కాంగ్రెస్ పాలనకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితమే నిదర్శనం
పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ
సికింద్రాబాద్, నవంబర్ 14 ( ప్రజామంటలు) :
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించడం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల నమ్మకానికి ప్రతీక అని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ అన్నారు. సనత్‌నగర్‌లో జరిగిన విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఆమె, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఫలితాలిస్తున్నాయనే దానికి ఈ విజయం నిదర్శనమని పేర్కొన్నారు.
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు వడ్డీరహిత రుణాలు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యోగ నియామకాలు వంటి పథకాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు.
రైతాంగానికి తీసుకున్న నిర్ణయాలు గ్రామీణ ప్రాంతాల్లో మంచి ఫలితాలు ఇస్తున్నాయని వెల్లడించారు. బీఆర్ఎస్ దశాబ్ద కాలం ఏమీ చేయలేదని, తప్పుడు ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం విఫలమైందని నీలిమ విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థి స్థానిక బీసీ నాయకుడు కావడం, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిత్వం కూడా విజయంలో కీలకమైందని తెలిపారు. బీఆర్ఎస్ రగిలించిన సెంటిమెంట్ కూడా ప్రజలను ప్రభావితం చేయలేదని వ్యాఖ్యానించారు. కేటీఆర్ చేసిన బుల్డోజర్ ప్రచారం నమ్మకపోవడంతో ప్రజలు నవీన్ యాదవ్‌కే అధికారం అప్పగించారని అన్నారు.
మతం పేరుతో ప్రజలను విడదీసే బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదని, వారి ఆటలు తెలంగాణలో సాగవని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు ఈ విజయమే ప్రతిఫలమని నీలిమ పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు టపాకాయలు పేల్చి, మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు.
––
More News...
<%- node_title %>
<%- node_title %>
జ్యోతి హై స్కూల్, ఐఐటీ అకాడమీలో బాలల దినోత్సవం
నాయకత్వం – బాధ్యత – స్వయం నియంత్రణ: డైరెక్టర్ హరి చరణ్ రావు
జగిత్యాల (రూరల్), నవంబర్ 14 (ప్రజా మంటలు):జగిత్యాల పట్టణంలోని జ్యోతి హై స్కూల్ మరియు ఐఐటీ అకాడమీలో బాలల దినోత్సవం పురస్కరించుకొని సెల్ఫ్ గవర్నెన్స్ డే ను హర్షాతిరేకాలతో నిర్వహించారు. విద్యార్థుల్లో నాయకత్వ నైపుణ్యాలు, బాధ్యతా భావం, పాఠశాల... జూబ్లీహిల్స్ విజయంలో సంబరాలు – ఎమ్మెల్యే డా. సంజయ్ ఆదేశాల మేరకు ఘనంగా వేడుకలు
జగిత్యాల (రూరల్) నవంబర్ 14 (ప్రజా మంటలు):జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 24 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందడం సందర్భంగా జగిత్యాల పట్టణంలో భారీ సంబరాలు జరిగాయి. ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద... మధుమేహం అలక్ష్యం చేస్తే ప్రమాదం – నిపుణ వైద్యుల సందేశం
(రామ కిష్టయ్య సంగన భట్ల, సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్.9440595494)
ధర్మపురి క్షేత్రంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన మధుమేహ అవగాహన కార్యక్రమం ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించిన ప్రాముఖ్యమైన వేదికగా నిలిచింది. మధుమేహం పెరుగుతున్న నేపథ్యం, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల అవసరం దృష్ట్యా, ఈ కార్యక్రమానికి ప్రజలు... గాయత్రి కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ రూ. 3647.67 కోట్ల వ్యాపారం దాటింది :: డిజిటల్ సేవల విస్తరణ
జగిత్యాల,నవంబర్ 14 (ప్రజా మంటలు):72వ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా, జగిత్యాలలోని గాయత్రి కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో సహకార పతాకాన్ని బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి వనమాల శ్రీనివాస్ ఆవిష్కరించారు. అనంతరం “డిజిటలైజేషన్ ప్రమోషన్” అనే అంశంపై నిర్వహించిన సమావేశంలో సహకార విభాగ అధికారులు, బోర్డు సభ్యులు, జనరల్ మేనేజర్లు, సిబ్బంది... వర్షకొండ అక్షర స్కూల్ లో బాలల దినోత్సవం వేడుకలు
ఇబ్రహీంపట్నం నవంబర్ 14(ప్రజామంటలు దగ్గుల అశోక్):
ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని వర్షకొండ గ్రామంలోని అక్షర భారతి కాన్వెంట్ స్కూల్ మరియు అంగన్వాడి కేంద్రంలో బాలల దినోత్సవం సందర్భంగా శుక్రవారం రోజున పాఠశాలలో సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఎన్డీఏపై నమ్మకం ఉంచిన బిహార్ ప్రజలకు ధన్యవాదాలు: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ నవంబర్ 14:
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ప్రజలు ఎన్డీఏపై చూపిన నమ్మకాన్ని ఆయన అభినందించారు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య బలానికి నిదర్శనమని, అభివృద్ధి పట్ల ప్రజల నిబద్ధత మరోసారి రుజువైందని అన్నారు.
బిహార్ తీర్పు చరిత్రాత్మకం – మోదీ
ప్రధాని మోదీ మాట్లాడుతూ, బిహార్... శ్రీశ్రీనివాసఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా కుంకుమార్చనలు
జగిత్యాల నవంబర్ 14 (ప్రజా మంటలు) జగిత్యాల పట్టణంలోని కూరగాయల మార్కెట్ లో గల శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో మాతలచే సామూహిక కుంకుమార్చన నిర్వహించారు.
వైదిక క్రతువును నంబి నరసింహ ఆచార్య (చిన్న స్వామి) నిర్వహించగా కార్యక్రమంలో మేడిపల్లి రాజన్న శర్మ శశాంక మౌళి భార్గవ్ శర్మ రుద్రంగి గోపాలకృష్ణశర్మ సిరిసిల్ల... “కర్మ తిరిగి వచ్చింది” జూబ్లీహిల్స్ ఓటమిపై భారీ చర్చ: కవిత సంచలన ట్వీట్
హైదరాబాద్ నవంబర్ 14 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ ఓటమిపై చేసిన ట్వీట్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.బీఆర్ఎస్ అభ్యర్థి పరాజయంపై స్పందించిన ఆమె, “కర్మ తిరిగి వచ్చింది” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద సంచలనాన్ని సృష్టించాయి.
కవితను... 17న తెలంగాణ కేబినెట్ సమావేశం – స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ అయిన ప్రభుత్వం
హైదరాబాద్ నవంబర్ 14 (ప్రజా మంటలు):
జూబ్లిహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ సాధించిన ఘన విజయంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఈ నెల 17న కేబినెట్ సమావేశం జరుగుతుందని, ఆ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలకు... కాంగ్రెస్ విజయం, హైదరాబాద్ అభివృద్ధి, కేసీఆర్ రాజకీయాలు, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు
హైదరాబాద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి – మీడియా చిట్‌చాట్ ముఖ్యాంశాలు
జూబ్లిహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను అపార మెజారిటీతో గెలిపించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ నాయకత్వం నుంచి కార్యకర్త స్థాయి వరకు అందరూ ఏకమై పనిచేయడంతోనే ఈ విజయాన్ని సాధించామని ఆయన అన్నారు. ఈ గెలుపు... “మాగంటి సునీత ఎంతో కష్టపడ్డారు… బీఆర్ఎస్ తిరిగి లేస్తుంది”
కాంగ్రెస్ పార్టీ ఘన విజయంపై కేసీఆర్ విమర్శ
“బీఆర్ఎస్ కార్యకర్తలు నిరాశపడొద్దు… మేము తిరిగి వస్తాం” కేసీఆర్
బిహార్ ఎన్నికలపై కెటిఆర్ వ్యాఖ్యలు
హైదరాబాద్ నవంబర్ 14 (ప్రజా మంటలు):
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 25వేలకు పైగా ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్... సంచార జాతుల బాలలతో – బాలల దినోత్సవ వేడుకలు
సికింద్రాబాద్, నవంబర్ 14 (ప్రజామంటలు):
బాలల దినోత్సవం సందర్భంగా శుక్రవారం పద్మారావునగర్ కు చెందిన స్కై ఫౌండేషన్ సంచార జాతుల చిన్నారులతో కలిసి ఆనందంగా వేడుకలను నిర్వహించింది. రోడ్ల పక్కన ఫుట్ పాత్ లపై ఉన్న చిన్నారులకు పలకలు, బలపాలు, ఆట వస్తువులు, వివిధ రకాల తినుబండారాలు అందజేస్తూ వారి ముఖాల్లో చిరునవ్వులు పూచించారు.
నేటి... 