Jagtial - Praja Mantalu

ఐజేయు కృషితో జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజులో 50 శాతం రాయితీ
టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు

జగిత్యాల జూలై 01(ప్రజా మంటలు):
టియుడబ్ల్యూజే  ఐజేయు  కృషితో జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజులో 50 శాతం రాయితీ లభించిందని టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా సమీపంలో గల టియుడబ్ల్యూజే ఐజేయు అనుబంధ ప్రెస్ క్లబ్ లో బుధవారం ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ జర్నలిస్టుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా కార్యవర్గంతో కలిసి సుమారు 550 మంది సభ్యుల్లో చిన్న పిల్లలు ఉన్నవారికి 50 శాతం ఫీజులో రాయితీ కోసం జిల్లా లోని అన్ని ప్రైవేటు విద్యా సంస్థలను సంప్రదించి జిల్లా కమిటీ ద్వారా జిల్లా కలెక్టర్ కు విన్నవించామన్నారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కలెక్టర్ జీవో లేకున్నా మానవతా దృక్పధం తో  ప్రైవేటు విద్యా సంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో 50 శాతం రాయితీ కల్పిస్తూ సర్క్యులర్ జారీ చేశారని

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు జిల్లా కార్యవర్గం పక్షాన ధన్యవాదాలు తెలిపారు. ప్రైవేటు విద్యా సంస్థలతో కూడా ఈ విషయాన్ని చర్చించి అర్హులైన ప్రతి జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో 50 శాతం రాయితీ అందేవిధంగా చూస్తామన్నారు. ఎవరికైనా ఈ విషయంలో ఇబ్బందులు ఎదురైతే జిల్లా కార్యవర్గం దృష్టికి తీసుకురావాలని సూచించారు. జర్నలిస్టుల
హక్కుల పరిరక్షనతో పాటు సమస్యల పరిష్కారానికి తమ కార్యవర్గం కృషి చేస్తుందని వివరించారు. అయితే కొందరు సభ్యులు ప్రస్తుత టియుడబ్ల్యూజే ఐజేయు కార్యవర్గం చేపట్టే జర్నలిస్టుల సంక్షేమాన్ని నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా జర్నలిస్టుల కుటుంబాలకు జిల్లా వైద్య శాఖ అధికారులతో చర్చించి అన్ని రకాల వైద్య సేవలు అందించే విధంగా వారితో మాట్లాడామని,  త్వరలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటుకు వారు సానుకూలంగా స్పందించారన్నారు.

యూనియన్ సభ్యులందరికీ గుర్తింపు కార్డులు జారీ చేస్తాం, ఇప్పటికే గుర్తింపు కార్డుల ప్రక్రియ 85 శాతం పూర్తయ్యిందని, మిగతా వారు కూడా వారి వివరాలు  జిల్లా బాద్యులకు అందజేసి సహకరించాలని కోరారు. జిల్లాలో జర్నలిస్టులు  హక్కుల పరిరక్షనే ధ్యేయంగా పని చేస్తున్నాం అని జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బెజ్జెంకి సంపూర్ణ చారి, ఉపాధ్యక్షులు గడ్డల హరికృష్ణ, హైదర్ అలీ, కోశాధికారి సిరిసిల్ల వేణు గోపాల్,  సహాయ కార్యదర్శి గుర్రం చంద్ర శేఖర్, కార్యవర్గ సభ్యులు సంబు రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

₹80 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్
జగిత్యాల, జూన్ 04 (ప్రజా మంటలు):

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మొయినుద్దీన్ ₹80 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ నేతృత్వంలో గురువారం ఈ దాడి నిర్వహించారు.

ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఒక వ్యక్తి అధికారిక పని నిమిత్తం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మొయినుద్దీన్‌ను సంప్రదించగా, పని చేయడానికి ₹80 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. లంచం ఇవ్వడానికి ఇష్టపడని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.

ఫిర్యాదు ఆధారంగా పక్కా ప్రణాళికతో వల పన్నిన ఏసీబీ అధికారులు, కార్యాలయంలో బాధితుడి నుంచి లంచం స్వీకరిస్తున్న సమయంలో మొయినుద్దీన్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి సంబంధిత రికార్డులు, పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

జగిత్య BRS సభ మరో ఉద్యమానికి, కాంగ్రెస్ పతనానికి నాంది - బి ఆర్ ఎస్ నాయకులు
జగిత్యాల, ఏప్రిల్ 21 (ప్రజా మంటలు):

జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, జెడ్పీ మాజీ ఛైర్‌పర్సన్ దావా వసంత, మార్క్‌ఫెడ్ లోక బాపురెడ్డి, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, శ్రీకాంత్ రెడ్డి తదితరులు కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ, జగిత్యాలలో జరిగిన కేసీఆర్ బహిరంగ సభ తెలంగాణ ఉద్యమాన్ని తలపించిందని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రెండు సార్లు తెలంగాణ దేశంలో ముందంజలో నిలిచిందని చెప్పారు.
రైతు సంక్షేమంపై మాట్లాడిన ఆయన, కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు వంటి పథకాలు అమలు చేయగా, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు పంటలకు రైతు భరోసా హామీని నిలబెట్టలేదని విమర్శించారు. పంటల బీమా, భూమిలేని వారికి ప్రోత్సాహకాలు వంటి హామీలు అమలు కాలేదని అన్నారు.
కళ్యాణ లక్ష్మి పథకంలో బంగారం హామీ అమలు కాలేదని, కేసీఆర్ కిట్ పేరును మార్చినా సరే పథకాన్ని కొనసాగించాలని సూచించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో రాష్ట్ర వాటా ఇవ్వకపోవడంతో కేంద్ర నిధులు వెనక్కి వెళ్లాయని ఆరోపించారు.
మేడిగడ్డ ప్రాజెక్ట్‌పై మాట్లాడుతూ, 30 నెలలుగా సమస్య పరిష్కారం కాలేదని, కేవలం రూ.400 కోట్లతో మరమ్మతులు సాధ్యమని నివేదికలు ఉన్నప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. కేసీఆర్‌ను దోషిగా చూపేందుకు ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు.
తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణంపై ఎన్నికల హామీ నెరవేర్చలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ద్వారా తెలంగాణకు విస్తృతంగా నీరు అందించే లక్ష్యంతో కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారని తెలిపారు.
రాష్ట్ర పాలనపై విమర్శలు చేస్తూ, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, రేవంత్ రెడ్డి పదవి నుంచి తప్పుకోవాలని వ్యాఖ్యానించారు. అయితే ఆయనకు వ్యక్తిగతంగా కీడు కోరడం లేదని చెప్పారు.
తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ, ఎన్నో సంవత్సరాలుగా పార్టీ మారకుండా ప్రజాస్వామ్య విలువలను కాపాడుతున్నానని చెప్పారు. పదవుల కోసం ఎప్పుడూ ప్రయత్నించలేదని, ఆత్మగౌరవం కోసం నిర్ణయాలు తీసుకున్నానని అన్నారు.
రాష్ట్రంలో కార్మికులు, రైతులు, బీసీలు, మైనార్టీలు అన్ని వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయని, ఆర్‌టీసీ, సింగరేణి కార్మికులు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు అభద్రతలో ఉన్నారని పేర్కొన్నారు.
చివరగా, తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ నాయకత్వం అవసరమని, మేడిగడ్డ పునర్నిర్మాణం ఆయనతోనే సాధ్యమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత పరిస్థితులపై కూడా విమర్శలు గుప్పించారు.

భార్యను కాపురానికి పంపలేదని అత్తను కరెంట్ షాక్‌తో హత్యాయత్నం నిందితుడు అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు
గొల్లపల్లి, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు):

భార్యను తిరిగి కాపురానికి పంపలేదనే కోపంతో అత్తను కరెంట్ షాక్‌తో చంపేందుకు ప్రయత్నించిన ఘటన వెంగటూరు మండలంలో చోటుచేసుకుంది.
వెల్గటూర్ మండలం జగదేవపేట గ్రామానికి చెందిన గాగిరెడ్డి మల్లారెడ్డి (48) తన భార్య పద్మతో గత కొన్నేళ్లుగా వివాదాలు కొనసాగుతున్నాయి. భర్త హింసను భరించలేక పద్మ తన పిల్లలతో కలిసి తన తల్లి గడ్డం రాజవ్వ వద్దకు వెళ్లింది.
ఈ నేపథ్యంలో అత్త రాజవ్వ తన భార్యను తన వద్దకు రానీయడం లేదని భావించిన మల్లారెడ్డి, ఆమెను హత్య చేయాలని పథకం రచించాడు. ఈ నెల 10వ తేదీ రాత్రి రాజవ్వ ఇంటి ముందు ఇనుప రాడ్లకు కరెంట్ వైర్లు అమర్చి, కరెంట్ పోల్‌కు కనెక్షన్ ఇచ్చాడు.
ఉదయం తలుపు తెరిచిన సమయంలో రాజవ్వకు స్వల్పంగా కరెంట్ షాక్ తగలడంతో అప్రమత్తమై పొరుగువారికి సమాచారం ఇచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై పి. ఉదయ్ కుమార్ తెలిపారు.

జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలోమరోసారి ఏసీబీ దాడులు
జగిత్యాల, ఏప్రిల్ 07 (ప్రజా మంటలు):

జగిత్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ (Anti-Corruption Bureau) అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. సుమారు 14 మంది అధికారులతో కూడిన బృందం కార్యాలయంలోని అన్ని విభాగాల్లో విస్తృత తనిఖీలు చేపట్టింది. ఇది రెండవసారి .

సోదాల సందర్భంగా కార్యాలయ సిబ్బంది మొబైల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగంపై వచ్చిన అవినీతి ఆరోపణలు దృష్ట్యా ఆ విభాగంపై ప్రత్యేకంగా పరిశీలన కొనసాగిస్తున్నారు.

గత కొంతకాలంగా మున్సిపల్ కార్యాలయంలో వివిధ సేవల విషయంలో అవినీతి జరుగుతోందన్న ఫిర్యాదులు అధికంగా రావడంతో ఏసీబీ ఈ దాడులు చేపట్టినట్లు సమాచారం.
పత్రాలు, లావాదేవీల వివరాలు, ఫైళ్లను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అవసరమైతే సంబంధిత అధికారులపై కేసులు నమోదు చేసే అవకాశముందని తెలుస్తోంది.
సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

ప్రజా ప్రతినిధుల శిక్షణ బుగ్గారంలోనే పెట్టాలి - చుక్క శ్రీలత
బుగ్గారం, ఏప్రిల్ 05(ప్రజా మంటలు):
బుగ్గారం మండల కేంద్రాన్ని పక్కనబెట్టి శేఖల్లలో వార్డ్ సభ్యులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలోని అన్ని గ్రామాల వార్డ్ సభ్యులు హాజరు కావాల్సిన ఈ శిక్షణను దూర ప్రాంతంలో ఏర్పాటు చేయడం వల్ల ఇబ్బందులు, అసౌకర్యాలు తలెత్తుతున్నాయని స్థానిక ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
“ఇది పూర్తిగా అన్యాయం. మండల కేంద్రం బుగ్గారం ఉన్నప్పటికీ శిక్షణను అక్కడ కాకుండా శేఖల్లలో నిర్వహించడం వల్ల సభ్యులకు ప్రయాణ భారం పెరుగుతోంది. అధికారులు, పాలక వర్గం ఈ విషయంపై పునరాలోచన చేయాలి,” అని బుగ్గారం గ్రామపంచాయతీ 11వ వార్డ్ సభ్యురాలు చుక్క లతశ్రీ పేర్కొన్నారు.
మండల కేంద్రంలోనే శిక్షణ నిర్వహిస్తే అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులకు సౌలభ్యం కలుగుతుందని, ప్రజాస్వామ్యానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని ఆమె కోరారు.

కవి, రచయిత నల్లాల లక్ష్మి రాజం అకాల మృతి
కరీంనగర్ జిల్లా నుండి ఎదిగిన ప్రముఖ రచయిత, దళిత సాహితీవేత్త నల్లాల లక్ష్మి రాజం అకాల మరణం పట్ల సాహితీ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమైంది. ప్రముఖ రచయిత బి.ఎస్. రాములు తన సంతాపాన్ని తెలియజేస్తూ, ఇది సాహిత్య రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు.
కథా రచయితగా, నాటకకర్తగా, పాటల కవిగా నల్లాల లక్ష్మి రాజం విశిష్ట స్థానం సంపాదించారు. ఆయన రచించిన “తిరుగు ప్రయాణం” కథల సంపుటి విశేష ఆదరణ పొందడంతో పాటు విశాల సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకుంది.
అలాగే “జీబీ రాజ్ జిందాబాద్” నాటక ప్రదర్శన ద్వారా మద్యపాన వ్యతిరేక చైతన్యాన్ని విస్తృతంగా వ్యాప్తి చేశారు. కుల వివక్ష, అంటరానితనం వంటి సామాజిక సమస్యలపై ఆయన నిరంతరం పోరాడారు.
“నీ బాకీ తప్పక తీరుస్తాను…” అంటూ సామాజిక వ్యంగ్యంతో కూడిన ఆయన పాట ప్రజల్లో విశేష ప్రాచుర్యం పొందింది.
జగిత్యాల సమీపంలోని తక్కల్లపల్లి గ్రామంలో జన్మించిన లక్ష్మి రాజం విప్లవ భావజాలానికి సానుభూతి కలిగి జీవించారు. జీవన పరిస్థితుల కారణంగా పోలీస్ శాఖలో చేరి, కరీంనగర్ జిల్లాలో పోలీస్ విభాగం తరఫున అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కవి సమ్మేళనాల్లో పాల్గొని ప్రజలు, అధికారుల ప్రశంసలు అందుకున్నారు. అనంతరం హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందారు.
అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, మార్చ్ 25, 2026న హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
1992 నుంచి తనకు పరిచయమై, కుటుంబ సభ్యుడిలా మారిన లక్ష్మి రాజం మరణం పట్ల బి.ఎస్. రాములు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
జగిత్యాల సాహితీ మిత్రులు కూడా ఆయన అకాల మరణంపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పనున్న జీవన్ రెడ్డి - 25న కీలక సమావేశం - రాజీనామా ప్రకటనకు సిద్ధం
జగిత్యాల, మార్చ్ 22 (ప్రజా మంటలు):

మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి  రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. ఈనెల 25న అభిమానులు, శ్రేయోభిలాషులతో సమావేశం నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలిపారు. అదే రోజు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్లు స్పష్టం చేశారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నాలుగు దశాబ్దాలుగా కొనసాగిన అనుబంధాన్ని తెంచుకోవడం తనకు బాధాకరమని అన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం సాధ్యం కాదని అభిప్రాయానికి వచ్చినట్లు చెప్పారు.
20 నెలలుగా జగిత్యాలలో జరుగుతున్న పరిణామాలు తనను తీవ్ర అసంతృప్తికి గురిచేశాయని, తన సమస్యలకు పరిష్కారం లభించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్‌లో ఫిరాయింపు నేతలు పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం పెరిగిందని, నిజమైన కార్యకర్తల హక్కులు కాలరాస్తున్నాయని విమర్శించారు.
శాసన మండలిలో ప్రజల సమస్యలపై ఒంటరి పోరాటం చేశానని, అధికారంలో ఉన్నప్పటికీ ప్రజల పక్షాన నిలబడ్డానని జీవన్ రెడ్డి గుర్తుచేశారు. గతంలో రైతుల ప్రోత్సాహకాలు, అదనపు విద్యుత్ బిల్లుల ఉపసంహరణ కోసం కూడా ఉద్యమాలు చేసినట్లు తెలిపారు.
రాజకీయాల్లో గౌరవం ముఖ్యమని, అది లేకపోతే పార్టీలో కొనసాగడం వలన ప్రయోజనం లేదని అన్నారు. సొంత పార్టీలోనే పోరాటం చేయాల్సి రావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రాణహిత నది నీటి వినియోగంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, తుమ్మడిహెట్టి బ్యారేజ్ నిర్మాణం ఆలస్యం ఉత్తర తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. మేడిగడ్డ పునరుద్ధరణపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తనకు జరిగిన అన్యాయంపై రాష్ట్ర నాయకత్వం స్పందించలేదని, శ్రీధర్ బాబుతో చర్చించినా పరిష్కారం దొరకలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్య హక్కుల మేరకు నిర్ణయం తీసుకుంటున్నానని స్పష్టం చేశారు.
జగిత్యాల ప్రజలతో తన అనుబంధం ఎప్పటికీ కొనసాగుతుందని, చివరి శ్వాస వరకు ప్రజల మధ్యనే ఉంటానని జీవన్ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్‌లో కొనసాగడంపై ఆలోచిస్తా – మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
జగిత్యాల రూరల్,  మార్చ్ 10 (ప్రజా మంటలు):

కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా లేదా అన్న విషయంపై తాను ఆలోచిస్తున్నానని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికల రోజే కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం గురించి తాను ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అప్పుడే స్పష్టంగా చెప్పానని గుర్తు చేశారు. ఆ సందర్భంలో చెప్పిన మాటలు ఇప్పటికీ మారలేదని, అయితే ఇప్పటివరకు తాను ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు.
పార్టీలోని పరిస్థితులు, జరిగిన పరిణామాలు తనను తీవ్రంగా ఆలోచింపజేశాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా పని చేసిన తనలాంటి నాయకులను పక్కన పెట్టే పరిస్థితులు రావడం బాధాకరమని వ్యాఖ్యానించారు.
ఇప్పటికీ తాను తొందరపడి నిర్ణయం తీసుకునే పరిస్థితిలో లేనని, కాంగ్రెస్ పార్టీలో ఉన్న తన మిత్రులు, కార్యకర్తలు, అనుచరులతో చర్చించిన తర్వాతే తగిన నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు తన నిర్ణయాన్ని స్పష్టంగా ప్రకటిస్తానని చెప్పారు.
పార్టీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో జీవన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన తదుపరి నిర్ణయం ఏంటన్నది జిల్లాలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఆసక్తికరంగా మారింది.

రేచపల్లి లో బావిలో బాలుడి మృతదేహం
జగిత్యాల రూరల్, మార్చ్ 08 (ప్రజా మంటలు):

రేచపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిన్నోజి రమేశ్ – జ్యోస్న దంపతుల కుమారుడు పవన్ తేజ (10) సమీపంలోని బావిలో మృతదేహంగా కనిపించాడు.
పవన్ తేజ ఈ నెల 3వ తేదీన హోలీ ఆడుకోవడానికి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. గ్రామం పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా వెతికినా అతని ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు.

ఇదిలా ఉండగా ఆదివారం గ్రామ సమీపంలోని బావిలో బాలుడి మృతదేహం తేలియాడుతూ కనిపించడంతో స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సారంగాపూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు.
ఐదు రోజులుగా కనిపించకుండా పోయిన బాలుడి మృతదేహం లభించడంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

బడిపిల్లల కథలకు ఆహ్వానం జిల్లా విద్యాశాఖాధికారి కె. రాము
జగిత్యాల ఫిబ్రవరి 27 (ప్రజా మంటలు):

జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు కథా రచనలను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె. రాము ఒక ప్రకటనలో తెలిపారు.
శుక్రవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ (టీఎన్‌జీవో) స్కూల్ ఎడ్యుకేషన్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షులు కె. సుగుణాకర్కు, రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ జగిత్యాల జిల్లా శాఖ తరఫున జిల్లా అధ్యక్షులు వేల్పుల స్వామి యాదవ్ భగవద్గీతను డీఈవో చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా సుగుణాకర్ చేస్తున్న సేవలు, జాతీయ భావనను కొనియాడుతూ డీఈవోతో పాటు ఆర్యుపిపి జిల్లా శాఖ అధ్యక్షులు అభినందనలు తెలిపారు.
డీఈవో మాట్లాడుతూ—జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులు తమకు నచ్చిన ఏదైనా ఒక అంశంపై ఒక పేజీకి మించకుండా తెలుగు, హిందీ లేదా ఇంగ్లీష్ భాషల్లో కథలు రాసి పంపాలని సూచించారు. కథల్లో నైతిక విలువలు, మానవతా భావాలు, నీతి–నిజాయితీ వంటి అంశాలు ప్రతిఫలించాలని తెలిపారు. పాఠశాల స్థాయిలోనే కథా రచన అలవాటు పెంపొందితే భవిష్యత్తులో మంచి రచయితలుగా ఎదగగలరని పేర్కొన్నారు.
జిల్లాలోని ప్రతి పాఠశాల నుంచి కనీసం ఐదు కథలు తప్పనిసరిగా పంపాలని, అందిన కథలను పరిశీలించి ఉత్తమ కథలను ఎంపిక చేసి మార్చి మొదటి వారంలో పుస్తకరూపంలో వెలువరించనున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం బాలసాహిత్య సృజనకు ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు.
కథలను మార్చి 15వ తేదీలోపు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి పంపాలని సూచించారు. వివరాలకు 8985348424 నంబర్‌కు లేదా ఎఎమ్ఓ ఎం. చంద్రశేఖర్ రెడ్డిని సంప్రదించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్యుపిపి జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి ఎనగందుల రాజేంద్రప్రసాద్, గౌరవ అధ్యక్షులు అలకట్టు సత్యనారాయణ, వేల్పుల రఘు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీలో కొనసాగడంపై ఆలోచిస్తున్నా… భవిష్యత్ ఏంటో గోచరించట్లేదు : మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు)

కాంగ్రెస్ పార్టీలో తన భవిష్యత్‌పై ఆలోచిస్తున్నానని మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ —
“భవిష్యత్ ఏంటో నాకు గోచరించట్లేదు. అవమానాలు ఇంకెంత కాలం భరించాలి?” అని ఆవేదన వ్యక్తం చేశారు.

🔹 ఎన్నికలే ముగింపు కాదు
“ఈ ఎన్నికలతో కథ ముగిసినట్టేం కాదు. జగిత్యాలలో ఎమ్మెల్యేగా సంజయ్ కుమార్ ఉన్నంతకాలం నాకు వేధింపులు తప్పవు” అని వ్యాఖ్యానించారు.

పార్టీ మారలేదా… రాజకీయాలు మారలేదా?
“స్పీకర్ మాత్రం ఎమ్మెల్యే పార్టీ మారలేదని అంటున్నారు. తెలుగుదేశంతో అంట కాగిన సంజయ్, బి ఆర్ ఎస్ లో చేరి, గెలిచారు. కానీ ఎమ్మెల్యేగా, రాజకీయ సంసారం మాత్రం కాంగ్రెస్ పార్టీతోనే కొనసాగుతోంది” అని ఎద్దేవా చేశారు.

🔹 పవర్ ఆఫ్ అటార్నీ ఎవరికిచ్చారు?
“జగిత్యాల కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు పట్టా రాసిచ్చారా? పవర్ ఆఫ్ అటార్నీ ఎమ్మెల్యే సంజయ్‌కు ఇచ్చినట్టుగా వ్యవహారం సాగుతోంది” అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

🔹 అధినాయకత్వానికి విజ్ఞప్తి
“కాంగ్రెస్ అధినాయకత్వం తప్పకుండా పార్టీ కార్యకర్తల మనోభావాలను గౌరవించాలి. జగిత్యాలలో పరిస్థితి ఇలానే ఉంటే, పార్టీ మారిన మరో 9 ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో ఆలోచించాలి” అని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ వ్యాఖ్యలు జగిత్యాల కాంగ్రెస్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. మాజీ మంత్రి అసంతృప్తి పార్టీ అధిష్టానం వరకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.