Hyderabad News - Praja Mantalu

ముత్తాత సమాధి కోసం 19 ఏళ్ల అన్వేషణ.. ఇంగ్లండ్ నుంచి హైదరాబాద్‌కు బ్రిటిష్ పౌరుడు
సికింద్రాబాద్‌, ఫిబ్రవరి 18 (ప్రజా మంటలు):

130 ఏళ్ల క్రితం సికింద్రాబాద్‌లో మరణించిన తన ముత్తాత సమాధిని వెతుక్కుంటూ ఇంగ్లండ్‌కు చెందిన రాబిన్ డిక్సన్ హైదరాబాద్‌కు వచ్చారు. దాదాపు 19 ఏళ్ల అన్వేషణ ఎట్టకేలకు ఫలించడంతో, పూర్వీకుడి సమాధి వద్ద భావోద్వేగంతో నివాళులర్పించారు.

రాబిన్ డిక్సన్ తన కుటుంబ పాత దస్త్రాల ద్వారా తన ముత్తాత చార్లెస్ విల్సన్ బ్రిటిష్ ఇండియాలో మరణించారని తెలుసుకున్నారు. 1880లో బ్రిటిష్ సైన్యంలో చేరిన చార్లెస్ విల్సన్ బెంగళూరు, మద్రాస్ ప్రాంతాల్లో సేవలందించి, అనంతరం సికింద్రాబాద్ రెజిమెంట్‌లో లెఫ్టినెంట్‌గా పనిచేశారు. 1906 ఆగస్టు 4న అనారోగ్యంతో తిరుమలగిరి ఆసుపత్రిలో కన్నుమూశారు. అప్పటికి ఆయన వయసు 48 సంవత్సరాలు.

తన ముత్తాత సమాధి స్థలాన్ని గుర్తించేందుకు రాబిన్ దాదాపు రెండు దశాబ్దాల పాటు బెంగళూరు, చెన్నై, సికింద్రాబాద్‌లలో అన్వేషించారు. స్థానిక జర్నలిస్ట్ రవిరెడ్డి సహకారంతో, ఎనిమిది నెలల క్రితం సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి ‘సెమెట్రీ-12’లో సమాధిని గుర్తించారు.

ఈ విషయం తెలిసిన వెంటనే రాబిన్ తన భార్య లిన్‌తో కలిసి ఇంగ్లండ్ నుంచి ప్రత్యేకంగా హైదరాబాద్‌కు వచ్చారు. సమాధిపై తెల్ల గులాబీలు ఉంచి కన్నీటి పర్యంతమయ్యారు. “ఈ క్షణం కోసమే ఇన్నేళ్లుగా ఎదురుచూశాను” అంటూ భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు.

ప్రేమ, అనుబంధాలకు సరిహద్దులు ఉండవన్న మాటకు ఈ ఘటన నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.

చంచల్‌గూడా జైలు నుంచి విడుదలైన ఐబొమ్మ రవి
హైదరాబాద్, ఫిబ్రవరి 18 (ప్రజా మంటలు):

ఐబొమ్మ వ్యవహారంలో అరెస్టై సుమారు 90 రోజులుగా జైలులో ఉన్న ఐబొమ్మ రవి కు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.

బెయిల్ ఉత్తర్వుల నేపథ్యంలో రవిని చంచల్‌గూడా జైలు అధికారులు విడుదల చేశారు. ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వహణకు సంబంధించి రవిపై మొత్తం ఐదు సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయి. కాపీరైట్ ఉల్లంఘనలు, అక్రమ కంటెంట్ ప్రసారం ఆరోపణలపై గతంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.

కేసు విచారణలో భాగంగా సుదీర్ఘకాలం జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న రవికి తాజాగా బెయిల్ లభించడంతో జైలు నుంచి బయటకు వచ్చారు. అయితే కేసుల విచారణ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో, కోర్టు విధించిన షరతులను పాటించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.

ఇమంది రవి ఎట్టి పరిస్థితుల్లోనూ దేశం విడిచి వెళ్లొద్దని, తన పాస్పోర్టును కోర్టులో సరెండర్ చేయాలని ఆదేశించింది. ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు సీసీఎస్ పోలీసుల ఎదుట హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ కేసులో గతేడాది నవంబరులో అతడు అరెస్టయిన విషయం తెలిసిందే.

ఈ విడుదలతో సినీ పరిశ్రమతో పాటు సైబర్ క్రైమ్ వర్గాల్లో మరోసారి చర్చ మొదలైంది.

అమర జ్యోతి కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలి – రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డా. జీ. చిన్నారెడ్డి
హైదరాబాద్, నవంబర్ 13 (ప్రజా మంటలు):

హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం ఎదురుగా నిర్మించిన అమర వీరుల స్మారక అమర జ్యోతి కేంద్రాన్ని తక్షణమే ప్రారంభించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డా. జీ. చిన్నారెడ్డి పేర్కొన్నారు.

బుధవారం ఆయన అమర జ్యోతి కేంద్రాన్ని సందర్శించి, అక్కడి సౌకర్యాలు, నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, “అమర జ్యోతి కేంద్రం ప్రజలకు అందుబాటులో ఉండేలా వెంటనే ప్రారంభించాలనే విజ్ఞప్తిని త్వరలోనే ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి సమర్పిస్తాను” అని తెలిపారు.

తెలంగాణ ఉద్యమ అమరుల స్మారక చిహ్నం

డా. చిన్నారెడ్డి మాట్లాడుతూ, “1969లో తొలి దశ, 2000-2014లో రెండవ దశలో తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల స్మారకార్థం ఈ కేంద్రం నిర్మించబడింది. ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలవాలి” అని అన్నారు.

ఆధునిక సౌకర్యాలతో ఆకర్షణీయ ప్రాంగణం

అమర జ్యోతి ప్రాంగణంలో భారీ సమావేశ మందిరం, క్యాంటీన్, విశాల ప్రదేశం, ఎస్కలేటర్లు వంటి ఆధునిక సౌకర్యాలు ఉండటం గమనార్హమని ఆయన పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్టుకు ప్రణాళిక రూపొందించిన ప్రముఖ శిల్పి ఎం.వి. రమణా రెడ్డి వ్యక్తిగతంగా ప్రాంగణంలో ఉండి డా. చిన్నారెడ్డికి నిర్మాణ వివరాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి ఫౌండర్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ గంటా జలంధర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

ఆర్టీసీ కార్మికుల పక్షాన కవిత – ఉద్యోగ భద్రతకై జాగృతి డిమాండ్
RTC ఎండిని కలిసిసమస్య పరిష్కారానికై డిమాండ్

హైదరాబాద్, నవంబర్ 13 (ప్రజా మంటలు):

హైదరాబాద్‌లోని ఆర్టీసీ బస్ భవన్‌లో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి గారిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈరోజు కలిశారు. ఆర్టీసీ కార్మికుల ఉద్యోగ భద్రత, బకాయిల చెల్లింపులు, విలీనం వంటి అంశాలపై కవిత గారు కీలకంగా స్పందించారు.

🔹 2021 నుండి ఇప్పటి వరకు 1,300 మంది తొలగింపు

కవిత గారు పేర్కొన్న దాని ప్రకారం, 2021 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు చిన్న చిన్న కారణాలతో డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర కార్మికులు కలిపి 1,300 మందిని సంస్థ ఉద్యోగాల నుంచి తొలగించింది.

🔹 తిరిగి విధుల్లోకి తీసుకోవాలి

వారిలో 491 మందిని తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చినా, ఇంకా వారిని విధుల్లోకి తీసుకోకపోవడం విచారకరం అని కవిత గారు పేర్కొన్నారు. సంస్థ వెంటనే ఆ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి

మిగతా తొలగింపుల విషయంలో కూడా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆమె కోరారు. ఉద్యోగ భద్రత లేకుండా కార్మికులు ఒత్తిడిలో ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

హైర్, ఎలక్ట్రిక్ బస్సులపై ఆందోళన

కవిత గారు హైర్ బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులపై కూడా స్పందించారు.“హైర్ బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు తీసుకుంటున్నారు.. కానీ వాటి డ్రైవర్లపై ఆర్టీసీకి నియంత్రణ లేదు. ప్రైవేట్ డ్రైవర్లు ప్రమాదాలకు కారణమవుతుంటే బాధ్యత ఎవరిది? ఆర్టీసీ డ్రైవర్లే ఆ బస్సులు నడపాలని చర్యలు తీసుకోవాలి.”అని కోరారు.

🔹 బకాయిల చెల్లింపు – విలీనం ప్రక్రియ వేగవంతం చేయాలి

ఆర్టీసీ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని, అలాగే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కవిత గారు డిమాండ్ చేశారు.
“విలీనం పూర్తయితేనే ప్రజలకు భద్రమైన ప్రయాణం, కార్మికులకు ఉద్యోగ భద్రత లభిస్తాయి” అని ఆమె అన్నారు.