కాంగ్రెస్ - Praja Mantalu

కొత్త నెత్తురు, కొత్త రాజకీయాలతో తెలంగాణలో మార్పు – కవిత ప్రకటన
హైదరాబాద్, ఏప్రిల్ 09 (ప్రజా మంటలు):

తెలంగాణ భవిష్యత్‌ను, చరిత్రను మార్చే రోజుగా ఈ నెల 25 నిలుస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఆ రోజు ప్రకటించబోయే కొత్త పార్టీ ద్వారా ఈ గడ్డకు కొత్త నెత్తురు, కొత్త రాజకీయాలను పరిచయం చేస్తామని వెల్లడించారు.
బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గొంగళ్ల రంజిత్ కుమార్ తన అనుచరులతో కలిసి జాగృతిలో చేరారు. కవిత వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, ప్రజల కోసం ప్రశ్నించే, పోరాడే, పరిష్కారాలను అందించే కొత్త తరహా రాజకీయాలు తీసుకురాబోతున్నామని చెప్పారు. రాష్ట్రంలో అధికార పక్షమైన Indian National Congress మరియు ప్రతిపక్షం Bharat Rashtra Samithi ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రజల సమస్యలపై మాట్లాడేది జాగృతి మాత్రమే అన్న నమ్మకం ప్రజల్లో పెరుగుతోందని తెలిపారు.

దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎంలా మారిందని ఆరోపించారు. రాహుల్ గాంధీ ఫోన్ చేస్తే రేవంత్ రెడ్డి నిలబడి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణకు స్వయంపాలన వచ్చిందని భావించిన ప్రజలకు ఢిల్లీకి గులాంగిరి చేసే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతు భరోసా, రుణమాఫీ వంటి హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. కేంద్రంపై కూడా స్పందించకుండా నరేంద్ర మోదీ నిర్ణయాలపై రాష్ట్ర ప్రభుత్వం మౌనం పాటిస్తోందని విమర్శించారు.

గద్వాల్ ప్రాంతంలో గడీల ప్రభావం తొలగి ఉద్యమకారుల జెండా ఎగరాలని, చేనేత కార్మికులు, సీడ్ పత్తి రైతుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రానున్న మూడు సంవత్సరాలు ప్రజల తరఫున ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని కవిత స్పష్టం చేశారు.
రంజిత్ కుమార్ మాట్లాడుతూ, కవిత కమిట్ అయితే ఎంత కష్టమైనా వెనుకడుగు వేయరని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాదాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లే నాయకత్వం ఆమెదేనని పేర్కొన్నారు. జాగృతి జెండాను ప్రతి గ్రామానికి తీసుకెళ్తామని తెలిపారు.

జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు గా సంఘనబట్ల దినేష్ నియామకం
ధర్మపురి, మార్చ్ 28 (ప్రజా మంటలు):

ధర్మపురికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సంఘనబట్ల దినేష్‌కు కీలక పదవి దక్కింది. తెలంగాణ పబ్లిక్ లైబ్రరీల చట్టం, 1960 ప్రకారం ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ మేరకు, ఆయనను జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ (జిల్లా గ్రంథాలయ సమస్థ) చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వచ్చింది.
ఈ సందర్భంగా ధర్మపురి, జగిత్యాల ప్రాంతాల్లో కాంగ్రెస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. స్థానికంగా పార్టీ కోసం దీర్ఘకాలంగా పనిచేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించిన దినేష్‌కు ఈ పదవి రావడం సముచితమని నేతలు అభిప్రాయపడుతున్నారు.
మొన్నటి మున్సిపల్ ఎన్నికల సమయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇచ్చిన హామీ మేరకే ఈ నియామకం జరిగిందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. జిల్లాలో పలువురు ఆశావహులు ఉన్నప్పటికీ, పార్టీ పట్ల నిబద్ధత, సేవా భావం దృష్ట్యా దినేష్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం.
ఈ నియామకంతో జిల్లాలో గ్రంథాలయ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, విద్యార్థులు, పాఠకులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

జగిత్యాల రాజకీయాల్లో జీవన్ రెడ్డి కొత్త సంకేతాలు : అధిష్ఠానం మాట వినని జీవన్ రెడ్డి
బీఆర్‌ఎస్‌/ బీజేపీ లోకి వెళితే పరిస్థితి?

రాజకీయ భవిష్యత్తుపై అనిశ్చితి

జగిత్యాల మార్చ్ 16 (ప్రజా మంటలు):

జగిత్యాల రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలకుపైగా కాంగ్రెస్ పార్టీకి అంకితమై పనిచేసిన మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ఆయన ఇంటి ముందు గతంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జాతీయ, రాష్ట్ర నాయకులతో ఉన్న ఫ్లెక్సీని తొలగించడం ఈ చర్చకు ప్రధాన కారణమైంది.

దాని స్థానంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో జీవన్ రెడ్డి కాషాయం కండువా ధరించి సీతారామలక్ష్మణుల విగ్రహాలకు నమస్కరిస్తున్న దృశ్యం కనిపిస్తోంది. ఉగాది, శ్రీరామనవమి శుభాకాంక్షలతో ఉన్న ఈ ఫ్లెక్సీలో కాంగ్రెస్ పార్టీ రంగులు లేకపోవడం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

ఈరోజు పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోన్ లో జీవన్ రెడ్డి తో మాట్లాడినట్లు, ఆమెకు ఈయన ఘాటుగా జవాబిస్తూ, ఇంతవరకు జరిగింది చాలు అన్నట్లు తెలిసింది. ఈయనతో పాటు మరికొందరు మాజీలు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ను వీడనున్నట్లు తెలుస్తుంది. మరో వైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రహద్యమంతనాలు పార్టీలోని అసంతృప్తులను ఒక దగ్గరికి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. మొత్తానికి మార్చ్ నెల కాంగ్రెస్ పార్టీకి పెద్ద గండాన్ని తెచ్చిపెట్టనున్నట్లు ప్రచారం జరుగుతుంది.

ఎన్నికల తరువాత మారిన రాజకీయ సమీకరణాలు

గత అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన డా. సంజయ్ కుమార్ జీవన్ రెడ్డిపై విజయం సాధించారు. అయితే అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ పరిణామం తరువాత జగిత్యాల కాంగ్రెస్‌లో జీవన్ రెడ్డి వర్గానికి ప్రాధాన్యం తగ్గిందని ఆయన అనుచరులు భావిస్తున్నారు. ముఖ్యంగా మున్సిపల్ రాజకీయాల్లో తిరుగుబాటు కౌన్సిలర్లను గెలిపించినప్పటికీ, మున్సిపల్ చైర్మన్ పదవి జీవన్ రెడ్డి వర్గానికి దక్కకపోవడం అసంతృప్తిని మరింత పెంచింది.

ఉగాది తరువాత కీలక నిర్ణయం?

గత కొంతకాలంగా పార్టీలో తాను ఇమడలేకపోతున్నానని జీవన్ రెడ్డి బహిరంగంగానే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉగాది తరువాత ఆయన కాంగ్రెస్ పార్టీని విడిచిపెడతారని ప్రచారం జరుగుతోంది.

ఇటీవల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కూడా ఈ ప్రచారానికి బలం చేకూర్చింది. అయినప్పటికీ ఆయన వెంటనే పార్టీ మారుతారా, లేక మరికొంత కాలం వేచి చూస్తారా అన్నది ప్రస్తుతం “లక్ష డాలర్ల ప్రశ్న”గా మారింది.

వామపక్ష భావజాలం నుంచి కాంగ్రెస్ వరకు

జీవన్ రెడ్డి రాజకీయ ప్రయాణం విభిన్న దశలను దాటింది. న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించిన ఆయన వామపక్ష భావజాలానికి దగ్గరగా ఉండేవారు. రాజకీయాల్లోకి రాకముందు అప్పటి జనతా పార్టీతో సంబంధం కొనసాగించారు.

1981లో సమితి అధ్యక్ష ఎన్నికల్లో మల్యాల ప్రాంతం నుంచి పార్టీరహితంగా గెలిచారు. తరువాత 1982లో మొదటిసారి తెలుగుదేశం పార్టీలో చేరారు. 1984లో జరిగిన రాజకీయ సంక్షోభ సమయంలో నాదెండ్ల భాస్కర్ రావుతో కలిసి అదే ఏడాది డిసెంబరులో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఆ తర్వాత గెలుపోటములతో సంబంధం లేకుండా సుమారు నలభై ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు.

రాష్ట్ర అధ్యక్ష పదవి అవకాశాన్ని కూడా వదిలేశారు

కొన్ని సంవత్సరాల క్రితం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవిని జీవన్ రెడ్డికి ఇవ్వాలని పార్టీ అధిష్టానం ఆలోచించింది. ఆయనను ఢిల్లీకి కూడా పిలిచినా ఆ పదవిని స్వీకరించడానికి ముందుకు రాలేదు.

ఆర్థికంగా బలమైన వనరులు లేకపోవడం వల్లనే ఆ బాధ్యత తీసుకోలేదని ఆయన సమీప వర్గాలు చెబుతాయి. అయితే అదే సమయంలో రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న రేవంత్ రెడ్డికి జీవన్ రెడ్డి అడ్డంకిగా మారారనే భావన అప్పటి రాజకీయ పరిణామాల్లో కనిపించింది.

పార్టీ అంతర్గత విభేదాలు

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి తీసుకురావడంపై జీవన్ రెడ్డి వ్యక్తం చేసిన అభ్యంతరాలు కూడా రాష్ట్ర నాయకత్వంతో విభేదాలకు కారణమయ్యాయని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

తాను పార్టీని విడిచిపెడతానని జీవన్ రెడ్డి పలుమార్లు ప్రకటించినప్పటికీ, రాష్ట్ర నాయకత్వం పెద్దగా స్పందించకపోవడం కూడా ఈ విభేదాలను మరింత పెంచింది.

బీజేపీ వైపు వెళతారా?

ఇప్పుడు ఆయన తదుపరి అడుగు ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. రాజకీయంగా బీజేపీ సిద్ధాంతాలతో జీవన్ రెడ్డి పెద్దగా ఏకీభవించరని ఆయన సన్నిహితులు చెబుతారు.

అయితే నిజామాబాద్ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్‌తో కుటుంబపరమైన అనుబంధం ఉండటం వల్ల ఆయన బీజేపీ వైపు వెళతారా అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

అయితే దాదాపు నాలుగు దశాబ్దాలపాటు బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ పోరాటం చేసిన నాయకుడు ఆ పార్టీలో చేరడం అనేది రాజకీయంగా పెద్ద మలుపే అవుతుందని విశ్లేషకులు అంటున్నారు.

బీఆర్‌ఎస్‌లోకి వెళితే పరిస్థితి?

ఇక మరో ప్రత్యామ్నాయం బీఆర్‌ఎస్ పార్టీ. జగిత్యాలలో ఆ పార్టీలో ఎమ్మెల్సీ ఎల్. రమణ, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత, మాజీ మంత్రి రాజేశం గౌడ్ వంటి నాయకులు ఉన్నారు.

అయితే వీరంతా ప్రారంభం నుంచే జీవన్ రెడ్డికి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారు. కాబట్టి బీఆర్‌ఎస్‌లో చేరినా స్థానికంగా వర్గపోరు కొనసాగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

రాజకీయ భవిష్యత్తుపై అనిశ్చితి

జగిత్యాల కాంగ్రెస్ రాజకీయాల్లో ఒకప్పుడు ఏకఛత్రాధిపత్యం వహించిన జీవన్ రెడ్డి ఇప్పుడు రాజకీయ పద్మవ్యుహంలో చిక్కుకున్న అభిమన్యుడిలా ఉన్నారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

భవిష్యత్తులో ఆయన స్వయంగా రాజకీయాల నుంచి తప్పుకుని తన కుమారుడిని రంగంలోకి దించాలని ఆలోచిస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీకరణాల్లో అది ఎంతవరకు సాధ్యమవుతుందన్నది స్పష్టంగా కనిపించడం లేదు.

ఒక రాజకీయ పాఠమా?

దాదాపు నాలుగు దశాబ్దాలపాటు ఒకే పార్టీ కోసం పోరాడిన సీనియర్ నాయకుడికి ఇలాంటి పరిస్థితి రావడం రాజకీయాల్లో పరిస్థితులు ఎంత వేగంగా మారుతాయో చూపిస్తున్న ఉదాహరణగా కూడా చూడవచ్చు.

జీవన్ రెడ్డి తదుపరి అడుగు ఏంటన్నది మాత్రమే కాదు, జగిత్యాల రాజకీయ సమీకరణాలు ఎలా మారబోతున్నాయన్నదే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

కాంగ్రెస్ పార్టీలో కొనసాగడంపై ఆలోచిస్తున్నా… భవిష్యత్ ఏంటో గోచరించట్లేదు : మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు)

కాంగ్రెస్ పార్టీలో తన భవిష్యత్‌పై ఆలోచిస్తున్నానని మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ —
“భవిష్యత్ ఏంటో నాకు గోచరించట్లేదు. అవమానాలు ఇంకెంత కాలం భరించాలి?” అని ఆవేదన వ్యక్తం చేశారు.

🔹 ఎన్నికలే ముగింపు కాదు
“ఈ ఎన్నికలతో కథ ముగిసినట్టేం కాదు. జగిత్యాలలో ఎమ్మెల్యేగా సంజయ్ కుమార్ ఉన్నంతకాలం నాకు వేధింపులు తప్పవు” అని వ్యాఖ్యానించారు.

పార్టీ మారలేదా… రాజకీయాలు మారలేదా?
“స్పీకర్ మాత్రం ఎమ్మెల్యే పార్టీ మారలేదని అంటున్నారు. తెలుగుదేశంతో అంట కాగిన సంజయ్, బి ఆర్ ఎస్ లో చేరి, గెలిచారు. కానీ ఎమ్మెల్యేగా, రాజకీయ సంసారం మాత్రం కాంగ్రెస్ పార్టీతోనే కొనసాగుతోంది” అని ఎద్దేవా చేశారు.

🔹 పవర్ ఆఫ్ అటార్నీ ఎవరికిచ్చారు?
“జగిత్యాల కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు పట్టా రాసిచ్చారా? పవర్ ఆఫ్ అటార్నీ ఎమ్మెల్యే సంజయ్‌కు ఇచ్చినట్టుగా వ్యవహారం సాగుతోంది” అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

🔹 అధినాయకత్వానికి విజ్ఞప్తి
“కాంగ్రెస్ అధినాయకత్వం తప్పకుండా పార్టీ కార్యకర్తల మనోభావాలను గౌరవించాలి. జగిత్యాలలో పరిస్థితి ఇలానే ఉంటే, పార్టీ మారిన మరో 9 ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో ఆలోచించాలి” అని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ వ్యాఖ్యలు జగిత్యాల కాంగ్రెస్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. మాజీ మంత్రి అసంతృప్తి పార్టీ అధిష్టానం వరకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.

హుస్నాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గా దండి లక్ష్మీ కొమురయ్య
హుస్నాబాద్ | ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు)

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో నేడు జరిగిన ప్రత్యేక సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. 14వ వార్డు సభ్యులు దండి లక్ష్మీ కొమురయ్యను హుస్నాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా, 7వ వార్డు సభ్యులు చిత్తారి పద్మ రవీందర్ను వైస్ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు.

మున్సిపల్ ఎన్నికైన సభ్యులతో ఎన్నికల ప్రత్యేక అధికారి, ఆర్డీవో రామ్మూర్తి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 16 మంది వార్డు సభ్యులు,, బీఆర్ఎస్‌కు చెందిన 4 మంది వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ సమావేశానికి ఎక్స్ అఫిషియో సభ్యులుగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు.

చైర్‌పర్సన్ ఎన్నిక సందర్భంగా దండి లక్ష్మీ కొమురయ్య పేరును చెన్నమేని అనూష ప్రతిపాదించగా, ఆకుల రజిత, కేశవేని రమేష్, శోభన్ బాబు మద్దతు తెలిపారు.
ఇతర సభ్యుల సమ్మతితో ఆమె హుస్నాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అనంతరం వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలో చిత్తారి పద్మ రవీందర్ పేరును పిల్లి తిరుపతి ప్రతిపాదించగా, వర ప్రసాద్, బొలిశెట్టి రాజు, వైద్యం కిరణ్ ప్రసాద్ మద్దతు పలికారు. దీంతో ఆమె హుస్నాబాద్ మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌లతో కలిసి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఆర్డీవో రామ్మూర్తి నిర్వహించారు. ఈ ప్రత్యేక సమావేశానికి మొత్తం 20 మంది సభ్యులు + మంత్రి పొన్నం ప్రభాకర్ (ఎక్స్ అఫిషియో) హాజరయ్యారు.

హుస్నాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిపత్యం నెలకొనగా, పట్టణంలో రాజకీయ ఉత్సాహం వెల్లివిరిసింది.

రాయికల్ మున్సిపల్ పీఠంపై ఎగిరిన గులాబీ జెండా
ఐదు సీట్లు గెలుచుకున్న బీజేపీ లో నిరాశ

రాయికల్  ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు):

జగిత్యాల నియోజకవర్గంలోని రాయికల్ పట్టణ మున్సిపాలిటీపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పట్టు సాధించింది. మొత్తం 7 మంది కౌన్సిలర్ల మద్దతుతో బీఆర్ఎస్ అధికారాన్ని కైవసం చేసుకుంది.

▪️ మున్సిపల్ చైర్మన్‌గా కట్కం రవీందర్ ఎన్నిక
▪️ వైస్ చైర్మన్‌గా తురగ సౌజన్య శ్రీధర్ రెడ్డి ఎంపిక
▪️ పాలక వర్గ సభ్యులుగా( కోఆప్షన్ ) ఎలిగేట్ లతికా – అనిల్ ఎన్నిక

మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ వశం కావడంతో పట్టణంలో రాజకీయ ఉత్సాహం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్. రమణ, జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్లు నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్‌లకు శాలువలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు.

రాయికల్ మున్సిపల్ రాజకీయాల్లో బీఆర్ఎస్ పూర్తి ఆధిపత్యం నెలకొన్నట్లు స్పష్టమైంది. ఈ ఫలితంతో జగిత్యాల జిల్లాలో గులాబీ పార్టీ శక్తి కొంత ఉన్నట్లు చాటినట్లైంది.

బీజేపీ రాయికల్ లో 5 వార్డుల గెలుచుకున్న, రాజకీయ వ్యూహం, నాయకత్వ లేమితో అధికారపీఠం వదులుకోవడం, కార్యకర్తలకు నిరాశే మిగిల్చింది.

ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా వేముల నాగలక్ష్మి (కాంగ్రెస్) ఎన్నిక
ధర్మపురి | ఫిబ్రవరి 16 – ప్రజా మంటలు

ధర్మపురి మున్సిపల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మున్సిపల్ చైర్‌పర్సన్‌గా వేముల నాగలక్ష్మిను కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపిక చేశారు. అదే సమయంలో, వైస్ చైర్మన్‌గా ఇందారపు రామన్నను తిరిగి నియమించారు.

▪️ మొదటినుంచి ప్రచారంలో ఉన్న అభ్యర్థి కాకుండా కొత్త అభ్యర్థికి ఛైర్‌పర్సన్ పదవి
▪️ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చొరవతో వేముల నాగలక్ష్మి ఎంపిక
▪️ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఇందారపు రామన్నకు మళ్లీ వైస్ చైర్మన్ పదవి
▪️ కాంగ్రెస్‌లో దీర్ఘకాలంగా పనిచేస్తున్న నాయకులు, జనరల్ మహిళకు అవకాశం రావడంతో,  ఎంతో కాలంగా పదవి ఆశించిన వారికి నిరాశే ఎదురైంది.

ఈ ఎంపికలతో ధర్మపురి మున్సిపల్ పాలన పూర్తిగా కాంగ్రెస్ ఆధీనంలోకి వెళ్లింది. పార్టీ అంతర్గత సమీకరణాలు, మంత్రి అడ్లూరి వ్యూహాలు ఫలించినట్టుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

గ్యారంటీల పేర మోసం చేసిన కాంగ్రెస్ ను ఓడించండి - కొప్పుల ఈశ్వర్
ధర్మపురి, ఫిబ్రవరి 08 (ప్రజా మంటలు):

ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు 15, 4, 7, 9, 8, 1 వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 420 హామీలు, ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, అందువల్ల ఈ ప్రభుత్వానికి ఓటు అడిగే అర్హత లేదన్నారు. ఎన్నికల్లో జూట మాటలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గాలను మోసం చేశారని విమర్శించారు.

ఉద్యోగాల పేరుతో యువతను నమ్మించి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మోసం చేసిందని, ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను దగాచేసిందన్నారు. రేవంత్ పాలనలో మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయని, గతంలోలా చెప్పులు క్యూలైన్లలో పెట్టి ఎదురు చూడాల్సిన పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు.

రెండేళ్లుగా సంక్షేమం, అభివృద్ధి లేక ప్రజలు గోసపడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టింపులేదన్నారు. ఆశపడటం తప్పు కాదని, కానీ ఆశ పెట్టి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చి మోసం చేయడం తప్పని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు అరచేతిలో వైకుంఠం చూపిస్తూ ‘అభయహస్తం’ అన్నారు గానీ, అది అభయహస్తం కాదని భస్మాసుర హస్తమని ధ్వజమెత్తారు.

ధర్మపురి పట్టణంలో తాను సుమారు రూ.9 కోట్లతో మాతా–శిశు ఆసుపత్రిని నిర్మించి ప్రారంభించానని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆసుపత్రిలో ఫర్నిచర్, డాక్టర్లు, సిబ్బంది ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు.

ధర్మపురి మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

హుస్నాబాద్ పట్టణాన్ని రాష్ట్రంలో రోల్ మోడల్ చేస్తా - పొన్నం
హుస్నాబాద్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్, ఫిబ్రవరి2,(ప్రజా మంటలు):

ఈనెల 11 వ తేదీన జరిగే ఎన్నికల్లో హుస్నాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని 20 లోస్థానాలు గెలిపించి తనకు మరింత బలాన్ని ఇవ్వాలని హుస్నాబాద్ పట్టణంను ప్రత్యేక ప్రణాళిక ద్వారా అభివృద్ధి చేస్తున్నామని ,గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో ఒక్క డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వలేదని  ,హుస్నాబాద్ పట్టణంలో ఈ ఒక్క సంవత్సరమే 500  ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాము  అవకాశం ఇస్తే
హుస్నాబాద్ పట్టణాన్ని రాష్ట్రంలో రోల్ మోడల్ చేసి, అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

హుస్నాబాద్ లో మున్సిపల్ ఎన్నికలకు 1,2,3,12,13,14 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు స్థానిక ముఖ్య నేతలతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ డోర్ టూ డోర్ ప్రచారం నిర్వహించారు. ప్రచారం లో గడపగడప కి వెళ్తూ మహిళలు, చిన్నారులను, వృద్ధులను ఆత్మీయంగా పలకరిస్తూ ప్రజా పాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు. ఫిబ్రవరి 11 వ తేదీన జరిగే ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటు అభ్యర్థించారు.

ఒకటవ వార్డులో అనూష సాగర్ ,రెండవ వార్డులో లత కృష్ణ స్వామి ,మూడవ వార్డులో కొండ రజిత , 12 వార్డులో కేశినేని రమేష్ ,13 వార్డులో పచ్చిమట్ల శ్రీకాంత్ ,14 వ వార్డులో దండి లక్ష్మీ లకు మద్దతుగా ప్రచారం నిర్వహించి వారిని ఓటర్లకు పరిచయం చేస్తూ స్థానికంగా ఉండే నేతలు నిరంతరం మీ సమస్యలలో మీకు అండగా ఉంటారని, మీ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. పేదలకి 200 యూనిట్ల ఉచిత విద్యుత్,మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ,సన్న బియ్యం పంపిణీ , నూతన రేషన్ కార్డులు , మహిళలకు వడ్డీలేని రుణాలు లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. హుస్నాబాద్ లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కి 20 స్థానాలు ఇచ్చి తనకి మరింత ఆత్మస్థైర్యాన్ని  ఇవ్వాలని పేర్కొన్నారు.
హుస్నాబాద్ పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు పూర్తి చేస్తున్నామని 250 పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందనీ,హుస్నాబాద్ కి ఇంజనీరింగ్ కళాశాల,ఎల్లమ్మ చెరువు సుందరీకరణ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.  ఉపాధి అవకాశాలు పెంచడానికి ఇండస్ట్రియల్ కారీడార్ తీసుకొస్తున్నామన్నారు. మహిళలకు స్వీయ ఉపాధి పెంచుకోవడానికి సెట్విన్ శిక్షణ ఇస్తున్నామన్నారు. ఎల్లమ్మ చెరువు దగ్గర ఫిషరీస్ మార్కెట్,కోల్డ్ స్టోరేజ్ నిర్ణయిస్తామని ప్రతిపాదనలు పంపామని వెల్లడించారు. ప్రభుత్వం మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేలా బలన్నివ్వాలని  ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.
[02/02, 19:34] Rajanna Elkathurty Reporter: చట్టం ముందు కేసీఆర్ దేవుడా..?

భయం ఉంటేనే రాస్తారోకోలు ర్యాలీలు

జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వీరమల్లు రంజిత్ రెడ్డి తీవ్ర విమర్శలు

ఎల్కతుర్తి ఫిబ్రవరి 02 ప్రజా మంటలు

సీట్ విచారణలో భాగంగా ఆదివారం రోజున అధికారులు విచారణకు పిలువగా తప్పు చేయనప్పుడు భయమెందుకు అని వారి అనుచరులు రాస్తారోకోలు బైకు ర్యాలీలు చేయడమేంటని అన్నారు. హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరమల్లు రంజిత్ రెడ్డి సోమవారం ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కెసిఆర్ ఏమైనా దైవంశ సంభూతుడ మానవాతీతుడా మహాత్ముడా అని అన్నారు. బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ను చట్టాలకు అతీతుడా గా చూపించే ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరమాల్లు రంజిత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం ముందు నిలబడాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. సిబుసోరెన్ జయలలిత లాలు ప్రసాద్ యాదవ్ యడ్యూ రప్ప వంటి దేశంలోని ప్రముఖ నాయకులే తప్పులకు జైళ్లకు వెళ్లినప్పుడు దుర్మార్గపు పనులు చేసిన ముఠాకు నాయకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసీఆర్ ను విచారణకు పిలిస్తే ఎందుకు భయపడుతున్నారని ఆయన నిలదీశారు. కెసిఆర్ తప్పు చేయలేదని అనుకుంటే రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు బైక్ ర్యాలీలు పెట్టి ప్రజలను రోడ్డెక్కించడం ఎందుకని ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి విభజన అనంతరం కెసిఆర్ ధనిక తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారని వేలకోట్ల అప్పులు చేసి రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టారని రంజిత్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పుడు ఆ అప్పుల భారం మోస్తూ ప్రజలకు పాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేయడం సిగ్గుచేటని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ప్రజలకు సంక్షేమ పథకాలు విద్య వైద్య రంగాలకు నిధులు కేటాయిస్తూ ముందుకు సాగుతుంటే అభివృద్ధిని జీర్ణించుకోలేని కెసిఆర్ ఆయన అనుచరులు ప్రజా ప్రభుత్వం పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. విచారణ ఎదుర్కొనే ధైర్యం లేకనే ప్రజలను రెచ్చగొట్టే రాజకీయ గ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. కెసిఆర్ పై ఉన్న ఆర్థిక అక్రమాలు అవినీతి ఆరోపణలపై సిబిఐ ఈడి సహా కేంద్ర దర్యాప్తు సంస్థలతో సమగ్ర విచారణ జరగాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. నిజాలు బయటపడితే కెసిఆర్ పాలనలో జరిగిన దోపిడీ ప్రజల ముందు బయటపడుతుందని హెచ్చరించారు. ప్రజాస్వామ్యం అన్నింటిని గమనిస్తోందని రానున్న మున్సిపాలిటీ ఎన్నికలలో కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు మరోసారి రాజకీయ బుద్ధి చెప్పడం ఖాయమని జోస్యం చెప్పారు. చట్టాన్ని తప్పించుకోవాలని ఎంత ప్రయత్నించినా చివరికి న్యాయం గెలుస్తుందని కేసీఆర్ అయినా సరే చట్టం ముందు తలవంచక తప్పదని వీరమల్లు రంజీత్ రెడ్డి స్పష్టం చేశారు.

తెలంగాణ జల ద్రోహానికి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి: హరీష్ రావు
హైదరాబాద్, జనవరి 30 (ప్రజా మంటలు):

రాజకీయాలకన్నా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో అత్యవసరంగా ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆయన… రాష్ట్రానికి జరుగుతున్న తీవ్రమైన జల ద్రోహాన్ని దేశరాజధాని ఢిల్లీ కేంద్రంగా ప్రజల ముందుకు తీసుకొచ్చామని తెలిపారు. ఈ పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వమే కల్పించిందని తీవ్రంగా విమర్శించారు.

తెలంగాణ నీటిని ఆంధ్రప్రదేశ్‌కు దోచిపెడుతున్నది సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డేనని హరీష్ రావు ఆరోపించారు. “ఈ ప్రాంతం వాడే తెలంగాణకు ద్రోహం చేస్తాడని కాళోజీ గారు ముందే చెప్పినట్లే జరుగుతోంది” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పక్కా ప్రణాళిక ప్రకారమే పోలవరం–నల్లమల సాగర్‌కు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తోందని, అందులో భాగంగానే సుప్రీంకోర్టులో చెల్లని రిట్ పిటిషన్ వేసి తిరిగి వెనక్కి తీసుకున్నారని ఎద్దేవా చేశారు.

ఒకవేళ ఈ తప్పు జరిగితే… తెలంగాణ నీటి చరిత్రలో ఈ రోజు శాశ్వతంగా ఒక **“బ్లాక్ డే”**గా మిగిలిపోతుందని హరీష్ రావు హెచ్చరించారు. గోదావరి జలాల అక్రమ తరలింపు విషయంలో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచే అప్రమత్తం చేస్తూనే వస్తోందని, అయినా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే పెడచెవిన పెడుతోందన్నారు.

గతంలో ఈ అంశంపై అనేకసార్లు ప్రెస్‌మీట్‌లు పెట్టి వాస్తవాలు బయటపెట్టినా, ప్రభుత్వం మాత్రం నామమాత్రంగా బ్యాక్‌డేట్ లేఖలు విడుదల చేసి చేతులు దులుపుకుందని దుయ్యబట్టారు. “ముల్లు కర్రతో పొడుస్తూ మొద్దు నిద్ర లేపుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం తప్పులు చేస్తూనే ఉంది” అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

బనకచర్ల అయినా, నల్లమల సాగర్ అయినా పేరు మాత్రమే మారిందని, కానీ ఆంధ్రప్రదేశ్ జల దోపిడీ మాత్రం ఆగలేదని హరీష్ రావు స్పష్టం చేశారు. “జల ద్రోహంలో కత్తి చంద్రబాబుది అయితే, పొడిచేది రేవంత్ రెడ్డి” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సమైక్య పాలనలోనే తెలంగాణకు నీటి వాటాల్లో తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు మరో చారిత్రక ద్రోహానికి పాల్పడుతోందని విమర్శించారు. ఈ రోజు ఢిల్లీలో జరుగుతున్న ఇరిగేషన్ మీటింగ్ సాక్షిగా రేవంత్ ప్రభుత్వం రాష్ట్రానికి మరణ శాసనం రాయబోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రజలు ఈ ద్రోహాన్ని ఎప్పటికీ క్షమించరని, నీటి హక్కుల కోసం బీఆర్ఎస్ చివరి వరకూ పోరాడుతుందని హరీష్ రావు స్పష్టం చేశారు.

టీపీసీసీ ఎస్సీ విభాగం చైర్మన్‌ కవ్వంపల్లి సత్యనారాయణకు కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ శ్రేణుల ఘన స్వాగతం
కరీంనగర్, జనవరి 10 (ప్రజా మంటలు):

టీపీసీసీ ఎస్సీ విభాగం చైర్మన్‌గా నియమితులైన మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తొలిసారిగా కరీంనగర్ జిల్లాకు విచ్చేయగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.

జిల్లా సరిహద్దు బెజ్జంకి నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహిస్తూ నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, చొప్పదండి ఎమ్మెల్యే, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తదితరులు కవ్వంపల్లి సత్యనారాయణకు శాలువా, గజమాలలతో స్వాగతం పలికారు.

ర్యాలీ అనంతరం కోర్టు చౌరస్తా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు కోడూరు సత్యనారాయణ గౌడ్, ఆరెపల్లి మోహన్,నాయకులు ఎండి తాజ్,కొర్వి  అరుణ్ కుమార్, శ్రవణ్ నాయక్, పులి ఆంజనేయులు గౌడ్, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, కర్రసత్య ప్రసన్న రెడ్డి,పురం రాజేశం, ఎస్ ఎల్ గౌడ్, గోపు మల్లారెడ్డి,కర్ర రాజశేఖర్ తో పాటు
కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరైనారు.

సమావేశంలో మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, దళితుల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ చారిత్రకంగా కట్టుబడి పనిచేస్తోందని అన్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులకు ఎక్కువ రాజకీయ ప్రాతినిధ్యం కల్పించామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు శాశ్వత పరిష్కారం చూపిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు.

అనంతరం కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, ఎస్సీ సెల్ చైర్మన్ పదవి తనకు గౌరవం కంటే బాధ్యతగా భావిస్తున్నానన్నారు. దళితుల ఐక్యత, సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ద్వారా నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ఎస్సీ వర్గీకరణతో దళితుల మధ్య సోదర భావం పెరిగిందని పేర్కొన్నారు.

కవితపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదు: తెలంగాణ జాగృతి
హైదరాబాద్ జనవరి 08 (ప్రజా మంటలు)::

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై తీన్మార్ మల్లన్న తప్పుడు, అసత్య ప్రచారం చేస్తున్నాడని తెలంగాణ జాగృతి నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో జరిగిన ప్రెస్‌మీట్‌లో రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీకాంత్ గౌడ్, నాయకులు ఆనంద్, మాధవి మీడియాతో మాట్లాడారు.

అగ్గిపెట్టె హరీష్ రావు డైరెక్షన్‌లో, బీఆర్ఎస్ విష కౌగిలిలోకి వెళ్లి తీన్మార్ మల్లన్న కవితపై నీచమైన ఆరోపణలు చేస్తున్నాడని శ్రీకాంత్ గౌడ్ ఆరోపించారు. కవితను కాంగ్రెస్ మంత్రివర్గంలోకి తీసుకునే ప్రయత్నం చేశారన్న మల్లన్న వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని అన్నారు. జూన్ 8న కాంగ్రెస్ మంత్రులు ప్రమాణం చేసిన సమయంలో కవిత బీఆర్ఎస్‌లోనే ఉన్న విషయాన్ని కూడా గుర్తించకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.

టీఆర్పీ పేరుతో పార్టీ పెట్టిన మల్లన్న, కాంగ్రెస్ బీఫామ్‌పై ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు. క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బులు వసూలు చేస్తూ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపించారు. సాయి ఈశ్వరాచారి ఆత్మహత్యకు మల్లన్నే కారణమని పేర్కొంటూ, దీనిపై ప్రభుత్వం వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

కవితపై అనుచిత వ్యాఖ్యలు కొనసాగిస్తే తెలంగాణలో తిరగనివ్వమని జాగృతి నేతలు హెచ్చరించారు. రాజకీయంగా విధానాలపై మాట్లాడితే పరవాలేదని, కానీ వ్యక్తిగతంగా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు.

కవితపై తప్పుడు ప్రచారం మానుకోవాలని, లేదంటే తగిన విధంగా స్పందిస్తామని జాగృతి నాయకులు స్పష్టం చేశారు.