GHMC - Praja Mantalu

జీహెచ్ఎంసీలో అవినీతికి సీఎం బాధ్యులు: కవిత
హైదరాబాద్, ఏప్రిల్ 10 (ప్రజా మంటలు):

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలో భారీ అవినీతి జరుగుతోందని ఆరోపించారు. టెండర్లకు బదులుగా నామినేషన్ పద్ధతిలో కోట్ల విలువైన కాంట్రాక్టులు సీఎం అనుచరులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.1,148 కోట్ల పనులు ఇదే విధంగా ఇచ్చారని తెలిపారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారులపై ఒత్తిడి తీసుకుని కమీషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ, ఈ వ్యవహారం ఆపకపోతే ఈడీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మరమ్మత్తులు కూడా కమీషన్ల కోసమే చేస్తున్నారని విమర్శించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లులో 2011 జనాభా లెక్కలు ఆధారంగా తీసుకోవడం అన్యాయమని, 2027 జనగణన తర్వాతే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ నెల 25న జరగనున్న పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాట్ల కోసం 21 కమిటీలు ఏర్పాటు చేసినట్లు కవిత తెలిపారు.

కంటోన్మెంట్ బోర్డు విలీన పోరాటానికి JAC సన్నాహక సమావేశం
సికింద్రాబాద్,  ఫిబ్రవరి 01 (ప్రజా మంటలు):

కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేయాలనే డిమాండ్‌తో ఆదివారం బాలంరాయిలోని లీ ప్యాలెస్‌లో జేఏసీ (జాయింట్ యాక్షన్ కమిటీ) ఏర్పాటు సన్నాహక సమావేశం ఘనంగా జరిగింది. ఇటీవల కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ చేపట్టిన రిలే నిరాహార దీక్షకు నియోజకవర్గంలోని కాలనీ అసోసియేషన్ సభ్యులు, బస్తీల వాసులు, మేధావులు, కవులు, కళాకారులు సంఘీభావం తెలుపుతూ ఈ ఉద్యమాన్ని జేఏసీ ఆధ్వర్యంలో ముందుకు తీసుకెళ్లాలని దీక్ష శిబిరంలో తీసుకున్న నిర్ణయానికి కొనసాగింపుగానే ఈ సమావేశాన్ని నిర్వహించారు.

దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వంపై వివిధ రూపాల్లో ఒత్తిడి తీసుకురావాలని, ఉద్యమాన్ని దశలవారీగా ఉధృతం చేయాలని నిర్ణయించారు. జేఏసీ నిర్మాణ విధివిధానాలను ఖరారు చేసి త్వరలో అధికారికంగా కమిటీని ప్రకటించడంతో పాటు కార్యాచరణ ప్రణాళికను వెల్లడిస్తామని నేతలు తెలిపారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో జరిగిన అభివృద్ధితో పోలిస్తే కంటోన్మెంట్ ప్రాంతం సుమారు 30 ఏళ్లు వెనుకబడి ఉందని సమావేశంలో పాల్గొన్నవారు ఆవేదన వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేస్తేనే ఈ ప్రాంతానికి సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని, మౌలిక వసతులు మెరుగుపడతాయని అభిప్రాయపడ్డారు. ఆరు సంవత్సరాలుగా ఎన్నికలు జరగకపోవడం వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థకు భంగం వాటిల్లుతోందని పేర్కొన్నారు.
రిలే నిరాహార దీక్ష ద్వారా విలీనం అవసరాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన ఎమ్మెల్యే శ్రీగణేష్‌ను సమావేశానికి హాజరైనవారు అభినందించారు. విలీన పోరాటానికి నిస్వార్థంగా సహకరించే ప్రతి ఒక్కరినీ జేఏసీ ఉద్యమంలో భాగస్వాములుగా చేరాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన 40 కాలనీల అధ్యక్షులు, పలువురు మేధావులు, కవులు, కళాకారులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఉద్యమాన్ని ప్రజల వరకు తీసుకెళ్లేందుకు ఐక్యంగా ముందుకు సాగాలని నిర్ణయించారు.

జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు బ్రేక్ : చెదిరిన రేవంత్ కల
హైదరాబాద్, డిసెంబర్ 25 (ప్రజా మంటలు):

వచ్చే ఏడాది జరగనున్న ఎస్‌ఐఆర్‌, జనగణనలను దృష్టిలో ఉంచుకొని వేగంగా పూర్తి చేయాలని భావించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) డీలిమిటేషన్ ప్రక్రియకు ప్రభుత్వమే బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది. డివిజన్ల పునర్విభజనపై ప్రజల నుంచి వెల్లువెత్తిన అభ్యంతరాలు, రాజకీయ వర్గాల నుంచి వచ్చిన నిరసనల నేపథ్యంలో తుది నోటిఫికేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

నగర పరిధిలోని 20 పురపాలక సంఘాలు, 7 నగర పాలక సంస్థలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ 300 డివిజన్లుగా పునర్విభజన చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం మొదట వేగంగా ముందుకెళ్లింది. ఈ మేరకు ఈ నెల 9వ తేదీన ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసి, అభ్యంతరాలను స్వీకరించారు. అనంతరం హైకోర్టు ఆదేశాల మేరకు 22వ తేదీ వరకు ఫిర్యాదులు, సూచనలు స్వీకరించారు.

అయితే ఈ ప్రక్రియపై సుమారు ఆరు వేల వరకు అభ్యంతరాలు రావడం, పలువురు ప్రజాప్రతినిధులు లిఖితపూర్వకంగా వ్యతిరేకత తెలపడం, ప్రజల్లో అసంతృప్తి పెరగడం ప్రభుత్వాన్ని వెనక్కి తగ్గేలా చేసినట్లు సమాచారం. డివిజన్ల హద్దులు సహేతుకంగా లేవని, రాజకీయ లబ్ధికోసం మార్పులు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో పరిస్థితి మరింత సంక్లిష్టమైంది.

అధికారులు అన్ని అభ్యంతరాలను పరిశీలించి, తుది నివేదికను సిద్ధం చేసినప్పటికీ, ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు తుది నోటిఫికేషన్‌ను నిలిపివేశారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ పాలకమండలికి ఫిబ్రవరి 10 వరకు మాత్రమే గడువు ఉండటంతో, ఈ పరిణామం పాలక వర్గంలోనూ కలవరం రేపుతోంది.

మొత్తానికి, డీలిమిటేషన్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న తొందరపాటు నిర్ణయానికి ప్రజా వ్యతిరేకత గట్టి ఎదురుదెబ్బగా మారింది. పరిస్థితులు చల్లారే వరకు ప్రక్రియను వాయిదా వేయాలని నిర్ణయించడం రాజకీయంగా తప్పని పరిస్థితిగా మారినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.