నల్గొండ - Praja Mantalu

ప్రణయ్ హత్య కేసు దోషి అబ్దుల్ బారీ మృతి..
సికింద్రాబాద్,సెప్టెంబర్ 24 ( ప్రజామంటలు):

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ అమృత-ప్రణయ్ పరువు హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న ఏ-4 నిందితుడు అబ్దుల్ బారీ (52) కన్నుమూశాడు. చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఉన్న అతనికి గురువారం తెల్లవారు జామున తీవ్రమైన గుండెనొప్పితో అస్వస్థతకు గురికావడంతో జైలు సిబ్బంది వెంటనే సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో అతడు తుదిశ్వాస విడిచాడు.

ప్రస్తుతం బారీ మృతదేహాన్ని మార్చురీకి తరలించగా, శుక్రవారం ఉదయం అధికారుల సమక్షంలో  పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు గాంధీ ఆసుపత్రి ఫొరెన్సిక్ హెచ్ఓడీ ప్రొఫెసర్ డా.నాగమోహన్ రావు తెలిపారు. నల్లగొండ పట్టణంలోని ప్యారసభాగ్ కాలనీకి చెందిన అబ్దుల్ బారీకి నేర చరిత్ర ఉంది. గతంలో గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్య హత్య కేసులోనూ ప్రధాన నిందితుల్లో ఒకడిగా ఉన్న బారీ జైలు శిక్ష అనుభవించాడు.

అనంతరం 2018లో మిర్యాలగూడలో చోటుచేసుకున్న పెరుమాళ్ల ప్రణయ్ పరువు హత్య కేసులో ఏ-4గా చేర్చబడ్డాడు. సుదీర్ఘ విచారణ తర్వాత న్యాయస్థానం అతనికి జీవిత ఖైదు విధించడంతో చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.

“కృష్ణా నీటిపై అలసత్వం ప్రదర్శిస్తే సీఎం ఇంటి ముందే ధర్నా చేస్తాం” — కల్వకుంట్ల కవిత
“ఫ్రెంచ్ విప్లవ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం”

“మా పిల్లల అరెస్టులు ఎందుకు?”

“బీఆర్ఎస్‌ను తిట్టి వచ్చిన కాంగ్రెస్ కూడా మారలేదు”

నల్గొండ, నవంబర్ 12 (ప్రజా మంటలు):

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నల్గొండలో జరిగిన జాగృతి జనం బాట కార్యక్రమంలో పాల్గొని, ప్రెస్ మీట్‌లో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయినా, ఎస్ఎల్‌బీసీ, నక్కలగండి, డిండి వంటి ప్రాజెక్టులు పూర్తి చేయలేదని తీవ్రంగా విమర్శించారు.

“బీఆర్ఎస్‌ను తిట్టి వచ్చిన కాంగ్రెస్ కూడా మారలేదు"

“బీఆర్ఎస్‌ను తిట్టి తిట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూడా పాత చట్రం నుంచి బయటపడలేకపోయింది. సుంకిశాల ప్రమాదంపై కాంట్రాక్ట్ సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? మేఘాతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులది ‘ఫెవికాల్ బంధం’ అయిపోయింది” అన్నారు.

ఆమె నక్కలగండి, నెల్లికల్, కిష్టరాయినిపల్లె ప్రాజెక్టుల పూర్తి ఆలస్యం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

“నిర్వాసితుల బాధ వర్ణనాతీతం”

ప్రాజెక్టుల కింద భూములు ఇచ్చిన నిర్వాసితుల పరిస్థితి దయనీయంగా ఉందని కవిత గారు తెలిపారు.

“భూములు ఇచ్చిన 17 ఏళ్లైనా వారికి ఉద్యోగాలు ఇవ్వలేదు. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంతో తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ ఇప్పటికీ ఆ మూడు పూర్తిగా సాధించలేకపోయాం” అన్నారు.

కృష్ణానది నీటిని తెచ్చే పనిలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తే, నిర్వాసితులతో కలిసి సీఎం నివాసం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు.

ఆసుపత్రి పరిస్థితిపై ఆవేదన

నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన సందర్భంగా కవిత గారు అక్కడి దయనీయ పరిస్థితిని వివరించారు.

“ఒక్కో బెడ్‌పై ఇద్దరు పేషెంట్లు పడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎపిడ్యూరెల్ మందు లేక మహిళలు ఇంకా ఆటవిక కాలం మాదిరిగా ప్రసవ వేదన పడుతున్నారు” అని పేర్కొన్నారు.

ఆసుపత్రుల్లో సౌకర్యాల లోపంపై మహిళలకు క్షమాపణ చెబుతూ, హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా గారు తప్పక చర్యలు తీసుకోవాలి అని విజ్ఞప్తి చేశారు.

“మా పిల్లల అరెస్టులు ఎందుకు?”

జాగృతి కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించిన కవిత గారు —

“వెంకట్ రెడ్డి అన్నా, నాతో నీకు ఏ పంచాయితీ ఉందన్నా? మా పిల్లలను ఎందుకు అరెస్ట్ చేయించావు?” అంటూ ప్రశ్నించారు.
“ఇప్పుడు రాజకీయాలు చేయటానికి రాలేదు, కానీ చేస్తే గట్టి పోటీదారులను పెడతాం. జాగృతి కార్యకర్తలతో పెట్టుకోకండి — పెట్టుకున్నవాళ్లు బాగుపడలేదు” అని హెచ్చరించారు.

రైతులు, విద్య, ఇండస్ట్రీ సమస్యలపై డిమాండ్లు

కవిత గారు ధాన్యం కొనుగోలు కేంద్రాలు తగినంత లేవని, వెంటనే కేంద్రాల సంఖ్యను వెయ్యికి పెంచాలని డిమాండ్ చేశారు.
మిర్యాలగూడలో రైస్ మిల్లులు ఎక్కువగా ఉండటంతో వంద మెట్రిక్ టన్నుల గోడౌన్ ఏర్పాటు చేయాలని కోరారు.
దామర్లచర్ల యాదాద్రి పవర్ ప్లాంట్‌లో ఐదు యూనిట్లు నడవాల్సి ఉన్నా రెండు మాత్రమే పనిచేస్తున్నాయని తెలిపారు.

అలాగే మహిళలు, బీసీలు, మైనార్టీలు, డబ్బులేని యువతకు అవకాశాలు రావాలంటే సామాజిక తెలంగాణ రావాలి అని పిలుపునిచ్చారు.

“ఫ్రెంచ్ విప్లవ స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం”

“భూమి, భుక్తి, విముక్తి — ఇదే తెలంగాణ ఆత్మ. భౌగోళిక తెలంగాణ కాకుండా సామాజిక తెలంగాణ రావాలి. అందుకే మా పోరాటం కొనసాగుతుంది” అని కవిత గారు పేర్కొన్నారు.

జిల్లాలో విద్యార్థి ఎన్నికలు పునరుద్ధరించి, కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు.

ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరిక

“తప్పు బీఆర్ఎస్ చేసినా తప్పే, కాంగ్రెస్ చేసినా తప్పే. ప్రజల సమస్యలు పట్టించుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలు కొత్త ప్రత్యామ్నాయాన్ని గెలిపిస్తారు” అని కవిత గారు హెచ్చరించారు.

నల్గొండలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, ఆసుపత్రుల అభివృద్ధి, పత్తి రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

జాగృతి జనం బాట కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం తమ ప్రధాన లక్ష్యమని కల్వకుంట్ల కవిత తెలిపారు.