గతంలో కన్నా ఈసారి బోనాల ఉత్సవాలు గొప్పగా జరిగాయి.
బోనాల వేడుకల్లో పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమా - అమ్మవార్లకు బోనాల సమర్పణ
సికింద్రాబాద్ జూలై 20 (ప్రజామంటలు) :
బోనాల పండగ నేపథ్యంలో ఆదివారం పీసీసీ ఉపాధ్యక్షురాలు, సనత్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు ఆలయాలను సందర్శించారు. ఈసందర్బంగా సంప్రదాయబద్దంగా ఆయా ఆలయాల్లోని అమ్మవార్లకు బోనాలు సమర్పించి పూజలు చేశారు. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి సాధారణ క్యూ లైన్ లో వెళ్లి బోనం సమర్పించి దర్శించుకున్నారు.
అనంతరం సనత్ నగర్ సెవెన్ టెంపుల్స్ అమ్మవార్లను దర్శించుకున్నారు. తర్వాత బన్సీలాల్ పేటలోని భోలక్ పూర్ ఏరియాలో గల అమ్మవారి ఆలయాన్ని, పద్మారావు నగర్ బస్తీలో గల అమ్మవారి ఆలయాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం బోనాల ఉత్సవాలకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిందన్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక బడ్జెట్ కేటాయించిందని తెలిపారు. బోనాల విజయవంతానికి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతో పక్కడ్బందీగా ఏర్పాట్లు చేసిందన్నారు. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేశారన్నారు. గతేడాది కన్నా ఈ ఏడాది ఉత్సవాలు బాగా జరిగాయన్నారు.
వర్షాలు సంవృద్దిగా కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. మరోవైపు బోనాలు విజయవంతానికి ప్రత్యేక దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులదే కీలక పాత్ర -ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అరిగల అశోక్ కుమార్

వాల్మీకి ఆవాసం, సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు. -ఆర్ఎస్ఎస్ విభాగ్ సేవ ప్రముఖ్ ఆకు రాజేందర్

వేతనాలు,కూలీలు చెల్లించాలా పోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే - రాష్ట్ర మానవహక్కుల కమీషన్

ఉద్యోగులు, పెన్షనర్లకు రీయింబర్స్ మెంట్ తిప్పలు తీర్చాలి

అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది లారీలపై కేసు నమోదు

శ్రీమావురాల ఎల్లమ్మ ఆలయంలో బోనాల సందడి
.jpg)
గతంలో కన్నా ఈసారి బోనాల ఉత్సవాలు గొప్పగా జరిగాయి.
.jpg)
మాజీ వైస్ ఎంపీపీ ఆవుల సత్యం తల్లిబి పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం.... నివాళులు అర్పించిన మాజీ మంత్రి కొప్పుల,డిక్కీ జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్

నూతన విద్యుత్ పోల్స్ ను వెంటనే వేయించాలి
.jpg)
108 జిల్లా స్టార్ ఈ ఏం టి అవార్డు పొందిన అంకతి మనస
.jpg)
లయన్స్ క్లబ్ నవభారత్, వనిత భారత్ నూతన కమిటీల ఏర్పాటు
