DMK - Praja Mantalu

డీఎండీకే – డీఎంకే కూటమి: రాజకీయ లెక్కలు ఏమిటి?
చెన్నై ఫిబ్రవరి 20:

తమిళనాడు రాజకీయాల్లో కీలకమైన మార్పు చోటుచేసుకుంది.
డీఎండీకే అధికార పార్టీ అయిన డీఎంకే కూటమిలో చేరింది. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల వరకు డీఎండీకే ఏ కూటమిలో చేరుతుందో స్పష్టత లేకుండా ఉంది. అధికార పార్టీ వైపు వెళ్తుందా? లేక ప్రతిపక్ష కూటమిలో చేరుతుందా? అనే సందేహాలు కొనసాగాయి. చివరకు పార్టీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని డీఎంకే కూటమిలో చేరాలని నిర్ణయించింది.

ప్రతిపక్ష కూటమికి ఎదురుదెబ్బ

డీఎండీకే ప్రతిపక్ష కూటమిలో చేరుతుందని భావించిన వారు తీవ్ర నిరాశకు గురయ్యారు.
ప్రత్యేకంగా ఎడప్పాడి పళనిస్వామి మరియు బీజేపీ నేతలు ఈ పరిణామాన్ని ఊహించలేదు. బలమైన కూటమి ఏర్పడుతుందన్న వారి అంచనాలు తారుమారయ్యాయి.

ప్రేమలత నిర్ణయం వెనుక కారణాలు

డీఎండీకే అధినేత విజయకాంత్ మరణానంతరం పార్టీ బాధ్యతలు చూసుకుంటున్న ప్రీమలత విజయకాంత్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
గతంలో ప్రతిపక్ష కూటమి ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం వల్ల పార్టీ నేతల్లో అసంతృప్తి పెరిగింది. ముఖ్యంగా రాజ్యసభ హామీ నెరవేర్చకపోవడం కీలక కారణంగా మారింది.

పార్టీ అంతర్గత మద్దతు

ఇటీవల జరిగిన డీఎండీకే జిల్లా స్థాయి సమావేశంలో ఎక్కువ మంది నేతలు అధికార పార్టీ కూటమిలో చేరాలని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీకి మళ్లీ ప్రజల్లో గుర్తింపు రావాలంటే అధికార కూటమిలో ఉండటం అవసరమని వారు భావించారు.

అధికార పార్టీకి లాభం

అధికార పార్టీ వచ్చే ఎన్నికల్లో భారీ విజయం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి నియోజకవర్గంలో కొన్ని వేల ఓట్లు ప్రభావితం చేసే శక్తి డీఎండీకేకు ఉందని అంచనా. అందుకే ఈ కూటమి అధికార పార్టీకి అదనపు బలంగా మారింది.

డీఎండీకే భవిష్యత్ వ్యూహం

డీఎండీకే ఈ కూటమి ద్వారా

శాసనసభలో ప్రతినిధిత్వం

పార్లమెంటులో ప్రాతినిధ్యం

స్థానిక సంస్థల స్థాయిలో బలపడటం
లక్ష్యంగా పెట్టుకుంది.

రాజకీయంగా కీలక మలుపు

2011 ఎన్నికల్లో కూటమి భాగస్వామిగా ఉండి ప్రతిపక్ష హోదా పొందిన డీఎండీకే, ఆ తర్వాత సరైన రాజకీయ దారి లేక బలహీనపడింది. ఇప్పుడు అధికార పార్టీ కూటమిలో చేరి మళ్లీ రాజకీయ పునరాగమనానికి ప్రయత్నిస్తోంది.

డీఎండీకే తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా సరైనదేనా?
పార్టీకి మళ్లీ పూర్వ వైభవం వస్తుందా?
అనేది రాబోయే ఎన్నికల ఫలితాల్లో తేలనుంది.

ప్రజాస్వామ్యానికి ‘నోట్ల బానిసత్వం’: బిహార్ మహిళా రోజ్గార్ పథకం అసలు ముఖం
బీహార్ ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన పరిశీలన

(సిహెచ్.వి. ప్రభాకర్ రావు)

బిహార్ ఎన్నికల సమయంలో ప్రకటించిన ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన రాజకీయాల నైతిక పతనానికి, రాష్ట్ర ఆర్థిక పతనానికి జాతీయ రహదారి. ఇప్పటికే మొదటి క్రీస్తు కింద దాదాపు కోటి మందికి, తలా పదివేల రూపాయల చొప్పున, ₹10 వేల కోట్లు పంచినట్లు ప్రచారంలో ఉంది. అధికారిక లెక్కలు మాత్రం లేవు. నిజానికి ఈపథకం లక్ష్యం మంచిదే అయినా, ప్రకటించిన సమయం, అమలు తీరే ప్రశ్నార్థకం. ఒకసారి ఈ పథకం దేశ వ్యాప్తంగా అన్ని పార్టీలు ఎన్నికల సమయంలో ప్రకటిస్తే, దేశ ఆర్థిక వ్యవస్థ ఏమౌతుందో రాజకీయ నాయకులు మాత్రమే చెప్పాలి.

ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటే—వాగ్దానాలకన్నా బాధ్యతను, డబ్బులకన్నా ధర్మాన్ని విలువ చేసేటట్టు చేసే సమయం ఇది.

బిహార్ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ పేరిట ఒక్కసారిగా కోటి మందికి ₹10,000 చొప్పున పంపిణీ చేయడం, రాజకీయ వ్యవస్థలో డబ్బు ఆధిపత్యం ఏ స్థాయికి వెళ్లిందో స్పష్టంగా చూపిస్తోంది. బిహార్ వార్షిక బడ్జెట్ ₹3 లక్షల కోట్లు, రాష్ట్ర అప్పులు ఇప్పటికే ₹4 లక్షల కోట్లను దాటాయి.

ఇలాంటి పరిస్థితుల్లో, “ప్రతి కుటుంబంలో ఒకరికి ₹2 లక్షలు” అనే భారీ హామీ ఆర్థికంగా అసాధ్యం మాత్రమే కాదు—సూటిగా చెప్పాలంటే ఇది ఓటు కొనుగోలు కోసం రూపొందించిన ఎలక్షన్ బ్రీబు తప్ప మరేదీ కాదు.

అమ్ములమ్ములను పరామర్శిస్తున్నట్లు నటిస్తూ, ఆర్థిక పరిమితులు పట్టించుకోకుండా కోటి మందికి ముందస్తు చెల్లింపులు జరపడం—దీని వెనక రాజకీయ లాభం తప్ప ప్రజా సంక్షేమం లేదు. ఈ పథకం “తరువాత రద్దు చేస్తారు, పునర్విమర్శ చేస్తారు, లబ్ధిదారుల జాబితా మళ్లీ తడమతడమ చేస్తారు” అన్న ప్రతిపక్షాల ఆరోపణ నిరాధారమేమీ కాదు. గతంలో బిహార్ सहित అనేక రాష్ట్రాల్లో ఎన్నికల తర్వాత ఇదే తరహా ‘వాగ్దాన పరారీ’ ఎప్పుడూ జరిగిందే.

ఇది సంక్షేమమా? లేక అధికారిక లంచమా?

ఒక్క సారి ఆలోచిస్తే—ఓ కుటుంబంలో ఒక్కరికే ₹2 లక్షల హామీ ఇవ్వడం అసలే సంక్షేమం కాదు. మహిళా సాధికారత అనే పేరు పెట్టి, రాజకీయ బాగోతాన్ని తెల్లదనంతో పూతపూయడమే. ఎందుకంటే నిజమైన సాధికారత అంటే—ఉద్యోగాలు, విద్య, ఆరోగ్యం, భద్రత… కానీ ఇవన్నీ చేయడానికి సంవత్సరాల ప్రణాళికలు, బడ్జెట్ కట్టుబాట్లు అవసరం. కానీ ఇవేవీ చేయకుండా, ఎలక్షన్ టైంలో ‘డబ్బు వర్షం’ కురిపించడం ప్రజాస్వామ్యాన్ని క్రమంగా అవినీతి అగాధంలోకి నెట్టడమే.

భవిష్యత్తు పన్నుల రూపంలో తిరిగి వసూలు చేసే డబ్బును ముందుగానే ఎన్నికల స్వార్ధం కోసం పంచడం—ఇది ప్రజలకేమీ లాభం కాదని, కేవలం పార్టీల అధికార వ్యసనం మాత్రమేనని స్పష్టమవుతోంది.

ప్రతిపక్షాల ఆలోచన ఏమిటి?

బీజేపీ–జేడీయూ కూటమి తిరిగి అధికారంలోకి రావడంతో ప్రతిపక్షానికి ఇది మరో రాజకీయ ‘బైటింగ్ పాయింట్’. పథకం ఆర్థిక సుస్థిరతను ప్రశ్నించటం, మోసపూరిత హామీలను బయటపెట్టడం, తదుపరి బడ్జెట్‌లో ఎలా భర్తీ చేస్తారో అడగడం—ఇవన్నీ ప్రతిపక్షాలు ఇప్పుడు ప్రధాన ఆయుధాలుగా ఉపయోగించనున్నాయి. ఈ పథకం పూర్తిగా అమలు చేయలేరని, అమలు చేస్తే బిహార్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని ఎదురుదాడి కొనసాగించటమే కాక, కేంద్ర బీజేపీపై కూడా నైతిక ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తాయి.

ఈ పథకాన్ని అన్ని రాష్ట్రాలు అనుకరిస్తే?

భారత ప్రజాస్వామ్యానికి ఇదో అత్యంత ప్రమాదకర సంకేతం.
ఎన్నికల సమయంలో ప్రతి రాష్ట్రం ఇలాంటి ‘క్యాష్-ఫర్-వోట్స్’ పథకాలు ప్రకటిస్తే—

ఎన్నికలది ‘పోటీ’ కాదు, ‘వేలం’ అవుతుంది

రాజకీయ పార్టీలకు పాలసీల కంటే డబ్బే ప్రధాన సాధనం అవుతుంది

ప్రభుత్వాలు అప్పుల్లో కూరుకుపోతాయి

ప్రజల అవసరాలు కంటే, వారి ఆర్థిక బలహీనతను దోపిడీ చేయడమే ప్రధాన కౌశలం అవుతుంది

అందుకే ఈ ధోరణి దేశ ప్రజాస్వామ్యాన్ని ఆధికారికంగా నోట్లకు విక్రయించడం అవుతుంది.

ఒకసారి ఆలోచించండి?

బిహార్‌లోని మహిళా రోజ్గార్ పథకం—మూల్యం ఉన్న సంక్షేమం కాదు, ఎన్నికల కోసం కట్టిన బంగారు వల. ఇది అమలు కాని, నిలవని, సాగని వాగ్దానం. ప్రజల బతుకులను మెరుగుపరచే సాధనం కాకుండా, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ఆయుధంగా మారింది.
దేశ రాజకీయాలు ఇలాంటి పథకాల దారిలో నడిస్తే—రేపటి భారతం పాలసీలతో కాదు, ప్యాకేజీలతో నడిచే దేశంగా మారిపోతుంది.
ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటే—వాగ్దానాలకన్నా బాధ్యతను, డబ్బులకన్నా ధర్మాన్ని విలువ చేసేటట్టు చేసే సమయం ఇది.

టీవీకే పై డీఎంకే అపవాద ప్రచారం చేస్తోందని విజయ్
డీఎంకే నాయకత్వం నిరాధార ఆరోపణలు చేస్తోందని, తమ పార్టీ విమర్శలు మాత్రం మర్యాదపూర్వకంగానే ఉన్నాయని విజయ్ వ్యాఖ్య

చెన్నై నవంబర్ 12,

తమిళనాడు రాజకీయాల్లో మరోసారి వేడి రగులుతోంది. తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు, నటుడు విజయ్ బుధవారం (నవంబర్ 12) డీఎంకే పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
స్పష్టంగా పేరు చెప్పకపోయినా, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకేనే ఉద్దేశిస్తూ మాట్లాడుతూ — ఆ పార్టీ తమపై అపవాద ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు.

విజయ్ తన ‘X’ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేస్తూ ఇలా రాశారు:

“ఇటీవలి కాలంలో ప్రజల మద్దతు కోల్పోయిన ఒక పార్టీ అపవాద రాజకీయాలకు దిగజారింది. ఏ పార్టీని చెప్పాలో మీకు తెలుసా? ఇతరులను తిట్టడం, అపఖ్యాతి కలిగించడం ఆ పార్టీకి మౌలిక రాజకీయ సూత్రం అయిపోయింది. వారి కొత్త లక్ష్యం టీవీకేనే విమర్శించడం.”

అలాగే, తన పార్టీ డీఎంకేపై చేసిన విమర్శలు మాత్రం మర్యాదపూర్వకంగా, ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఉన్నాయని విజయ్ పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలతో తమిళనాడులో డీఎంకే – టీవీకే మధ్య రాజకీయ వాగ్వాదం మరింత ఉధృతం అయ్యే అవకాశం కనిపిస్తోంది.