కస్తూర్బా గాంధీ జూనియర్ మహిళా కళాశాలలో జాబ్ మేళా
సికింద్రాబాద్, జూన్ 23 (ప్రజామంటలు) :
నేటి యువతకు ఉజ్వల భవిష్యత్తు వృత్తి విద్య కోర్సులతోనే అని ఇంటర్ విద్య డైరెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. సికింద్రాబాద్ వెస్ట్ మారేడు పల్లి కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్ కళాశాల ప్రాంగణంలో సోమవారం వృత్తి విద్య కోర్సులు పూర్తి చేసిన విద్యార్థుల కోసం అప్రెంటిషిప్,కమ్ జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ఇంటర్ విద్య డైరెక్టర్ కృష్ణ ఆదిత్య,ఇంటర్ విద్య జాయింట్ డైరెక్టర్ వెంకయ్య నాయక్,జాయింట్ సెక్రటరీ జ్యోష్న రాణి,కస్తూర్బా జూనియర్ కళాశాల సొసైటీ కార్యదర్శి అల్తాఫ్ హుస్సేన్,ట్రెజరర్ సురేందర్ రావు,ప్రిన్సిపాల్ డాక్టర్ సిహెచ్ చారుమతి దేవి, స్కిల్ డెవలప్మెంట్ సతీష్ రెడ్డి,కోఆర్డినేటర్ సురేందర్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ కంపెనీలను,నిరుద్యోగ యువతను ఒకే వేదిక పైకి తీసుకొచ్చి,ఉద్యోగ అవకాశాలను కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.చదువు పూర్తయిన వెంటనే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ మేళా ప్రధాన ఉద్దేశమని, నిరుపేద కుటుంబాల పిల్లలకు ఇది గొప్ప అవకాశమని వివరించారు.
అనంతరం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఒద్దన్న మాట్లాడుతూ ఈ మేళాను విజయవంతం చేయడానికి ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి,గత వారం రోజులుగా పరిశ్రమల సర్వే నిర్వహించి,విద్యార్థులకు కంపెనీలకు సమాచారం అందించామన్నారు. 81 కంపెనీలలో 3183 వృత్తి విద్యా కోర్సుల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు గుర్తించిన జాబ్ మేళాను నిర్వహించారు. మొత్తం 53 కంపెనీలు 572 విద్యార్థులను ఇంటర్వ్యూ లు నిర్వహించారు. సెలెక్ట్ అయిన తర్వాత నేరుగా విద్యార్థులకు సమాచారాన్ని అందజేస్తారు. అలాగే జిల్లాలోని 22 ప్రభుత్వ 30 ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపల్స్,లెక్చరర్లు, వికారాబాద్, రంగారెడ్డి,నాగర్‌కర్నూల్, నిజామాబాద్,ఖమ్మం జిల్లాల నుండి విద్యార్థులు పాల్గొన్నారు.గత మూడు సంవత్సరాల్లో వృత్తి విద్య కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు మేళాలో పాల్గొన్నారు. అనేక కంపెనీలు ఈ విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించాయి.వీరిలో చాలామంది విద్యార్థులు ఎంపిక అయ్యారని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
కృష్ణ ఆదిత్య,జ్యోష్న రాణి కాలేజీ ప్రిన్సిపాల్ చారుమతి దేవి మెమెంటు ఇచ్చి శాలువాతో సన్మానించారు. ఈ ప్రోగ్రాం లో ప్రత్యేక ఆకర్షణగా భరతనాట్యం చేసిన కుమారి తనిష్క ను శాలువా సన్మానించారు. అలాగే విద్యలో ఉత్తమప్రతిభ కనబరచిన విద్యార్థిని విద్యార్థులకు మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కస్తూర్బా మహిళా కళాశాల లెక్చరర్లు,సిబ్బంది,ఈ జాబు మేళ విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నూతన విద్యుత్ పోల్స్ ను వెంటనే వేయించాలి
.jpg)
108 జిల్లా స్టార్ ఈ ఏం టి అవార్డు పొందిన అంకతి మనస
.jpg)
లయన్స్ క్లబ్ నవభారత్, వనిత భారత్ నూతన కమిటీల ఏర్పాటు

పల్లెల్లో పడకేసిన పారిశుద్ధ్యం...వర్షాకాలం కావడంతో విషపురుగులు ,దోమలతో అనారోగ్యాలు

గీత సత్సంగ్ ఆధ్వర్యంలో భగవద్గీత శిక్షకునికి జ్ఞాపిక అందజేత

అంబిటస్ స్కూల్లో అంబరాన్నాంటిన బోనాల సంబరాలు

ధర్మపురిలో యమునికి భరణీ నక్షత్ర విశేష పూజలు

జగిత్యాల జిల్లా కిషన్ రావుపేటలో పరువు హత్య - ఇద్దరి అరెస్ట్!
.jpg)
శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం భూ సేకరణ విస్తరణను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

మల్యాల గొల్లపల్లి సబ్ డివిజన్ విద్యుత్ సిబ్బందితో ఎస్.ఈ సుదర్శనం సదస్సు

జిల్లా స్థాయి అథ్లెటిక్స్ లో గర్ల్స్ హై స్కూల్ విద్యార్థుల ప్రతిభ

గొల్లపల్లి మోడల్ స్కూల్ లో ఘనంగా తెలంగాణ బోనాలు
