తెలంగాణ జాగృతి - Praja Mantalu

బంజారా ప్రముఖులతో కల్వకుంట్ల కవిత భేటీ – కొత్త రాజకీయ పార్టీపై చర్చలు
హైదరాబాద్ ఏప్రిల్ 05 (ప్రజా మంటలు):

బంజారా ప్రముఖులతో సమావేశమై కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు నేపథ్యంలో, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక చర్చలు నిర్వహించారు. రిటైర్డ్ అదనపు డీజీ డీటీ నాయక్ నివాసంలో ఈ భేటీ జరిగింది.

ఈ నెల 25న పార్టీ ప్రారంభానికి ముందు, బంజారా సమాజ సమస్యలు, వారికి అందాల్సిన రాజకీయ అవకాశాలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. గతంలో మంత్రివర్గంలో బంజారాలకు తగిన ప్రాతినిధ్యం లభించలేదని పేర్కొన్నారు.
తాము ఏర్పాటు చేయబోయే పార్టీలో బంజారా సమాజానికి సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. పార్టీ విధానాల రూపకల్పనలో బంజారా మేధావులు, ప్రముఖులు సూచనలు ఇవ్వాలని కోరారు. రాజకీయాల్లోకి రావాలనుకునే బంజారా యువతకు ఆహ్వానం పలికారు.
సమావేశంలో జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, లక్ష్మణ్ నాయక్, మోహన్ సింగ్ నాయక్, భీమ్లా నాయక్, హరి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

“రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు” : కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఆగ్రహం
:హైదరాబాద్, మార్చ్ 31 (ప్రజా మంటలు):

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టేసిందని ఆమె ఆరోపించారు.
కాగ్ (CAG) 2024-25 నివేదిక ఆధారంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారిందని ఆమె పేర్కొన్నారు. రోజువారీ ఖర్చుల నిర్వహణకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వద్ద అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు. ఆర్థిక సంవత్సరంలో దాదాపు ప్రతి రోజూ ఆర్బీఐ నుంచి చేబదులు తీసుకుని ప్రభుత్వాన్ని నడిపించటం దౌర్భాగ్యకరమని వ్యాఖ్యానించారు.

ఒకే ఏడాదిలో రూ.1.30 లక్షల కోట్ల అప్పులు తీసుకోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని, ఇంకా వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించలేకపోవడం పరిస్థితి తీవ్రతను చూపుతోందన్నారు. ఇప్పటికే రాష్ట్రంపై రూ.8.65 లక్షల కోట్ల అప్పు భారముందని, ఒక్కో కుటుంబంపై సుమారు రూ.9 లక్షల అప్పు పడిందని తెలిపారు.
“సంపద పెంచుతాం, పేదలకు పంచుతాం” అన్న హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేకపోయిందని, అప్పుల మీదే పాలన సాగుతోందని విమర్శించారు. ఇంతటి సంక్షోభంలో కూడా “మిగులు బడ్జెట్” అంటూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.
రైతుల సమస్యలపై ఆందోళన
అకాల వర్షాలతో రైతులు తీవ్ర నష్టపోయారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, నిర్మల్ జిల్లాల్లో పంటలు భారీగా దెబ్బతిన్నాయని చెప్పారు. కోతకు సిద్ధంగా ఉన్న మొక్కజొన్న, వరి, నువ్వులు, పసుపు పంటలు నేలరాలిపోయాయని పేర్కొన్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ప్రతి రైతుకు సహాయం అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

వెలుగుమట్ల బాధితులకు ఇళ్లు ప్రకటించడంతో కవిత దీక్ష విరమణ – భూదాన్ భూములపై శ్వేతపత్రం డిమాండ్
హైదరాబాద్, మార్చ్ 11 (ప్రజా మంటలు):

ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతలకు గురైన బాధితులకు ప్రభుత్వం ఇళ్లు, ఇండ్ల పట్టాలు ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో కొనసాగుతున్న నిరాహార దీక్షను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరియు ధర్మసమాజ్ పార్టీ నాయకుడు విశారదన్ మహారాజ్ విరమించారు.
జస్టిస్ ఈశ్వరయ్య నిమ్మరసం ఇచ్చి వారి దీక్షను విరమింపజేశారు. అనంతరం విశారదన్ మహారాజ్, జస్టిస్ ఈశ్వరయ్యలతో కలిసి కవిత మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ వెలుగుమట్ల ఘటన రాష్ట్ర ప్రజలను తీవ్రంగా కలచివేసిందన్నారు. అర్ధరాత్రి సమయంలో బుల్డోజర్లతో పేదల ఇళ్లను కూల్చివేయడం రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలిగించే విధంగా ఉందని విమర్శించారు. బాధితుల ఇళ్లను కూల్చివేసిన తరువాత వారికి భూమిపై హక్కులు లేవని చెప్పడం మరింత అవమానకరమని అన్నారు.
వెలుగుమట్ల బాధితులను కలిసినప్పుడు పరిస్థితి చూసి మనం భారత్‌లో ఉన్నామా లేదా అఫ్గానిస్తాన్‌లో ఉన్నామా అనే అనుమానం కలిగిందని వ్యాఖ్యానించారు. పేదలను కొట్టి వారి భూములను కొందరు ప్రభావశీలులకు అప్పగించే కుట్ర జరుగుతోందనే అనుమానం తమకు కలిగిందన్నారు.

అన్ని అర్హతలు ఉన్న పేదల ఇళ్లను కూల్చే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిది అని ప్రశ్నించిన ఆమె, ప్రైవేట్ ప్రాపర్టీలోకి వెళ్లి ఇళ్లను కూల్చివేయడం తీవ్రమైన చట్టవిరుద్ధ చర్య అని అన్నారు. చేతిలో రాజ్యాంగం పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ ఈ ఘటనపై బాధ్యత వహించి రాష్ట్ర ప్రభుత్వంపై గట్టి చర్యలు తీసుకోవాలని, ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మొన్నటివరకు ఆక్రమణలు జరిగాయని చెప్పిన మంత్రులు ఇప్పుడు అక్కడ అర్హులు ఉన్నారని చెప్పడం విరుద్ధ వ్యాఖ్యలని కవిత విమర్శించారు. పోలీసు కమిషనరే ల్యాండ్ ఓనర్లను ఖాళీ చేయించి ఇళ్లు కూల్చేశామని ట్వీట్ చేసినప్పుడు ఆ అధికారులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం బాధితులకు ఇచ్చిన టోకెన్లపై ఇంకా అనుమానం ఉందని, పూర్తి లేఅవుట్ తీసి ప్రతి కుటుంబానికి వారి స్థలం ఎక్కడుందో స్పష్టంగా చూపించాలని ఆమె కోరారు. కొందరు పది లక్షలు, కొందరు ఇరవై లక్షలు, మరికొందరు ముప్పై లక్షలు ఖర్చు చేసి ఇళ్లు నిర్మించుకున్నారని, వారికి కేవలం ఐదు లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పడం సరిపోదన్నారు.
వెలుగుమట్ల ఘటనపై ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పాటు చేసి బాధితులకు సంపూర్ణ న్యాయం జరిగిందా లేదా పరిశీలిస్తామని కవిత తెలిపారు. జస్టిస్ ఈశ్వరయ్య సమక్షంలో బాధితులతో మళ్లీ మాట్లాడి పూర్తి నివేదిక తీసుకుంటామని చెప్పారు.
రాష్ట్రంలోని లక్షా 74 వేల ఎకరాల భూదాన్ భూములపై ప్రభుత్వ పెద్దల కన్ను పడిందని కవిత ఆరోపించారు. వెలుగుమట్లలో జరిగిన కూల్చివేతలు ఒక ట్రయల్ మాత్రమేనని, ఎలాంటి వ్యతిరేకత రాకపోతే రాష్ట్రవ్యాప్తంగా భూదాన్ భూములను కాజేసే ప్రయత్నం జరిగేదని అన్నారు.

భూదాన్ భూముల లెక్కలపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆ భూములు పేదలకు చెందేవేనని, వాటిని వారికి పంపిణీ చేయాలని, లేకపోతే భవిష్యత్తులో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు పంచుతామని తెలిపారు.
ప్రస్తుతం ఈ పోరాటానికి విరామం మాత్రమేనని, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత అవసరమైతే మళ్లీ ఉద్యమాన్ని కొనసాగిస్తామని కవిత స్పష్టం చేశారు. పేదలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని తెలిపారు.
ఈ సందర్భంగా తమ దీక్షకు మద్దతు తెలిపిన ప్రజా సంఘాలు, ఎస్సీ–ఎస్టీ–బీసీ జేఏసీ, జాగృతి కార్యకర్తలు మరియు ఇతర ప్రగతిశీల శక్తులకు కవిత కృతజ్ఞతలు తెలిపారు.

వెలుగుమట్ల బాధితుల ఆవేదన చూస్తే కడుపు తరుక్కుపోతోంది: కల్వకుంట్ల కవిత
ఖమ్మం, మార్చ్ 09 (ప్రజా మంటలు):

ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేత బాధితుల ఆవేదన చూస్తే కడుపు తరుక్కుపోతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బాధితులతో కలిసి కలెక్టరేట్‌కు ర్యాలీగా బయల్దేరిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వానికి, రాజకీయ నాయకులకు ఇక్కడున్న ఆడబిడ్డల ఉసురు తగులుతుందని తీవ్రంగా వ్యాఖ్యానించారు.
పిల్లల పరీక్షల సమయంలోనే పుస్తకాలతో సహా రాత్రికి రాత్రే బుల్డోజర్లతో ఇళ్లను కూల్చివేయడం అమానుషమని ఆమె విమర్శించారు. ఇళ్లు కూల్చిన తరువాత చాలా మంది రాజకీయ నాయకులు బాధితుల బాధను ఎగ్జిబిషన్‌లా చూసి వెళ్లారని, కొందరు రాజకీయ పార్టీలకు ఈ బాధ ఒక ప్రదర్శనగా మారిందని అన్నారు.
తాను కేవలం బాధితులను చూసి వెళ్లటానికి రాలేదని, వారి సమస్యలను పూర్తిగా విని ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కారం సాధించేందుకు వచ్చానని కవిత స్పష్టం చేశారు. మహిళలు, పేదల పక్షాన ఎప్పుడూ నిలుస్తానని ఆమె తెలిపారు.

వెలుగుమట్ల బాధితుల పక్షాన ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ, ధర్మ సమాజ్ పార్టీ, ప్రజా సంఘాలు మరియు తెలంగాణ జాగృతి కలిసి పోరాటం చేస్తాయని ఆమె చెప్పారు. సమస్యకు పరిష్కారం వచ్చే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు.
ప్రస్తుతం బాధితులను సరైన సదుపాయాలు లేకుండా ఒకేచోటకు తరలించారని, మహిళలకు ప్రత్యేక వసతి కూడా లేదని కవిత అన్నారు. హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారులు కనీసం హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయకపోవడం దారుణమని విమర్శించారు.
గతంలో ఇళ్ల కూల్చివేతకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు భోజనాలు, హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారని, వారు చేసిన పాపాలను కడుక్కునే ప్రయత్నమే అది అని ఆమె వ్యాఖ్యానించారు.

జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఎవరూ బాధితుల సమస్యపై స్పందించలేదని కవిత అన్నారు. ముఖ్యమంత్రి మరియు జిల్లా మంత్రులు వెంటనే ఈ సమస్యపై మాట్లాడాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే జిల్లా కలెక్టర్ వెంటనే బాధితులను కలవాలని కోరారు.
బాధితుల ఇళ్లను ఎక్కడ కూల్చివేశారో అదే చోట వారికి కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేరే ప్రాంతాలకు తరలించాలనే ప్రయత్నాలను ప్రజలు అంగీకరించరని తెలిపారు.
రాష్ట్రంలో పేదలపై జులుం నడుస్తోందని, పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడుపుతున్నారని కవిత విమర్శించారు. పెద్దల అక్రమ నిర్మాణాలపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.
పేదల హక్కులను కాపాడేందుకు మరియు బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు.
SEO ట్యాగ్స్:

త్వరలో కొత్త పార్టీ, తెలంగాణ హక్కుల కోసం పోరాటం : తిరుమలలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు –
అలిపిరి మార్చ్ 05 (ప్రజా మంటలు):

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. గురువారం సాయంత్రం అలిపిరి నుంచి కుటుంబ సభ్యులు, జాగృతి నాయకులతో కలిసి మెట్ల మార్గం ద్వారా బయలుదేరిన ఆమె రాత్రి సుమారు 10 గంటల సమయంలో తిరుమలకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత, త్వరలోనే తెలంగాణ ప్రజలకు సేవ చేసే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కవిత మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు ప్రస్తుతం ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీలు ప్రతిపక్షాలుగా పూర్తిగా వైఫల్యం చెందాయని విమర్శించారు. ఈ కారణంగానే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధిక స్థానాలు వచ్చాయని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు, అస్తిత్వం, హక్కుల పరిరక్షణ కోసం తమ పార్టీ పనిచేస్తుందని కవిత స్పష్టం చేశారు. ఎన్నికలకే పరిమితం కాకుండా తెలంగాణ హక్కుల పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు, మహిళలు, యువతను విస్మరించిందని ఆరోపించిన ఆమె, ఆ వర్గాల సమస్యలను తమ పార్టీ అజెండాగా తీసుకుని ముందుకు వెళ్తామని చెప్పారు. ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించే పార్టీగా తమ పార్టీ పనిచేస్తుందని పేర్కొన్నారు.

ఆంధ్రా ప్రజలంటే తమకు ఎలాంటి ద్వేషం లేదని, ఆంధ్రా రాజకీయ నాయకుల ఆధిపత్యాన్ని మాత్రమే వ్యతిరేకించామని కవిత అన్నారు. రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ప్రతి రాష్ట్రం తన అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు గురించి మాట్లాడుతూ, తాను చేయని తప్పుకు నాలుగేళ్లుగా తనపై మరియు తన కుటుంబంపై తీవ్ర మానసిక వేదన కలిగించారని అన్నారు. అయితే దేవుడి ఆశీస్సులతో కోర్టు ఆ కేసును కొట్టివేసిందని చెప్పారు. తిరుమలకు కాలినడకన వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం తమ కుటుంబానికి ఒక మొక్కు అని, త్వరలో ప్రారంభించబోయే కొత్త పార్టీకి కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుంటామని తెలిపారు.
తిరుమలలో లడ్డూ కల్తీ వివాదంపై స్పందించిన కవిత, వెంకటేశ్వర స్వామి భక్తులు దేశవ్యాప్తంగా ఉన్నారని పేర్కొన్నారు. టీటీడీ వ్యవహారంలో భక్తులకు విశ్వాసం కలిగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

మరోవైపు హైడ్రా చర్యలపై కూడా ఆమె విమర్శలు చేశారు. పెద్దలను కాపాడుతూ పేదలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ఏ ప్రభుత్వం అయినా పెద్దల కోసం పేదలకు అన్యాయం చేసే పరిస్థితి మారాల్సిన అవసరం ఉందని అన్నారు. శుక్రవారం ఉదయం కవిత శ్రీవారి దర్శనం అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు.

నర్సింగిలో మూసీ ఆక్రమణపై కవిత ఆందోళన – అక్రమ రియల్ ఎస్టేట్ వెంచర్‌పై చర్యలు డిమాండ్
హైదరాబాద్, మార్చ్ 03 (ప్రజా మంటలు):

హైదరాబాద్ పరిధిలోని నర్సింగిలో మూసీ నదిని ఆక్రమించి నిర్మిస్తున్న భారీ రియల్ ఎస్టేట్ వెంచర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కల్వకుంట్ల కవిత స్థానికులతో కలిసి ఆందోళన చేపట్టారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా ఆమె ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో పేదల ఇళ్లను తొలగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, హైడ్రా అధికారులు మూసీ నదిలో నిర్మాణం జరుగుతున్న భారీ భవనాలను ఎందుకు గుర్తించట్లేదని ప్రశ్నించారు. మూసీ నదిలోనే అంతస్తుల భవనాలు కడుతున్నా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

కుత్భుల్లాపూర్‌లో పేదల ఇళ్లను కూల్చివేసినట్లు, ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో 600 మంది పేదల ఇళ్లు అక్రమంగా తొలగించారని పేర్కొన్నారు. మూసీ పరిధిలో కూడా పేదల ఇళ్లను కూల్చివేసినా, ప్రస్తుతం నిర్మిస్తున్న భారీ బిల్డింగ్‌పై మాత్రం అధికారులు స్పందించడం లేదన్నారు.
హైడ్రా అధికారి రంగనాథ్‌కు ఫోన్ చేసినప్పుడు కలెక్టర్ల సమావేశంలో ఉన్నానని సమాధానం ఇచ్చారని తెలిపారు. బుల్డోజర్లు తెచ్చే వరకు తాము అక్కడి నుంచి కదలబోమని స్పష్టం చేశారు.

జనం బాట కార్యక్రమంలో భాగంగా చెరువులు, నదులు ఆక్రమించి కట్టిన భవనాలపై ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో నగరంలోని మధు రిడ్జ్ అపార్ట్‌మెంట్ నివాసులను కూడా ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. దాదాపు 20 ఏళ్ల క్రితం నిర్మించిన అపార్ట్‌మెంట్‌లను లక్ష్యంగా చేసుకోవడం సరైంది కాదన్నారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ఈ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆరు నెలలు నిర్మాణాలను నిలిపివేసి, తరువాత మళ్లీ అనుమతులు ఇచ్చిందని ఆరోపించారు. న్యాయం అందరికీ ఒకే విధంగా ఉండాలన్నదే తమ పోరాటమని స్పష్టం చేశారు.మూసీ నది, తెలంగాణ వనరులను పరిరక్షించుకునే దిశగా తమ ఉద్యమం కొనసాగుతుందని కవిత తెలిపారు.

అంగన్‌వాడీల్లో రాజకీయ జోక్యం సరికాదు : కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ప్రజా మంటలు)::

అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణలో రాజకీయ జోక్యం ఉండేలా ప్రభుత్వం జారీ చేసిన జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. అంగన్‌వాడీలు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ పరిధిలో కొనసాగాలని, వాటిని గ్రామ పంచాయతీల పరిధిలోకి తీసుకురావడం సరికాదన్నారు.

గర్భిణులు, చిన్నపిల్లలకు పౌష్టికాహారం అందించడంలో అంగన్‌వాడీల పాత్ర కీలకమని, ప్రారంభం నుంచే పోషకాహార లోపం గణనీయంగా తగ్గిందన్నారు. ప్రభుత్వం అప్పగించిన ప్రతి పనిని అంగన్‌వాడీ టీచర్లు, వర్కర్లు నిబద్ధతతో నిర్వహిస్తున్నారని, అలాంటి వారిపై మరింత ఒత్తిడి పెంచడం తగదన్నారు.

ఆరు నుంచి తొమ్మిది నెలల వరకు అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలకు జీతాలు చెల్లించకపోవడం అన్యాయమని, సంక్షేమ పథకాల పేరుతో వారి వేతనాలను నిలిపివేయడం సరికాదని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అంగన్‌వాడీలు, ఆశాలు, ఎఎన్ఎంలు, కాంట్రాక్ట్ వర్కర్ల జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు.

ఇదే సమయంలో, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మహిళలతో కలిసి బేగంపేటలోని ప్రజాభవన్ వద్ద ఆందోళన నిర్వహించారు. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం, పింఛన్ల పెంపు, ఇతర సంక్షేమ హామీల అమలుకు బడ్జెట్ కేటాయింపులు చేయాలని కోరారు.

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్–బీజేపీ మధ్య అంతర్గత సహకారాన్ని వెల్లడించాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ప్రజలకు ప్రత్యామ్నాయ పార్టీ లేకపోవడంతోనే కాంగ్రెస్ గెలిచింది - కవిత
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (ప్రజా మంటలు):

మున్సిపల్ ఎన్నికలు కేవలం ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ఇంకా మిగిలే ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమెతో పాటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ,
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండానే ఎక్కువ స్థానాలు గెలుచుకుందని విమర్శించారు. మరోవైపు, ప్రజలు తమకు గుడులు కట్టారంటూ ప్రచారం చేసుకునే బీఆర్ఎస్ చాలా చోట్ల మూడు, నాలుగు స్థానాలకు పరిమితమైందన్నారు. గతంలో 90 శాతం మున్సిపాలిటీల్లో గెలిచిన బీఆర్ఎస్ ఇప్పుడు కేవలం 16 మున్సిపాలిటీలకే పరిమితమైందని తెలిపారు.

ప్రజలకు సరైన ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లే కాంగ్రెస్‌కు ఓట్లు పడ్డాయని కవిత అభిప్రాయపడ్డారు. తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వని బీజేపీ కరీంనగర్ మేయర్ స్థానం తప్ప మిగతా చోట్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని అన్నారు. అయితే ఈ ఎన్నికల్లో తమలాంటి కొత్త తరహా రాజకీయ శక్తులను ప్రజలు ఆదరించారని చెప్పారు.

త్వరలోనే రాజకీయ పార్టీగా మారుతామని ప్రకటించినప్పటికీ, సమయం తక్కువగా ఉండటంతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్‌తో కలిసి పోటీ చేశామని తెలిపారు. ఈ ఎన్నికల్లో జాగృతి–ఫార్వర్డ్ బ్లాక్ కలిసి పోటీ చేసిన అభ్యర్థుల్లో మొత్తం 40 మంది గెలిచారని, అధికారికంగా 33 స్థానాలు వచ్చినప్పటికీ బీ–ఫామ్ సమస్యల కారణంగా మరో ఏడు స్థానాల్లో తమ అభ్యర్థులే గెలిచారని వివరించారు.

మున్సిపల్ ఎన్నికల్లో చట్టాలు, నిబంధనలు ఉల్లంఘించబడ్డాయని, ప్రభుత్వ ఖర్చుతోనే ప్రచారం జరిగిందని కవిత ఆరోపించారు. అయినప్పటికీ ఎన్నికల సంఘం, ప్రతిపక్షాలు స్పందించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య నార్త్ తెలంగాణలో అప్రకటిత పొత్తు ఉందని, మున్సిపల్ ఎన్నికలు ఆ పొత్తుకు తొలి మెట్టు అని అన్నారు.

ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి మాట్లాడుతూ, భవిష్యత్‌లోనూ జాగృతి–ఫార్వర్డ్ బ్లాక్ కలిసి పనిచేస్తాయని స్పష్టం చేశారు. వడ్డెపల్లి మున్సిపాలిటీని ఇరు పార్టీలూ కలిసే గెలుచుకున్నామని, దీనిపై ఎలాంటి గందరగోళం అవసరం లేదన్నారు.

హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ, రామగుండం ఎమ్మెల్యే తమ అభ్యర్థులను బెదిరించారని ఆరోపించారు. ఉత్తర తెలంగాణలో సీపీఐ రాజకీయంగా పూర్తిగా బలహీనమైందని, భవిష్యత్‌లో కార్మికుల కోసం నిజంగా పోరాడే శక్తులకే ప్రజలు మద్దతు ఇస్తారని చెప్పారు.

ఈ సమావేశంలో ఫార్వర్డ్ బ్లాక్ కేంద్ర కమిటీ సభ్యులు ఆర్‌వీఆర్ ప్రసాద్, జాగృతి ప్రధాన కార్యదర్శి ఎల్. రూప్ సింగ్, నవీన్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.

సంత్ సేవాలాల్ 287వ జయంతి పోస్టర్ ఆవిష్కరణ
హైదరాబాద్ – ఫిబ్రవరి 08 (ప్రజా మంటలు):

ఈ నెల 15న నిర్వహించనున్న బంజారా జాతి ఆరాధ్యదైవం, మూలపురుషుడు సంత్ శ్రీ సేవాలాల్ మాహారాజ్ 287వ జయంతి వేడుకల పోస్టర్‌ను తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంత్ సేవాలాల్ మాహారాజ్ జయంతిని జాగృతి కేంద్ర కార్యాలయంలో జాగృతి బంజారా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. గతంలో ఎవరూ చేయని విధంగా ఈసారి భోగ్ బండార్ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి బంజారా గురువులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని చెప్పారు.

బంజారా జాతి సమస్యలపై ఇప్పటివరకు ఏ పార్టీ, ఏ ప్రభుత్వం గణనీయమైన శ్రద్ధ చూపలేదని రూప్ సింగ్ విమర్శించారు. అయితే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత  బంజారాల అంశంపై లోతైన అధ్యయనం చేసి, బంజారాలు–ఆదివాసీలను ఏకం చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన ప్రశంసించారు.

తెలంగాణ చరిత్రలో తొలిసారిగా బంజారా పూజారులను పిలిచి గౌరవించిన ఘనత కవిత గారిదేనని పేర్కొన్నారు. ఆమె స్వయంగా బంజారా పూజారులను ఇంటికి ఆహ్వానించి, వారికి నమస్కరించి గౌరవించిన సందర్భాలు ప్రజలకు గుర్తుండిపోయాయని అన్నారు.

అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్‌లోని హథిరాం మఠాన్ని కూలగొట్టే ప్రయత్నం జరిగిన సమయంలో, అక్కడి ముఖ్యమంత్రి, టీటీడీ ఛైర్మన్, అధికారులతో మాట్లాడి ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారని తెలిపారు. ఇది బంజారా, ఆదివాసీ సంప్రదాయాల పట్ల కవిత గారి నిబద్ధతకు నిదర్శనమని రూప్ సింగ్ పేర్కొన్నారు.

ఈ నెల 15న నిర్వహించే భోగ్ బండార్ కార్యక్రమంలో కవిత స్వయంగా పాల్గొంటారని ఆయన స్పష్టం చేశారు.

ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జాగృతి బంజారా నాయకులుబి. కిషన్ నాయక్, బి. సంజీవ్ నాయక్, బానోత్ వెంకట్ నాయక్, దేవి బాయి, పున్ని బాయి, రాంజి నాయక్, గుగులోత్ శ్రీనివాస్ నాయక్, బాలు నాయక్, కుమార్ నాయక్, ప్రేమ్ కుమార్, ప్రవీణ్ నాయక్, కృష్ణ నాయక్, జీవన్ నాయక్, రామ చావలి బాయి తదితరులు పాల్గొన్నారు.

ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వకపోతే భూపోరాటాలు తప్పవు: తెలంగాణ జాగృతి
హైదరాబాద్, జనవరి 10 (ప్రజా మంటలు):

తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్ హెచ్చరించారు. ముఖ్యంగా ఉద్యమకారులకు హామీ ఇచ్చిన 250 గజాల భూమిని వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు.

బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో జరిగిన ఉద్యమకారులతో ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే కరీంనగర్‌లో భూపోరాటం ప్రారంభమైందని, మిగతా జిల్లాల్లోనూ ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను ఉద్యమకారులు గుర్తించాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో కవిత స్వయంగా భూపోరాటం నిర్వహించి స్థలాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటారని తెలిపారు.

ఉద్యమకారుల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధి చూపడం లేదని విమర్శించారు. ఉద్యమకారుల సమస్యలపై అన్ని సంఘాలతో కలిసి జాగృతి పనిచేస్తుందని, ఉద్యమంలో నష్టపోయిన యూనివర్సిటీ విద్యార్థులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో వివిధ ఉద్యమకారుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

సీఎం రేవంత్‌పై ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఫిర్యాదు: రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన కవిత
హైదరాబాద్, డిసెంబర్ 03 (ప్రజా మంటలు):

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాధనంతో రాజకీయ ప్రచారం చేస్తున్నారని ఆరోజిస్తూ, తెలంగాణ జాగృతి ప్రతినిధి బృందం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసింది. జాగృతి అధ్యక్షురాలు కవిత సమర్పించిన ఫిర్యాదు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

“ప్రభుత్వ ధనంతో ఎన్నికల ప్రచారం… సీఎం టూర్‌పై వెంటనే ఆంక్షలు కావాలి” — కవిత

సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి సీఎం టూర్ షెడ్యూల్‌పై మేము అభ్యంతరం తెలిపారు.

అర్బన్ ఏరియాల్లో ప్రభుత్వ నిధులతో మీటింగులు నిర్వహించి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పరోక్షంగా ప్రచారం చేస్తున్నారు.

దీనిపై మొదటి రోజునే టూర్‌కి ఆంక్షలు విధించాలని ఎన్నికల సంఘానికి లేఖ ఇచ్చాం.

ఎన్నికల అధికారులు “నియమావళి ప్రకారం ప్రభుత్వానికి సూచనలు ఇస్తాం” అని చెప్పినా, సీఎం చేసిన తాజా వ్యాఖ్యలు స్పష్టంగా మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనలో పడతాయని మేము ఈసీకి అందజేసిన వీడియో కాపీలు చూపిస్తున్నాయి.

లూప్‌హోల్స్‌ను ప్రయోజనంగా ఉపయోగించుకుంటున్నారని ఆరోపణ

గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో రాష్ట్రం మొత్తం కోడ్ అమలు చేసేవారు.

తరువాత మున్సిపాలిటీ పరిమితుల్లో కోడ్ వర్తించదనే ఎగ్జెంప్షన్ ఇచ్చారు.

ఈ లోటును ప్రయోజనంగా చేసుకొని సీఎం రాజకీయ ప్రచారం చేస్తున్నారని కవిత ఆరోపించారు.

“ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను సమావేశాలకు లాగడం దారుణం”కవిత ఆరోపణ:

ప్రభుత్వ నిధులతో నిర్వహించిన కార్యక్రమంలో స్కూల్ పిల్లలను నింపారని, ఇది ఎన్నికల నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని పేర్కొన్నారు.

గ్రౌండ్ లెవెల్ దుర్వినియోగాలపై ఈసీకి సమాచారం

గద్వాల్, నల్గొండ తదితర ప్రాంతాల్లో అధికార దుర్వినియోగం, ఒత్తిడి, బెదిరింపుల విషయాలను కూడా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

నల్గొండలో ఒక బీసీ అభ్యర్థిని నిర్బంధించి గెలిపించే ప్రయత్నం చేసిన ఘటనను కూడా వివరించారు.

“సీఎం హోదాను దుర్వినియోగం చేస్తున్నారు… ఈసీ తక్షణ చర్యలు తీసుకోవాలి”

ఎన్నికల కోడ్‌ను రాజకీయ పార్టీలూ ఎలా ఉల్లంఘిస్తాయన్న అంశంపై నేను విస్తృతంగా అధ్యయనం చేశాను.

ప్రస్తుతం సీఎం తన హోదాను అడ్డం పెట్టుకొని సర్పంచ్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ స్వంతంగా మీటింగ్ పెట్టుకుంటే అభ్యంతరం లేదు. కానీ ప్రజాధనంతో ప్రచారం చేయడం సరికాదు.

ఈ విషయాన్ని ఇతర ప్రతిపక్షాలు కూడా సీరియస్‌గా తీసుకోవాలి.

మేము ఇచ్చిన ఫిర్యాదుపై స్పందన రాకపోతే మళ్లీ రిప్రజెంటేషన్లు ఇస్తాం.

ప్రజలకు ఈ అంశంపై అవగాహన పెంచేందుకు మీడియా ద్వారా ప్రచారం కొనసాగిస్తాం.

తెలంగాణ అమరవీరుల స్మరణలో జాగృతి మెగా రక్తదాన శిబిరం
హైదరాబాద్ డిసెంబర్ 02 (ప్రజా మంటలు):

తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో భారీ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్వయంగా రక్తదానం చేసి, ఉద్యమ నాయకులు, కార్యకర్తలు, యువతను ఉత్సాహపరచారు.

కవిత మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర నిర్మాణం వెనుక ఉన్న అమరుల త్యాగాలు, కేసీఆర్‌ గారి దీక్ష, విద్యార్థుల పోరాటం, ప్రజల అహర్నిశల ఉద్యమం అసమానమని పేర్కొన్నారు.

కవిత ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు చేస్తూ, ఉద్యమంలో “మనమే 1200 మంది అమరులయ్యాం” అని చెబుతారు కానీ కేవలం 540 కుటుంబాలకు మాత్రమే సహాయం అందించబడిందని పేర్కొన్నారు.

రాష్ట్రావతరణ వేడుకలలో కూడా అమరుల కుటుంబాలకు శాలువా కప్పే గౌరవం ఇవ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు, పెన్షన్లు, 250 గజాల భూమి ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, కానీ రెండేళ్లుగా ఏ ముందడుగు వేయలేదని తెలిపారు.

డిసెంబర్ 9 న ముఖ్యమంత్రి ఉద్యమకారుల భూముల విషయంలో స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

“ప్రకటన లేకపోతే క్షేత్రస్థాయిలో భూపోరాటాలు ప్రారంభం” – కవిత హెచ్చరిక

కవిత తీవ్ర హెచ్చరిక జారీ చేస్తూ:“డిసెంబర్ 9 నాటికి ఉద్యమకారుల భూములపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించకపోతే… జాగృతి తరఫున భూపోరాటాలు ప్రారంభిస్తాం. ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయో అక్కడ ఉద్యమకారులను తీసుకెళ్లి భూములను పంచుతాం. అక్కడే జాగృతి జెండాలు పాతుతాం,” అని స్పష్టం చేశారు.

“మా రక్తం, చెమటతో తెలంగాణ తెచ్చాం… అలాంటి ఉద్యమకారులకు భూములు తప్పకుండా రావాలి” అని ఆమె ధ్వనించారు.