యావర్ రోడ్డు విస్తరణ - Praja Mantalu

అభివృద్ధే అస్త్రం… అధికార పార్టీతోనే జగిత్యాల పురోగతి: ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల – ఫిబ్రవరి 09 (ప్రజా మంటలు):

చేసిన అభివృద్ధి పనులకే ప్రజలు పట్టం కడతారని, ప్రభుత్వంతో కలిసి పనిచేసే ప్రతినిధులను గెలిపిస్తేనే జగిత్యాల అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

యావర్ రోడ్డు విస్తరణకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణానికి చల్గల్‌లో స్థలం కేటాయించినట్లు తెలిపారు. టీఆర్ నగర్‌ను జగిత్యాలలో విలీనం చేయడం ద్వారా అధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశామని చెప్పారు.

జగిత్యాల, రాయికల్, టీఆర్ నగర్ ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. జగిత్యాలలో అభివృద్ధితో మార్పు మొదలైందని, ప్రజలు దీనిని గమనిస్తున్నారని అన్నారు.

జీవో–58 కింద టీఆర్ నగర్‌లో 116 మందికి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇళ్ల పట్టాలు ఇచ్చామని తెలిపారు. అలాగే, 62 కోట్ల నిధులతో జగిత్యాల పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. గతంలో ఇతర నియోజకవర్గాల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మాణం జరగలేదని, జగిత్యాలలో మాత్రం రాష్ట్రంలోనే అత్యధికంగా 4520 ఇళ్లు నిర్మించినట్లు తెలిపారు.

కొందరు అభివృద్ధిని ఓర్వలేక కుల, మత, ప్రాంత భేదాలతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కన్నీళ్లు, ప్రలోభాలతో ఓట్లు వేయకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ పక్షాన ఉండి అభివృద్ధి చేసే వారికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరు చేస్తామని, 5 కోట్ల ఎస్‌డీఎఫ్ నిధులతో అన్ని కుల సంఘాల భవనాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. జగిత్యాల పట్టణంలోని అన్ని వార్డుల్లో నాణ్యతతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు.

ఒక్క ఓటు ఐదేళ్ల జగిత్యాల అభివృద్ధికి దారితీస్తుందని, ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, నాయకులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఏ పార్టీ తెలవని ఎమ్మెల్యే బీ-ఫారం ఎలా ఇస్తారు? – కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం సహించం: మాజీ మంత్రి టీ. జీవన్ రెడ్డి
జగిత్యాల, జనవరి 19 (ప్రజా మంటలు):

తాను ఏ పార్టీకి చెందినవాడో కూడా స్పష్టత లేని ఎమ్మెల్యే, మున్సిపల్ ఎన్నికలలో బీ-ఫారం ఇవ్వడం గురించి మాట్లాడడం విడ్డూరమని మాజీ మంత్రి టీ. జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ మిత్రుల కలయిక సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ, రాజ్యాంగ నిబంధనలు, నైతిక విలువల గురించి ఏ పార్టీలో ఉన్నాడో తెలియని వ్యక్తి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

2014లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను జగిత్యాల ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో బోర్నపల్లి వంతెన కోసం తాను విజ్ఞప్తి చేయగా, కేసీఆర్ సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో నీ జోక్యం ఏమిటని ప్రస్తుత ఎమ్మెల్యేను ఆయన నిలదీశారు.

టిడిపి శాసనసభ రద్దు చేసిన అనంతరం తాను కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు, 1984 పార్లమెంట్ ఎన్నికల తర్వాత అదే ఏడాది డిసెంబర్‌లో కాంగ్రెస్‌లో చేరానని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే మా హక్కులకు అడ్డుపడుతున్నారని, తమ హక్కుల కోసమే తాము మాట్లాడుతున్నామని అన్నారు.

జగిత్యాలలో మాత్రమే జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే రూ.15 కోట్ల విలువైన పనులు సింగిల్ టెండర్ ద్వారా, మూడు శాతం అధికంగా, అగ్రిమెంట్ లేకుండా చేపట్టడం ఇదేనా అభివృద్ధి పనుల్లో పారదర్శకత అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా ఇది మీ బాధ్యత కాదా అని సూటిగా నిలదీశారు.

గత పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వారికి గుర్తింపు ఇవ్వాలన్నదే తమ విజ్ఞప్తి అని తెలిపారు. టికెట్ల విషయమై నిర్ణయం పార్టీ అధిష్టానం తీసుకుంటుందని, కాంగ్రెస్ పార్టీ టికెట్లపై మాట్లాడే అర్హత ఎమ్మెల్యేకు లేదని తీవ్రంగా వ్యాఖ్యానించారు. పదేళ్లు కష్టపడ్డవారు అవకాశాలు పొందాలా? లేక అవకాశవాదులా? అని ప్రశ్నించారు.

చొక్కా రావు హయాంలో తాను జగిత్యాల కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జిగా పనిచేశానని గుర్తు చేశారు. అలాగే యావర్ రోడ్డు విస్తరణ కోసం కలెక్టర్‌కు లేఖ రాస్తే ఎమ్మెల్యే అడ్డుపడిన కారణంగానే ఆ పనులు జాప్యం అయ్యాయని ఆరోపించారు.

అసెంబ్లీలో జగిత్యాల నియోజకవర్గ సమస్యలు ప్రస్తావించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
హైదరాబాద్ డిసెంబర్ 29 (ప్రజా మంటలు):

అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించిన కీలక సమస్యలను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సభ దృష్టికి తీసుకువచ్చారు. జగిత్యాల మున్సిపాలిటీ పురాతనమైనదని, పట్టణ అభివృద్ధిలో భాగంగా యావర్ రోడ్డును 60 అడుగుల నుంచి 100 అడుగుల వరకు విస్తరించేందుకు 2021లో మాస్టర్ ప్లాన్ రూపొందించామని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖను కూడా నిర్వహిస్తున్నందున, యావర్ రోడ్డు విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సభాధ్యక్షుల ద్వారా విజ్ఞప్తి చేశారు.

అలాగే జగిత్యాల ప్రాంతం ప్రధానంగా కమాండ్ ఏరియాగా ఉండటంతో సాగునీటి సమస్యలు తలెత్తకుండా కాలువల మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉందని వివరించారు. మరోవైపు ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించిన రోల్లవాగు ప్రాజెక్ట్ అటవీ అనుమతుల ఆలస్యం కారణంగా గేట్ల నిర్మాణం నిలిచిపోయిందని తెలిపారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సభలో కోరారు.

SEO కీవర్డ్స్ / ట్యాగ్స్:

యావర్ రోడ్డు విస్తరణ జరిగితేనే రాజకీయాల్లో కొనసాగుతా:?
జగిత్యాల / హైదరాబాద్ డిసెంబర్ 22 ప్రజా మంటలు:

జగిత్యాల నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక అయిన యావర్ రోడ్డు విస్తరణపై జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో సీఎం కార్యాలయంలో ప్రత్యేకంగా చర్చించారు.

ఈ సందర్భంగా యావర్ రోడ్డు విస్తరణ జరిగితేనే మళ్లీ రాజకీయాల్లో కొనసాగుతా అని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన తెలిపారు.

2001కి ముందు యావర్ రోడ్డు 80 అడుగుల వెడల్పుతో ఉండేదని, మొదటి నుంచే ఇది ప్రధానంగా వ్యాపార ప్రాంతంగా, తక్కువ నివాస ప్రాంతంతో కొనసాగిందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అయితే 2021లో రోడ్డును 100 అడుగుల వెడల్పుతో కమర్షియల్ జోన్‌గా మార్చడం జరిగిందని తెలిపారు.

గతంలో 30, 50, 80 అడుగుల రోడ్డు వెడల్పు అనుమతులతో నిర్మించిన భవనాలను తొలగించాల్సి వస్తే, నష్టపరిహారం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, అందువల్ల రోడ్డు విస్తరణకు తక్షణ చర్యలు అవసరమని సీఎం ను కోరారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీదేవికి తగిన ఆదేశాలు జారీ చేశారు.

జగిత్యాల పట్టణ అభివృద్ధికి రాష్ట్రంలోనే అత్యధికంగా రూ.62.50 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు, యావర్ రోడ్డు విస్తరణకు హామీ ఇచ్చినందుకు సీఎం కు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.

అలాగే జగిత్యాలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం మంజూరు కాగా, 10 ఎకరాల్లో మినీ స్టేడియం, ఇండోర్ స్టేడియం నిర్మాణానికి స్థలం సమస్యగా మారిందని వివరించారు. ప్రజల సౌకర్యార్థం చల్గల్ వద్ద వాలంతరీ భూమిని కేటాయించాలని కోరగా, ఇరిగేషన్, కమాండ్ ఏరియా డెవలప్మెంట్ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జతో మాట్లాడి స్థలం కేటాయింపునకు సీఎం ఆదేశాలు ఇచ్చారు.

రూ.204 కోట్లతో మంజూరైన హాస్పిటల్ ప్రాజెక్టులో భాగంగా రూ.135 కోట్లతో బిల్డింగ్ నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తయిందని, జనవరిలో భూమిపూజ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎం ను ఆహ్వానించగా, జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు కూడా సమాచారం అందించినట్లు ఎమ్మెల్యే చెప్పారు.