Karimnagar - Praja Mantalu

ఘనంగా దుద్దిళ్ల శ్రీపాదరావు 89వ జయంతి వేడుకలు
కరీంనగర్, మార్చి 02 (ప్రజా మంటలు):

మాజీ శాసనసభ స్పీకర్, అజాతశత్రువు దుద్దిళ్ల శ్రీపాదరావు గారి 89వ జయంతి వేడుకలు జిల్లా కాంగ్రెస్ కార్యాలయం తో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు.
ముందుగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శ్రీపాదరావు చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం బస్టాండ్ కూడలి వద్ద ప్రభుత్వం తరఫున ఆర్డీవో మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశం, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, అనుబంధ సంఘాల అధ్యక్షులు ఎండి తాజ్, కొరివి అరుణ్ కుమార్, కార్పొరేటర్లు మల్లికార్జున రాజేందర్, పర్వత మల్లేశం, వరాల నర్సింగం, గుమ్మడి రాజ్ కుమార్ తదితరులు పాల్గొని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అన్నదాన కార్యక్రమం ప్రారంభం
ఈ సందర్భంగా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసనసభ స్పీకర్‌గా శ్రీపాదరావు ప్రజాసేవలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారని, ప్రాంత భేదం లేకుండా ప్రతి ఒక్కరికీ సేవలు అందించి అజాతశత్రువుగా అందరి మన్ననలు పొందారని పేర్కొన్నారు.
ఆయన చూపిన సేవా మార్గం నేటి రాజకీయ నాయకులకు ఆదర్శప్రాయమని అన్నారు.
అలాగే, ఆయన మరణానంతరం ఆయన ఆశయాలను తనయుడు దుద్దిళ్ల శ్రీధర్ బాబు కొనసాగిస్తూ, తండ్రికి తగ్గ తనయుడిగా ప్రజల మన్ననలు పొందుతున్నారని ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో వెన్న రాజమల్లయ్య, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, టేల భూమయ్య, ఆకుల ఉదయ్, మంద నగేష్ ముదిరాజ్, మూల కృష్ణారెడ్డి, వంగల విద్యాసాగర్, విక్టర్, నాగుల సతీష్, చెర్ల పద్మ, పంజాల స్వామి గౌడ్, దిండుగాల మధు, మాదాసు శ్రీనివాస్, సత్తినేని శ్రీకాంత్, జ్యోతి రెడ్డి, రాచర్ల పద్మ, అబ్దుల్ భారీ, కుంభాల రాజ్ కుమార్, బషీరుద్దీన్, కాంపల్లి కీర్తి కుమార్, ఎర్ర శ్రీనివాస్, స్వప్న శ్రీ, ముక్క భాస్కర్, శ్రీరాముల రమేష్, దండు రవీందర్, సలీముద్దీన్, సిరికొండ శివప్రసాద్, జొన్నల రమేష్, కొట్టే ప్రభాకర్, మామిడి సత్యనారాయణ రెడ్డి, రూపు రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సుంకరిగణపతి, ఊరడి లత, ములకల కవిత, మార్కరాజు, ఫజల్, అందే శంకర్ తదితరులు పాల్గొన్నారు.

కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు
కరీంనగర్, జనవరి 26 (ప్రజా మంటలు):

77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, బాబు రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నాయకత్వంలో రూపొందిన భారత రాజ్యాంగం దేశానికి దిశానిర్దేశం చేసిందని అన్నారు. 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి రావడం ద్వారా భారత్ సార్వభౌమ, సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అవతరించిందని తెలిపారు. స్వాతంత్ర సమరయోధులు, రాజ్యాంగ నిర్మాతల త్యాగాలు, ఆలోచనల ఫలితంగానే నేడు భారత్ ప్రపంచంలో గొప్ప ప్రజాస్వామ్య దేశంగా నిలిచిందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వెలిచాల రాజేందర్ రావు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, పీసీసీ ప్రధాన కార్యదర్శి రహమత్ హుస్సేన్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్‌తో పాటు పలువురు నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు..

వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్, జనవరి 25 (ప్రజా మంటలు):

కరీంనగర్ పాత మార్కెట్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి 9వ వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథసప్తమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, సూర్యప్రభ వాహనసేవలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, కరీంనగర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, గతంలో మాజీ మంత్రి ప్రారంభించిన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే భక్తి భావంతో కొనసాగిస్తోందన్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో పాటు దాతల సహాయంతో పూజలు, హోమాలు, అన్నదాన కార్యక్రమాలు నిరంతరంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.

సమ్మక్క సారలక్క జాతరకు ప్రత్యేక బస్సులు

సమ్మక్క-సారలమ్మ జాతరపై మంత్రి ప్రత్యేకంగా స్పందిస్తూ, ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని 51 కేంద్రాల నుంచి ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు. జాతర కోసం మొత్తం 4 వేల ఆర్టీసీ బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు.

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమని, భక్తులు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. గద్దెల వరకు బస్సులు వెళ్లేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. పిల్లలు తప్పిపోకుండా ఉండేందుకు పోలీస్ శాఖ క్యూఆర్ కోడ్ వ్యవస్థను తీసుకొచ్చిందని, భక్తులు అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరారు.

ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు లేవు.

ఫోన్ ట్యాపింగ్ అంశంపై స్పందించిన మంత్రి, ప్రభుత్వం ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు చేపట్టడం లేదని, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని అన్నారు. మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్ల విషయంలో ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉండదని స్పష్టం చేశారు. గతంలో జరిగినట్లుగా రిజర్వేషన్లు మార్చే పరిస్థితి ఇప్పుడు లేదన్నారు.

హుస్నాబాద్ నియోజకవర్గంలోనూ రిజర్వేషన్లపై ఎలాంటి జోక్యం ఉండదని, ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకూ ఎవరి ప్రమేయం ఉండదని తెలిపారు. అభ్యర్థుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని, ‘సెలెక్ట్ అండ్ ఎలెక్ట్’ విధానంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికల్లో అందరూ సమన్వయంతో పనిచేయాలని మంత్రి కోరారు.

టీపీసీసీ ఎస్సీ విభాగం చైర్మన్‌ కవ్వంపల్లి సత్యనారాయణకు కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ శ్రేణుల ఘన స్వాగతం
కరీంనగర్, జనవరి 10 (ప్రజా మంటలు):

టీపీసీసీ ఎస్సీ విభాగం చైర్మన్‌గా నియమితులైన మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తొలిసారిగా కరీంనగర్ జిల్లాకు విచ్చేయగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.

జిల్లా సరిహద్దు బెజ్జంకి నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహిస్తూ నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, చొప్పదండి ఎమ్మెల్యే, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తదితరులు కవ్వంపల్లి సత్యనారాయణకు శాలువా, గజమాలలతో స్వాగతం పలికారు.

ర్యాలీ అనంతరం కోర్టు చౌరస్తా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు కోడూరు సత్యనారాయణ గౌడ్, ఆరెపల్లి మోహన్,నాయకులు ఎండి తాజ్,కొర్వి  అరుణ్ కుమార్, శ్రవణ్ నాయక్, పులి ఆంజనేయులు గౌడ్, కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, కర్రసత్య ప్రసన్న రెడ్డి,పురం రాజేశం, ఎస్ ఎల్ గౌడ్, గోపు మల్లారెడ్డి,కర్ర రాజశేఖర్ తో పాటు
కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరైనారు.

సమావేశంలో మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, దళితుల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ చారిత్రకంగా కట్టుబడి పనిచేస్తోందని అన్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితులకు ఎక్కువ రాజకీయ ప్రాతినిధ్యం కల్పించామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు శాశ్వత పరిష్కారం చూపిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు.

అనంతరం కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, ఎస్సీ సెల్ చైర్మన్ పదవి తనకు గౌరవం కంటే బాధ్యతగా భావిస్తున్నానన్నారు. దళితుల ఐక్యత, సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ద్వారా నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ఎస్సీ వర్గీకరణతో దళితుల మధ్య సోదర భావం పెరిగిందని పేర్కొన్నారు.

పంచాయతీలకు నెలలో నిధులు విడుదల చేయాలి – లేదంటే హైదరాబాద్‌లో సర్పంచుల పరేడ్: బండి సంజయ్
కరీంనగర్, డిసెంబర్ 24 (ప్రజా మంటలు):

తెలంగాణ గ్రామ పంచాయతీలకు నిధుల విడుదల విషయంలో కేంద్రమంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నెల రోజుల్లోగా పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని డెడ్‌లైన్ విధిస్తూ, లేకపోతే హైదరాబాద్ నడిబొడ్డున రాష్ట్రవ్యాప్త సర్పంచులు, ఉప సర్పంచులతో భారీ “పరేడ్” నిర్వహిస్తామని హెచ్చరించారు. గ్రామాలకు నిధులు వచ్చే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.

కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో గెలిచిన 108 మంది బీజేపీ మద్దతుదారులైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను సన్మానించిన బండి సంజయ్, ఈ 108 గ్రామాలను ఆదర్శంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి గ్రామంలో వాటర్ ప్లాంట్, ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అవసరమైన వైద్య పరికరాలు అందిస్తానన్నారు. విద్య, వైద్య రంగాలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని, 9వ తరగతి విద్యార్థులకు సర్పంచుల ఆధ్వర్యంలో సైకిళ్లు పంపిణీ చేస్తామని తెలిపారు.

సర్పంచ్ పదవి అధికారం కాదని, ప్రజల బాధ్యత అని పేర్కొన్న ఆయన, ప్రజలకు కష్టకాలంలో తండ్రిలా ఆదుకునే నాయకత్వం చూపాలని కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు సూచించారు.

మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి – కాంగ్రెస్ నేతల ఘన నివాళులు
కరీంనగర్, నవంబర్ 28 (ప్రజా మంటలు):

మహాత్మ జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా డిసిసి కార్యాలయం మరియు శాతవాహన యూనివర్సిటీ వద్ద జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ ఆధ్వర్యంలో ఘన కార్యక్రమాలు జరిగాయి.

సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ పూలే చిత్రపటం, విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు.

నాయకులు మాట్లాడుతూ పూలే మహిళా విద్య, కులవివక్ష నిర్మూలనకు చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను కొనసాగించేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుల వివక్ష నిర్మూలనలో విఫలమైందని విమర్శించారు.

కార్యక్రమంలో ఎండి తాజ్, శ్రావణ్ నాయక్ బానోతు, మడుపు మోహన్, పత్తి మధు, కర్ర రాజశేఖర్, కల్వల రామ్చందర్, వెన్నం రజిత రెడ్డి, అహమ్మద్ అలీ, కుర్ర పోచయ్య, వంగల విద్యాసాగర్, తోట అంజయ్య, కంకణాల అనిల్ కుమార్ గుప్తా, పెద్ది గారి తిరుపతి, రోళ్ల సతీష్, గంగుల దిలీప్, ఇమ్రాన్, నాగుల సతీష్, కుంబాల రాజ్ కుమార్, వీర దేవేందర్, విక్టర్, హైమద్, రామిడి తిరుపతి, నూనె గోపాల్ రెడ్డి, మంద మహేష్, మాదాసు శ్రీనివాస్, అనరాస్ కుమార్, బాశెట్టి కిషన్, పర్వత మల్లేశం, సరిల్ల రతన్ రాజ్, మీసా రమాదేవి, దుబ్బ నీరజ, రవీందర్ రెడ్డి, ఉరడిలతా, ఆవారు లత, రాచర్ల పద్మ, స్వప్న శ్రీ, విక్రమ్, బషీరుద్దీన్, సుధాకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ హ్యూమన్ రైట్స్ కమిషన్‌ దృష్టికి రెండు కీలక ఫిర్యాదులు; విచారణకు ఆదేశాలు
హైదరాబాద్, నవంబర్ 13 (ప్రజా మంటలు):

తెలంగాణ హ్యూమన్ రైట్స్ కమిషన్ (TGHRC) చైర్మన్ గౌరవనీయ న్యాయమూర్తి డా. జస్టిస్ షమీమ్ అక్థర్ ఆధ్వర్యంలో రెండు వేర్వేరు మానవ హక్కుల ఉల్లంఘన కేసులను స్వయంగా నమోదు చేసి సంబంధిత అధికారులకు విచారణకు సంబంధించి కీలక దిశానిర్దేశాలు జారీ చేసింది.

మంథనిలో పోలీసులు కొట్టడంతో యువకుడు మృతి – సబ్ ఇన్‌స్పెక్టర్‌కి సమన్లు

SR No. 3336/2025 కేసు వివరాలు:
ఫిర్యాదుదారు ఈ. సత్యనారాయణ అందజేసిన ఫిర్యాదులో పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి:

రామగుండం కమిషనరేట్‌కు చెందిన మంథని ఎస్ఐ దేగల రమేశ్,

07.12.2024న సీలం రాజ్‌కుమార్‌ను పోలీస్‌స్టేషన్‌లో తీవ్రంగా దాడి చేశాడని ఆరోపణ.

ఆ ఘటన తర్వాత తదుపరి రోజు అంటే 08.12.2024న బాధితుడు ఆత్మహత్యకు యత్నించాడు.

చికిత్స పొందుతూ 19.09.2025న మృతి చెందాడు.

అనంతరం భారీ పోలీసు బలగాలను ఉంచి కుటుంబాన్ని బెదిరించి, అదే రాత్రి అంత్యక్రియలు చేయించారని ఫిర్యాదులో ఆరోపణ.

కమిషన్ ఈ ఆరోపణలను అత్యంత తీవ్రమైనవిగా పరిగణించి, ఎస్ఐ దేగల రమేశ్‌కు సమన్లు జారీ చేసి డిసెంబరు 4, 2025న హాజరు కావాలని ఆదేశించింది. ఫిర్యాదుదారుని కూడా అదే తేదీన విచారణ కోసం పిలిచింది.

కరీంనగర్ మున్సిపల్ అధికారుల వేధింపులతో మహిళ ఆత్మహత్య? – కమిషన్ స్పందన

SR No. 3339/2025:
పోస్టల్ ద్వారా అందిన ఫిర్యాదులో,

వి. లక్ష్మీ రాజం అనే మహిళ

25.10.2025న ఆత్మహత్య చేసుకుందని,

ఈ ఘటనకు కారణం కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారుల హరాస్‌మెంట్, బెదిరింపులు, అక్రమ డిమాండ్లు అని ఆరోపించారు.

ఈ కేసును కూడా కమిషన్ అత్యంత గంభీరంగా పరిగణించింది.
కరీంనగర్ టీపీబీవో సయ్యద్ ఖాదర్ నుంచి వివరణ కోరేందుకు ఆదేశాలు జారీ చేసి, డిసెంబరు 11, 2025న సమాధానం ఇవ్వాల్సిందిగా నోటీసులు పంపింది.