కలెక్టర్ కు పెన్షనర్ల మెగా మెమోరాండం.
జగిత్యాల జూన్ 23 (ప్రజా మంటలు):
కేంద్రప్రభుత్వం లోకసభలో ఇటీవల ఆమోదించుకున్న పెన్షన్ సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని కోరుతూ సోమవారం తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కు పెన్షనర్లు మెగా మెమోరాండం ను సమర్పిస్తూ ప్రధాన మంత్రికి పంపాలని కోరారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్, సహాయ అధ్యక్షుడు పి.హన్మంత రెడ్డి,కోశాధికారి గౌరిశెట్టి విశ్వనాథం లు మాట్లాడుతూ మెగా మెమోరాండం లో పేర్కొన్న అంశాలను వివరించారు. పెన్షనర్లను పాత,కొత్త పెన్షన్ దారులుగా విడదీయడము ఈ బిల్లులోని ముఖ్య విషయమన్నారు.ఈ బిల్లు చట్ట రూపంలో అమల్లోకి వస్తే పెన్షనర్లు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతారని,ఆ బిల్లును రద్దు చేయడానికి సుదీర్ఘ ఉద్యమాన్ని సాగించడానికి సంసిద్ధంగా ఉండాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు పి.సి.హన్మంత రెడ్డి,కోశాధికారి గౌరిశెట్టి విశ్వనాథం,ఉపాధ్యక్షుడుఎం.డి.యాకూబ్,ఆర్గనైజింగ్ కార్యదర్శులు పూసాల అశోక్ రావు, కే.సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శి దిండిగాల విఠల్,కోరుట్ల అధ్యక్షుడు పబ్బా శివానందం,కార్యదర్శి రాజ్ మోహన్,కోశాధికారి లక్ష్మీ నారాయణ, సంయుక్త కార్యదర్శి టి.రాజయ్య,,మెట్ పల్లి అధ్యక్షుడు వి.ప్రభాకర్ రావు,ధర్మపురి అధ్యక్షుడు కే.గంగాధర్, జగిత్యాల యూనిట్ అధ్యక్షుడు బి.రాజేశ్వర్,మల్యాల అధ్యక్షుడు ఎం.డి.యాకూబ్, నాయకులు కొక్కు నారాయణ,దేవేందర్ రావు,ఎం.డి.ఇక్బాల్,మనోహర్, కరుణ,విజయలక్ష్మి, జిల్లా,డివిజన్,మండలాల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మాజీ వైస్ ఎంపీపీ ఆవుల సత్యం తల్లిబి పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం.... నివాళులు అర్పించిన మాజీ మంత్రి కొప్పుల,డిక్కీ జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్

నూతన విద్యుత్ పోల్స్ ను వెంటనే వేయించాలి
.jpg)
108 జిల్లా స్టార్ ఈ ఏం టి అవార్డు పొందిన అంకతి మనస
.jpg)
లయన్స్ క్లబ్ నవభారత్, వనిత భారత్ నూతన కమిటీల ఏర్పాటు

పల్లెల్లో పడకేసిన పారిశుద్ధ్యం...వర్షాకాలం కావడంతో విషపురుగులు ,దోమలతో అనారోగ్యాలు

గీత సత్సంగ్ ఆధ్వర్యంలో భగవద్గీత శిక్షకునికి జ్ఞాపిక అందజేత

అంబిటస్ స్కూల్లో అంబరాన్నాంటిన బోనాల సంబరాలు

ధర్మపురిలో యమునికి భరణీ నక్షత్ర విశేష పూజలు

జగిత్యాల జిల్లా కిషన్ రావుపేటలో పరువు హత్య - ఇద్దరి అరెస్ట్!
.jpg)
శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం భూ సేకరణ విస్తరణను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

మల్యాల గొల్లపల్లి సబ్ డివిజన్ విద్యుత్ సిబ్బందితో ఎస్.ఈ సుదర్శనం సదస్సు
