డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం: జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్‌ను పాడుచేసుకోవద్దు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్
జగిత్యాల జూన్ 23 (ప్రజా మంటలు)
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయం లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.
ప్రతి సంవత్సరం జూన్ 26న నిర్వహించే అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహించే వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్,జిల్లా ఎస్పి అశోక్ కుమార్ మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించడం జరిగినది.
జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ మాట్లాడుతూ ... మాదకద్రవ్యాల దుర్వినియోగం-అక్రమ రవాణా అవగహన వారోత్సవాల సందర్భంగా డ్రగ్-రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న క్రమంలో మత్తు పదార్థాలను అరికట్టేందుకు ప్రజలు, యువత/విద్యార్థులు కలిసి కట్టుగా ముందడుగు వేయాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు.
మాదక ద్రవ్యాల బారిన పడుతున్న యువతను కాపాడేందుకు పోలీస్ శాఖ చేస్తున కృషి అభినందనీయమని అన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా మాదక ద్రవ్యాలపై అవగాహన పెంపొందించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణకు కూడా నాంది పలికినట్లైంది,” అన్నారు.
జిల్లా ఎస్పి అశోక్ కుమార్ మాట్లాడుతూ ... జిల్లాలో వారం రోజుల వరకు మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
యువత గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, కోరారు. జిల్లాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక టీం ను ఏర్పాటు చేయడం జరిగిందని, విద్యాసంస్థలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిరంతరంగా చేపడతామన స్పష్టం చేశారు. యువతలో మానసిక ధైర్యం పెంపొందించేందుకు పోలీస్ శాఖ కట్టుబడి ఉందన్నారు.
ఈ సందర్భంగా గా కలెక్టర్ , ఎస్పీ సిబ్బంది తో కలిసి “జాగ్రత్త!! మాదక ద్రవ్యాలు..మీ జీవితాన్ని నాశనం చేస్తాయి...డ్రగ్స్ కు నో చెప్పండి” అనే పోస్టర్లు రిలీజ్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన “ I AM ANTI DRUG SOLDIER” అనే సెల్ఫీ పాయింట్ వద్ద కలెక్టర్ ,ఎస్పీ మరియు ఇతర అధికారులు మరియు సిబ్బంది ఫొటోలు దిగారు.
ఈ యొక్క కార్యక్రమంలో అదనపు ఎస్పి భీమ్ రావు, డిఎస్పి రఘు చందర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు కిరణ్ కుమార్, వేణు, సైదులు, ఇన్స్పెక్టర్ లు శ్రీనివాస్,ఆరిఫ్ అలీ ఖాన్,కరుణాకర్, మరియు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వేతనాలు,కూలీలు చెల్లించాలా పోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే - రాష్ట్ర మానవహక్కుల కమీషన్

ఉద్యోగులు, పెన్షనర్లకు రీయింబర్స్ మెంట్ తిప్పలు తీర్చాలి

అక్రమంగా ఇసుక తరలిస్తున్న పది లారీలపై కేసు నమోదు

శ్రీమావురాల ఎల్లమ్మ ఆలయంలో బోనాల సందడి
.jpg)
గతంలో కన్నా ఈసారి బోనాల ఉత్సవాలు గొప్పగా జరిగాయి.
.jpg)
మాజీ వైస్ ఎంపీపీ ఆవుల సత్యం తల్లిబి పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణం.... నివాళులు అర్పించిన మాజీ మంత్రి కొప్పుల,డిక్కీ జిల్లా కోఆర్డినేటర్ నల్ల శ్యామ్

నూతన విద్యుత్ పోల్స్ ను వెంటనే వేయించాలి
.jpg)
108 జిల్లా స్టార్ ఈ ఏం టి అవార్డు పొందిన అంకతి మనస
.jpg)
లయన్స్ క్లబ్ నవభారత్, వనిత భారత్ నూతన కమిటీల ఏర్పాటు

పల్లెల్లో పడకేసిన పారిశుద్ధ్యం...వర్షాకాలం కావడంతో విషపురుగులు ,దోమలతో అనారోగ్యాలు

గీత సత్సంగ్ ఆధ్వర్యంలో భగవద్గీత శిక్షకునికి జ్ఞాపిక అందజేత
