ముల్కనూర్ లో శ్రీ వేంకటేశ్వర హాస్పిటల్ ప్రారంభం
మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం
ముల్కనూర్లో శ్రీ వేంకటేశ్వర హాస్పిటల్ రిబ్బన్ కట్ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి
భీమదేవరపల్లి జూన్ 24 (ప్రజామంటలు) :
హన్మకొండ జిల్లా ముల్కనూర్ గ్రామంలో నూతనంగా నిర్మితమైన శ్రీ వేంకటేశ్వర హాస్పిటల్ నేడు (24-06-2025) ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ MLA అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి, టెంకాయ సమర్పించి ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ ఆసుపత్రి ప్రారంభం కమ్మరిపేట మాజీ సర్పంచ్ రాజ మల్లయ్య ఆహ్వానంపై జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రవీణ్ రెడ్డి "ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లకుండానే అన్ని సౌకర్యాలతో కూడిన వైద్యం అందుకోవాలన్నదే లక్ష్యం. అందుకు అనుగుణంగా ఈ ఆసుపత్రి ఏర్పాటు చేయడం అభినందనీయం" అని పేర్కొన్నారు. ఆసుపత్రిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, వైద్య సిబ్బంది, అలాగే వేలేరు, భీమదేవరపల్లి మండలాల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులదే కీలక పాత్ర -ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అరిగల అశోక్ కుమార్

వాల్మీకి ఆవాసం, సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు. -ఆర్ఎస్ఎస్ విభాగ్ సేవ ప్రముఖ్ ఆకు రాజేందర్

వేతనాలు,కూలీలు చెల్లించాలా పోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే - రాష్ట్ర మానవహక్కుల కమీషన్

ఉద్యోగులు, పెన్షనర్లకు రీయింబర్స్ మెంట్ తిప్పలు తీర్చాలి

అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది లారీలపై కేసు నమోదు

శ్రీమావురాల ఎల్లమ్మ ఆలయంలో బోనాల సందడి
.jpg)
గతంలో కన్నా ఈసారి బోనాల ఉత్సవాలు గొప్పగా జరిగాయి.
.jpg)
మాజీ వైస్ ఎంపీపీ ఆవుల సత్యం తల్లిబి పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం.... నివాళులు అర్పించిన మాజీ మంత్రి కొప్పుల,డిక్కీ జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్

నూతన విద్యుత్ పోల్స్ ను వెంటనే వేయించాలి
.jpg)
108 జిల్లా స్టార్ ఈ ఏం టి అవార్డు పొందిన అంకతి మనస
.jpg)
లయన్స్ క్లబ్ నవభారత్, వనిత భారత్ నూతన కమిటీల ఏర్పాటు
