పెండింగ్ లో ఉన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదల చేయాలి బిసి విద్యార్థి సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నారోజు రాకేష్ చారి
కరీంనగర్ జూన్ 23 ( ప్రజా మంటలు)
ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు నారోజు రాకేష్ చారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ కి వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుండి ఫీజు రీయింబర్స్ మెంట్ అందలేదని 2021-22 సంవత్సరం నుండి జిల్లా బీసీ సంక్షేమ శాఖలో 114 కోట్ల రూపాయల వరకు బకాయిలు పేరుకు పోయాయని తెలిపారు. విద్యార్థులు కళాశాల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నారని అన్నారు.కళాశాలల యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. దీనితో చివరి సంవత్సరం పూర్తి అయిన విద్యార్థులకు యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వటం లేదని అన్నారు.గత మూడు సంత్సరముల నుండి ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల
చేయకపోవడం బాధాకరమైన విషయమని అన్నారు. ప్రభుత్వం మాత్రం నిధులు విడుదల అని ప్రకటన ఇస్తుందే తప్ప అవి కళాశాలలకు మాత్రం రావడం లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ మాటలు కోటలు దాటుతాయి తప్ప చేతలు మాత్రం గడప దాటటం లేదని ఎద్దేవా చేశారు. వెంటనే బకాయిలు విడుదల చేసి విద్యార్థులను అలాగే యాజమాన్యాలను ఆదుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బిసి విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బియ్యని తిరుపతి,బిసి విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శులు రోహిత్, చింటు,అజయ్,సాయి,తదితర బిసి విద్యార్థి సంఘ నాయకులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులదే కీలక పాత్ర -ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అరిగల అశోక్ కుమార్

వాల్మీకి ఆవాసం, సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలు. -ఆర్ఎస్ఎస్ విభాగ్ సేవ ప్రముఖ్ ఆకు రాజేందర్

వేతనాలు,కూలీలు చెల్లించాలా పోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే - రాష్ట్ర మానవహక్కుల కమీషన్

ఉద్యోగులు, పెన్షనర్లకు రీయింబర్స్ మెంట్ తిప్పలు తీర్చాలి

అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది లారీలపై కేసు నమోదు

శ్రీమావురాల ఎల్లమ్మ ఆలయంలో బోనాల సందడి
.jpg)
గతంలో కన్నా ఈసారి బోనాల ఉత్సవాలు గొప్పగా జరిగాయి.
.jpg)
మాజీ వైస్ ఎంపీపీ ఆవుల సత్యం తల్లిబి పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం.... నివాళులు అర్పించిన మాజీ మంత్రి కొప్పుల,డిక్కీ జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్

నూతన విద్యుత్ పోల్స్ ను వెంటనే వేయించాలి
.jpg)
108 జిల్లా స్టార్ ఈ ఏం టి అవార్డు పొందిన అంకతి మనస
.jpg)
లయన్స్ క్లబ్ నవభారత్, వనిత భారత్ నూతన కమిటీల ఏర్పాటు
