Revanth Reddy - Praja Mantalu

హిందూ–ముస్లింలు నాకు రెండు కళ్లలాంటి వారు: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 13:

హిందూ–ముస్లింల మధ్య తనకు ఎలాంటి వ్యత్యాసం లేదని, ఇరువర్గాలు తనకు రెండు కళ్లలాంటి వారని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమితులైన యువత తెలంగాణ రైజింగ్ కోసం పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కొమురం భీమ్ ఆదివాసీ భవన్‌లో నిర్వహించిన తెలంగాణ మైనారిటీల ప్రతిభా సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3, గ్రూప్–4 తదితర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఎంపికైన వారితో పాటు నీట్, ఐఐటీ, ఎన్‌ఐటీ వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన 782 మంది మైనారిటీ అభ్యర్థులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.

విద్యతో పాటు నైపుణ్యాలు అవసరం

చదువు ఒక్కటే భవిష్యత్తును మార్చగల శక్తి అని రేవంత్ రెడ్డి అన్నారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యపై దృష్టి పెట్టడంతో పాటు, ఆ తర్వాత నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. నైపుణ్యాలు ఉన్న యువతకు దేశంలోనే కాకుండా జర్మనీ, జపాన్ వంటి దేశాల్లోనూ అనేక ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

యువతను నైపుణ్యాల దిశగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నామని, పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొచ్చామని ముఖ్యమంత్రి చెప్పారు. చిన్న కుటుంబాల నుంచి వచ్చి కష్టపడి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

4 శాతం రిజర్వేషన్లపై సీఎం వ్యాఖ్యలు

మైనారిటీలకు కల్పించిన 4 శాతం రిజర్వేషన్లను తొలగించేందుకు ప్రయత్నాలు జరిగినప్పటికీ అవి విజయవంతం కాలేదని రేవంత్ రెడ్డి అన్నారు. మైనారిటీల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం ద్వారా మైనారిటీ వర్గాలకు కూడా గణనీయమైన ప్రయోజనం లభిస్తోందని పేర్కొన్నారు.

గత ప్రభుత్వంపై విమర్శలు

గత ప్రభుత్వ హయాంలో గ్రూప్–1తో పాటు ఇతర ఉద్యోగ నియామకాలు సక్రమంగా జరగలేదని ముఖ్యమంత్రి విమర్శించారు. గ్రూప్–1 పరీక్షా పత్రాలు మార్కెట్‌లో విక్రయించబడ్డాయని ఆరోపించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో అర్హత, నైపుణ్యం కలిగిన వ్యక్తులను సభ్యులుగా నియమించాల్సిన అవసరం ఉందని అన్నారు.

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌తో పాటు నిపుణులతో సంప్రదింపులు జరిపి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేశామని రేవంత్ రెడ్డి తెలిపారు. నియామక ప్రక్రియను అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు జరిగినప్పటికీ, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు న్యాయపోరాటం చేసి నియామకాలను పూర్తి చేశామని చెప్పారు.

కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, టీజీఎంఆర్‌ఈఐఎస్ అధ్యక్షుడు మహమ్మద్ ఫహీముద్దీన్ ఖురేషీతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

జగిత్యాలలో RTC సమ్మెకు జీవన్ రెడ్డి మద్దతు | ప్రభుత్వం నిర్లక్ష్యంపై విమర్శలు
జగిత్యాల, ఏప్రిల్ 24 (ప్రజా మంటలు):

పట్టణంలోని RTC డిపో ముందు జరుగుతున్న RTC కార్మికుల సమ్మెకు మాజీ మంత్రి, BRS పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, RTC కార్మికులు సమ్మెకు దిగడం దురదృష్టకరమని, ఈ పరిస్థితి పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఫలితమని విమర్శించారు.
గతంలో RTCను ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రతిపాదన శాసనసభ, శాసనమండలిలో ఏకగ్రీవంగా ఆమోదించబడిందని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో RTC కార్మికులు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. అలాంటి సంస్థ సమస్యలపై ప్రస్తుత ప్రభుత్వం జాప్యం చేయడం సమంజసం కాదని అన్నారు.
RTC ఒక ప్రభుత్వ రంగ సంస్థగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, మహాలక్ష్మి పథకం అమలుతో ఆక్యుపెన్సీ పెరిగినప్పటికీ, బస్సుల సంఖ్య పెంచకుండా డిపోలను తగ్గించడం తప్పుదారి పట్టించే నిర్ణయమని విమర్శించారు.
RTC కార్మికుడు శంకర్ గౌడ్ మరణం ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని పేర్కొంటూ, ఈ ఘటనతో అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలని కోరారు. కార్మికులు రోడ్డెక్కే పరిస్థితి రావడానికి ప్రభుత్వం పరోక్షంగా కారణమని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తుల అమ్మకాలే ప్రభుత్వ ఆదాయంగా మారాయని, RTC ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం పయనిస్తోందని విమర్శించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ సమస్యలో బాధ్యత వహించాలని పేర్కొన్నారు. వేతన భత్యాల సవరణ కార్మికుల రాజ్యాంగ హక్కు అని అన్నారు. ఎలక్ట్రిక్ బస్సులను RTCకు కేటాయిస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని సూచించారు.
కార్మికుల ఆత్మహుతులు సమస్యలకు పరిష్కారం కాదని, ఓపికతో పోరాటం కొనసాగించాలని సూచించారు. శంకర్ గౌడ్ మరణం గతంలో శ్రీకాంత చారి బలిదానాన్ని తలపిస్తోందని భావోద్వేగంగా చెప్పారు.
శంకర్ గౌడ్ కుటుంబానికి రూ.1 కోటి పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన మళ్లీ జరగకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. RTC కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, యూనియన్ల పునరుద్ధరణ అవసరమని చెప్పారు.
చివరిగా, శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

జగిత్య BRS సభ మరో ఉద్యమానికి, కాంగ్రెస్ పతనానికి నాంది - బి ఆర్ ఎస్ నాయకులు
జగిత్యాల, ఏప్రిల్ 21 (ప్రజా మంటలు):

జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, జెడ్పీ మాజీ ఛైర్‌పర్సన్ దావా వసంత, మార్క్‌ఫెడ్ లోక బాపురెడ్డి, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, శ్రీకాంత్ రెడ్డి తదితరులు కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ, జగిత్యాలలో జరిగిన కేసీఆర్ బహిరంగ సభ తెలంగాణ ఉద్యమాన్ని తలపించిందని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రెండు సార్లు తెలంగాణ దేశంలో ముందంజలో నిలిచిందని చెప్పారు.
రైతు సంక్షేమంపై మాట్లాడిన ఆయన, కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు వంటి పథకాలు అమలు చేయగా, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు పంటలకు రైతు భరోసా హామీని నిలబెట్టలేదని విమర్శించారు. పంటల బీమా, భూమిలేని వారికి ప్రోత్సాహకాలు వంటి హామీలు అమలు కాలేదని అన్నారు.
కళ్యాణ లక్ష్మి పథకంలో బంగారం హామీ అమలు కాలేదని, కేసీఆర్ కిట్ పేరును మార్చినా సరే పథకాన్ని కొనసాగించాలని సూచించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో రాష్ట్ర వాటా ఇవ్వకపోవడంతో కేంద్ర నిధులు వెనక్కి వెళ్లాయని ఆరోపించారు.
మేడిగడ్డ ప్రాజెక్ట్‌పై మాట్లాడుతూ, 30 నెలలుగా సమస్య పరిష్కారం కాలేదని, కేవలం రూ.400 కోట్లతో మరమ్మతులు సాధ్యమని నివేదికలు ఉన్నప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. కేసీఆర్‌ను దోషిగా చూపేందుకు ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు.
తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణంపై ఎన్నికల హామీ నెరవేర్చలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ద్వారా తెలంగాణకు విస్తృతంగా నీరు అందించే లక్ష్యంతో కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారని తెలిపారు.
రాష్ట్ర పాలనపై విమర్శలు చేస్తూ, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, రేవంత్ రెడ్డి పదవి నుంచి తప్పుకోవాలని వ్యాఖ్యానించారు. అయితే ఆయనకు వ్యక్తిగతంగా కీడు కోరడం లేదని చెప్పారు.
తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ, ఎన్నో సంవత్సరాలుగా పార్టీ మారకుండా ప్రజాస్వామ్య విలువలను కాపాడుతున్నానని చెప్పారు. పదవుల కోసం ఎప్పుడూ ప్రయత్నించలేదని, ఆత్మగౌరవం కోసం నిర్ణయాలు తీసుకున్నానని అన్నారు.
రాష్ట్రంలో కార్మికులు, రైతులు, బీసీలు, మైనార్టీలు అన్ని వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయని, ఆర్‌టీసీ, సింగరేణి కార్మికులు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు అభద్రతలో ఉన్నారని పేర్కొన్నారు.
చివరగా, తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ నాయకత్వం అవసరమని, మేడిగడ్డ పునర్నిర్మాణం ఆయనతోనే సాధ్యమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత పరిస్థితులపై కూడా విమర్శలు గుప్పించారు.

జీహెచ్ఎంసీలో అవినీతికి సీఎం బాధ్యులు: కవిత
హైదరాబాద్, ఏప్రిల్ 10 (ప్రజా మంటలు):

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలో భారీ అవినీతి జరుగుతోందని ఆరోపించారు. టెండర్లకు బదులుగా నామినేషన్ పద్ధతిలో కోట్ల విలువైన కాంట్రాక్టులు సీఎం అనుచరులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.1,148 కోట్ల పనులు ఇదే విధంగా ఇచ్చారని తెలిపారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారులపై ఒత్తిడి తీసుకుని కమీషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ, ఈ వ్యవహారం ఆపకపోతే ఈడీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ మరమ్మత్తులు కూడా కమీషన్ల కోసమే చేస్తున్నారని విమర్శించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లులో 2011 జనాభా లెక్కలు ఆధారంగా తీసుకోవడం అన్యాయమని, 2027 జనగణన తర్వాతే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ నెల 25న జరగనున్న పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాట్ల కోసం 21 కమిటీలు ఏర్పాటు చేసినట్లు కవిత తెలిపారు.

కాంగ్రెస్ పార్టీలో కొనసాగడంపై ఆలోచిస్తున్నా… భవిష్యత్ ఏంటో గోచరించట్లేదు : మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల ఫిబ్రవరి 16 (ప్రజా మంటలు)

కాంగ్రెస్ పార్టీలో తన భవిష్యత్‌పై ఆలోచిస్తున్నానని మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ —
“భవిష్యత్ ఏంటో నాకు గోచరించట్లేదు. అవమానాలు ఇంకెంత కాలం భరించాలి?” అని ఆవేదన వ్యక్తం చేశారు.

🔹 ఎన్నికలే ముగింపు కాదు
“ఈ ఎన్నికలతో కథ ముగిసినట్టేం కాదు. జగిత్యాలలో ఎమ్మెల్యేగా సంజయ్ కుమార్ ఉన్నంతకాలం నాకు వేధింపులు తప్పవు” అని వ్యాఖ్యానించారు.

పార్టీ మారలేదా… రాజకీయాలు మారలేదా?
“స్పీకర్ మాత్రం ఎమ్మెల్యే పార్టీ మారలేదని అంటున్నారు. తెలుగుదేశంతో అంట కాగిన సంజయ్, బి ఆర్ ఎస్ లో చేరి, గెలిచారు. కానీ ఎమ్మెల్యేగా, రాజకీయ సంసారం మాత్రం కాంగ్రెస్ పార్టీతోనే కొనసాగుతోంది” అని ఎద్దేవా చేశారు.

🔹 పవర్ ఆఫ్ అటార్నీ ఎవరికిచ్చారు?
“జగిత్యాల కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు పట్టా రాసిచ్చారా? పవర్ ఆఫ్ అటార్నీ ఎమ్మెల్యే సంజయ్‌కు ఇచ్చినట్టుగా వ్యవహారం సాగుతోంది” అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

🔹 అధినాయకత్వానికి విజ్ఞప్తి
“కాంగ్రెస్ అధినాయకత్వం తప్పకుండా పార్టీ కార్యకర్తల మనోభావాలను గౌరవించాలి. జగిత్యాలలో పరిస్థితి ఇలానే ఉంటే, పార్టీ మారిన మరో 9 ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో ఆలోచించాలి” అని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ వ్యాఖ్యలు జగిత్యాల కాంగ్రెస్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. మాజీ మంత్రి అసంతృప్తి పార్టీ అధిష్టానం వరకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.

ఉద్యమకారుల కోసం మరో ఉద్యమం చేస్తాం –కల్వకుంట్ల కవిత
న్యాయం కోసం మరో ఉద్యమం – త్వరలో కొత్త రాజకీయ పార్టీ ప్రకటిస్తాం: కల్వకుంట్ల కవిత

బాగ్ లింగంపల్లి, ఫిబ్రవరి 12 (ప్రజా మంటలు):

బాగ్ లింగంపల్లి ఆర్‌టీసీ కళ్యాణ మండపంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యమకారుల ఆత్మగౌరవ సభలో ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి నివాళులర్పించారు. అమరవీరుల స్మరణార్థం రెండు నిమిషాల మౌనం పాటించారు. తొలి విడత ఉద్యమకారుడు పెద్ది శ్రీరాములు గారిని సత్కరించారు.

ఈ సభకు పదికి పైగా ఉద్యమ సంఘాలు, పెద్ద సంఖ్యలో ఉద్యమ నాయకులు హాజరయ్యారు.

“ఉద్యమకారులకు న్యాయం జరగలేదు”

కవిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు తీరని అన్యాయం జరిగిందని అన్నారు.
“మీరు బయట ఉండి బాధపడితే, నేను బీఆర్ఎస్ లో ఉండి బాధపడ్డాను” అని వ్యాఖ్యానించారు.

కేసీఆర్ గారిని విమర్శించాలనే ఉద్దేశం లేదని చెప్పినా, పదేళ్లు అవకాశం వచ్చిన తర్వాత కూడా ఉద్యమకారులకు పూర్తి న్యాయం ఎందుకు జరగలేదని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి పై విమర్శలు

ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు.
“ఉద్యమ సోయి లేని వ్యక్తి సీఎం కావటం మన దౌర్భాగ్యం” అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలే చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. బడ్జెట్ సమావేశాల్లో ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ, సంక్షేమ బోర్డు ఏర్పాటు అంశాలను చేర్చాలని డిమాండ్ చేశారు.

“త్వరలో కొత్త రాజకీయ పార్టీ”

ఉద్యమకారుల అజెండాతోనే ముందుకు సాగే కొత్త రాజకీయ పార్టీని త్వరలో ప్రకటిస్తామని కవిత వెల్లడించారు.
“మాది ఫక్తు రాజకీయ పార్టీ కాదు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీ” అని స్పష్టం చేశారు.

ఉద్యమకారుల పిల్లలకు అవకాశాలు, ప్రైవేట్ ఉద్యోగాల్లో తెలంగాణ బిడ్డలకు 20 శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తామని తెలిపారు.

చారిత్రక ప్రస్తావనలు

సభలో తెలంగాణ చరిత్రను ప్రస్తావించిన కవిత,

రామ్ జీ, కొమురం భీమ్ పోరాటాలు

దొడ్డి కొమురయ్య త్యాగం

1969 తెలంగాణ ఉద్యమం

వరంగల్ డిక్లరేషన్

2001లో కేసీఆర్ ప్రారంభించిన ఉద్యమం

వంటి సంఘటనలను గుర్తు చేశారు.

ఉద్యమంలో పోరాడిన వారికి గౌరవం, అధికారిక గుర్తింపు ఇంకా లభించలేదని అన్నారు.

యాప్ ద్వారా ఉద్యమకారుల గుర్తింపు

ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రత్యేక యాప్ సిద్ధం చేసినట్లు తెలిపారు. యాప్‌లో నమోదు చేసుకున్న ప్రతి ఉద్యమకారుడి కుటుంబానికి తెలంగాణ జాగృతి తరఫున హెల్త్ ఇన్సూరెన్స్ అందిస్తామని చెప్పారు.

“తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారుల వైపే ధర్మం ఉంది. వారి కోసం మరో ఉద్యమం చేయాల్సిందే” అంటూ కవిత సభను ముగించారు.

ఈ సభతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. త్వరలో ప్రకటించబోయే కొత్త రాజకీయ పార్టీపై ఆసక్తి నెలకొంది. సభలో  ఉద్యమ నాయకులు మురళీధర్ దేశ పాండే, కాచం సత్యనారాయణ, sajida సికిందర్ బేగం లతో పాటు జాగృతి కార్యదర్శి నవీనా చారి, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.

టీ-హబ్‌ స్టార్టప్‌ల కేంద్రంగానే కొనసాగాలి: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, జనవరి 24 (ప్రజా మంటలు):

టీ-హబ్‌ను పూర్తిగా స్టార్టప్‌ల కేంద్రంగా మాత్రమే కొనసాగించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను టీ-హబ్‌కు మార్చనున్నారన్న వార్తలపై సీఎం వెంటనే స్పందించారు.

అమెరికా పర్యటనలో ఉన్న సీఎం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో ఫోన్‌లో మాట్లాడి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అద్దె భవనాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ కార్యాలయాలను ఇతర అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాలకు మార్చాలని సూచించారు.

టీ-హబ్‌ను ఇంక్యుబేటర్‌, ఇన్నోవేషన్ క్యాటలిస్ట్‌గా స్టార్టప్‌ల కోసం ఏర్పాటు చేసిన కేంద్రంగా గుర్తించాలని, అక్కడ ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు ఎలాంటి అవకాశం లేదని సీఎం స్పష్టం చేశారు. టీ-హబ్ స్వరూపాన్ని మార్చే ఆలోచనలుంటే వెంటనే విరమించుకోవాలని అధికారులకు ఆదేశించారు.

గత ప్రభుత్వం పాలమూరును పట్టించుకోలేదు – డీకే అరుణ
జడ్చర్ల, జనవరి 17 (ప్రజా మంటలు):

గత ప్రభుత్వం పాలమూరు అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రజలను మోసం చేసిందని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు.

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లిలో రూ.200 కోట్లతో నిర్మించనున్న రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (IIIT) భూమిపూజ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.

ఎన్నికల సమయంలో వేదికపై ఉన్నవారంతా తన ఓటమికి గట్టిగా పనిచేశారని, అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేస్తామని అన్నారు. పాలమూరు అభివృద్ధికి కేంద్రం తరపున పూర్తి సహకారం అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులను సమన్వయంతో ఉపయోగించుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను మంజూరు చేయాలని కోరారు. పాలమూరు అభివృద్ధి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని డీకే అరుణ స్పష్టం చేశారు.

లక్ష్యం ఉన్నతంగా ఉండాలి – చదువే జీవితాన్ని మార్చుతుంది – సీఎం రేవంత్ రెడ్డి
జడ్చర్ల, జనవరి 17 (ప్రజా మంటలు):

లక్ష్యం ఉన్నతంగా పెట్టుకుని కష్టపడితేనే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోగలమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విద్యార్థినీ విద్యార్థులకు సూచించారు. చదువుతోనే సమాజంలో గౌరవం లభిస్తుందని తెలిపారు.

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లిలో రూ.200 కోట్లతో నిర్మించనున్న రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (IIIT) భూమిపూజ కార్యక్రమంలో సీఎం పాల్గొని, అనంతరం విద్యార్థులతో ముఖాముఖి సంభాషించారు.

విద్యారంగ అభివృద్ధినే ప్రభుత్వ టాప్ ప్రాధాన్యంగా తీసుకున్నామని, ప్రతి నియోజకవర్గంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు, మహబూబ్‌నగర్ జిల్లాలో ఐఐఐటీతో పాటు ఇంజినీరింగ్, లా, మెడికల్ కళాశాలల స్థాపన జరుగుతుందని తెలిపారు. యూపీఎస్సీ అభ్యర్థులకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వం ఇవ్వగలిగే గొప్ప సంపద విద్యేనని, విద్య ఒక్కటే జీవితాన్ని మార్చగలదని సీఎం అన్నారు. ఏడాది కాలంలో ఐఐఐటీ భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎంపీలు మల్లు రవి, డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కిట్ నాణ్యతపై రాజీ వద్దు : సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, జనవరి 13 (ప్రజా మంటలు):

ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు అందించనున్న 22 వస్తువులతో కూడిన కిట్ విషయంలో నాణ్యతపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులకు స్పష్టం చేశారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే నాటికి ప్రతి విద్యార్థికి కిట్ అందేలా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

విద్యార్థులకు యూనిఫామ్‌తో పాటు బెల్ట్, టై, షూస్, స్కూల్ బ్యాగ్, నోట్ బుక్స్ సహా మొత్తం 21 ఇతర వస్తువులతో కూడిన కిట్‌ను అందించేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఖర్చుకు వెనకాడవద్దని, నాణ్యతే ప్రధాన ప్రమాణంగా ఉండాలని సూచించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లకు సంబంధించిన పెండింగ్ బిల్లుల పూర్తి వివరాలను వెంటనే సమర్పించాలని అధికారులను ఆదేశించారు. సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ విధానంపై నిర్వహించిన ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి గారు, వేం నరేందర్ రెడ్డి గారు, స్పెషల్ సీఎస్ సబ్యసాచి ఘోష్ గారు, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు గారు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రత్యేక విమానంలో ఢిల్లీకి రాహుల్ గాంధీ, సీఎం రేవంత్… కీలక అంశాలపై సుదీర్ఘ చర్చ
హైదరాబాద్ డిసెంబర్ 15

నిన్న ఉప్పల్ స్టేడియంలో నిర్వహించిన మెస్సీ – రేవంత్ టీమ్‌ల ఫుట్‌బాల్ మ్యాచ్‌ సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డితో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు.

ఈ ప్రయాణ సమయంలో రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా తెలంగాణలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, నామినేటెడ్ పదవుల భర్తీ అంశాలపై కీలకంగా మాట్లాడినట్లు సమాచారం.

అలాగే ఇటీవల నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయం గురించి సీఎం రేవంత్ రాహుల్ గాంధీకి వివరించారు. ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి సుమారు రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం విశేషమని తెలిపారు.

అంచనాలను మించి సమ్మిట్ అత్యంత విజయవంతంగా జరిగిందని సీఎం వివరించగా, రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డిని అభినందించారు. తెలంగాణ అభివృద్ధి దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించినట్లు తెలిసింది.

ఉప్పల్ స్టేడియంలో మెస్సీ–రేవంత్ ఫుట్‌బాల్ మ్యాచ్.. అభిమానుల్లో ఉత్సాహం
హైదరాబాద్‌ డిసెంబర్ 13 (ప్రజా మంటలు):

ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ప్రత్యేక ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డి, ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మైదానంలోకి దిగారు. ఈ మ్యాచ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.

మ్యాచ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఒక గోల్‌ సాధించగా, మెస్సీ రెండు గోల్స్‌తో తన ప్రతిభను చాటుకున్నారు. గోల్స్‌తో పాటు మెస్సీ ఆటతీరుకు స్టేడియం మార్మోగింది. మ్యాచ్ సందర్భంగా మెస్సీ అభిమానులకు చేతులు ఊపుతూ అభివాదం చేయడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకపోయాయి.

మ్యాచ్ అనంతరం ఇరు జట్లతో కలిసి మెస్సీ, సీఎం రేవంత్‌రెడ్డి ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా క్రీడాభిమానులతో పాటు రాజకీయ, సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు.

మ్యాచ్ ముగిసిన తరువాత మెస్సీ హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేయనున్న మెస్సీ, రేపు ఉదయం ముంబైకి బయల్దేరనున్నట్లు సమాచారం.