Kasireddy Adireddy - Praja Mantalu

వడ్డెర సంఘం మండల అధ్యక్షుడిగా బొమ్మిశెట్టి రమేష్
భీమదేవరపల్లి, జనవరి 21 (ప్రజా మంటలు) :

వడ్డెర సంఘం భీమదేవరపల్లి మండల అధ్యక్షులుగా బొమ్మిశెట్టి రమేష్ నియామకమయ్యారు.  ఈ మేరకు తెలంగాణ వడ్డెర సంఘం మరియు చారిటబుల్ ట్రస్ట్ రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి అయిలమల్లు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా నియామకమైన వడ్డెర సంఘం మండల అధ్యక్షుడు బొమ్మిశెట్టి రమేష్ మాట్లాడుతూ వడ్డెర సంఘం సంక్షేమ కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బొమ్మిశెట్టి రమేష్ నియామకం పట్ల వడ్డెర సంఘం నాయకులు వల్లెపు కనకయ్య, సుధాకర్,  గొల్లెన రమేష్, అశోక్, కుమారస్వామి, బొమ్మిశెట్టి సంపత్ హర్షం వ్యక్తం చేశారు.

ముత్తారం సర్పంచ్ గా ఉరడి భారతి జైపాల్ రెడ్డి విజయం
ముత్తారం సర్పంచ్ గా ఉరడి భారతి జైపాల్ రెడ్డి విజయం

* ఆనందోత్సవాల్లో గ్రామ ప్రజలు

* గట్టి పోటీ ఇచ్చిన కొర్ర స్వర్ణలత శ్రీకాంత్

* ఉప సర్పంచ్ గా మాట్ల హరికుమార్

భీమదేవరపల్లి, డిసెంబర్ 11 (ప్రజామంటలు) :

ముత్తారం గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో ఉరడి భారతి జైపాల్ రెడ్డి స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించారు. ఎన్నికల ఫలితాలు వెల్లడించిన వెంటనే గ్రామంలో సందడి నెలకొంది. మహిళా సర్పంచ్ గెలుపుతో గ్రామ ప్రజలు భారీగా ఊరేగింపుకు సన్నాహాలు చేస్తూ పటాకులు పేల్చారు. విజేత భారతి తమ విజయం గ్రామ ప్రజల ఆశీర్వాదం, అభిమానం అని పేర్కొన్నారు. ఇతర అభ్యర్థులకు గట్టి పోటీ ఇస్తూ చివరి వరకు పోరాడిన కొర్ర స్వర్ణలత శ్రీకాంత్ మంచి ఓట్లను సాధించారు. గ్రామ అభివృద్ధి, పారదర్శక పాలనకు తమ కృషి కొనసాగుతుందన్నారు. అదేవిధంగా ఉపసర్పంచ్ పదవికి మాట్ల హరికుమార్ ఎన్నికయ్యారు. గ్రామ భవిష్యత్తు అభివృద్ధే తన లక్ష్యం అని హరికుమార్ పేర్కొన్నారు. గ్రామంలో ప్రాథమిక సదుపాయాల విస్తరణ, తాగునీటి సమస్యల పరిష్కారం, రోడ్ల మరమ్మతులు, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాలపై త్వరలోనే కార్యాచరణ చేపడతామని నేతలు చెప్పారు. ఎన్నికల ప్రక్రియ శాంతియుతంగా జరుగడానికి సహకరించిన గ్రామస్తులకు, పోలీసు శాఖకు, అధికార యంత్రాంగానికి సర్పంచ్ భారతి, ఉపసర్పంచ్ హరికుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

గ్రామ రాజకీయాల్లోకి ఏఐ ఎంట్రీ
గ్రామాల్లో మర్ఫింగ్ వీడియోల కలకలం

* ఏఐ మార్ఫింగ్‌తో ప్రత్యర్థులపై దుష్ప్రచారం

* గ్రామ రాజకీయాల్లోకి ఏఐ ఎంట్రీ

* ఏఐ మార్ఫింగ్‌తో ఓటర్లలో అయోమయం

భీమదేవరపల్లి డిసెంబర్ 10 (ప్రజామంటలు) :

మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల వేళ రాజకీయ వేడి పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కడ చూసినా ఏఐ సిత్రాలు, మర్ఫింగ్ వీడియోలు కలకలం రేపుతున్నాయి. అభ్యర్థుల పేర్లు, ఫోటోలు వాడుకుని కల్పిత వీడియోలు, మార్ఫింగ్ ఆడియోలు తయారుచేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

*అభ్యర్థులపై వ్యక్తిగత విషయాల బహిర్గతం పేరుతో నకిలీ ప్రచారం*

కొంతమంది ప్రత్యర్థులపై తప్పుడు ఆరోపణలు, వ్యక్తిగత విషయాల పేరిట కల్పిత పోస్టులు, ఫేక్ స్క్రీన్‌షాట్లు, డీప్‌ఫేక్ వీడియోలు తయారుచేసి వాట్సాప్ గ్రూపుల ద్వారా వ్యాప్తి చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. గ్రామస్థులు ఏది నిజం, ఏది నకిలీ అన్నది తేల్చుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు.

*వాట్సాప్ పోస్టుపై సర్పంచ్ అభ్యర్థి ఫిర్యాదు*

భీమదేవరపల్లి మండలంలోని ఓ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి తనపై అభ్యంతరకరంగా, తప్పుడు సమాచారంతో రూపొందించిన ఏఐ పోస్టులు పంచుతున్నారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ పోస్టులు గ్రామంలో తన ప్రతిష్ఠ దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా చేసినవని అభ్యర్థి ఆరోపించారు.

*ముల్కనూర్‌లో అధికార పార్టీ నాయకురాలిపై కల్పిత వీడియో*

ముల్కనూర్‌లో ఓ అధికార పార్టీ మహిళా నాయకురాలి ఫోటోను ఉపయోగించి, తాను మాట్లాడినట్లు కృత్రిమంగా తయారు చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఘటన పట్ల సదరు నాయకురాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇది తమను అపకీర్తి పర్చేందుకు ప్రత్యర్థులు చేస్తున్న అనైతిక చర్య అని పేర్కొన్నారు.

*ఎన్నికల్లో ఏఐ దుర్వినియోగంపై ఆందోళన*

స్థానికంగా ఏఐ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ, అభ్యర్థుల అసలు మాటలను మార్చడం, మాట్లాడని మాటలు మాట్లాడినట్లుగా చూపడం, ఫేక్ స్క్రీన్‌షాట్లతో అపోహలు రేకెత్తించడం, ప్రత్యర్థులపై అవమానకర పోస్టులు చేయడం లాంటివి పెరుగుతున్నాయని అధికారులు హెచ్చరించారు.

*పోలీసుల హెచ్చరిక*

భీమదేవరపల్లి, వంగర ఎస్సైలు రాజు, దివ్య ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, ఎన్నికల సమయంలో తప్పుడు వార్తలు, ఫేక్ వీడియోలు పంచడం నేరమని, అసత్య సమాచారాన్ని ఫార్వర్డ్ చేసినా క్రిమినల్ కేసులు నమోదవుతాయని హెచ్చరించారు. ఏఐ మార్ఫింగ్‌కు పాల్పడేవారిపై ఐటీ చట్టం సెక్షన్ల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

*ప్రజలకు విజ్ఞప్తి*

నకిలీ వీడియోలు, ఏఐ పోస్టులు వస్తే వెంటనే నిజానిజాలు ఖరారు చేసుకోవాలని, గ్రామ పెద్దలు, అధికారులు పోలీసులకు సమాచారమివ్వాలని, అనుమానాస్పద పోస్టులను షేర్‌ చేయరాదని స్పష్టం చేశారు.

ఓటరు తస్మాత్ జాగ్రత్త..! మల్లారంలో జాగృతి నాటిక
ఓటరు తస్మాత్ జాగ్రత్త..! మల్లారంలో జాగృతి నాటిక

* జాగృతి పోలీస్ కళా బృందం అవగాహన కార్యక్రమం

* గంజాయి, డ్రగ్స్, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన –

*  ప్రశాంత ఎన్నికల పిలుపు

ముల్కనూర్, డిసెంబర్ 7 (ప్రజామంటలు) :

వరంగల్ నగర పోలీస్ కమిషనర్ శ్రీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జాగృతి పోలీస్ కళా బృందం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ముల్కనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లారం గ్రామంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం సాయంత్రం 6:30 గంటల నుంచి 8:30 గంటల వరకు కొనసాగింది. ఈ సందర్భంగా యువత గంజాయి, డ్రగ్స్, గుట్క వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి అమ్మకం లేదా వినియోగంపై సమాచారం అందించేందుకు 8712584473 నంబర్‌కు ఫోన్ చేయాలని కళా బృందం సభ్యులు ప్రజలకు అవగాహన కల్పించారు. చదువు ప్రాముఖ్యత, రోడ్డు ప్రమాదాల నివారణ, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, డయల్ 100 సేవలు, సీసీటీవీ కెమెరాల అవసరం, వృద్ధాప్యంలో తల్లిదండ్రుల సంరక్షణ వంటి అంశాలపై పాటలు, నాటికల ద్వారా చైతన్యం కల్పించారు. మూఢ నమ్మకాల నివారణపై మ్యాజిక్ షో ప్రదర్శించి ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించారు. హెడ్ కానిస్టేబుల్ మల్లెల నాగేశ్వరరావు మాట్లాడుతూ, సైబర్ క్రైమ్, ఆన్‌లైన్ బెట్టింగ్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, బాధితుల కోసం 1930 హెల్ప్‌లైన్ నంబర్ గురించి వివరించారు. రాబోయే గ్రామపంచాయతీ ఎన్నికలు ఎలాంటి గొడవలు లేకుండా నియమ నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా జరుపుకోవాలని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలియజేస్తూ “ఓటరు తస్మాత్ జాగ్రత్త” అనే నాటికను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ముల్కనూర్ హెడ్ కానిస్టేబుల్ మల్లెల నాగేశ్వర్ రావు, కానిస్టేబుళ్లు ఖలీం, నీరజ్, మహేందర్, కళా బృందం ఇన్‌చార్జ్ ఉమెన్ ఏఎస్‌ఐ నాగమణి, సభ్యులు హెడ్ కానిస్టేబుళ్లు విలియం, వెంకటేశ్వర్లు, రత్నయ్య, పీసీ పూల్‌సింగ్, హోం గార్డులు శ్రీనివాస్, నారాయణ, విక్రమ్ రాజు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున కార్యక్రమానికి హాజరయ్యారు.

గాంధీనగర్ సర్పంచ్ ఏకగ్రీవం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు
గాంధీనగర్ సర్పంచ్ ఏకగ్రీవం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు

భీమదేవరపల్లి, డిసెంబర్‌ 5 (ప్రజామంటలు) :

గాంధీనగర్ గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన కేతిరి లక్ష్మారెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్‌ను మర్యాద పూర్వకంగా కలిసి అభివాదం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, గ్రామ ప్రజలు కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నాయకుడు లక్ష్మారెడ్డిపై ఉంచిన నమ్మకాన్ని ఏకగ్రీవ ఎన్నిక మరింత బలపరిచిందని అభినందించారు. గ్రామాభివృద్ధి దిశగా ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలు చేస్తూ గాంధీనగర్‌ను పురోగతి పథంలో నడిపించగల నాయకత్వం లక్ష్మారెడ్డిదేనని విశ్వాసం వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధి కోసం అవసరమైన నిధులను పరిశీలించి మంజూరు చేయడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలు తనపై ఉంచిన విశ్వాసం నిలబెట్టుకునేందుకు అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయాలని లక్ష్మారెడ్డి మంత్రిని కోరగా, మంత్రి సానుకూలంగా స్పందించారు. గ్రామ ప్రజల తరఫున మంత్రికి కృతజ్ఞతలు వ్యక్తం చేశారు.

అంబేద్కర్ విగ్రహానికి నివాళులతో ముత్తారంలో ఉరడి భారతి ప్రచారానికి శ్రీకారం
అంబేద్కర్ విగ్రహానికి నివాళులతో ముత్తారంలో ఉరడి భారతి ప్రచారానికి శ్రీకారం

* అభయాంజనేయ ఆశీస్సులతో ప్రచార ప్రారంభం – సర్పంచ్ అభ్యర్థి ఊరడి భారతి జైపాల్ రెడ్డి

భీమదేవరపల్లి, డిసెంబర్ 5 (ప్రజామంటలు):

ముత్తారం గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఊరడి భారతి జైపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ఉదృతంగా ప్రారంభించారు. శుక్రవారం ఉదయం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ ప్రజల సంక్షేమం, శాంతి, సమృద్ధి కోసం ప్రార్థించారు. అనంతరం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల అర్పించి నివాళులర్పించారు. తరువాత భారతి జైపాల్ రెడ్డి గ్రామంలోని ప్రతి వార్డును సందర్శిస్తూ ప్రజలతో మమేకమై మద్దతును కూడగట్టారు. గ్రామాభివృద్ధి, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, తాగునీరు, రహదారులు, పారిశుధ్యం, రైతుల సమస్యల పరిష్కారం వంటి అంశాలపై ప్రజలతో మాట్లాడారు. గ్రామంలో పెండింగ్‌లో ఉన్న అన్ని సమస్యలను ప్రాధాన్యంతో పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉండే పారదర్శక పరిపాలనతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. ప్రచార కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువత, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

వంగర పోలీస్ స్టేషన్‌లో ఏసీపీ వార్షిక తనిఖీలు
వంగర పోలీస్ స్టేషన్‌లో ఏసీపీ వార్షిక తనిఖీలు

భీమదేవరపల్లి డిసెంబర్ 3 (ప్రజామంటలు)  :

వార్షిక తనిఖీలలో భాగంగా కాజీపేట ఏసీపీ పింగిలి. ప్రశాంత్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం వంగర పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. స్టేషన్ కు చేరుకున్న ఏసీపీని ఎస్‌ఐ జి. దివ్య పూల మొక్కలు అందజేసి స్వాగతం పలికారు. తనిఖీల సందర్భంగా స్టేషన్ పరిసరాలను పరిశీలించిన ఏసీపీ, రిసెప్షన్ సిబ్బందిని విధులు నిర్వహణపై అడిగి తెలుసుకున్నారు. వచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలు, పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, రౌడీ షీటర్ల సమాచారం, రోడ్డుప్రమాదాల నియంత్రణకు చేపట్టిన చర్యలు, కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులపై దర్యాప్తు పురోగతిని స్టేషన్ సిబ్బంది నుండి వివరంగా తెలుసుకున్నారు. అలాగే స్టేషన్ లో నిర్వహిస్తున్న వివిధ రికార్డులను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఏసీపీ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజలతో మర్యాద పూర్వకంగా ప్రవర్తించాలని, ఫిర్యాదు దారుల్లో సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకం కలిగేలా పోలీసులు పని చేయాలన్నారు. వచ్చిన ఫిర్యాదుపై వెంటనే స్పందించి, ప్రజల నమ్మకానికి తగ్గట్టుగా నిజాయితీగా సేవలు అందించాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏసీపీ చేతుల మీదుగా పండ్ల మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి సిఐ పులి రమేష్, వంగర పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

శరణఘోషలతో వంగరలో అయ్యప్ప స్వాముల సందడి
భీమదేవరపల్లి, నవంబర్ 24 (ప్రజామంటలు) ప్రతినిధి కాశిరెడ్డి ఆదిరెడ్డి:

భీమదేవరపల్లి మండలంలోని వంగర గ్రామంలో సోమవారం జరిగిన అయ్యప్ప స్వాముల పడిపూజ కార్యక్రమం విశేష భక్తి శ్రద్ధల మధ్య విభవంగా నిర్వహించారు. గ్రామానికి చెందిన కుల్లకట్ల అమలకొండాల్ రెడ్డి, వారి పిల్లలు చరణ్ వంశీ, చరితవ్య కుటుంబసభ్యులతో కలిసి ఈ పూజ కార్యక్రమాన్ని సమర్పణతో నిర్వహించారు. పంచముఖ హనుమాన్ ఆలయ అర్చకులు ఉపేందర్ అయ్యగారి మార్గదర్శకత్వంలో అయ్యప్ప స్వామికి అభిషేకం, గణపతి పూజ, పుష్పార్చన, మంత్రపూజతో పాటు ప్రత్యేక పడిపూజ నిర్వహించారు. మంగళవాద్యాల నినాదాలు, వేదఘోషల నడుమ స్వామి పూజలు సాగాయి. కార్యక్రమానికి మండల గురుస్వాములు నరసయ్య, తిరుపతి, సంపత్, శివసాగర్ లు హాజరై స్వాములకు పూజలు చేశారు. 150 మంది అయ్యప్ప స్వాములు, 100కు పైగా భక్తులు పాల్గొని పడి పూజకు మరింత శోభను చేకూర్చారు. అనంతరం అయ్యప్ప మాలధారణ చేసిన స్వాములు శరణఘోషలతో ఊరంతా పండుగ వాతావరణాన్ని, భక్తిరస మయం చేశారు. గ్రామ పెద్దలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

“ఒక్కసారిగా 2000 నాటు కోళ్లు! ఎల్కతుర్తిలో కొక్కొరొకో కలకలం”
గుర్తు తెలియని వారి "నాటు" పథకం – "కోళ్లతో" కలకలం!”

* “ఎల్కతుర్తిలో నాటు కోళ్ల నాటకం… 2000 కోళ్లు ఎవరు వదిలారు?”

* “ఒక్కసారిగా 2000 నాటు కోళ్లు! ఎల్కతుర్తిలో కొక్కొరొకో కలకలం”

* పంట పొలాల్లో నాటు కోళ్ల ‘సందడి’… ఎల్కతుర్తి పంట పొలాల్లో.... !

* 2000 నాటు కోళ్లను ఎవరు వదిలారు? – గ్రామంలో సంచలనం

ఎల్కతుర్తి, నవంబర్ 8 (ప్రజామంటలు) :

హనుమకొండ జిల్లా
పంట పొలాల మధ్య ఒక్కసారిగా వేల సంఖ్యలో నాటు కోళ్లు కనిపించడంతో ఎల్కతుర్తి మండలంలో వివాదాస్పద పరిస్థితులు తలెత్తాయి. సుమారు 2,000కు పైగా నాటు కోళ్లను గుర్తు తెలియని వ్యక్తులు పంట పొలాలు, పత్తి పొలాల్లో వదిలేసిన ఘటన స్థానికుల్లో కుతూహలం, భయాలకూ తావు కలిగించింది.

ఉదయం పొలాలకు వెళ్లిన రైతులు కోళ్లను చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు "ఎవరైనా ఉచితంగా వదిలేశారా!" అని భావించి కోళ్ల వేటకు పరుగులు పెట్టారు. పిల్లలు, పెద్దలు సంచులు పట్టుకుని పంట పొలాల్లో కోళ్లను పట్టుకునేందుకు హోరాహోరీగా పరుగులు తీశారు. కొందరు ఒక్కొక్కరు సంచుల్లో నింపుకొని ఇంటికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

అయితే, ఈ సంఘటనపై వైరస్ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

“పక్షుల వ్యాధులు వ్యాప్తి చెందుతున్న ఈ సమయంలో ఇలా పెద్ద ఎత్తున నాటు కోళ్లను వదిలేయడం అనుమానాస్పదం, ఆ కోళ్లకు ఏదైనా వైరస్ వచ్చి ఉండొచ్చని భయం పడుతున్నాము” అని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

*కోళ్లను ఎవరు, ఎందుకు వదిలారు?*

ఎవరైనా వ్యాపారులు అమ్ముడుపోని కోళ్లను పారేసారా?
లేదా దొంగ కోళ్ల రవాణా జరుగుతుండగా భయంతో వదిలేశారా?
అన్న కోణాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

స్థానికులు ఈ ఘటనపై పశుసంవర్థక శాఖాధికారులు విచారణ చేసి కోళ్ల ఆరోగ్యంపై నివేదిక ఇవ్వాలని కోరుతున్నారు.

గ్రామంలో అయితే ఒక్కసారిగా "నాటు కోళ్ల హంగామా" హైలైట్ అయ్యింది.
ఎల్కతుర్తిలో ఇప్పుడు ఒక్క మాటే… “నాటు కోళ్ల కబురు ఏంటి?” అని.

ఆ నాటు కోళ్లను ఎవరు తినవద్దు - దీపిక పశు వైద్యురాలు ఎల్కతుర్తి

ఇంద్రానగర్ వద్ద దొరికిన నాటు కోళ్లను ప్రజలు ఎవరు తినొద్దు
శనివారం ఉదయం ఇందిరానగర్ గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తులు నాటు కోళ్లను వదిలి వెళ్లారు. అయితే ప్రజలు వీటిని తీసుకెళ్లారు. తీసుకెళ్లిన ప్రజలు ఎవరు వాటిని వండి తినొద్దు. వాటికి ఏమైనా వ్యాధులు ఉన్నాయా అనే విషయంపై కొన్ని కోళ్లను ల్యాబ్ కు పంపించాము. కావున ప్రజలు తమ ఆరోగ్య రీత్యా వాటిని తినకుండా ఉండాలని చెప్తున్నాం.

కొత్తపల్లి గ్రామంలో విషాదం
భీమదేవరపల్లి, అక్టోబర్ 30 (ప్రజామంటలు) :

మొంథా తుఫాను ప్రభావంతో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం అతలాకుతలమైంది. బుధవారం కురిసిన భారీ వర్షం కారణంగా కొత్తపల్లి గ్రామానికి చెందిన అప్పని నాగేంద్రం (58) దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు. నాగేంద్రం హనుమకొండలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. బుధవారం రాత్రి విధులు ముగించుకుని స్వగ్రామానికి బయలుదేరారు. ఈ సమయంలో వర్షం తీవ్రంగా కురుస్తుండడంతో గ్రామ ప్రవేశద్వారంలో ఉన్న కల్వర్టు జలమయమైంది. దారి కనిపించకపోవడంతో ఆయన బైక్‌తో పాటు నీటిలో పడిపోయి మృతిచెందారు. మృతుడు గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కన్ను కోల్పోయినట్లు సమాచారం. ఆయనకు భార్య అనిత, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటనపై మృతుడి భార్య అనిత ఫిర్యాదు మేరకు ముల్కనూర్ ఎస్‌ఐ రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హరీశ్ రావుకు పితృవియోగం
హరీశ్ రావుకు పితృవియోగం

మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ రావు కన్నుమూత

హైదరాబాద్‌, అక్టోబర్‌ 28 (ప్రజామంటలు) :
తెలంగాణ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు  పితృవియోగం కలిగింది. హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు ఈ రోజు, అక్టోబర్ 28,తెల్లవారు 4 గంటల ప్రాంతంలో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని స్వగృహంలో మృతి చెందారు.

సత్యనారాయణ రావు గారు సాదాసీదా వ్యక్తిగా, ప్రజాముఖ్య దృక్పథం కలిగినవారిగా, తన కుమారుడు హరీశ్ రావు రాజకీయ జీవితంలో స్ఫూర్తిగా నిలిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణవార్త తెలిసి హరీశ్ రావు కుటుంబానికి పలువురు రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

మృతదేహాన్ని సిద్దిపేటకు తరలించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అంత్యక్రియలు నేడు (మంగళవారం) సిద్దిపేటలో నిర్వహించనున్నారని సమాచారం.

తన్నీరు కుటుంబానికి ప్రజామంటలు న్యూస్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాము.

చదువులో టాపర్… జీవితంలో ఓడిపోయింది! కన్నీటి సముద్రంలో వంగర గురుకులం
చదువులో టాపర్… జీవితంలో ఓడిపోయింది!

* కన్నీటి సముద్రంలో వంగర గురుకులం

* కరిగిపోయిన కన్న తల్లిదండ్రుల కలలు

* నిన్న ఫోన్‌లో మాట్లాడింది… ఈరోజు శవపేటికలో..

* “ఇంత తెలివైన అమ్మాయి ఎందుకిలా…” చదువులో టాపర్

* గురుకులంలో కుదుపేసిన ఆత్మహత్య ఘటన

భీమదేవరపల్లి, అక్టోబర్ 24 (ప్రజామంటలు) :

హనుమకొండ జిల్లా వంగర మండలంలోని పీవీ నర్సింహరావు గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదాన్ని మిగిల్చింది. వివరాల ప్రకారం, కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన వనం తిరుపతి, మమత దంపతుల కుమార్తె వనం గాయత్రి (15) గత నాలుగేళ్లుగా వంగర గురుకుల పాఠశాలలో విద్యనభ్యసిస్తోంది. ప్రస్తుతం పదో తరగతిలో చదువుతున్న ఆమె స్కూల్ లీడర్‌గా ఉండి, చదువులో ప్రతిభ చూపిస్తూ టాపర్‌గా పేరుపొందింది. గత వారం జ్వరంతో బాధపడడంతో తల్లిదండ్రులు ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న గాయత్రి ఆరోగ్యం మెరుగుపడడంతో బుధవారం సాయంత్రం పాఠశాలకు తిరిగి చేరుకుంది. సాధారణంగా వ్యవహరించిన ఆమె గురువారంనాడు తరగతులకు హాజరైంది. కానీ శుక్రవారం ఉదయం తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత కొన్ని గంటలకే, ఉదయం 9.30 ప్రాంతంలో, పాఠశాల ప్రార్థన అనంతరం డార్మిటరీ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే సహ విద్యార్థులు, సిబ్బంది చెబుతున్న మేరకు ఆమె ఇటీవల కొంత మానసిక ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది. పాఠశాల సిబ్బంది ఈ విషయాన్ని గమనించి వెంటనే వంగర పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై దివ్య సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాణాల సేకరణతో పాటు డార్మిటరీలోని సీసీ ఫుటేజీని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులకు సమాచారం అందించగా, వారు ఆవేదనతో ఆవిసిపోయారు. సహ విద్యార్థులు, ఉపాధ్యాయులు కన్నీటి పర్యంతమయ్యారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వంగర ఎస్సై దివ్య తెలిపారు.