గాంధీ ఆసుపత్రిలో మెగా పీడియాట్రిక్ క్యాంపు
సికింద్రాబాద్,సెప్టెంబర్ 18 (ప్రజా మంటలు):
భారత ప్రభుత్వ ఫ్యామిలీ ప్లానింగ్ అదనపు కమిషనర్ డాక్టర్ ఇందు గ్రేవాల్ గురువారం సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా పీడియాట్రిక్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా పీడియాట్రిక్ ఆరోగ్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు.
చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా నిర్వహించిన ఈ శిబిరంలో చిన్నారులకు ఉచిత వైద్య పరీక్షలు, అవసరమైన చికిత్సలు, పోషకాహారం, టీకాలు, ఆరోగ్య సూచనలు అందించబడ్డాయి. శిబిరానికి వచ్చిన తల్లిదండ్రులకు కూడా పిల్లల సంరక్షణ, వ్యాధి నివారణ, ఆహారపు అలవాట్లు, శుభ్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్. వాణి, పీడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ వాసుదేవ్, డాక్టర్ అజయ్ మోహన్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ కె. సునీల్‌కుమార్, సి.ఎస్.ఆర్.ఎంఓ డాక్టర్ శేషాద్రి, డాక్టర్ రాజిని, డాక్టర్ కళ్యాణ్‌తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ ఇందు గ్రేవాల్ మాట్లాడుతూ ..భారత ప్రభుత్వం చేపట్టిన ‘స్వస్థ నారి–స్వసక్తి కుటుంబ్ అభియాన్ లో భాగంగా దేశవ్యాప్తంగా మహిళలు, పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. కుటుంబం బలపడాలంటే మహిళలు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యవంతమైన పిల్లలే సమాజానికి వెలుగులు నింపుతారు అని తెలిపారు. సూపరింటెండెంట్ డాక్టర్ వాణి మాట్లాడుతూ ..గాంధీ ఆసుపత్రిలో పీడియాట్రిక్ విభాగం ఆధ్వర్యంలో తరచూ ఇలాంటి ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తాము. ఈ రోజు నిర్వహించిన శిబిరం ద్వారా వందలాది చిన్నారులకు ఉచిత వైద్య పరీక్షలు జరిపాం. రాబోయే రోజుల్లో మరిన్ని విభాగాల సహకారంతో పెద్ద స్థాయిలో ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ మెగా శిబిరం ద్వారా తల్లిదండ్రుల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందడమే కాకుండా, చిన్నారులకు సమగ్ర వైద్యసేవలు అందించినట్లు వైద్యులు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మానవాళికీ ప్రథమ శత్రువు ప్లాస్టిక్ భూతం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఉత్తమ ఉపాధ్యాయుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

తల్లిదండ్రులను విస్మరిస్తే శిక్షార్హులే జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

భువనేశ్వర్–ముంబయి గంజాయి అక్రమ రవాణా రాకెట్ ఆటకట్టు

గాంధీ ఆసుపత్రిలో మెగా పీడియాట్రిక్ క్యాంపు

ఇబ్రహీంపట్నం మండలం లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

ముత్తారం మూలమలుపు చెట్ల తొలగింపు - స్పందించిన ముల్కనూర్ పోలీస్

రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి
.jpg)
మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్
