ఉద్యోగులు, పెన్షనర్లకు రీయింబర్స్ మెంట్ తిప్పలు తీర్చాలి
-తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్
జగిత్యాల జులై 20 (ప్రజా మంటలు):
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు వైద్య ఖర్చుల రీయింబర్స్ మెంట్ కోసం ఎదురు చూస్తూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొం టున్నారని తెలంగాణ పెన్షనర్ల సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.ఆదివారం అసోసియేషన్ కార్యాలయంలో జిల్లా స్థాయి పెన్షనర్ల సమావేశం జరిగింది.ఈ సందర్భంగా హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ దాదాపు 20 వేల అప్లికేషన్లు వివిధ దశల్లో పెండింగ్ లో ఉండగా, రూ.250 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉన్నదని, నిబం ధనల ప్రకారం.. ఉద్యోగులకు రూ.3 లక్షలు, పెన్షనర్లకు రూ.2 లక్షల వరకు వైద్య ఖర్చులు డీఎంఈ ఆమోదంతో తిరిగి చెల్లించాల్సి ఉండగా ఏడాదికిపైగా సమయం తీసుకోవడం తో క్యాన్సర్, కిడ్నీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బా ధపడుతున్న వారు మరింత కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా ప్రభు త్వం స్పందించి, మెడికల్ రీయింబర్స్ మెంట్ అప్లికేషన్లను త్వరగా పరిష్కరించి బకాయిలను క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లం విజయ్,అసోసియేట్ అధ్యక్షుడు పి.సి.హన్మంత రెడ్డి,కోశాధికారి గౌరిశెట్టి విశ్వనాథం, ఉపాధ్యక్షులు వెల్ముల ప్రకాష్ రావు, ఎం.డి.యాకూబ్, ఆర్గనైజింగ్ కార్యదర్శులు పి.ఆశోక్ రావు, కె.సత్యనారాయణ, కోరుట్ల అధ్యక్షుడు పబ్బా శివానందం, మెట్ పల్లి అధ్యక్షుడు వి.ప్రభాకర్ రావు,ధర్మపురి అధ్యక్షుడు కండ్లే గంగాధర్,దేవేందర్ రావు, ఉప్పుగల్ల మురళీధర్, నారాయణ, కరుణ, విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులదే కీలక పాత్ర -ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అరిగల అశోక్ కుమార్

వాల్మీకి ఆవాసం, సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు. -ఆర్ఎస్ఎస్ విభాగ్ సేవ ప్రముఖ్ ఆకు రాజేందర్

వేతనాలు,కూలీలు చెల్లించాలా పోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే - రాష్ట్ర మానవహక్కుల కమీషన్

ఉద్యోగులు, పెన్షనర్లకు రీయింబర్స్ మెంట్ తిప్పలు తీర్చాలి

అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది లారీలపై కేసు నమోదు

శ్రీమావురాల ఎల్లమ్మ ఆలయంలో బోనాల సందడి
.jpg)
గతంలో కన్నా ఈసారి బోనాల ఉత్సవాలు గొప్పగా జరిగాయి.
.jpg)
మాజీ వైస్ ఎంపీపీ ఆవుల సత్యం తల్లిబి పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం.... నివాళులు అర్పించిన మాజీ మంత్రి కొప్పుల,డిక్కీ జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్

నూతన విద్యుత్ పోల్స్ ను వెంటనే వేయించాలి
.jpg)
108 జిల్లా స్టార్ ఈ ఏం టి అవార్డు పొందిన అంకతి మనస
.jpg)
లయన్స్ క్లబ్ నవభారత్, వనిత భారత్ నూతన కమిటీల ఏర్పాటు
