Hyderabad - Praja Mantalu

తెలంగాణ రైతు భరోసా నిధుల విడుదల
హైదరాబాద్, జూన్ 30 (ప్రజా మంటలు):

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద తొలి విడతగా 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,482.02 కోట్లు జమ చేసింది. హైదరాబాద్‌లో నిర్వహించిన రైతు భరోసా సదస్సులో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నిధులను విడుదల చేశారు.
ప్రభుత్వం వచ్చే తొమ్మిది రోజుల్లో మొత్తం రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,600 రైతు వేదికల ద్వారా రైతులు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గత 30 నెలల్లో వ్యవసాయ రంగానికి రూ.1.75 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. 25.35 లక్షల మంది రైతులకు రూ.20,677 కోట్ల పంట రుణాలను మాఫీ చేశామని, గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.7 వేల కోట్ల రైతు భరోసా బకాయిలను చెల్లించామని పేర్కొన్నారు.
రైతు భరోసా వార్షిక సాయాన్ని రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పెంచామని, ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో రూ.27 వేల కోట్లకుపైగా జమ చేశామని, తాజా విడతతో కలిపి రైతు భరోసా కింద మొత్తం రూ.36 వేల కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు.
అలాగే పంట బోనస్‌గా రూ.4 వేల కోట్లు, వ్యవసాయ పనిముట్ల కోసం రూ.2 వేల కోట్లు, పంట బీమాకు రూ.3,500 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. గత రెండున్నరేళ్లలో వరి కొనుగోళ్ల కోసం రూ.80 వేల కోట్లకు పైగా చెల్లించినట్లు తెలిపారు.
ఆర్థిక పరిస్థితులపై మాట్లాడుతూ, రాష్ట్రం అప్పుల భారం మధ్య ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిందని, ప్రస్తుతం ప్రతి నెల మొదటి తేదీకే ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రస్తుతం 2.88 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తితో దేశంలో మొదటి స్థానంలో నిలిచిందని తెలిపారు.
వాతావరణ మార్పులు, ఎల్ నినో ప్రభావంతో ఈసారి వర్షాభావ పరిస్థితులు ఉండే అవకాశం ఉందని, రైతులు పంట మార్పిడిపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

బేగంపేట ప్రజా భవన్ ఎదుట ఉద్రిక్తత – తెలంగాణ జాగృతి నేతలు, మహిళల అరెస్టు
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (ప్రజా మంటలు):

బేగంపేటలోని ప్రజా భవన్ ముందు తెలంగాణ జాగృతి నాయకులు, మహిళలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. మహిళలను అరెస్ట్ చేస్తున్న దృశ్యాలను చిత్రీకరిస్తున్న జాగృతి కార్యాలయ ఉద్యోగి లక్ష్మణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మహిళలకు నెలకు రూ.2,500 ఇవ్వాలన్న ఎన్నికల హామీని అమలు చేయాలని, అలాగే అంగన్‌వాడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రం ఇవ్వడానికి జాగృతి నాయకులు ప్రజా భవన్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకుని అరెస్టులు చేపట్టారు.

కాసేపట్లో కల్వకుంట్ల కవిత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ప్రజా భవన్‌కు చేరుకుని ఆందోళనలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల అమలుకు స్పష్టమైన గడువు ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు.

ఈ ఘటనతో ప్రజా భవన్ పరిసరాలు ఉద్రిక్తంగా మారాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

నాంపల్లి రోడ్‌లో ఫర్నిచర్ షాప్ భవనంలో అగ్నిప్రమాదం
హైదరాబాద్, జనవరి 24 (ప్రజా మంటలు):

హైదరాబాద్ నాంపల్లి రోడ్‌లోని ఓ బహుళ అంతస్తుల ఫర్నిచర్ షాప్ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా మొత్తం ఆరుగురు మంటల్లో చిక్కుకుని తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, ఫర్నిచర్ షాప్‌కు చెందిన సెల్లార్‌లో ముందుగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడ నిల్వ ఉంచిన ఫర్నిచర్ సామగ్రి, చెక్క వస్తువులు, పాలిష్ రసాయనాలు ఉండటంతో మంటలు వేగంగా చెలరేగాయి. క్షణాల్లోనే దట్టమైన పొగతో పాటు మంటలు పై అంతస్తులకు వ్యాపించాయి.

భవనం లోపల ఉన్నవారు బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పై అంతస్తుల్లో ఉన్న ఇద్దరు చిన్న పిల్లలు, నలుగురు పెద్దలు పొగతో ఊపిరి ఆడక చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.

అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చి, లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తెచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

కొందరు  పొగను ఎక్కువగా పీల్చిన కారణంగా కొందరికి శ్వాస సమస్యలు తలెత్తగా, వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అగ్నిప్రమాదానికి గల కారణాలపై విచారణ ప్రారంభించారు. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. భవనంలో సరైన అగ్నిమాపక భద్రతా చర్యలు ఉన్నాయా లేదా అనే కోణంలోనూ అధికారులు పరిశీలన చేస్తున్నారు.

ఈ ఘటనతో నాంపల్లి రోడ్ ప్రాంతంలో కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, వాణిజ్య భవనాల్లో భద్రతా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

25ఏండ్ల యువతికి పున:ర్జన్మ ప్రసాదించిన గాంధీ డాక్టర్లు
సికింద్రాబాద్, జనవరి 21 (ప్రజామంటలు) :

గాంధీఆస్పత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించి ఓ మహిళ రోగికి పునర్జన్మ ప్రసాదించారు. కార్డియోథోరాసిస్‌ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన సర్జరీ వివరాలను ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రొ. వాణితో కలిసి సీటీసర్జరీ హెచ్‌ఓడీ ప్రొ. రవీంద్ర బుధవారం మీడియాకు  వెల్లడించారు.

వివరాలు ఇవి...ఆసిఫాబాద్‌కు చెందిన పల్లవి (25) పలు అనారోగ్య సమస్యలతో అక్కడి  స్థానిక ఆస్పత్రిలో చేరింది.తర్వాత వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికు వెల్లగా హృద్రోగ సమస్యలు గుర్తించిన అక్కడి వైద్యులు గాంధీఆస్పత్రికి రిఫర్‌ చేశారు. పలు రుగ్మతలతోపాటు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు, గుండెదడతో బాధపడుతున్న పల్లవిని కార్డియోథోరాసిస్‌ సర్జరీ (సీటీ సర్జరీ) వైద్యులు పలురకాల వైద్యపరీక్షలు నిర్వహించారు. బార్టెల్‌బీల్‌ సిండ్రోమ్‌ (బీబీఎస్‌) బహుళ అవయవాలను ప్రభావితం చేసే జన్యుపరమైన రుగ్మత), పాలీడాక్డిలీ (పుట్టుకతోనే చేతులు, కాళ్లకు అదనపు వ్రేళ్లు ఉండడం) రెడ్‌కోస్‌డిస్ట్రోఫీ (కండరాల బలహీనత), రెటినిటోస్‌ పిగ్మెంటోసా (వంశపారంపర్యంగా వచ్చే కంటివ్యాధి, దృష్టిలోపం) ఊబకాయం, మేథోవైకల్యం, టైప్‌–1 డయాబెటిస్‌తోపాటు  హృద్రోగ రుగ్మతలతో బాధితురాలు బాధపడుతున్నట్లు గుర్తించారు.

ఓస్టియంప్రైమమ్‌ (పుట్టుకతోవచ్చే గుండెలోపం) ఆటిజమ్‌ స్పెక్ట్రమ్‌ డిజార్డర్‌ (ఏఎస్‌డీ) కర్ణిక సెప్టంలో 14.7 మిల్లీమీటర్ల రంధ్రాన్ని నిర్ధారించారు. ఇంజెక్షన్‌ ప్రెక్షన్‌ (ఈఎఫ్‌) 65 పర్సంట్‌గా అంచనా వేశారు. సీటీ సర్జరీ హెచ్‌ఓడీ ప్రొ. రవీంద్ర నేతృత్వంలో పెరికార్డియంతో అనూలోప్లాస్టీ, ఓస్టియం ప్రైమస్‌ ఏఎస్‌డీ క్లోజర్‌తో మిట్రల్‌వాల్వు ఎఎంఎల్‌ను రిపేర్‌ చేసి, సంక్లిష్టమైన సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. పలు రుగ్మతలతో బాధపడుతున్న రోగికి ఇటువంటి సర్జరీ చేయడం సవాల్‌తో కూడుకున్నదని గాంధీ సూపరింటెండెంట్‌ ప్రొ. వాణి అన్నారు. లక్షలాది రూపాయలు వ్యయం అయ్యే సర్జరీని గాంధీఆస్పత్రిలో ఉచితంగా నిర్వహించామన్నారు.

అరుదైన సర్జరీని విజయవంతంగా  నిర్వహించిన సీటీ సర్జరీ హెచ్‌ఓడీ రవీంద్ర, వైద్యులు రవిశ్రీనివాస్, ప్రశాంత్, రాజ్‌ కుమార్, అనస్టీషియా వైద్యులు మురళీ, కిరణ్, శ్రేయ, సుచరిత, సాయిప్రసన్నలను ఆమె అభినందించారు.  తనకు పునర్జన్మ ప్రసాదించిన గాంధీ వైద్యులు, సిబ్బందికి బాధితురాలు పల్లవి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్‌ఎంఓలు శేషాద్రి, కళ్యాణ్‌చక్రవర్తి, నవీస్, హసిత, నర్సింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

–ఫొటో:

గాంధీ ఆసుపత్రిలో హైరిస్క్ శస్త్రచికిత్స విజయవంతం
సికింద్రాబాద్,  జనవరి 12 ( ప్రజా మంటలు):

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో అత్యంత హైరిస్క్ శస్ర్త చికిత్సను చేసిన వైద్యులు రోగి ప్రాణాలను కాపాడారు. వివరాలు ఇవి..ఖమ్మం జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు (56) గత 20 రోజులుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ ఈనెల 6న అర్ధరాత్రి గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. రోగికి గుండె సంబంధిత సమస్యలు ఉండటంతో పాటు హృదయ ధమనిలో స్టెంట్ ఉండటంతో ఈ కేసును వైద్యులు అత్యంత హైరిస్క్ గా పరిగణించారు.

రోగి పరిస్థితిని అంచనా వేసిన వెంటనే ఎలాంటి ఆలస్యం లేకుండా అల్ట్రాసౌండ్, ఈసీజీ, 2డీ ఎకో సహా అన్ని అత్యవసర వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్డియాలజీ, అనస్థీషియా నిపుణులు సమగ్రంగా పరిశీలించిన అనంతరం, అధిక ప్రమాదం ఉన్నప్పటికీ శస్త్రచికిత్సకు అనుమతి ఇచ్చారు.శస్త్రచికిత్స సమయంలో రోగి పిత్తాశయం (గాల్ బ్లాడర్) అత్యంత పెద్దదిగా మారి, అనేక రాళ్లతో నిండిపోయినట్టు వైద్యులు గుర్తించారు.

అనంతరం వైద్య బృందం విజయవంతంగా చోలిసిస్టెక్టమీ శస్త్రచికిత్స నిర్వహించి పిత్తాశయాన్ని పూర్తిగా తొలగించారు. శస్త్రచికిత్స అనంతరం రోగిని ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచగా, ఎలాంటి అనూహ్య సమస్యలు తలెత్తకుండా క్రమంగా కోలుకున్నారు. పూర్తి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో సోమవారం రోగిని డిశ్చార్జ్ చేసినట్టు వైద్యులు తెలిపారు.ఈ హైరిస్క్ శస్త్రచికిత్సను సర్జన్ డా. సునీల్ కుమార్ నేతృత్వంలోని బృందం విజయవంతంగా నిర్వహించగా, అనస్థీషియా విభాగం డాక్టర్ కిరణ్ మాదల ఆధ్వర్యంలో వైద్య బృందం సర్జరీ లో పాల్గొన్నారు.

అత్యంత రిస్క్ సర్జరీ ని విజయవంతంగా చేసిన డాక్టర్ల బృందాన్ని సూపరింటెండెంట్ ప్రొఫెసర్ డా.వాణి అభినందించారు. ఇలాంటి క్లిష్టమైన సర్జరీలు, ట్రీట్మెంట్ లు గాంధీ ఆసుపత్రి ప్రతిష్టను మరింత ఇనుమడింప చేస్తాయని అన్నారు.

నగరానికి నిజాం కట్టడాల ప్రతిభా సాక్ష్యం
రామ కిష్టయ్య సంగన భట్ల

(సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్, కాలమిస్ట్, 9440595494)

“వరంగల్‌ చారిత్రక వైభవాన్ని ప్రతిబింబించే నూతన ఆవిష్కృత కాఫీ టేబుల్ బుక్ చరిత్ర పరిశోధకులకు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఎంతో ఉపయోగకర మవుతుందని,  చారిత్రక అంశాలపై ఒక పౌర సంబంధాల అధికారి ఇంత విలువైన కృషి చేయడం నిజంగా అభినందనీయమైన విషయం.”  అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో సమాచార, పౌర సంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్ కన్నెకంటి వెంకట రమణ రచించిన JEWELS OF ASAF JAHI’S – The Glory of Warangal అనే కాఫీ టేబుల్ బుక్‌ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు, రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి వేర్వేరు కార్యక్రమాల్లో ఆవిష్కరించారు. డా. బీ.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలోని సి.ఎస్ ఛాంబర్‌లో జరిగిన ఆవిష్కరణ కార్యక్రమానికి సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సి.హెచ్. ప్రియాంక కూడా హాజరయ్యారు. అనంతరం డీజీపీ కార్యాలయంలో ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సి.ఎస్ రామకృష్ణ రావు మాట్లాడుతూ, వరంగల్ చరిత్ర, నిజాం కాలపు వారసత్వం, అసఫ్‌జాహీ వంశపు నిర్మాణ వైభవం అన్నీ కలగలసిన ఈ పుస్తకం తెలంగాణ చరిత్రలో విలువైన మార్గదర్శక గ్రంథంగా నిలుస్తుందని అభినందించారు.

రచయిత కన్నెకంటి వెంకట రమణ మాట్లాడుతూ, “వరంగల్ అనగానే కాకతీయుల వైభవం, వేయి స్థంభాల ఆలయం, ఖిలా వరంగల్, భద్రకాళి ఆలయం వెంటనే మనకు గుర్తొస్తాయి. కానీ అదే నగరంలో కాజిపేట నుండి మామునూర్ వరకు నిజాం నవాబులు నిర్మించిన ఎన్నో అద్భుత భవనాలు, కళాత్మక కట్టడాలు, ఆధునికతకు మార్గదర్శకమైన నిర్మాణాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు” అని వివరించారు.

ఈ పుస్తకంలో వరంగల్ కేంద్రంగా ఏర్పడిన అసఫ్ జాహీ పాలనా విభాగమైన “వరంగల్ సుబా” చరిత్ర, అందులో భాగమైన ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం ప్రాంతాల పరిపాలన, అక్కడి సుబేదారుల వివరాలు, వారి ప్రత్యేకతలతో పాటు అరుదైన పత్రాధారాలు సమగ్రంగా పొందుపరిచారు. ఆ కాలపు పాలనా శైలి, నిర్మాణ శిల్పం, సామాజిక–సాంస్కృతిక పరిణామాలు, నిజాం యుగపు హెరిటేజ్ భవనాల ఫోటోలు ఈ గ్రంథాన్ని అరుదైన చరిత్ర పత్రంగా నిలిపాయి.

నిజాం కాలంలో నిర్మితమైన కాజిపేట రైల్వే స్టేషన్, ప్రస్తుత మిషన్ భగీరథ పథకానికి మూలమైన ధర్మసాగర్ ఫిల్టర్ బెడ్, పలు కోటలు, ప్రభుత్వ భవనాలు, మసీదులు, విద్యాసంస్థలు ఈ గ్రంథంలో విశదీకరించబడ్డాయి. ప్రతి చిత్రానికి వెనుక చరిత్రాత్మక నేపథ్యం, ఆ కాలపు శైలీ సౌందర్యం వివరించబడింది.

JEWELS OF ASAF JAHI’S – The Glory of Warangal పుస్తకం కేవలం చిత్రసంపుటం మాత్రమే కాదు — అది వరంగల్ నగర చరిత్రలో మానవ కృషి, కళ, సాంస్కృతిక పరిపుష్టి, నిర్మాణ వారసత్వం ప్రతిబింబించే విలువైన గ్రంథం. చరిత్రాభిమానులు, విద్యార్థులు, పరిశోధకులు, వారసత్వ సంరక్షణకారులు అందరికీ ఇది ప్రేరణగా నిలుస్తుందని సి.ఎస్‌, డీజీపీలు అభిప్రాయపడ్డారు.

చారిత్రక అవగాహనను విస్తరించి, నిజాం యుగపు నిర్మాణ సంపదను వెలికితీస్తూ, వరంగల్ నగర మహిమాన్విత చరిత్రను కొత్త దృక్కోణంలో పరిచయం చేసిన ఈ గ్రంథం తెలంగాణ సంస్కృతి, వారసత్వ గాధలో చిరస్మరణీయంగా నిలవనుంది.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక :: ముగిసిన పోలింగ్ :: ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపే
పోలింగ్ సరళి – ఓటింగ్ శాతం పై ప్రత్యేక విశ్లేషణ

హైదరాబాద్ నవంబర్ 11 (ప్రజా మంటలు ప్రత్యేక ప్రతినిధి):

ఉపఎన్నికల పోరు ముగిసింది. ఈసారి పోలింగ్ అధికారిక,తాత్కాలిక అంచనాల ప్రకారం 50% కు అటుఇటుగా ఉండవచ్చు. అనుకున్నదానికన్నా, తక్కువ ఓటింగ్ జరిగింది. ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి.

మొన్నటి వరకు బోర్స్ గెలుస్తుందని చెప్పిన పండితులు, రెండు రోజుల్లో ప్లేట్ ఫిరాయించారు. వారి సర్వేలన్నీ కాంగ్రెస్ వైపు ఉన్నాయి. దీనికి కారణం, కాంగ్రెస్ చివరి మూడు రోజులలో చేసిన "పాల్ మేనేజ్మెంట్" బీజేపీని మరిపించిందని చెప్పుకొంటున్నారు. కానీ ఫలితాలలో తేడా మాత్రం నానా మాత్రమే ఉండవచ్చని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ విజయం 5000 నుండి 8000 ఓట్ల మెజారిటీతో ఉండవచ్చని అనుకొంటున్నారు. షేక్ పేట,రహ్మత్ నగర్, యూసఫ్ గూడా ప్రాంతాలలోని ఓటర్ల వైఖరే, పార్టీల గెలుపు, ఓటముల నిర్ణయిస్తుంది.

గమ్మత్తేమిటంటే,అయిష్టంగానే అయినా, పరువు కొరకు పోటీలో దిగిన బీజేపీ పార్టీ, కనీసం డిపాజిట్ కాపాడుకుంటే చాలు అన్నట్లుగా పరిస్థితి ఉంది.

ఎన్నికలో ప్రజల వ్యవహార సరళిపై సింహావలోకనం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోలింగ్ శనివారం సాయంత్రంతో ప్రశాంతంగా ముగిసింది. మొత్తం నియోజకవర్గం వ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ ఎటువంటి ప్రధాన అంతరాయం లేకుండా సాగినప్పటికీ, పోలింగ్ సరళి లోపల దాగి ఉన్న రాజకీయ సందేశాలు మాత్రం స్పష్టంగా కనిపించాయి. ఈసారి ఓటర్ల స్పందన, ముఖ్యంగా మధ్యతరగతి, మైనార్టీ, దిగువ పేద తరగతి జనాభా నివసించే ప్రాంతాల్లో, రెండు ప్రధాన పార్టీల మధ్య పోటీ తీవ్రతను ప్రతిబింబించింది.

చదువుకున్న వారే ఓటువేయకపోవడం దురదృష్టం

నగర మధ్య ప్రాంతాల్లో ఉన్న అపార్ట్‌మెంట్లలో పోలింగ్ శాతం గత ఎన్నికలతో పోలిస్తే కొంత తగ్గినట్లు గమనించబడింది. ఇది పట్టణ ఓటర్ ధోరణిలో కనిపించే సామాన్య నిర్లక్ష్యం కారణంగా భావించవచ్చు.సాధారణంగా గుంపు సమావేశాలలో ప్రభుత్వాన్ని, అవినీతిని, సమాజాన్ని విమర్శించే వీరే ఓటు వేయకుండా, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారు.

మరోవైపు, ఉప ఎన్నికలు కావడం వల్ల ఓటర్లలో ఉత్సాహం ప్రధాన ఎన్నికలతో పోలిస్తే తక్కువగా ఉండటం సహజం.

అయితే, ప్రాథమికంగా గమనించాల్సిన విషయం—
అస్థిర ఓటింగ్ నమూనా ఉన్న ‘పోరస్’ ప్రాంతాల్లో, అంటే కి డి తరగతి వారు, వలసలు ఉన్న ప్రాంతం లో ఓటింగ్ శాతం బాగుంది.
ఇది రెండు కారణాలకు సంకేతం:
1️⃣ పార్టీలు ఆయా ప్రాంతాల్లో భారీగా ప్రచారం సాగించటం
2️⃣ స్థానిక అభ్యర్థుల ప్రభావం
ఈ ప్రాంతాల్లో మహిళా ఓటర్ల హాజరు కూడా స్పష్టంగా పెరిగినట్లు గుర్తించారు.

జూబ్లీహిల్స్‌లో ప్రధానంగా ఉన్నతవర్గం, మధ్యతరగతి, సేవారంగ ఉద్యోగులు,కొండితరగతి ఉపాధి ఉన్నవారు, మైనార్టీలు, కళాకార వర్గాల ఓటర్ల మిశ్రమ జనాభా ఉంటుంది. ఈ వర్గాలు సాధారణంగా సమస్యలపై విశ్లేషణాత్మక దృష్టితో ఓటు వేస్తాయి. సివిల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, శానిటేషన్, ట్రాఫిక్ నియంత్రణ, సివిల్ అమెనిటీస్ వంటి అంశాలు ఈసారి ఓటర్ల నిర్ణయాలలో కీలక పాత్ర పోషించాయి.

మరోవైపు, గ్రౌండ్‌లో కార్యకర్తల బలం ఉన్న పార్టీలు తమ క్యాడర్ ఓటును కట్టడి చేయడంలో ముందంజలో ఉన్నాయి. బూత్ నిర్వహణ, డోర్-టు-డోర్ ప్రచారం, స్థానిక క్యాడర్ యాక్టివిటీ—all కలిసి ఓటింగ్ శాతంపై ప్రభావం చూపాయి.

ఇక్కడ బి.ఆర్.ఎస్ కంటే కాంగ్రెస్ ముందుండి. పోలింగ్ రోజు మజ్లిస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ కి తొడవ్వడం వారికి లభించింది.

బిఆర్ఎస్ పార్టీలో స్థానిక కార్యకర్తల కొరత స్పష్టంగా కనిపించింది. వేరే ప్రాంత కార్యకర్తలను బిఆర్ఎస్ తెచ్చుకోగలిగిన, స్థానికత లేకపోవడం అనే లోపం బూత్ మేనేజ్ మెంట్ లో, బూత్ లను ముందు ఆకర్షించే వారి సంఖ్య తక్కువగా ఉండడమే దీనికి నిదర్శనం.

పోలింగ్ ముగిసిన తర్వాత బయట పడుతున్న మొదటి అంచనాలు చూస్తే, ఎన్నో ప్రాంతాల్లో యువ ఓటర్లు మరియు మహిళా ఓటర్ల ఆక్టివ్ పార్టిసిపేషన్ గమనించవచ్చు. ఇది ఉప ఎన్నికల్లో అరుదుగా కనిపించే ట్రెండ్.

అయితే, పోలింగ్ శాతం మొత్తం యథాతథంగా ఉన్నప్పటికీ, ఓటింగ్ సరళిలో వచ్చిన సూక్ష్మ మార్పులు రేపటి రిజల్ట్‌పై పెద్ద ప్రభావం చూపవచ్చు. ముఖ్యంగా పోరస్ ఏరియాల్లో కనిపించిన భారీ టర్నౌట్—గెలుపు-ఓటమి మేజిన్‌ను నిర్ణయించే కీలక అంశం అవుతుందనడంలో సందేహం లేదు.

మొత్తంగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రజాస్వామ్యంగా శాంతియుతంగా జరిగి, ఎన్నికలలో ఉన్న భావోద్వేగ రగడను ఓటర్లు సర్దుబాటు చేసి, సమతుల్యతతో స్పందించినట్లు ఈ పోల్ ట్రెండ్ స్పష్టం చేస్తున్నది..