బదిలీ పై వెళుతున్న అదనపు ఎస్పి భీమ్ రావు కి ఆత్మీయ వీడ్కోలు
జగిత్యాల జూన్ 24 ( ప్రజా మంటలు)
బదిలీ లో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కి బదిలీ పై వెళుతున్న అదనపు ఎస్పి భీమ్ రావు ని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ శాలువా తో సన్మానించి ఆత్మీయ వీడ్కోలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... జిల్లాలో అదనపు ఎస్పీగా పనిచేసిన భీమ్ రావు సేవలు అభినందనీయమని అన్నారు.ప్రభుత్వ అధికారులు ఉత్తమ సేవలందిస్తే గుర్తింపు పొందుతారనే దానికి భీమ్ రావు ఒక నిదర్శనమని అన్నారు.
జిల్లాలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ మరియు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మరియు ఇతర గ్రూప్- 1,2,3,4, ఇతర పోటీ పరీక్షల్లో నిర్వహణలో పోలీస్ శాఖ తరపున చేయవలసిన భద్రతాపరమైన ఏర్పాట్లు పూర్తిచేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా విజయవంతంగా నిర్వహించడానికి ఎంతో కృషి చేశారని అన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీ సర్వసాధారణమని ఎక్కడ విధులు నిర్వహించిన అంకిత భావంతో వృత్తి ధర్మాన్ని నిర్వర్తించి పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
అనంతరం అదనపు ఎస్పి భీమ్ రావు మాట్లాడుతూ జిల్లా లో సుమారు 22 నెలల పాటు నిర్వర్తించిన విధులు సంతృప్తి నిఛ్చాయని పోలీస్ అధికారులు, సిబ్బంది సహకారం మరువలేనిది అని అన్నారు. సమర్థవంతంగా పనిచేసి మధుర స్మృతులతో బదిలీ పై వెళ్లడం ఆనందంగా ఉందన్నారు.
ఈ యొక్క కార్యక్రమంలో డిఎస్పి రఘు చందర్, రాములు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు కిరణ్ కుమార్, వేణు, సైదులు, ఇన్స్పెక్టర్ లు శ్రీనివాస్,ఆరిఫ్ అలీ ఖాన్,కరుణాకర్, శ్రీధర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వాల్మీకి ఆవాసం, సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు. -ఆర్ఎస్ఎస్ విభాగ్ సేవ ప్రముఖ్ ఆకు రాజేందర్

వేతనాలు,కూలీలు చెల్లించాలా పోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే - రాష్ట్ర మానవహక్కుల కమీషన్

ఉద్యోగులు, పెన్షనర్లకు రీయింబర్స్ మెంట్ తిప్పలు తీర్చాలి

అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది లారీలపై కేసు నమోదు

శ్రీమావురాల ఎల్లమ్మ ఆలయంలో బోనాల సందడి
.jpg)
గతంలో కన్నా ఈసారి బోనాల ఉత్సవాలు గొప్పగా జరిగాయి.
.jpg)
మాజీ వైస్ ఎంపీపీ ఆవుల సత్యం తల్లిబి పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం.... నివాళులు అర్పించిన మాజీ మంత్రి కొప్పుల,డిక్కీ జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్

నూతన విద్యుత్ పోల్స్ ను వెంటనే వేయించాలి
.jpg)
108 జిల్లా స్టార్ ఈ ఏం టి అవార్డు పొందిన అంకతి మనస
.jpg)
లయన్స్ క్లబ్ నవభారత్, వనిత భారత్ నూతన కమిటీల ఏర్పాటు

పల్లెల్లో పడకేసిన పారిశుద్ధ్యం...వర్షాకాలం కావడంతో విషపురుగులు ,దోమలతో అనారోగ్యాలు
