Sama satyanarayana - Praja Mantalu

జగిత్యాల జిల్లాలో పోక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష
జగిత్యాల: జూలై 29  (ప్రజా మంటలు):

జగిత్యాల రూరల్ మండలానికి చెందిన ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోక్సో కేసులో నిందితుడు రాజేష్‌కు జగిత్యాల పోక్సో ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే నిందితుడికి ₹6,500 జరిమానా కూడా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.
అదేవిధంగా బాధిత మైనర్ బాలికకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ₹50 వేల పరిహారం అందించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో జగిత్యాల పోక్సో ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి రత్న పద్మావతి తీర్పు వెలువరించారు.
కేసు దర్యాప్తును అప్పటి జగిత్యాల రూరల్ ఎస్‌ఐ సదాకర్, డీఎస్పీ రఘుచందర్ పర్యవేక్షణలో సమగ్రంగా నిర్వహించడంతో నిందితుడికి శిక్ష పడిందని పోలీసులు తెలిపారు.
ఈ కేసును విజయవంతంగా దర్యాప్తు చేసి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు. పోక్సో చట్టం కింద బాలలపై జరిగే లైంగిక నేరాల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని, బాధితులకు న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

నంది మేడారం పంప్‌హౌస్‌లో నాలుగు బాహుబలి పంపులు ప్రారంభం
కరీంనగర్, జూలై 29  (ప్రజా మంటలు):

కాళేశ్వరం ద్వారా 12,600 క్యూసెక్కుల నీటి ఎత్తిపోతలు
ఎడతెరిపి వర్షాల నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2 పరిధిలోని పెద్దపల్లి జిల్లా నంది మేడారం పంప్‌హౌస్‌లో నాలుగు బాహుబలి పంపులను అధికారులు బుధవారం ప్రారంభించారు. ఒక్కో పంపు ద్వారా 3,150 క్యూసెక్కుల చొప్పున మొత్తం నాలుగు పంపులతో 12,600 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు.
నంది మేడారం పంప్‌హౌస్‌లో నాలుగు, రామడుగు గాయత్రి పంప్‌హౌస్‌లో మరో నాలుగు పంపులను ఆగస్టు 2వ తేదీ వరకు నిరంతరాయంగా నిర్వహించేందుకు మొత్తం 948.24 మెగావాట్ల విద్యుత్ సరఫరాను ప్రభుత్వం కోరినట్లు అధికారులు తెలిపారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు బుధవారం సాయంత్రం 6 గంటల నాటికి 75,328 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు నీటిమట్టం 144.22 మీటర్లకు చేరగా, 20.1754 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గాను ప్రస్తుతం 11.1105 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
ప్రాజెక్టు నుంచి మొత్తం 12,875 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇందులో నంది మేడారం పంప్‌హౌస్ ద్వారా 12,600 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తుండగా, ప్రాజెక్టులోని 62 గేట్లలో ఒక్క గేటును కూడా ఇప్పటివరకు ఎత్తలేదు. వరద పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నారు.

కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో రాష్ట్ర మంత్రుల గిరి ప్రదక్షిణ
సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు పండాలని వరుణ పూజలు
కొండగట్టు, జూలై 29 (ప్రజా మంటలు):

గురు పౌర్ణమి సందర్భంగా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో రాష్ట్ర ప్రజల సుభిక్షం కోసం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, డా. సంజయ్ కుమార్, హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి వొడితాల ప్రణవ్ బాబు, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గజంగి నందయ్య, బండ శంకర్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కలిసి గిరి ప్రదక్షిణ నిర్వహించారు.
అనంతరం శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక వరుణ పూజలు నిర్వహించి, రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురవాలని, రైతులకు మంచి దిగుబడులు రావాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు.
ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులు కూడా గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కొండగట్టు గిరి ప్రదక్షిణకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
కొండగట్టు, మే 11 (ప్రజా మంటలు):

జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు అంజన్న ఆలయంలో రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకున్న మంత్రి, అంజన్నకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు మంత్రికి పూర్ణకుంభ స్వాగతం పలికారు.
అనంతరం మంత్రి అడ్లూరి మాట్లాడుతూ, కొండగట్టు అంజన్న గిరి ప్రదక్షిణకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నిధుల విడుదలకు కృషి చేస్తానని తెలిపారు. గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు తాగునీరు, వైద్య సేవలు, భద్రత, పారిశుధ్యం వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచుతామని చెప్పారు.
పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దేవాదాయ శాఖ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు మంత్రి వెల్లడించారు. భక్తులు సమన్వయంతో ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకోవాలని సూచించారు.
కొండగట్టు అంజన్న ఆశీస్సులు తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలపై ఉండాలని ఆకాంక్షించిన మంత్రి, జిల్లా అధికారులు స్థానికంగా ఉండి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా ఉగాది వేడుకలు.. ప్రజా బడ్జెట్ విడుదల
హైదరాబాద్, మార్చ్ 19 (ప్రజా మంటలు):

శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా తెలంగాణ జాగృతి కార్యాలయంలో సంప్రదాయబద్ధంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు పంచాంగ శ్రవణం చేయగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఆమెతో పాటు అనిల్ దంపతులు, జాగృతి ముఖ్య నాయకులు హాజరయ్యారు.

రూ.2,15,200 కోట్లతో జాగృతి ప్రజా బడ్జెట్

ఉగాది వేడుకల అనంతరం కవిత తెలంగాణ జాగృతి తరఫున ప్రజా బడ్జెట్‌ను ప్రకటించారు. మొత్తం రూ.2,15,200 కోట్లతో ఈ బడ్జెట్‌ను ప్రతిపాదించినట్లు తెలిపారు. ఇక నుంచి ప్రతి సంవత్సరం ఉగాది రోజునే జాగృతి ప్రజా బడ్జెట్‌ను విడుదల చేస్తామని వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ రూ.3 లక్షల కోట్లకు పైగా ఉండగా, తాము మాత్రం ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకుని తక్కువ మొత్తంతో సమగ్ర బడ్జెట్ రూపొందించామని చెప్పారు. తమ బడ్జెట్‌లో ప్రజా సంక్షేమం, రాష్ట్ర పురోగతికి ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ప్రధాన కేటాయింపులు
ప్రజల నుంచి వచ్చిన సూచనల మేరకు రూపొందించిన ఈ బడ్జెట్‌లో పలు కీలక రంగాలకు భారీ కేటాయింపులు చేశారు:

విద్యారంగం – రూ.30,000 కోట్లు
వైద్యం, ఆరోగ్యం – రూ.25,000 కోట్లు
యూనివర్సిటీ విద్య – రూ.2,000 కోట్లు
పింఛన్లు (వృద్ధులు, వికలాంగులు తదితరులు) – రూ.25,000 కోట్లు
ఇందిరమ్మ ఇళ్లు – రూ.20,000 కోట్లు
ఉద్యమకారులు & అమరవీరుల కుటుంబాలు – రూ.5,000 కోట్లుl
రైతులు, కౌలు రైతులు & కూలీలు – రూ.35,000 కోట్లు
యువత (రాజీవ్ యువ వికాసం) – రూ.5,000 కోట్లు
యువతులకు స్కూటీలు – రూ.5,000 కోట్లు
బీసీ సంక్షేమం – రూ.20,000 కోట్లు
ఎస్సీ సంక్షేమం – రూ.18,000 కోట్లు
ఎస్టీ సంక్షేమం – రూ.10,000 కోట్లు
మైనారిటీ సంక్షేమం – రూ.5,000 కోట్లు
కళ్యాణ లక్ష్మీ & షాదీ ముబారక్ – రూ.10,000 కోట్లు
ఎంఎస్ఎంఈలు & పారిశ్రామిక వేత్తలు – రూ.10,000 కోట్లు
కళాకారుల పింఛన్లు – రూ.100 కోట్లు
ఆటో డ్రైవర్ల సాయం – రూ.100 కోట్లు

ప్రభుత్వానికి సూచనలు
ప్రభుత్వం తమ బడ్జెట్ ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలని కవిత కోరారు. తమ బడ్జెట్ అమలుతో రాష్ట్ర అభివృద్ధి వేగవంతమవుతుందని, సంపద సృష్టి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

ఉగాది సందేశం
ఉగాది కొత్త ఆరంభానికి నాంది అని కవిత పేర్కొన్నారు. ప్రజల కోసం సేవ చేయాలని జాగృతి నాయకులకు పిలుపునిచ్చారు. తెలంగాణ నేల త్యాగాల పరంపరతో నిలిచిందని, అదే స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. శ్రీ పరాభవ నామ సంవత్సరం తెలుగు ప్రజలకు శుభఫలితాలు తీసుకురావాలని ఆకాంక్షించారు.

మత సామరస్యానికి ప్రతీకగా ఇఫ్తార్ విందు – దావ వసంత సురేష్
జగిత్యాల, మార్చ్ 18 (ప్రజా మంటలు):

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, బీఆర్ఎస్ నాయకులు కలిసి పాల్గొని మత సామరస్యాన్ని చాటారు.
ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం దావ వసంత సురేష్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మైనారిటీల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు తెలిపారు. రంజాన్ తోఫా, షాదీ ముబారక్ వంటి పథకాలతో పాటు అధికారికంగా ఇఫ్తార్ విందులను కూడా ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు.
పేద మైనారిటీ విద్యార్థుల కోసం ప్రత్యేక గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఐల్నేని వెంకటేశ్వర్ రావు, కౌన్సిలర్లు దేవేందర్ నాయక్, అవారి శివ, కేసరి బాబు, హరీష్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావు, మైనారిటీ నాయకులు రియాజ్ ఖాన్, ఆసిఫ్, జునైద్, అసీం, సవన్, కమల్, జబెర్, ఫయాజ్, చాంద్, ఆరిఫ్, సాజిల్ తదితరులు పాల్గొన్నారు. అలాగే బీఆర్ఎస్ నాయకులు శీలం ప్రవీణ్, అర్బన్ మండల అధ్యక్షుడు తుమ్మ గంగాధర్, బండారి విజయ్ రెడ్డి, ప్రశాంత్ రావు, చింతల గంగాధర్, బండి వంశీ బాబు, సన్నిత్, నక్క గంగాధర్, గాజుల శ్రీనివాస్, గంగిపెల్లి వేణుమాధవ్, సంతోష్ గంగాధర్, అనురాధ, మల్లీశ్వరి, మానస తదితరులు హాజరయ్యారు.

వెలుగుమట్ల బాధితులకు ఇళ్లు ప్రకటించడంతో కవిత దీక్ష విరమణ – భూదాన్ భూములపై శ్వేతపత్రం డిమాండ్
హైదరాబాద్, మార్చ్ 11 (ప్రజా మంటలు):

ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతలకు గురైన బాధితులకు ప్రభుత్వం ఇళ్లు, ఇండ్ల పట్టాలు ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో కొనసాగుతున్న నిరాహార దీక్షను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరియు ధర్మసమాజ్ పార్టీ నాయకుడు విశారదన్ మహారాజ్ విరమించారు.
జస్టిస్ ఈశ్వరయ్య నిమ్మరసం ఇచ్చి వారి దీక్షను విరమింపజేశారు. అనంతరం విశారదన్ మహారాజ్, జస్టిస్ ఈశ్వరయ్యలతో కలిసి కవిత మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ వెలుగుమట్ల ఘటన రాష్ట్ర ప్రజలను తీవ్రంగా కలచివేసిందన్నారు. అర్ధరాత్రి సమయంలో బుల్డోజర్లతో పేదల ఇళ్లను కూల్చివేయడం రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానం కలిగించే విధంగా ఉందని విమర్శించారు. బాధితుల ఇళ్లను కూల్చివేసిన తరువాత వారికి భూమిపై హక్కులు లేవని చెప్పడం మరింత అవమానకరమని అన్నారు.
వెలుగుమట్ల బాధితులను కలిసినప్పుడు పరిస్థితి చూసి మనం భారత్‌లో ఉన్నామా లేదా అఫ్గానిస్తాన్‌లో ఉన్నామా అనే అనుమానం కలిగిందని వ్యాఖ్యానించారు. పేదలను కొట్టి వారి భూములను కొందరు ప్రభావశీలులకు అప్పగించే కుట్ర జరుగుతోందనే అనుమానం తమకు కలిగిందన్నారు.

అన్ని అర్హతలు ఉన్న పేదల ఇళ్లను కూల్చే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిది అని ప్రశ్నించిన ఆమె, ప్రైవేట్ ప్రాపర్టీలోకి వెళ్లి ఇళ్లను కూల్చివేయడం తీవ్రమైన చట్టవిరుద్ధ చర్య అని అన్నారు. చేతిలో రాజ్యాంగం పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ ఈ ఘటనపై బాధ్యత వహించి రాష్ట్ర ప్రభుత్వంపై గట్టి చర్యలు తీసుకోవాలని, ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మొన్నటివరకు ఆక్రమణలు జరిగాయని చెప్పిన మంత్రులు ఇప్పుడు అక్కడ అర్హులు ఉన్నారని చెప్పడం విరుద్ధ వ్యాఖ్యలని కవిత విమర్శించారు. పోలీసు కమిషనరే ల్యాండ్ ఓనర్లను ఖాళీ చేయించి ఇళ్లు కూల్చేశామని ట్వీట్ చేసినప్పుడు ఆ అధికారులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం బాధితులకు ఇచ్చిన టోకెన్లపై ఇంకా అనుమానం ఉందని, పూర్తి లేఅవుట్ తీసి ప్రతి కుటుంబానికి వారి స్థలం ఎక్కడుందో స్పష్టంగా చూపించాలని ఆమె కోరారు. కొందరు పది లక్షలు, కొందరు ఇరవై లక్షలు, మరికొందరు ముప్పై లక్షలు ఖర్చు చేసి ఇళ్లు నిర్మించుకున్నారని, వారికి కేవలం ఐదు లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పడం సరిపోదన్నారు.
వెలుగుమట్ల ఘటనపై ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పాటు చేసి బాధితులకు సంపూర్ణ న్యాయం జరిగిందా లేదా పరిశీలిస్తామని కవిత తెలిపారు. జస్టిస్ ఈశ్వరయ్య సమక్షంలో బాధితులతో మళ్లీ మాట్లాడి పూర్తి నివేదిక తీసుకుంటామని చెప్పారు.
రాష్ట్రంలోని లక్షా 74 వేల ఎకరాల భూదాన్ భూములపై ప్రభుత్వ పెద్దల కన్ను పడిందని కవిత ఆరోపించారు. వెలుగుమట్లలో జరిగిన కూల్చివేతలు ఒక ట్రయల్ మాత్రమేనని, ఎలాంటి వ్యతిరేకత రాకపోతే రాష్ట్రవ్యాప్తంగా భూదాన్ భూములను కాజేసే ప్రయత్నం జరిగేదని అన్నారు.

భూదాన్ భూముల లెక్కలపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆ భూములు పేదలకు చెందేవేనని, వాటిని వారికి పంపిణీ చేయాలని, లేకపోతే భవిష్యత్తులో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు పంచుతామని తెలిపారు.
ప్రస్తుతం ఈ పోరాటానికి విరామం మాత్రమేనని, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత అవసరమైతే మళ్లీ ఉద్యమాన్ని కొనసాగిస్తామని కవిత స్పష్టం చేశారు. పేదలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని తెలిపారు.
ఈ సందర్భంగా తమ దీక్షకు మద్దతు తెలిపిన ప్రజా సంఘాలు, ఎస్సీ–ఎస్టీ–బీసీ జేఏసీ, జాగృతి కార్యకర్తలు మరియు ఇతర ప్రగతిశీల శక్తులకు కవిత కృతజ్ఞతలు తెలిపారు.

సామాజిక మార్పుతోనే మహిళా సాధికారత సాధ్యం: సీనియర్ సివిల్ జడ్జి నాగేశ్వర్ రావు
మెట్‌పల్లి, మార్చ్ 10 (ప్రజా మంటలు):

సమాజంలో సానుకూల మార్పులు వచ్చినప్పుడే మహిళలకు నిజమైన సాధికారత సాధ్యమవుతుందని మెట్‌పల్లి సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం మండల న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాలు ఉన్నప్పటికీ, సమాజంలో మార్పులు వచ్చినప్పుడే మహిళల స్థానం మరింత బలపడుతుందని తెలిపారు. అన్ని రంగాల్లో మహిళలు ముందడుగు వేస్తున్నప్పటికీ, కొన్నిచోట్ల ఇంకా లైంగిక వేధింపులు ఎదుర్కోవడం దురదృష్టకరమన్నారు. అలాంటి సందర్భాల్లో మహిళలు చట్టపరమైన రక్షణ కోసం మండల న్యాయసేవా కేంద్రాలను సంప్రదించాలని సూచించారు.
పురుషుల కంటే తాము తక్కువ కాదనే ఆత్మవిశ్వాసం మహిళల్లో పెరగాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అనంతరం మహిళా న్యాయవాదులు, కోర్టు సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి నారం అరుణ్ కుమార్, అదనపు ప్రజా అభియోగ అధికారి చెర్లపల్లి ఆనంద్ గౌడ్, సహాయ ప్రజా అభియోగ అధికారి జి. ప్రణయ్, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పసునూరి శ్రీనివాస్, కోశాధికారి పడిగెల శ్రీనివాస్, క్రీడా కార్యదర్శి బిగుల్లా శంకర్ తదితరులు పాల్గొన్నారు. మహిళా న్యాయవాదులు మామిడిపల్లి విజయలక్ష్మి, కాజీపేట స్రవంతి, మెడిచెల్మల సుమలత, మాలేపు సంధ్యా రాణి, లొకిని హరిచందనతో పాటు కోర్టు సిబ్బంది వసంత, ఇందిర, విజయలక్ష్మి, భాగ్యలక్ష్మి, మనీషా, సుష్మ, స్వాతి, సరిత, ఈశ్వరమ్మ పాల్గొన్నారు.

సావిత్రిబాయి పూలే కు నివాళులు
మహిళా విద్యోద్యమ పితామహి సావిత్రిబాయి ఫూలే 129వ వర్ధంతి సందర్భంగా మెట్‌పల్లి బార్ అసోసియేషన్‌లో న్యాయవాదులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

కాంగ్రెస్‌లో కొనసాగడంపై ఆలోచిస్తా – మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
జగిత్యాల రూరల్,  మార్చ్ 10 (ప్రజా మంటలు):

కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలా లేదా అన్న విషయంపై తాను ఆలోచిస్తున్నానని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికల రోజే కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం గురించి తాను ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అప్పుడే స్పష్టంగా చెప్పానని గుర్తు చేశారు. ఆ సందర్భంలో చెప్పిన మాటలు ఇప్పటికీ మారలేదని, అయితే ఇప్పటివరకు తాను ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు.
పార్టీలోని పరిస్థితులు, జరిగిన పరిణామాలు తనను తీవ్రంగా ఆలోచింపజేశాయని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా పని చేసిన తనలాంటి నాయకులను పక్కన పెట్టే పరిస్థితులు రావడం బాధాకరమని వ్యాఖ్యానించారు.
ఇప్పటికీ తాను తొందరపడి నిర్ణయం తీసుకునే పరిస్థితిలో లేనని, కాంగ్రెస్ పార్టీలో ఉన్న తన మిత్రులు, కార్యకర్తలు, అనుచరులతో చర్చించిన తర్వాతే తగిన నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. సమయం, సందర్భం వచ్చినప్పుడు తన నిర్ణయాన్ని స్పష్టంగా ప్రకటిస్తానని చెప్పారు.
పార్టీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో జీవన్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన తదుపరి నిర్ణయం ఏంటన్నది జిల్లాలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఆసక్తికరంగా మారింది.

ఇరాన్ సుప్రీం లీడర్‌గా మోజ్తభా ఖమెనీ నియామకం –
ఇరాన్ సుప్రీం లీడర్‌గా మోజ్తభా కామెనీ నియామకం

మధ్యప్రాచ్య దేశమైన ఇరాన్లో అత్యున్నత మత-రాజకీయ అధికారం అయిన సుప్రీం లీడర్ పదవికి మోజ్తభా కామెనీను ఎంపిక చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, దౌత్య వర్గాల్లో చర్చకు దారితీసింది.
మోజ్తభా కామెనీ, ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయిన అయాతొల్లా అలీ కామెనీ కుమారుడు. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం దేశంలోని ప్రముఖ మత పండితులతో కూడిన అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ సుప్రీం లీడర్‌ను ఎంపిక చేసే అధికారం కలిగి ఉంటుంది. అదే ప్రక్రియలో మోజ్తభా కామెనీని ఈ పదవికి ఎన్నుకున్నట్లు సమాచారం.

ఇరాన్ రాజకీయాల్లో మోజ్తభా కామెనీ పాత్ర
మోజ్తభా కామెనీ గతంలో అధికారికంగా ఎలాంటి ఎన్నికల పదవిలో లేకపోయినా, ఇరాన్ మత మరియు రాజకీయ వ్యవస్థలో ప్రభావశీల వ్యక్తిగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా ఇరాన్ శక్తివంతమైన భద్రతా సంస్థ అయిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్తో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
ఇరాన్ రాజకీయ వ్యవస్థలో సుప్రీం లీడర్‌కు అత్యంత కీలక అధికారాలు ఉంటాయి. దేశ సైన్యం, భద్రతా వ్యవస్థ, విదేశాంగ విధానం మరియు అణు కార్యక్రమాలపై తుది నిర్ణయాధికారం ఈ పదవికే చెందుతుంది.

వారసత్వ రాజకీయాలపై చర్చ
1979లో జరిగిన ఇరాన్ ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్‌లో సుప్రీం లీడర్ పదవి వారసత్వంగా మారిందా అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. తండ్రి తర్వాత కుమారుడు ఈ పదవిని చేపట్టడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
ఈ నేపథ్యంలో కొందరు విశ్లేషకులు ఇరాన్ రాజకీయ వ్యవస్థలో కుటుంబ ప్రభావం పెరుగుతోందని వ్యాఖ్యానిస్తుండగా, మరికొందరు మాత్రం ఇది రాజ్యాంగ ప్రక్రియలో భాగమేనని అంటున్నారు.

అంతర్జాతీయ ప్రతిస్పందనలు
మోజ్తభా కామెనీ నియామకంపై ప్రపంచ దేశాలు భిన్నంగా స్పందిస్తున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆయనకు అభినందనలు తెలియజేసినట్లు సమాచారం. మరోవైపు అమెరికా మరియు ఇజ్రాయెల్ వర్గాలు ఈ పరిణామాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నాయి.
మధ్యప్రాచ్యంలో ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్‌లో కొత్త నాయకత్వం ప్రాంతీయ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా విశ్లేషణలు కొనసాగుతున్నాయి.

ఇరాన్ సుప్రీం లీడర్ అధికారాలు

ఇరాన్ సుప్రీం లీడర్‌కు ఉన్న ప్రధాన అధికారాలు ఇవి:
దేశ సైన్యానికి పరమాధికారి
అణు కార్యక్రమాలపై తుది నిర్ణయం
విదేశాంగ విధానాలపై ప్రభావం
న్యాయవ్యవస్థ, భద్రతా వ్యవస్థలపై నియంత్రణ
కీలక ప్రభుత్వ సంస్థల నియామకాలపై అధికారం
ప్రస్తుతం మోజ్తభా కామెనీ నాయకత్వం ఇరాన్ రాజకీయాలు, మధ్యప్రాచ్య భద్రతా పరిస్థితులపై ఎలా ప్రభావం చూపుతుందో ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయి.

ఖమ్మంలో కల్వకుంట్ల కవిత అరెస్ట్ – మహిళా కానిస్టేబుళ్లు లేకుండానే అరెస్టుపై వివాదం
ఖమ్మం, మార్చి 09 (ప్రజా మంటలు):

వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా ఖమ్మం జెడ్పీ సెంటర్ వద్ద ఆందోళన నిర్వహిస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్, వెలుగుమట్ల బాధితులు మరియు జాగృతి నాయకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కవితతో పాటు పలువురు మహిళలను మహిళా కానిస్టేబుళ్లు లేకుండానే పోలీసులు అరెస్ట్ చేశారని తెలంగాణ జాగృతి నాయకులు ఆరోపించారు. ఈ ఘటనపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అరెస్ట్ అనంతరం కల్వకుంట్ల కవితను ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించగా, వెలుగుమట్ల బాధితులు మరియు జాగృతి నాయకులను రఘునాథపాలెం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ ఘటనలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ జాగృతి నాయకులు మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

వెలుగుమట్ల బాధితుల ఆవేదన చూస్తే కడుపు తరుక్కుపోతోంది: కల్వకుంట్ల కవిత
ఖమ్మం, మార్చ్ 09 (ప్రజా మంటలు):

ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేత బాధితుల ఆవేదన చూస్తే కడుపు తరుక్కుపోతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బాధితులతో కలిసి కలెక్టరేట్‌కు ర్యాలీగా బయల్దేరిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వానికి, రాజకీయ నాయకులకు ఇక్కడున్న ఆడబిడ్డల ఉసురు తగులుతుందని తీవ్రంగా వ్యాఖ్యానించారు.
పిల్లల పరీక్షల సమయంలోనే పుస్తకాలతో సహా రాత్రికి రాత్రే బుల్డోజర్లతో ఇళ్లను కూల్చివేయడం అమానుషమని ఆమె విమర్శించారు. ఇళ్లు కూల్చిన తరువాత చాలా మంది రాజకీయ నాయకులు బాధితుల బాధను ఎగ్జిబిషన్‌లా చూసి వెళ్లారని, కొందరు రాజకీయ పార్టీలకు ఈ బాధ ఒక ప్రదర్శనగా మారిందని అన్నారు.
తాను కేవలం బాధితులను చూసి వెళ్లటానికి రాలేదని, వారి సమస్యలను పూర్తిగా విని ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కారం సాధించేందుకు వచ్చానని కవిత స్పష్టం చేశారు. మహిళలు, పేదల పక్షాన ఎప్పుడూ నిలుస్తానని ఆమె తెలిపారు.

వెలుగుమట్ల బాధితుల పక్షాన ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ, ధర్మ సమాజ్ పార్టీ, ప్రజా సంఘాలు మరియు తెలంగాణ జాగృతి కలిసి పోరాటం చేస్తాయని ఆమె చెప్పారు. సమస్యకు పరిష్కారం వచ్చే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు.
ప్రస్తుతం బాధితులను సరైన సదుపాయాలు లేకుండా ఒకేచోటకు తరలించారని, మహిళలకు ప్రత్యేక వసతి కూడా లేదని కవిత అన్నారు. హెల్త్ డిపార్ట్‌మెంట్ అధికారులు కనీసం హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయకపోవడం దారుణమని విమర్శించారు.
గతంలో ఇళ్ల కూల్చివేతకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు భోజనాలు, హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారని, వారు చేసిన పాపాలను కడుక్కునే ప్రయత్నమే అది అని ఆమె వ్యాఖ్యానించారు.

జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఎవరూ బాధితుల సమస్యపై స్పందించలేదని కవిత అన్నారు. ముఖ్యమంత్రి మరియు జిల్లా మంత్రులు వెంటనే ఈ సమస్యపై మాట్లాడాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే జిల్లా కలెక్టర్ వెంటనే బాధితులను కలవాలని కోరారు.
బాధితుల ఇళ్లను ఎక్కడ కూల్చివేశారో అదే చోట వారికి కొత్త ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేరే ప్రాంతాలకు తరలించాలనే ప్రయత్నాలను ప్రజలు అంగీకరించరని తెలిపారు.
రాష్ట్రంలో పేదలపై జులుం నడుస్తోందని, పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడుపుతున్నారని కవిత విమర్శించారు. పెద్దల అక్రమ నిర్మాణాలపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.
పేదల హక్కులను కాపాడేందుకు మరియు బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు.
SEO ట్యాగ్స్: