మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు భరోసా సంబరాలు
జగిత్యాల జూన్ 24 (ప్రజా మంటలు)
మాజీ మంత్రి వర్యులు జీవన్ రెడ్డి ఆద్వర్యంలో రైతు భరోసా విజయోత్సవాలు నిర్వహించారు
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ నుండి
కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక తహసీల్ చౌరస్తా వరకు ర్యాలీగా తరలి వెళ్లారు. తహసీల్ చౌరస్తాలో టపాసులు పేల్చి, స్వీట్లు పంపిణీ చేసి,సంబురాలు చేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి చిత్ర పటాలకు క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ..
రైతాంగానికి అండగా నిలుస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ..
స్వతంత్రం అనంతరం నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ తో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలమైంది.
రైతులను అప్పుల ఊబి నుండి విముక్తి కల్పించేందుకు సోనియా గాంధీ ఏక మొత్తంలో లక్ష రూపాయలు మాఫీ చేసారు.
రాష్ట్రంలో రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ లో పేర్కొన్న విధంగా రైతులను రుణ విముక్తులను చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తదుపరి రెండు లక్షలు రుణ మాఫీ చేయడంతో పాటు
గిట్టుబాటు ధరను కల్పిస్తూ, బోనస్ అందిస్తోంది
రైతులను ప్రోత్సహించేందుకు సన్న రకాలకు బోనస్ ఇస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ రాష్ట్రం మాత్రమే.
రైతు భరోసా పంట సాగు సమయంలో అందక
గతంలో పెట్టుబడి సాయం కోసం రైతులు ఎదురు చూసేవారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఖరీఫ్ పంట సాగు సమయానికి పెట్టుబడి సాయం 6000 కల్పించడం మొదటి సారి అని స్పష్టం చేశారు.
ఒక కోటి 40 లక్షల ఎకరాల పంట సాగుకు
తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేలకోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా కల్పించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కింది.
రైతులతో పాటు రైతు కూలీలకు ఉపాధి హామీ జాబ్ కార్డు ఉన్న కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద నెలకు వెయ్యి చొప్పున ఏడాదికి 12000 చెల్లించడం హర్షణీయం.
రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందనీ
వ్యవసాయానికి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్ అమలుకు శ్రీకారం చుడితే గృహ అవసరాలకు 200 యూనిట్ల వరకు ఉచితం కల్పించిన ఘనత రేవంత్ రెడ్డిది అన్నారు.
రైతులకు అండగా నిలవడం ప్రభుత్వ బాధ్యతగా భావించి పంటలకు
మద్దతు ధర కల్పించడం తో పాటు బోనస్ ఇస్తున్నామన్నారు.
నిరుపేదలకు పట్టెడన్నం పెట్టేలా ప్రభుత్వం పంపిణీ చేసే బియ్యం వినియోగపడాలనే సంకల్పంతో సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమేనన్నారు .
కాంగ్రెస్ ప్రభుత్వం అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రాజకీయాలు అతీతంగా రేషన్ కార్డు జారీ చేస్తున్నామన్నారు.
ఇల్లు లేని నిరుపేద లను సొంత ఇంటి కల సాకారం చేసేందుకు ఇందిరమ్మ గృహ వసతి కింద ఇల్లు కేటాయిస్తున్నామన్నాడు
రైతు భరోసా తో రైతు కళ్ళల్లో ఆనందం నింపిన సి ఏం రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులదే కీలక పాత్ర -ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అరిగల అశోక్ కుమార్

వాల్మీకి ఆవాసం, సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు. -ఆర్ఎస్ఎస్ విభాగ్ సేవ ప్రముఖ్ ఆకు రాజేందర్

వేతనాలు,కూలీలు చెల్లించాలా పోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే - రాష్ట్ర మానవహక్కుల కమీషన్

ఉద్యోగులు, పెన్షనర్లకు రీయింబర్స్ మెంట్ తిప్పలు తీర్చాలి

అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది లారీలపై కేసు నమోదు

శ్రీమావురాల ఎల్లమ్మ ఆలయంలో బోనాల సందడి
.jpg)
గతంలో కన్నా ఈసారి బోనాల ఉత్సవాలు గొప్పగా జరిగాయి.
.jpg)
మాజీ వైస్ ఎంపీపీ ఆవుల సత్యం తల్లిబి పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం.... నివాళులు అర్పించిన మాజీ మంత్రి కొప్పుల,డిక్కీ జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్

నూతన విద్యుత్ పోల్స్ ను వెంటనే వేయించాలి
.jpg)
108 జిల్లా స్టార్ ఈ ఏం టి అవార్డు పొందిన అంకతి మనస
.jpg)
లయన్స్ క్లబ్ నవభారత్, వనిత భారత్ నూతన కమిటీల ఏర్పాటు
