Jagtial municipal elections - Praja Mantalu

మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యం ఇచ్చాం : జిల్లా BRS అధ్యక్షులు
జగిత్యాల, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):

జగిత్యాల జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలోని జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీలలో బీఆర్‌ఎస్ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసి బి-ఫారాలు అందజేశామని తెలిపారు. జనరల్ స్థానాల్లోనూ బీసీ వర్గాలకు అధిక ప్రాధాన్యం కల్పించినట్లు పేర్కొన్నారు.

జగిత్యాల నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే వ్యవహార శైలిపై విమర్శలు చేశారు. తాను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనని చెప్పుకుంటూనే, కాంగ్రెస్ పార్టీ బి-ఫారాలు పొందిన అభ్యర్థులతో కలిసి ఉండడం ప్రజలను గందరగోళానికి గురిచేస్తోందని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనని చెబుతున్నందున, బీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని సూచించారు.

ప్రజలు ఇచ్చిన హామీలను అమలు చేసిన కేసీఆర్ పాలనకు మద్దతు ఇస్తారా, లేక అమలు కాని హామీలతో ముందుకెళ్లే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా అనే విషయంపై ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ శ్రేణులు కృషి చేస్తాయని, గత ప్రభుత్వ హయాంలో అమలైన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటి ప్రచారం చేపడతామని తెలిపారు.

జిల్లాలో కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు, మెడికల్ కాలేజ్, మాతా-శిశు ఆసుపత్రి, డయాలసిస్ కేంద్రాలు, రహదారుల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాలతో పాటు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్, ఆసరా పింఛన్లు వంటి పథకాలు అమలయ్యాయని గుర్తు చేశారు.

ఈ సమావేశంలో జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే స్థానిక ఎమ్మెల్యే తాను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని చెప్పుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనని చెప్పుకుంటే, పార్టీ కార్యాలయానికి వచ్చి, పార్టీ కండువా ధరించి, బీఆర్‌ఎస్ అభ్యర్థుల ప్రచారంలో పాల్గొనాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు ఆయిల్నేని వెంకటేశ్వర్ రావు, ఉపాధ్యక్షుడు వొళ్లెం మల్లేశం, ప్రధాన కార్యదర్శి అల్లాల ఆనంద్ రావు, రియాజ్ ఖాన్, మజాహిర్ రిజ్వన్, జూనైద్, చిట్ల రమణ తదితరులు పాల్గొన్నారు.

నూకపల్లి డబుల్ బెడ్రూం పథకం రాజకీయ–ఆర్థిక ఏటీఎంగా మారింది: జీవన్ రెడ్డి
నూకపల్లి డబుల్ బెడ్రూం మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆరోపణలు

జగిత్యాల, నవంబర్ 16 (ప్రజా మంటలు):

జగిత్యాల నూకపల్లి డబుల్ బెడ్రూం పథకం రాజకీయంగా మరియు ఆర్థికంగా కొందరు నాయకులకు “ఏటీఎం”గా మారినట్లు ఆరోపిస్తూ మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల ఇందిరా భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పలు కీలక ఆరోపణలు చేశారు.

నూకపల్లి డబుల్ బెడ్రూం కాలనీ రాజకీయ, ఆర్థిక లాభాల వేదికగా మారిందని, లబ్ధిదారుల ఓట్లను ప్రభావితం చేసి మున్సిపల్ ఎన్నికలలో కుట్ర జరుగుతోందని, దీనిని అరికట్టడం పూర్తిగా జిల్లా అధికారుల బాధ్యత అని పేర్కొన్నారు.

3500 లబ్ధిదారులు – 10 వేల ఓటర్లు: మున్సిపల్ ఎన్నికల్లో ఓటు చోరీ కుట్ర

జగిత్యాల మున్సిపల్ ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుని నూకపల్లి 2BHK పథకాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని జీవన్ రెడ్డి వెల్లడించారు.

3500 మంది లబ్ధిదారులు

వారితో పాటు సుమారు 10,000 ఓటర్లు

ప్రతి వార్డులో 200 వరకు నూకపల్లి లబ్ధిదారుల ఓట్లు ప్రభావం

ఇది ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే “సూక్ష్మ రాజకీయ కుట్ర”గా అభివర్ణించారు.

తాత్కాలికంగా ఉంటున్న వార్డులలో వారి పేర్లు ఓటర్ల జాబితాలో కొనసాగుతుండటం “ఓటు చోరీకు మార్గం సుగమం చేస్తున్నది” అని మండిపడ్డారు.

జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ ల నిర్లక్ష్యంపై ఆరోపణలు

లబ్ధిదారులను వెంటనే ఇళ్లలోకి తరలించాల్సిన బాధ్యత అధికారులదేనని, అయినప్పటికీ ఎటువంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు.

ఇందిరమ్మ పథకం కింద 4000 మందికి ఇళ్ల మంజూరు – కానీ కుట్రలతో నిలిచిపోయిన కల

ఉమ్మడి రాష్ట్ర కాలంలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద:ప్రభుత్వ భూమితో పాటు 100 ఎకరాల ప్రైవేట్ భూములు సేకరణ 4000 మంది నిరుపేదలకు ఇళ్ల మంజూరు, కాని, అవసరమైన మౌలిక వసతులు లేక నిర్మాణం పూర్తిగా చేపట్టకపోవడంతో వేలాది మంది ఇళ్ల కోసం తిరుగుతున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు.

2023 ఎన్నికల ముందురాజకీయ ప్రయోజనాల కోసం ఇళ్ల కేటాయింపులు

జీవన్ రెడ్డి ఆరోపణల ప్రకారం:నిజమైన ఇందిరమ్మ లబ్ధిదారులను పక్కన పెట్టి, 3500 కొత్త లబ్ధిదారులను ఎన్నికల ముందు ఎంచుకొని ఇళ్లు కేటాయించారుఇది పూర్తిగా రాజకీయ లబ్ధి కోసం చేసిన చర్య అని ఆయన అన్నారు

మౌలిక వసతులకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 32.5 కోట్లు

కాంగ్రెస్ ప్రభుత్వంలో త్రాగునీరు కోసం ₹14.5 కోట్లు, రోడ్లు, విద్యుత్, ఇతర వసతులకు ₹18 కోట్లు మంజూరు చేసినప్పటికీ, లబ్ధిదారులు ఇళ్లలోకి వెళ్లకపోవడం పెద్ద అనుమానానికి గురి చేస్తోందని అన్నారు.

“ఇళ్ల నాణ్యత లోపించిందా? లబ్దిదారుల అర్హత ప్రశ్నార్థకమా?”

ఇళ్ల నిర్మాణ నాణ్యతలో లోపాలున్నాయా?లబ్ధిదారుల అర్హతపై సందేహాలున్నాయా?ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇల్లు లేని వారిని ఎందుకు గుర్తించలేదు?అని జీవన్ రెడ్డి కీలక ప్రశ్నలు లేవనెత్తారు.:

ఇళ్లు ఖాళీగా ఉండటంతో అక్రమ కబ్జాల యత్నాలు

నగరంలో వందల సంఖ్యలో ఇల్లు లేని నిరుపేదలు ఉన్నప్పటికీ, 2BHK ఇళ్లు ఖాళీగా ఉండటమే అక్రమ కబ్జాలకు దారితీస్తోందని ఆయన హెచ్చరించారు.

ఎన్నికల్లో ఓటు చోరీని అరికట్టే బాధ్యత కలెక్టర్ దే

తాత్కాలిక నివాసం ఉన్న వార్డుల ఓటర్ లిస్ట్ నుండి లబ్ధిదారుల పేర్లు తొలగించి, నూకపల్లి ఓటర్ లిస్ట్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు.
అలా చేయకపోతే “ఎన్నికల ప్రక్రియను పరిహాసం చేసినట్టే” అవుతుందని హెచ్చరించారు.

ఇసుక రవాణా, బఫర్ జోన్ సమస్యలపై సీరియస్ ఆరోపణలు

జగిత్యాల పరిధిలో ఎస్ఆర్ఎస్పి కింద చెరువులు, కుంటలు ఆక్రమణకు గురవుతున్నాయి.అక్రమ ఇసుక రవాణా "బెల్ట్ షాపు"లా మారింది

ఇలాంటి అక్రమాలపై రెవెన్యూ, మైనింగ్ శాఖలు కఠిన చర్యలు చేపట్టాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఈ మొత్తం వ్యవహారాన్ని వివరించేలా సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాస్తున్నట్టు వెల్లడించారు.