ఉజ్జయిని మహాకాళి బోనాల జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు.
అధికారులతో మంత్రి పొన్నం, ఎమ్మెల్యే తలసాని సమీక్ష
- పాల్గొన్న అన్ని శాఖల అధికారులు..
సికింద్రాబాద్ జూన్ 24 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆషాడం బోనాల జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని, అందుకు తగ్గట్లు ఏర్పాట్లు ఉండాలని రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమశాఖ మంత్రి, హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ పొన్నం ప్రభాకర్ జిల్లా అధికారులను ఆదేశించారు. మంత్రి తో పాటు దేవాదాయ కమిషనర్,జిల్లా కలెక్టర్ దాసరి హరి చందన,మహాకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.
అనంతరం సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహకాళి దేవస్థానం నందు ఆషాడ జాతర బోనాలు ఉత్సవాల ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్షా సమావేశానికి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి అధ్యక్షతన చేపట్టాగా స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్,డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత,స్థానిక రాం గోపాల్ పేట్ కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్,మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి,సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కోట నీలిమ,దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్.వెంకట్రావు అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చరిత్ర కలిగిన శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆషాడ జాతర బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగానిర్వహించాలని దానికి తగ్గట్టుగా అన్నిశాఖల అధికారులు సమ న్వయంతో కలిసి పని చేస్తూ బోనాల జాతరను విజయవంతం చేయాలని మంత్రి ఆదేశించారు.
శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవస్థానం సికింద్రాబాద్ నందు జూలై 13న అమ్మవారికి బోనాలు సమర్పణ, 14 న రంగం ( భవిష్యవాణి) అమ్మవారిని అంబారిపై ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని, రెండు రోజులలో భక్తులు,ప్రజలు లక్షల్లో తరలి వస్తారని ఆ దిశగా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండాలని మంత్రి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా 13 వ తేదీన దేవాలయంలో భక్తులకు అమ్మవారి దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని దేవాలయ, పోలీస్ అధికారులను మంత్రి ఆదేశించారు.గత జాతర అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అధికారులందరూ సేవా భావం అలాగే బాధ్యతా యుతంగా పనిచేయాలని మంత్రి సూచించారు.
అదేవిధంగా రెవిన్యూ దేవాదాయ, పోలీస్ శాఖ,జిహెచ్ఎంసి అధికారులు సమన్వయం తోకలిసి పని చేయాలని ముఖ్యంగా 14 వ తేదీన అంబారీ ఊరేగింపులో భక్తులు,ప్రజలకు తొక్కిసలాటలు కాకుండా పోలీస్ అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని మంత్రి పొన్నం ఆదేశించారు.రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ బోనాల ఉత్సవాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ప్రభుత్వం ఇప్పటికే నిధులు మంజూరు చేసిందని,3600 దేవాలయాలకు సంబంధించి సమీక్ష రాష్ట్ర స్థాయి అధికారుల తో జరిగింది.అలాగే గోల్కొండ బోనాలు, బల్కంపేట ఎల్లమ్మ బోనాలు,శ్రీ ఉజ్జయిని మహాకాళి బోనాలు,లాల్ దర్వాజా బోనాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు మంత్రి పొన్నం పేర్కొన్నారు.
బోనాలు నిర్వహించే దేవాలయాల్లోఎక్కడ కూడా విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను,ఆలయఈవో నీ కోరుతున్న ఆలయంలోపల కేబుల్ వైర్ లు కొత్తవి వేసి ఇబ్బందులు,ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి అన్ని మంత్రి సూచించారు. రాష్ట్రం తో పాటు దేశం నలుమూలల నుండి తెలంగాణ బోనాల ఉత్సవాలకు భక్తులు తరలి వస్తారని నిరంతర విద్యుత్,త్రాగునీరు, వాహనాల పార్కింగ్, వాహనాల మళ్లింపు, ట్రాఫిక్ నియంత్రణ, భారీ కేటింగ్ ఏర్పాట్లు, నిరంతరం నీటి నిల్వలు పరిశీలన,పారిశుద్ధ్య పనులు అలాగే మొబైల్ టాయిలెట్స్, సిసి కెమెరాల నిర్వహణ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని సంబంధిత శాఖల అధికారులు మంత్రి ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఉజ్జయిని మహంకాళి బోనాలు అంటేనే తెలంగాణకు ఒక ప్రత్యేకమని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సమిష్టితో ఏసి పనిచేయాలని, వివిధ శాఖల అధికారులు పోలీసు అధికారుల సర్వీసును ఈ జాతరలో ఉపయోగించు కోవాలని అన్నారు.
అమ్మవారికి బోనాలు సమర్పణ,ఊరేగింపులో భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొంటారని ఏర్పాట్లు ఘనంగా ఉండాలని పేర్కొన్నారు.కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఎస్.కామేశ్వర్,టెంపుల్ ఈఓ మనోహర్ రెడ్డి,ఆదనపు సిపి విక్రమ్ సింగ్ మాన్, జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు,ఉత్తర మండల డిసిపి సాధన రష్మీ పెరుమాళ్,ట్రాఫిక్ డిసిపి రాహుల్ హెగ్డే,మహంకాళి ఏసిపి సుబ్బయ్య,సికింద్రాబాద్ జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ రవికిరణ్,ఎస్.ఈ విద్యుత్ శాఖ చక్రపాణి,ఆర్అండ్ బి ఈఈ మనోహర్, డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి,జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ,వాటర్ వర్క్స్,మెడికల్, మహంకాళి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పరుశురాం,ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
- జోగిని వాళ్ళకి ప్రత్యేక ఏర్పాట్లు..
మాకు బోనం ఎత్తుకునే వారే ప్రథమ ప్రాధాన్యత...జోగిని వాళ్ళకి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం...బోనాల సమయంలో కాకుండా రద్దీ తక్కువ ఉన్న సమయంలో వీఐపీలు దర్శనానికి వస్తే ఇబ్బందులు ఉండవు,ఉజ్జయిని మహకాళి బోనాలు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండాలి.. డెక్కన్ మానవ సేవ సమితి,ఇతర సంస్థలు ఇక్కడ చాలా సేవ కార్యక్రమాలు చేస్తున్నాయి.అందరూ వారి సహకారం అందించి ఉత్సవాల్లో భాగస్వామ్యం కావాలి.. అన్ని పొన్నం ప్రభాకర్ అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులదే కీలక పాత్ర -ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అరిగల అశోక్ కుమార్

వాల్మీకి ఆవాసం, సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు. -ఆర్ఎస్ఎస్ విభాగ్ సేవ ప్రముఖ్ ఆకు రాజేందర్

వేతనాలు,కూలీలు చెల్లించాలా పోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే - రాష్ట్ర మానవహక్కుల కమీషన్

ఉద్యోగులు, పెన్షనర్లకు రీయింబర్స్ మెంట్ తిప్పలు తీర్చాలి

అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది లారీలపై కేసు నమోదు

శ్రీమావురాల ఎల్లమ్మ ఆలయంలో బోనాల సందడి
.jpg)
గతంలో కన్నా ఈసారి బోనాల ఉత్సవాలు గొప్పగా జరిగాయి.
.jpg)
మాజీ వైస్ ఎంపీపీ ఆవుల సత్యం తల్లిబి పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం.... నివాళులు అర్పించిన మాజీ మంత్రి కొప్పుల,డిక్కీ జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్

నూతన విద్యుత్ పోల్స్ ను వెంటనే వేయించాలి
.jpg)
108 జిల్లా స్టార్ ఈ ఏం టి అవార్డు పొందిన అంకతి మనస
.jpg)
లయన్స్ క్లబ్ నవభారత్, వనిత భారత్ నూతన కమిటీల ఏర్పాటు
