగరికత విద్యా సమితిని స్థాపించి, సమాజానికి నైతిక విలువలతో కూడిన విద్య అందించాలనే ఆశయంతో ముందడుగు వేశారు. జగిత్యాలలో శ్రీ సరస్వతి శిశు మందిర్, శ్రీ వాణి సహకార జూనియర్ కళాశాలలను స్థాపించి, అనేక మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించారు. పేద విద్యార్థులకు ఉచితంగా లేదా నామమాత్రపు ఫీజుతో విద్య అందిస్తూ, వారి భవిష్యత్తుకు వెలుగులు నింపిన దాతగా నిలిచారు.

సమాజ సేవే జీవిత లక్ష్యంగా భావించిన ఆయన, రోటరీ క్లబ్ వంటి సంస్థల ద్వారా ఆరోగ్య, విద్య, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఎన్నో కుటుంబాలకు ఆర్థికంగా, మానసికంగా అండగా నిలిచి, నిస్వార్థ సేవకు ప్రతిరూపంగా నిలిచారు.

నిశ్శబ్దంగా సేవ చేస్తూ, వెలుగులు పంచిన ఆ మహనీయుడి మరణం జగిత్యాల ప్రజలకు తీరని లోటు. ఆయన జీవితం ఒక పాఠం, ఆయన సేవ ఒక ప్రేరణ.
కాసుగంటి సుధాకర్ రావు గారి స్మృతి చిరస్థాయిగా నిలిచిపోతుంది.