ప్రభుత్వ పాఠశాలలు - Praja Mantalu

తెలంగాణ మానవ హక్కుల కమిషన్ రెండు సుమోటో కేసులు నమోదు
హైదరాబాద్, జూలై 3 (ప్రజా మంటలు):

తెలంగాణ మానవ హక్కుల కమిషన్ రెండు వేర్వేరు అంశాలపై స్వయంస్పూర్తితో (సుమోటో) కేసులు నమోదు చేసింది.
మొదటి కేసులో రాజన్న సిరిసిల్ల జిల్లా బొంగులకింద గ్రామంలో నాలుగేళ్ల చిన్నారిపై వీధికుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటనను కమిషన్ పరిగణనలోకి తీసుకుంది. ఈ ఘటనపై సమగ్ర నివేదికను ఆగస్టు 3, 2026లోగా సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.
రెండో కేసులో తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదులు, మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాల కొరతపై వెలువడిన వార్తా కథనాన్ని సుమోటోగా స్వీకరించింది. ఈ అంశంపై సమగ్ర నివేదికను ఆగస్టు 3, 2026లోగా పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సమర్పించాలని కమిషన్ ఆదేశించింది.

కొత్త ప్రభుత్వం రెండేళ్లలో విద్యా రంగం పట్ల స్పష్టమైన చర్యలు తీసుకోలేదు:: కల్వకుంట్ల కవిత
టీజేటీఎఫ్ రౌండ్ టేబుల్ సమావేశం“తెలంగాణ రాష్ట్రం – విద్యావ్యవస్థ” అంశంపై నిపుణుల చర్చ, కవిత వ్యాఖ్యలు

హైదరాబాద్, నవంబర్ 16 (ప్రజా మంటలు);

తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో “తెలంగాణ రాష్ట్రం – విద్యావ్యవస్థ” పై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో విద్యావేత్తలు, సామాజికవేత్తలు, మేధావులు, విద్యార్థులు పాల్గొని పలు కీలక సూచనలు చేశారు. ప్రస్తుత విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలు, ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి, టీచర్ల కొరత, ఆడబిడ్డల విద్య, ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు, విలువల పై ఆధారిత విద్య—అన్నీ చర్చకు వచ్చాయి.

సమావేశాన్ని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రారంభించి, విద్యా రంగం ఎదుర్కొంటున్న సవాళ్లపై స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ ఏర్పడిన సమయంలో విద్యా వ్యవస్థ బలహీనంగా ఉండేదని,బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ చేసిన విమర్శలు ఉన్నప్పటికీ, కొత్త ప్రభుత్వం రెండేళ్లలో విద్యా రంగంలో స్పష్టమైన చర్యలు తీసుకోలేదని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.

కవిత రౌండ్ టేబుల్ సమావేశాన్ని ప్రారంభిస్తూ,విద్యా కమిషన్ ఏర్పాటు మంచిదైన నిర్ణయమే అయినప్పటికీ దాని పనితీరులో స్పష్టత లేదన్నారు.

ఆడబిడ్డల విద్యపై తీవ్రమైన వివక్ష ఇంకా కొనసాగుతుందని, బస్సు, వీధి దీపం వంటి ప్రాథమిక సౌకర్యాలు లేకపోయినా అమ్మాయిల చదువును ఆపేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు..

నిజామాబాద్ ఐటీ టవర్ ఉదాహరణతో మహిళల భద్రత విద్యకు ఎంత కీలకమో చెప్పారు.

“కమ్యూనిటీ, జెండర్ స్పెసిఫిక్ చర్చ అవసరం” అని స్పష్టం చేశారు.

విద్యావ్యవస్థను పునరుద్ధరించాలి :పరంజ్యోతి

“టెలంగాణ ఎడ్యుకేషన్ సిస్టమ్‌కి రీబర్త్ అవసరం” అని విద్యావేత్త పరంజ్యోతి పేర్కొన్నారు.అంగన్‌వాడీ నుంచి యూనివర్సిటీ వరకు వ్యవస్థ దెబ్బతిందని అన్నారు.19 వేల టీచర్ల ఖాళీలు ఇప్పటికీ భర్తీ కాకపోవడం ఆందోళనకరమని చెప్పారు.

టీచర్స్‌కి బోధనేతర పనులు ఎక్కువవుతున్నాయని, 40% సమయమూ బోధనకే కేటాయించలేకపోతున్నారని,రీసెర్చ్, ఇన్నోవేషన్ రంగాల్లో తెలంగాణ వెనుకబడిందని ఆయన అన్నారు.

టీచర్లకు శిక్షణ అవసరం: జాన్ హేమంత్

"పిల్లల మానసిక స్థితిని తెలుసుకొని, విద్యను బోధించాల్సిన అవసరం ఉందని, ఇప్పటి ఉపాధ్యాయుల్లో కొంతమేర ఈ శిక్షణ కొరవడిందని, సంస్థలు కోరితే తను శిక్షణ ఇవ్వడానికి సిద్ధమే అనిమానసికశాస్త్రవేత్త జాన్ హేమంత్ తెలిపారు..

“నెయిబర్‌హుడ్ స్కూల్‌ విధానం: వెంకట్ రెడ్డి

రాష్ట్రంలో 60% విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లలో చదవడం తీవ్రమైన సూచిక, ప్రభుత్వ విద్యపై నమ్మకం లేకపోవడంతోనే తల్లిదండ్రులు ప్రైవేట్ వైపు వెళ్తున్నారని విద్యావేత్త వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.

37 లక్షల విద్యార్థుల కోసం తల్లిదండ్రులు సంవత్సరానికి 50 వేల కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని, గద్వాల్ గట్టు మండలంలో రవాణా లేక డ్రాప్‌అవుట్స్ పెరగడం ప్రభుత్వ పుష్‌అవుట్స్ అని,“నెయిబర్‌హుడ్ స్కూల్‌ విధానాన్ని అమలులోకి తేవాలి” అని సూచించారు

కామన్ స్కూల్ విధానం ద్వారా మార్పు :సామాజికవేత్త గిరిజ పైడిమర్రి

మార్కుల ఆధారిత విద్య వల్ల క్రియేటివిటీ చనిపోయిందని, మహిళా విద్యలో వివక్ష ఇంకా ఉందని, కామన్ స్కూల్ విధానం ద్వారా మార్పు సాధ్యమని,విద్యా వ్యవస్థ పునర్నిర్మాణంపై కవిత నాయకత్వంపై నమ్మకం అని సామాజికవేత్త గిరిజ పైడిమర్రి అన్నారు.

కవిత ప్రోత్సాహం ఎంతో గొప్పది;ఆదివాసీ నాయకుడు కురిసంగ వేణు

కవిత ప్రోత్సాహంతో ఆదివాసీ సమాజంలో మార్పులు వస్తున్నాయని, తొలిసారి విద్యా సమస్యలపై మేధావుల సమావేశం జరుగుతుండటం ఆదివాసీలకు గొప్ప అవకాశమని,“మా సమస్యల పరిష్కారానికి కవిత సంకల్పంతో ఉన్నారు” అని ఆదివాసీ నాయకుడు కురిసంగ వేణు అన్నారు.

కనీస వసతులు, టీచర్లను ఇవ్వాలి : విద్యావేత్త మురళీ గౌడ్

ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు, ప్రతి క్లాస్‌కు ప్రత్యేక గది ఉండాలని పాఠశాలల్లో టాయిలెట్స్, గ్రౌండ్స్, ఆరోగ్య సౌకర్యాలు తప్పనిసరిగా ఉండాలని.విద్యావేత్త మురళీ గౌడ్ సూచించారు.

ప్రాథమిక విద్యే పునాది కాబట్టి అది పటిష్టంగా ఉండాలని,ప్రీ-ప్రైమరీ విద్య ప్రభుత్వంలో బలహీనంగా ఉందని తెలిపారు.

విలువలతో కూడిన్ విద్యా కావాలి : ప్రొఫెసర్ వంశీధర్

మానవ విలువలు, నైతిక విలువలతో కూడిన విద్య అవసరమని, జపాన్, చైనా వంటి దేశాల్లో సంప్రదాయ విలువల విద్య ఇంకా కొనసాగుతున్నట్లు,ప్రభుత్వానికి దీర్ఘకాలిక విద్యా ప్రణాళిక లేకపోయిందని ప్రొఫెసర్ వంశీధర్ (ఓయూ)  విమర్శించారు.

ట్రెస్మా ఛైర్మన్ వి.డి. రాజు

కవిత చేపట్టిన విద్యా సంస్కరణ యజ్ఞం కొనసాగాలని, పూర్తి స్థాయిలో అమలు కావాలని, ప్రభుత్వం విద్యార్థి ఒక్కొక్కరి మీద పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తుండటానికి తగిన ఫలితాలు రావాలని,ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్చే విధానానికి ట్రెస్మా ఛైర్మన్ వి.డి. రాజు మద్దతు తెలిపారు.

ప్రైమరీ స్కూల్ అసోసియేషన్ అధ్యక్షులు,రచ్చ మురళి

ప్రాథమిక పాఠశాలలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయరని,ఎఫ్‌ఆర్‌ఎస్ వంటి విధానాల వల్ల టీచర్ల సమయం వృథా అవుతుందని, .టీచర్లకు బోధనేతర పనులు తగ్గించాలని.ప్రైమరీ స్కూల్ అసోసియేషన్ అధ్యక్షులు,రచ్చ మురళి కోరారు.

విద్య, వైద్యం వంటి కీలక రంగాలకు బడ్జెట్ పెంపు అత్యవసరమని,ఎన్నికలపై ఖర్చు చేసిన ధనం విద్యకు కేటాయిస్తే మంచిదని విద్యార్థి నగేష్ అన్నారు.

కవిత గారి తుదివ్యాఖ్యలు

కవిత సమావేశంలో పది ప్రధాన తీర్మానాలను ప్రకటించారు:

విలువలతో కూడిన విద్యపై దృష్టి

విద్యకు 15% లేదా అవసరమైతే అపరిమిత బడ్జెట్

టెక్నాలజీ వినియోగం విస్తరణ

టీచర్లు, మిడ్ డే మీల్ స్టాఫ్, మెయింటెనెన్స్ వర్కర్లకు సమయానుసార జీతాలు

ప్రతి గ్రేడ్‌కి ఒక టీచర్ – ప్రతి తరగతికి ఒక గది

ప్రీ-ప్రైమరీ స్కూళ్ల స్థాపన

ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధ

20 ఏళ్ల అనుభవం ఉన్న వారికి TET మినహాయింపు

బోధనేతర పనుల తగ్గింపు, అడ్మిన్ స్టాఫ్ పెంపు

ఆడబిడ్డలు, ఆదివాసీల కోసం ప్రత్యేక విద్యా విధానం.

సమావేశం ముగింపు సందర్భంగా“ఈ రోజు మొదటి మీటింగ్ మాత్రమే. సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించే పోరాటం ప్రారంభమైంది” అని కవిత అన్నారు.