mla - Praja Mantalu

ఎన్ని విమర్శలు చేసినా జగిత్యాల అభివృద్ధి ఆగదు: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
జగిత్యాల, ఆగస్టు 30 (ప్రజా మంటలు):

జగిత్యాల నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎన్ని విమర్శలు చేసినా అభివృద్ధి పనులు ఆగబోవని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. శనివారం జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన సీనియర్ నాయకుడు తాటిపర్తి జీవన్‌రెడ్డి చేసిన విమర్శలకు స్పందించారు.

జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు విమర్శలుగా కాకుండా ద్వేషపూరితంగా ఉన్నాయని ఎమ్మెల్యే ఆరోపించారు. కార్యకర్తలను పక్కన పెట్టి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను రహస్యంగా కలుస్తూ మరోవైపు రాజకీయంగా భిన్నమైన వ్యాఖ్యలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. గత పదేళ్లపాటు కేసీఆర్‌ను తీవ్రంగా విమర్శించిన జీవన్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పాలాభిషేకం చేశారని గుర్తుచేశారు.

ప్రజల కోసం పనిచేస్తున్న తనను ‘ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ’గా అభివర్ణించడం విడ్డూరంగా ఉందని సంజయ్ కుమార్ అన్నారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేయడం కూడా ప్రైవేట్ కంపెనీ నడపడం అవుతుందా అని ప్రశ్నించారు.

ఇందిరమ్మ కాలనీపై 17 ఏళ్ల తర్వాతే దృష్టి

2008లో శంకుస్థాపన చేసిన ఇందిరమ్మ కాలనీని ఇన్నేళ్లుగా పట్టించుకోలేదని ఎమ్మెల్యే విమర్శించారు. 17 ఏళ్ల తర్వాత తాను కాలనీ సమస్యలపై దృష్టి సారించి ఇళ్ల నిర్మాణం చేపట్టానని తెలిపారు. ప్రభుత్వంతో సమన్వయంతో పనిచేయడం వల్ల అర్బన్ హౌసింగ్ కాలనీకి రూ.34 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు.

రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు 1,500 చొప్పున డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మంజూరైతే, జగిత్యాల నియోజకవర్గంలో మాత్రం సుమారు 4,500 ఇళ్ల నిర్మాణంలో తన పాత్ర ఉందని పేర్కొన్నారు. ఇతర నియోజకవర్గాల్లో మంజూరైన ఇళ్లలో సగం కూడా నిర్మించలేదని ఆయన అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీగా ఎనిమిది నెలలు ఉన్న సమయంలో ఇందిరమ్మ కాలనీ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం జీవన్‌రెడ్డి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాలనీ వాసులకు ఉగాది నాటికి బూరెలు తినిపిస్తానని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు.

రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిందనేది వాస్తవమని, అయితే వాటి నిర్మాణం విషయంలో స్థానికంగా ఎంత పని జరిగిందన్నదే ముఖ్యమని సంజయ్ కుమార్ అన్నారు.

వైద్య, విద్య రంగాలకు ప్రాధాన్యం

జగిత్యాల వైద్య కళాశాల ఏర్పాటులో తన కృషి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. తెలంగాణలో వైద్య కళాశాల, ఆసుపత్రి, నర్సింగ్ కళాశాల ఒకే ప్రాంతంలో ఉన్న జిల్లాగా జగిత్యాల నిలిచిందన్నారు. 334 మంది వైద్యులు, 366 మంది నర్సులు, 730 పడకల ఆసుపత్రికి అనుమతులు వచ్చినట్లు తెలిపారు.

నియోజకవర్గంలో ప్రస్తుతం 3,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కొనసాగుతోందని, కొన్ని ఇళ్లు పూర్తయ్యాయని చెప్పారు. మరో 2,000 ఇళ్లు మంజూరయ్యాయని వెల్లడించారు. సుమారు రూ.200 కోట్లతో యంగ్ ఇండియా సమీకృత పాఠశాల పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

గొల్లపల్లి రోడ్డులో మహిళా డిగ్రీ కళాశాల విషయంలో ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో జీవన్‌రెడ్డి ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. తాటిపల్లి–చల్గల్ ఎత్తిపోతల పథకం పనుల పరిస్థితి ఏమిటో కూడా ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.

కొత్త బస్టాండ్ పెట్రోల్ బంక్ వివాదంపై ప్రశ్నలు

జగిత్యాల కొత్త బస్టాండ్, పెట్రోల్ బంక్ వివాదానికి సంబంధించి కూడా ఎమ్మెల్యే స్పందించారు. జీవన్‌రెడ్డి అనుచరులు మున్సిపల్‌లో ఉన్న సమయంలోనే సంబంధిత అనుమతులు ఇచ్చారా లేదా అని ప్రశ్నించారు. పాత బస్టాండ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోల్ బంక్ అంశంపై తాను ఆలస్యం చేశానని విమర్శిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది పాటు ఎమ్మెల్సీగా ఉన్న జీవన్‌రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అంతకుముందు మంత్రిగా ఉన్న సమయంలో ఎందుకు పరిష్కరించలేదని నిలదీశారు.

గత నాలుగేళ్లుగా కాంట్రాక్టర్లకు బిల్లులు సకాలంలో రాకపోవడంతో అనేక అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఎమ్మెల్యే తెలిపారు. తుఫిడ్క్ నిధులు గత ప్రభుత్వం మున్సిపల్‌లో డిపాజిట్ చేయకపోవడం వల్ల కొన్ని పనులు ప్రారంభం కాలేదని పేర్కొన్నారు.

విమర్శలకు గత చరిత్రే సమాధానం

ప్రతి అభివృద్ధి పనిని విమర్శించాలనుకుంటే గతంలో జరిగిన వ్యవహారాలపై పూర్తి చిట్టా తన వద్ద ఉందని సంజయ్ కుమార్ అన్నారు. తనపై విమర్శలు చేసే ముందు గతంలో జరిగిన రాజకీయ పరిణామాలు, అభివృద్ధి పనుల పరిస్థితిని ప్రజలకు వివరించాలని సూచించారు.

తన హయాంలో అభివృద్ధి కంటే అణచివేత ధోరణికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని జీవన్‌రెడ్డిపై ఆరోపణలు చేశారు. మాజీ జెడ్పీ చైర్మన్‌పై విజిలెన్స్ కేసు పెట్టించారని, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిని భూ కబ్జాదారుడిగా విమర్శించారని గుర్తుచేశారు. దశాబ్ద కాలం కేసీఆర్‌ను తీవ్రంగా విమర్శించిన విషయాలను ఇప్పుడు మర్చిపోయారా అని ప్రశ్నించారు.

జగిత్యాల ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ప్రతిరోజూ అభివృద్ధి పనులకు భూమిపూజలు చేస్తున్నామని, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఎన్ని విమర్శలు చేసినా జగిత్యాలలో అభివృద్ధి మాత్రం ఆగదని ఆయన అన్నారు.

ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజంగి నందయ్య, సీనియర్ నాయకుడు బండ శంకర్, మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కొత్త మోహన్, కౌన్సిలర్లు ప్రశాంత్ రావు, పిట్ట ధర్మరాజు, మాజీ వైస్ చైర్మన్ మన్సూర్, నాయకులు కప్పల శ్రీకాంత్, రామకృష్ణారెడ్డి, మ్యానపురి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

యావర్ రోడ్డు విస్తరణ, పట్టణ అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల, ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు):

జగిత్యాల మోతే రోడ్డులోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ, జగిత్యాల–రాయికల్ పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనే తన లక్ష్యమన్నారు.

2021లో జగిత్యాల పట్టణంలో 12 జోన్ల పరిధిలో 121 సర్వే నంబర్లను మార్చి, యావర్ రోడ్డుపై ఉన్న ప్రాంతాలను రెసిడెన్షియల్, కమ్యూనికేషన్ జోన్ నుంచి కమర్షియల్ జోన్‌గా మార్పు చేసినట్లు తెలిపారు. యావర్ రోడ్డును 100 అడుగుల రోడ్డుగా అభివృద్ధి చేశామని, జోన్ల మార్పుతో చట్టబద్ధ అనుమతులు లభిస్తున్నాయని చెప్పారు.

జగిత్యాల ప్రజల చిరకాల కోరిక అయిన యావర్ రోడ్డు విస్తరణ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని, భూమి కోల్పోయే వారికి TDR (ట్రాన్స్‌ఫర్ ఆఫ్ డెవలప్‌మెంట్ రైట్స్) ద్వారా నష్టపరిహారం చెల్లించనున్నట్లు తెలిపారు. 2023లో 100 అడుగుల రోడ్డుకు సంబంధించిన జీఓ, TDR అంశంపై ప్రభుత్వం నుంచి హామీ లభించిందన్నారు.

నిన్న గుమ్లాపూర్ సభలో యావర్ రోడ్డు విస్తరణతో పాటు ఇంటిగ్రేటెడ్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం, మినీ స్టేడియానికి స్థలం కేటాయిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని వెల్లడించారు. అధికార పార్టీ అండతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు.

అభివృద్ధి పనులను అడ్డుకునే విధంగా ఆరోపణలు చేయడం తగదని, ప్రభుత్వం తో కలిసి ప్రజలకు పనిచేసే కౌన్సిలర్లను గెలిపించాలని ప్రజలను కోరారు. యావర్ రోడ్డు విస్తరణకు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రికి జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సమావేశంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

పంతం నెగ్గించుకొన్న MLA సంజయ్: 35 సీట్లతో పై చేయి.
జీవన్ రెడ్డి వర్గంలో తీవ్ర అసంతృప్తి – కార్యకర్తల ఆగ్రహం

జీవన్ రెడ్డి నిర్ణయం కొరకు ఎదిరి చూపు?

జగిత్యాల ఫిబ్రవరి 03 (ప్రజా మంటలు):

జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ల కేటాయింపు తీవ్ర వివాదానికి దారితీసింది. టికెట్ల పంపిణీలో అన్యాయం జరిగిందంటూ సీనియర్ నేత జీవన్ రెడ్డి వర్గం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి నివాసం ముందు ఆశావహులు ఆగ్రహావేశాలతో నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు.

సీట్ల పంపిణీపై చిచ్చు

మొత్తం 50 వార్డుల్లో

ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి 30 సీట్లు,

సీనియర్ నేత జీవన్ రెడ్డి వర్గానికి కేవలం 20 సీట్లు మాత్రమే కేటాయించడంపై జీవన్ రెడ్డి వర్గీయులు మండిపడుతున్నారు.

అంతేకాక, జీవన్ రెడ్డి వర్గానికి కేటాయించిన 29 సీట్లలో మళ్లీ 5 సీట్లను ఎమ్మెల్యే వర్గానికి మార్చడం పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసింది.

“ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం”

సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేసిన, కండువా మోసిన ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు బీ-ఫారమ్‌లు ఇవ్వకుండా, ఇటీవల పార్టీ మారిన వారికి టికెట్లు ఇచ్చారని కార్యకర్తలు ఆరోపించారు.
“ఎమ్మెల్యే సంజయ్ మా కడుపు కొట్టాడు” అంటూ ఆవేదన వ్యక్తం చేసిన వారు, అవసరమైతే ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.

పోలీసుల భారీ బందోబస్తు

టికెట్ల వివాదం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎమ్మెల్యే సంజయ్ క్యాంపు కార్యాలయం, నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

మారిన అభ్యర్థుల జాబితా

కాంగ్రెస్ పార్టీ లిస్టులో మారిన అభ్యర్థులు ఇలా ఉన్నారు:

26వ వార్డు: వీరబత్తిని పద్మజ → గొల్లపల్లి మాధవి లత

27వ వార్డు: బింగి సుమ → జుంబర్తి గంగలక్ష్మి

29వ వార్డు: తోపారపు లావణ్య → ఆరుముల్ల తేజస్విని

35వ వార్డు: జీనత్ పర్వీన్ → అజార్ ఫాతిమా

39వ వార్డు: హనుమండ్ల జయశ్రీ → బొలుసాని శ్రీనివాస్

అధిష్టానం వైఖరిపై ప్రశ్నలు

ఈ పరిణామాలతో జీవన్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోవడం లేదన్న భావన ఆయన వర్గంలో బలంగా వ్యక్తమవుతోంది. వయసు మీదపడిన జీవన్ రెడ్డి పట్ల కొత్త కాంగ్రెస్ నాయకత్వం చూపుతున్న నిర్లక్ష్యాన్ని ఆయన ఎలా ఎదుర్కొంటారన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

కీలక నిర్ణయం రేపటికి?

జగిత్యాల మున్సిపాల్టీపై తన పట్టును నిలుపుకోవడానికి

స్వతంత్ర లేదా పోటీ అభ్యర్థులను నిలబెడతారా?

లేక మౌనంగా తప్పుకుంటారా?

లేక మరో రాజకీయ ఎత్తు వేస్తారా?

అన్నది రేపటి వరకు తేలనుంది.

రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్‌పై మహిళ ఆరోపణలు
అమరావతి / రైల్వే కోడూరు, జనవరి 28 (ప్రజా మంటలు):

రైల్వే కోడూరు నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్‌పై ఓ మహిళ చేసిన తీవ్రమైన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. తనతో 2024 నుంచి 2026 జనవరి 7 వరకు సన్నిహిత సంబంధాలు కొనసాగించిన ఎమ్మెల్యే, పెళ్లి చేస్తానని నమ్మించి మోసం చేశారని, ఐదు సార్లు గర్భస్రావం చేయించారని సదరు మహిళ ఆరోపించింది.

ఈ ఆరోపణలు బహిర్గతం కావడంతో జనసేన పార్టీ స్పందించింది. ఆరోపణలపై పూర్తి స్థాయిలో వాస్తవాలను తెలుసుకునేందుకు పార్టీ అంతర్గతంగా **నిజనిర్ధారణ కమిటీ (Fact Finding Committee)**ని ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని జనసేన నాయకత్వం స్పష్టం చేసింది.

మహిళ చేసిన ఆరోపణల ప్రకారం, ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ తనను వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి శారీరక సంబంధం కొనసాగించారని, ఆ తర్వాత మాట తప్పారని ఆమె పేర్కొంది. గర్భధారణ జరిగిన ప్రతిసారి ఒత్తిడి చేసి అబార్షన్ చేయించారని, చివరికి తనను పూర్తిగా దూరం పెట్టారని ఆరోపించింది. ఈ వ్యవహారం తన జీవితాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

ఇక ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్‌పై వచ్చిన ఆరోపణలపై ఆయన నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. పార్టీ కమిటీ విచారణ పూర్తయ్యే వరకు నిర్ణయానికి రావద్దని జనసేన నేతలు అంటున్నారు.

ఈ ఘటన రాజకీయంగానే కాకుండా సామాజికంగా కూడా విస్తృత చర్చకు దారితీస్తోంది. మహిళా హక్కులు, ప్రజాప్రతినిధుల బాధ్యత, నైతిక విలువలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజనిర్ధారణ కమిటీ నివేదికతో ఈ వ్యవహారంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు
కరీంనగర్, జనవరి 26 (ప్రజా మంటలు):

77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, బాబు రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నాయకత్వంలో రూపొందిన భారత రాజ్యాంగం దేశానికి దిశానిర్దేశం చేసిందని అన్నారు. 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి రావడం ద్వారా భారత్ సార్వభౌమ, సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అవతరించిందని తెలిపారు. స్వాతంత్ర సమరయోధులు, రాజ్యాంగ నిర్మాతల త్యాగాలు, ఆలోచనల ఫలితంగానే నేడు భారత్ ప్రపంచంలో గొప్ప ప్రజాస్వామ్య దేశంగా నిలిచిందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వెలిచాల రాజేందర్ రావు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, పీసీసీ ప్రధాన కార్యదర్శి రహమత్ హుస్సేన్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్‌తో పాటు పలువురు నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు..

నేరాల నియంత్రణకు,కమ్యూనిటీ భద్రతకు సీసీ కెమెరాలు దోహ‌దం చేస్తాయి. సీసీ కెమెరాలు ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల రూరల్ జనవరి 21 (ప్రజా మంటలు)

నూతన సాంకేతికత ను గ్రామాల్లో ఉపయోగించి దాతల సహకారంతో 2లక్షల రూపాయల విలువగల సి సి కెమెరాలు ఏర్పాటు అభినందనీయం.
సిసి కెమెరాల ఏర్పాటు తో పాటు వారు నిర్వహణ చాలా ముఖ్యమని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు.

నేరాల నియంత్రణ,గ్రామంలో కొత్త వ్యక్తుల రాకపోకలు చిత్రించి,అనుమానాస్పద వ్యక్తులను గుర్తించడానికి ఉపయోగ పడుతుంది.గ్రామంలో నూతన గ్రామపంచాయతీ,అంగన్వాడీ భవనానికి గతంలో భూమిపూజ చేయటం జరిగిందన్నారు.గ్రామ అభివ్రుద్ది కి నిధులు మంజూరు చేసి అభివ్రుద్ది కి తన వంతుగా కృషి చేస్తా అన్నారు.

ప్రతి గ్రామానికి మహిళ సంఘాల బలోపేతానికి ప్రభుత్వం ఇందిరమ్మ  భవనాలు మంజూరు చేయటం జరిగింది.సరైన స్థలం గుర్తించి,దాతల సహకారంతో సేకరించి నిర్మాణం చేపట్టాలని అందరికీ ఉపయోగంగా ఉంటుంది అన్నారు .

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నక్కల రవీందర్ రెడ్డి,బాల ముకుందం, సర్పంచ్ ఉప సర్పంచ్ లు రెడ్డి రత్న,గుంటీ రవి,పోరండ్ల సర్పంచ్ ఉప సర్పంచ్ నక్క హరీష్,మల్లేశం గౌడ్,మాజీ ఉప సర్పంచ్ గంగారెడ్డి,నాయకులు పెద్దిరెడ్డి రవీందర్ రెడ్డి,కడ మహేష్,సత్యనారాయణ,కొండ శ్రీనివాస్, నారాయణ, తోట గంగరాజం,శశి కుమార్, భూమారెడ్డి, రవి, గంగాధర్, గ్రామ నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

నిత్యశ్రీ–చైత్ర మృతుల విచారణ రిపోర్ట్ వెంటనే బహిర్గతం చేయాలి: BSP
మహబూబాబాద్ జనవరి 20 (ప్రజా మంటలు):

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గిరిపురం గ్రామం ఇటుకల గడ్డ తండాలోని అంగన్వాడీ కేంద్రంలో ఫుడ్ పాయిజన్ వల్ల మృతి చెందిన నాలుగేళ్ల చిన్నారులు చైత్ర, నిత్యశ్రీల మృతిపై ఏర్పాటు చేసిన విచారణ కమిటీ రిపోర్ట్‌ను వెంటనే బహిర్గతం చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ (BSP) రాష్ట్ర నాయకులు దార్ల శివరాజ్ డిమాండ్ చేశారు.

ఈ రోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కోర్టు ఎదుట ఉన్న డా.బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహం ముందు, మృతిచెందిన చిన్నారుల తల్లిదండ్రులతో కలిసి BSP ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా దార్ల శివరాజ్ మాట్లాడుతూ, నెల రోజుల క్రితం అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చిన వడియాలు తిన్న నలుగురు పిల్లలు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారని, వారిలో ఇద్దరు కోలుకోగా, చైత్ర మరియు నిత్యశ్రీ కొద్ది రోజుల వ్యవధిలో మృతి చెందారని తెలిపారు.

ఈ ఘటనపై జిల్లా స్త్రీ–శిశు సంక్షేమ శాఖ, DM&HO, జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లినా ఇప్పటివరకు విచారణ వివరాలు బయట పెట్టకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. సంబంధిత అంగన్వాడీ టీచర్, ఆయా, సూపర్‌వైజర్, CDPO, DWOలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని తీవ్రంగా విమర్శించారు.

విచారణ రిపోర్ట్‌ను తక్షణమే విడుదల చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు తగిన ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. నెల రోజులు గడిచినా నివేదిక ఇవ్వకపోతే మృతదేహాలను వెలికి తీసి మళ్లీ పోస్ట్‌మార్టం నిర్వహించాలని సూచించారు.

ఈ విషయంలో జిల్లా కలెక్టర్ మరియు స్థానిక ఎమ్మెల్యే డా. రామచంద్ర నాయక్ వెంటనే స్పందించకపోతే BSP ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో BSP నాయకులు హలావత్ రంజిత్, హలావత్ ప్రమీల, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయం: జి. రాజేశం గౌడ్
హైదరాబాద్, జనవరి 18 (ప్రజా మంటలు):

మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి, తెలంగాణ తొలి ఆర్థిక సంఘం చైర్మన్ జి. రాజేశం గౌడ్ ఎన్టీఆర్ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1985–1990 మధ్యకాలంలో ఎన్టీఆర్ దూరదృష్టి, ప్రజాహిత పాలనతో న్యాయవ్యవస్థలో సంస్కరణలు, మహిళలకు ఆస్తి హక్కులు, పేదలకు ఉచిత న్యాయ సహాయం వంటి కీలక నిర్ణయాలు అమలయ్యాయని గుర్తు చేశారు. అలాగే ప్రతి గ్రామంలో పేదలకు ఇళ్లు నిర్మించాలనే లక్ష్యంతో చేపట్టిన గృహ నిర్మాణ కార్యక్రమాలు సామాజిక భద్రతకు పునాది వేశాయని అన్నారు.

ప్రజాహితమే లక్ష్యంగా పాలన సాగించిన మహానేతగా నందమూరి తారకరామారావు సేవలు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయని జి. రాజేశం గౌడ్ పేర్కొన్నారు.

అవినీతి కవలలుగా ప్రజల కష్టాన్ని దోచుకున్న బీజేపీ–బీఆర్ఎస్ – డిసిసి అధ్యక్షులు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
కరీంనగర్, జనవరి 17 (ప్రజా మంటలు):

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల పాలనలో కరీంనగర్ నగరంలో అభివృద్ధి జరగలేదని, అవినీతే రాజ్యమేలిందని డిసిసి అధ్యక్షులు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆరోపించారు. ఈ రెండు పార్టీలు అవినీతి కవలలుగా మారి ప్రజల కష్టార్జితాన్ని దోచుకున్నాయని విమర్శించారు.

నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో కరీంనగర్ అసెంబ్లీ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ తదితరులతో కలిసి ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మేడిపల్లి సత్యం మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీ–బీఆర్ఎస్ పాలనలో కరీంనగర్ కార్పొరేషన్‌లో పర్సంటేజీ కల్చర్ విస్తరించి అవినీతి వ్యవస్థగా మారిందని అన్నారు. బీఆర్ఎస్ పాలకవర్గంలో అవినీతికి పాల్పడిన నేతలు మరో అవతారంలో బీజేపీలోకి వెళ్లుతున్నారని, పార్టీ మారినా అవినీతి మాత్రం మారలేదని విమర్శించారు.

రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 90 శాతానికి తగ్గకుండా మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. గత గ్రామపంచాయతీ ఎన్నికల్లో పార్టీ సింబల్ లేకున్నా కాంగ్రెస్ మద్దతు అభ్యర్థులు 70 శాతానికి పైగా గెలుపొందిన విషయాన్ని గుర్తు చేశారు.

గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా అమలవుతున్నాయని తెలిపారు. రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్లలోపు ఉచిత కరెంటు, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు, అర్హులందరికీ రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ వంటి కార్యక్రమాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు.

కరీంనగర్ నగరంలో స్మార్ట్ సిటీ పనులు, కేబుల్ బ్రిడ్జి నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, ఎన్నికల అనంతరం పూర్తి స్థాయిలో విచారణ చేసి ప్రక్షాళన చేస్తామని తెలిపారు. డంపింగ్ యార్డ్ సమస్యకు కూడా శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.

నగర అభివృద్ధి కోసం ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని కరీంనగర్ ప్రజలను కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందున కరీంనగర్ కూడా హైదరాబాద్ మాదిరిగా అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, మేనేని రాజనర్సింగ్ రావు, ముద్దం తిరుపతి, ముద్దసాని రంగన్న, బానోతు శ్రవణ్ నాయక్, కొర్వి అరుణ్ కుమార్, రామిడి రాజిరెడ్డి, సురేందర్ రెడ్డి, లింగంపల్లి బాబు, సిరికొండ శివప్రసాద్, నెల్లి నరేష్, తదితరులు పాల్గొన్నారు.

పొలాస వ్యవసాయ కళాశాలలో విద్యార్థులతో మంత్రి అడ్లూరి, ఎమ్మెల్యే డా. సంజయ్‌ ముఖాముఖి
జగిత్యాల రూరల్ డిసెంబర్ 24 (ప్రజా మంటలు):

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పొలాస వ్యవసాయ కళాశాలలో నిర్వహించిన విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్‌కుమార్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో వైస్‌ చాన్స్‌లర్ ప్రొఫెసర్ జానయ్య, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజెంగి నందయ్య, డీన్ జాన్సీ రాణి, అసోసియేట్ డీన్ భారతి నారాయణన్ భట్, ADR హరీష్‌కుమార్ శర్మతో పాటు సర్పంచ్ శంకరయ్య, పలువురు నాయకులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థుల సందేహాలను మంత్రి, ఎమ్మెల్యేలు నివృత్తి చేస్తూ వ్యవసాయ రంగంలో అవకాశాలపై సూచనలు చేశారు.

యావర్ రోడ్డు విస్తరణ జాప్యానికి ఎమ్మెల్యేనే కారణం కాదా..? – మాజీ మంత్రి జీవన్ రెడ్డి సూటి ప్రశ్న
జగిత్యాల, డిసెంబర్ 23 (ప్రజా మంటలు):

జగిత్యాల జిల్లా కేంద్రంలోని యావర్ రోడ్డు 100 ఫీట్ల విస్తరణ జాప్యానికి స్థానిక ఎమ్మెల్యేనే ప్రధాన కారణమని మాజీ మంత్రి వర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి ఆరోపించారు. జగిత్యాల ఇందిరా భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

మున్సిపల్ తీర్మానాన్ని తుంగలో తొక్కి, ఎన్నికల్లో రాజకీయ లబ్ది కోసం యావర్ రోడ్డు విస్తరణను అడ్డుకున్నారని విమర్శించారు. ప్రజా ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేకు లేదా..? అని ప్రశ్నించారు.

100 ఫీట్ల విస్తరణపై పూర్తి వివరాలు

యావర్ రోడ్డును 100 ఫీట్లకు విస్తరించాలని 2017 జూన్‌లో ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం టౌన్ ప్లానింగ్ శాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందన్నారు.

మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం ఉన్నప్పటికీ, ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత రెండున్నర సంవత్సరాలు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు.

2021 జూన్ 14న ప్రభుత్వం జీఓ నెంబర్ 94 జారీ చేసి 100 ఫీట్ల విస్తరణకు అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు.

అయితే, 2023 ఆగస్టులో మాత్రమే టీడీఆర్ అంశాన్ని తెరపైకి తెచ్చారని, ఇది కావాలని చేసిన జాప్యమని ఆరోపించారు.

ఆక్రమణలు – సెట్‌బ్యాక్‌లపై తీవ్ర విమర్శలు

సెట్‌బ్యాక్ లేకుండా నిర్మించిన అక్రమ భవనాలు, ప్రజా ఆస్తులపై జరిగిన ఆక్రమణలను తక్షణమే తొలగించాల్సిన బాధ్యత మున్సిపల్‌, ఎమ్మెల్యేలకు ఉందన్నారు.
2008 తర్వాత టైటిల్ లేకుండా నిర్మాణాలకు అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు.

కొత్త బస్టాండ్ వద్ద పెట్రోల్ బంక్ పేరిట జరిగిన ఆక్రమణలపై కోర్టు స్పష్టంగా టైటిల్ లేదని తేల్చిందని, అయినా ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు.
సెట్‌బ్యాక్ లేకుండా నిర్మాణాల వల్ల రోడ్లపై వాహనాల పార్కింగ్ జరుగుతోందని, ఇది ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మారిందన్నారు.

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై విమర్శ

“యావర్ రోడ్డు విస్తరణ జరిగితేనే రాజకీయాల్లో కొనసాగుతా” అని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అనడం విడ్డూరమని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
పదేళ్లు అధికారంలో ఉండి కూడా విస్తరణ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్యలు

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, 2024 జూన్ 29న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి యావర్ రోడ్డు విస్తరణపై లేఖ రాసినట్లు తెలిపారు.
దీనిపై సీఎం స్పందించి అధికారులను ఆదేశించగా, సుమారు 100 కోట్ల వ్యయం అవుతుందని కలెక్టర్ సీఎం‌కు నివేదిక ఇచ్చినట్లు చెప్పారు.

ప్రజా ఆస్తుల పరిరక్షణ నా బాధ్యత

నాలుగు దశాబ్దాలుగా ప్రజా ఆస్తులు, దేవాలయ భూములను కాపాడిన చరిత్ర తనదని జీవన్ రెడ్డి తెలిపారు.
బాధ్యత గల పౌరుడిగా ప్రజా ఆస్తుల సంరక్షణ కోసం పోరాడుతున్నానని, కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ప్రజల తరఫున మాట్లాడుతున్నానన్నారు.

స్పష్టమైన హెచ్చరిక

ప్రజా ఆస్తుల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు తొలగించడం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చేయవచ్చని, ఇది పూర్తిగా మున్సిపల్ బాధ్యత అని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే పదవి శాశ్వతం కాదని, రాజకీయ భవిష్యత్తు ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు.
ముందుగా అక్రమ నిర్మాణాలు, సెట్‌బ్యాక్ ఉల్లంఘనలు తొలగించి ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలో బీజేపీకి మరో 50 ఏళ్ల దాకా అధికారంలో అవకాశం లేదు: రాజాసింగ్
హైదరాబాద్ నవంబర్ 15 (ప్రజా మంటలు):

తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారేలా గోషామహల్ ఎమ్మెల్యే టిఆర్ఎస్ (బీజేపీ) నేత టిని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ వచ్చే 50 ఏళ్లలోనూ అధికారంలోకి రాదని ఆయన ప్రకటించారు.

శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ…“తెలంగాణలో ప్రజలు బీజేపీకి దూరం అవుతున్నారు. రాష్ట్ర రాజకీయాల దిశ బీజేపీకి అనుకూలంగా లేదు. ఇంకా 50 ఏళ్లలో బీజేపీకి అధికారంలోకి వచ్చే సందర్భం కనిపించడం లేదు” అని రాజాసింగ్ అన్నారు.

ఇటీవలి ఉప ఎన్నికల్లో పార్టీకి వచ్చిన ఫలితాలు, రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు, బీజేపీ అంతర్గత విభేదాలు—ఇవన్నీ తన వ్యాఖ్యలకు కారణమని ఆయన సూచించారు.

రాజకీయ వర్గాల్లో ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశమైయ్యాయి. రాజాసింగ్ స్వయంగా బీజేపీ ఎమ్మెల్యేగా ఉండి, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పార్టీ లోపలే అసంతృప్తికి దారితీయొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధులు ఇంకా అధికారిక స్పందన ఇవ్వలేదు.