జనసమితి - Praja Mantalu

బనకచర్ల ప్రాజెక్టు వెంటనే ఆపాలి - రంగారెడ్డి జిల్లా జనసమితి ప్లీనరీలో ప్రొ.కోదండరాం.
హైదరాబాద్ జూన్ 21 (ప్రజా మంటలు):

తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య ఉన్న సంబంధాల దృష్ట్యా బనకచర్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజలు ఊరుకునే ప్రసక్తే లేదని, ప్రాజెక్టు వ్యతిరేకంగా తెలంగాణ జన సమితి పోరాటాన్ని తీవ్రతరం చేస్తుందని హెచ్చరించారు.

తెలంగాణ జన సమితి రంగారెడ్డి జిల్లా ప్లీనరీ సమావేశం శనివారం ఉదయం ఎల్.బి.నగర్‌లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టి.జె.ఎస్ అధినేత, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం గారు హాజరైయ్యారు.

టి.జె.ఎస్ రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ పల్లె వినయ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కోదండరాం గారు మాట్లాడుతూ " నాడు ఉమ్మడి రాష్ట్రంలోనూ, తెలంగాణ ఏర్పడ్డ తరువాత కెసిఆర్ పాలనలోనూ రంగారెడ్డి జిల్లా తీవ్ర వివక్షకు గురైంది. తెలంగాణ ఉద్యమంలో రంగారెడ్డి జిల్లా కీలక పాత్ర పోషించింది, అనేక ఉద్యమాలకు కేంద్ర బిందువుగా ఈ ప్రాంతం నిలిచింది. ఇక్కడి త్యాగాలు ఎప్పటికీ ప్రజలకు స్ఫూర్తినిస్థాయి. రంగారెడ్డి జిల్లాలో జరిగిన అనేక ప్రజా ఉద్యమాల్లో తెలంగాణ జన సమితి ముందుండి పోరాడిందని, జిల్లా ప్రజల హక్కులను నిలబెట్టేందుకు పార్టీ నిరంతరం కృషి చేస్తోందన్నారు."

ఇక గత ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, "గత పాలనలో ఫోన్ ట్యాపింగ్ చేస్తూ తమ ప్రభుత్వాన్ని విమర్శించే వారిపై నిత్యం నిఘా పెడుతూ వారిని వేదించేవారు. ఎదైనా కార్యక్రమం తలపెడితే ముందుగానే పోలీసులు ఆ విషయం తెలుసుకొని నిర్బంధించేవారు, నేడు ఆ పరిస్థితి పోయి స్వేచ్చ వాతావరణం ఉందని, సభలు సమావేశాలు జరుపుకోవడానికి అవకాశం ఉందన్నారు. కాలేశ్వరం పేరుతో లక్షల కోట్ల అప్పులు చేసి తెలంగాణను ఆర్ధికంగా దెబ్బతీశారని అన్నారు.
రైతుల భూముల విషయంలో గత ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందని, 420000 ఎకరాల భూమిని భూసేకరణ పేరుతో తీసుకున్నదని, అందులో ఎక్కువగా  పేదలకు ఇచ్చిన ఎసైన్డ్ భూములేనని గుర్తు చేశారు.

నాటి నుండి నేటి వరకు తెలంగాణ జన సమితి ప్రజల పక్షానే నిలబడి ప్రజా సమస్యలను రాజకీయ ఎజెండా మీద నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిందని, భవిష్యత్తులో కూడా అలానే పని చేస్తుందని స్పష్టం చేశారు. హార్డ్ వేర్ పార్క్, ఫార్మా సిటీ రైతుల హక్కుల కోసం జన సమితి నిరంతరం ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరుపుతోంది అని తెలిపారు.
అదే విధంగా, రాజకీయాలు డబ్బు చుట్టూ తిరిగే విధంగా కాకుండా ప్రజల చుట్టూ తిరిగేలా మారాలని. ప్రజలతో సంబంధం ఉన్నవారికి ప్రభుత్వ పనిలో భాగస్వామ్యం దక్కేలా ఉండాలని ఆకాంక్షించారు

ప్లీనరీ సమావేశం అనంతరం రాష్ట్ర కమిటీ సభ్యునిగా కె.వి.రంగారెడ్డిని, రంగారెడ్డి జిల్లా నూతన అధ్యక్షుడిగా దార సత్యం, ప్రధాన కార్యదర్శిగా కొత్త రవి, ఉపాధ్యక్షులుగా ఆర్.కే నాగని, షేక్ ఇమామ్ హుస్సేన్, పగడాల రమణ, జాయింట్ సెక్రటరీలుగా నిరంజన్, ఓబుల్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వేణుగోపాల్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా జంగయ్య, లింగయ్య, రమేష్ యాదవ్, పెంటా రెడ్డి ఎన్నికయ్యారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ధర్మార్జున్, బైరి రమేష్, ఆశప్ప, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎం.నరసయ్య, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు లక్ష్మి, కార్యదర్శి హనుమంత్ రెడ్డి, హైదరాబాద మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు దేశపాక శ్రీనివాస్, జనగాం జిల్లా అధ్యక్షుడు అశోక్ వర్ధన్ రెడ్డి, రాష్ట్ర కార్మిక విభాగ కన్వీనర్ ఆకుల శ్రీనివాస్, శేఖర్ యాదవ్, జంగయ్య, కళ్లెం శ్రీను, వినీల్ గుప్తా తదితరులు పాల్గొన్నారు..