మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి 19వ వార్షికోత్సవ ముందస్తు ఏర్పాట్ల సమీక్ష సమావేశం
హైదరాబాద్ జూన్ 19 ( ప్రజా మంటలు)
మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి
వచ్చేనెల ఆషాఢ శుద్ధ సప్తమి 02/07/2025 బుధవారం నుండి ఆషాఢ శుద్ధ ఏకాదశి 06/07/2025 బుధవారం జరుప సంకల్పించిన 19 వ వార్షికోత్సవ ముందస్తు ఏర్పాట్ల గురించి ఉత్సవ కమిటీ సమావేశం జరిగింది.
ఈ సంవత్సరం వార్షికోత్సవాన్ని భాగ్యనగరం లోనే నిర్వహించాలనే సంకల్పించి, విశ్వావసు ఉగాదిన ఏర్పడిన షష్ఠ గ్రహకూటమి దాని ప్రభావం వల్ల ఏర్పడిన యుద్ధ వాతావరణం అదే విధంగా ఇటీవల జరిగిన గుజరాత్ విమాన ప్రమాదం ఇలాంటి ఉపద్రవాలను అధిగమించాలని సంకల్పించి
హైదరాబాద్ మల్లాపూర్ లోని వీ ఎన్ ఆర్ గార్డెన్స్ వేదిక గా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని సంస్థ అధ్యక్షులు మహాదేవభట్ల లక్ష్మణప్రసాద్ శర్మ తెలిపారు.
వార్షికోత్సవానికి రోజుకు దాదాపు గా 1000 మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని వచ్చిన భక్తులకు అన్నప్రసాదము అందిచే ఏర్పాటు చేస్తున్నామని సంస్థ ప్రధాన కార్యదర్శి యలమంచి రామకృష్ణ శర్మ తెలిపారు.
ఉత్సవ కమిటీ చైర్మన్ వడిగిచర్ల విష్ణుమూర్తి శర్మ మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవాసమితి ప్రముఖ పుణ్యక్షేత్రాలలో వార్షికోత్సవాలను నిర్వహించామని ఈ సంవత్సరం హైదరాబాద్ వేదికగా వార్షికోత్సవము జరుపుతున్నామని తెలిపారు.
వార్షికోత్సవము లో భాగంగా మీన రాశి లో ఏర్పడిన షష్ఠగ్రహ కూటమి ప్రభావం తగ్గించడానికి నవగ్రహ పాశుపత రుద్రాభిషేకము దేశ ప్రజలందరూ ఆరోగ్యాన్ని ఆకాంక్షిస్తూ ఆరోగ్య పాశుపత రుద్రాభిషేకమును అభిషేకమునకు, పెళ్ళి కాని అబ్బాయిలకు అమ్మాయిలకు ప్రత్యేకంగా వివాహ రుద్రాభిషేకమును పాశుపత అభిషేకము, మరియు పెళ్లి అయిన జంటలకు సంతాన ప్రాప్తి కొరకు సంతాన పాశుపత రుద్రాభిషేకమును జరుపుటకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఈ కార్యక్రమం ద్వారా భక్తులందరూ వారి వారి కోరికలు తీర్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి భక్తులు విశేష సంఖ్యలో పాల్గొనాలని సంస్థ కన్వీనర్ సిరిసిల్ల రాంప్రసాద్ శర్మ తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నూతన విద్యుత్ పోల్స్ ను వెంటనే వేయించాలి
.jpg)
108 జిల్లా స్టార్ ఈ ఏం టి అవార్డు పొందిన అంకతి మనస
.jpg)
లయన్స్ క్లబ్ నవభారత్, వనిత భారత్ నూతన కమిటీల ఏర్పాటు

పల్లెల్లో పడకేసిన పారిశుద్ధ్యం...వర్షాకాలం కావడంతో విషపురుగులు ,దోమలతో అనారోగ్యాలు

గీత సత్సంగ్ ఆధ్వర్యంలో భగవద్గీత శిక్షకునికి జ్ఞాపిక అందజేత

అంబిటస్ స్కూల్లో అంబరాన్నాంటిన బోనాల సంబరాలు

ధర్మపురిలో యమునికి భరణీ నక్షత్ర విశేష పూజలు

జగిత్యాల జిల్లా కిషన్ రావుపేటలో పరువు హత్య - ఇద్దరి అరెస్ట్!
.jpg)
శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం భూ సేకరణ విస్తరణను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

మల్యాల గొల్లపల్లి సబ్ డివిజన్ విద్యుత్ సిబ్బందితో ఎస్.ఈ సుదర్శనం సదస్సు

జిల్లా స్థాయి అథ్లెటిక్స్ లో గర్ల్స్ హై స్కూల్ విద్యార్థుల ప్రతిభ

గొల్లపల్లి మోడల్ స్కూల్ లో ఘనంగా తెలంగాణ బోనాలు
