వికసిత భారత్ లో పాలు పంచుకోండి.
ఒక్క మిస్ కాల్ తో ప్రాథమిక సభ్యత్వ నమోదు కార్డు లభ్యం.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
రాయికల్ ఆగస్టు 30( ప్రజా మంటలు) :
భారతీయ జనతా పార్టీ రాయికల్ పట్టణ, మరియు రాయికల్ మండల్ సభ్యత్వ నమోదు వర్క్ షాప్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా. బోగ శ్రావణి
ఈ సందర్భంగా డాక్టర్ బోగ శ్రావణి మాట్లాడుతూ....
బిజెపి సభ్యత్వం తీసుకొని వికసిత భారత్ లో పాలుపంచుకోవాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ బోగ శ్రావణి అన్నారు.
బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం 2024 కార్యశాల కార్యక్రమంలో పాల్గొని ప్రతి నాయకులు కార్యకర్త ప్రతి బూత్ లో 200 మంది సభ్యత్వం చేయించాలన్నారు, సభ్యత నమోదు కోసం 8800002024 నెంబర్ కి మిస్ కాల్ ఇవ్వడం ద్వారా ప్రాథమిక సభ్యత్వ నమోదును కార్డును ఆన్లైన్ ద్వారా పొందవచ్చు, రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయడం ద్వారా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారు అవుతారన్నారు.
ఈ కార్యక్రమంలో రాయికల్ పట్టణ అధ్యక్షులు కల్లెడ ధర్మపురి, రాయికల్ మండలం ప్రధాన కార్యదర్శిలు ఆకుల మహేష్, తీపిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ప్యాక్స్ చైర్మన్ ముత్యంరెడ్డి, రాష్ట్ర కిషన్ మోర్చా కార్యవర్గ సభ్యులు మంగళారపు లక్ష్మీనారాయణ, కుర్మా మల్లారెడ్డి, సీనియర్ నాయకులు మచ్చ నారాయణ, శివనీతి రమ్య, మరియు పట్టణ మరియు మండల పదాధికారులు ముఖ్య నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.