సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
(రామ కిష్టయ్య సంగన భట్ల)
ధర్మపురి ఆగస్టు 29:
సీజనల్ వ్యాధుల పట్ల వైద్యులు అప్రమత్తంగా ఉండాలని, అవడమైన మాఅందులను కూడా అందుబాటులో ఉంచాలని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు. ధర్మపురి పట్టణంలోని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం మండల నాయకులు, అధికారులతో కలిసి పరిశీలించారు. ఆసుపత్రిలోని గదులు పరిశీలించి, మెడిసిన్స్, బెడ్స్, వైద్య సదుపాయాలు తదితర వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం రోగులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ...
ధర్మపురిలో సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించడం జరిగిందని, ఆసుపత్రిలోని వైద్య పరికరాలు, బెడ్స్, ల్యాబ్, గదులను పరిశీలించి వైద్యులతో మాట్లాడటం జరిగిందని, మెడికల్ పరంగా కొంత ఎక్యుప్
మెంట్ అవసరం ఉందని, వైద్య సిబ్బంది కూడా తక్కువ ఉన్నారని, బెడ్ల సంఖ్య కూడా పెంచాలని తమ దృష్టికి తీసుకురావడం జరిగిందనీ, వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని, ఆసుపత్రి పరిసరాలు కూడా ఎప్పటికపుడు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రికి అదనంగా కొంత వైద్య సిబ్బందిని కూడా నియమించే విధంగా చర్యలు తీసుకుంటామని, మాతా శిశు ఆసుపత్రి కూడా త్వరలోనే ప్రారంభించే విధంగా చొరవ చూపుతామని, వైద్య పరమైన ఎటువంటి సహకారం కావాలన్న అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉంచాలని, వైద్య సేవలు అందించే విషయంలో ఎక్కడ రాజీ పడే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో వైద్య అధికారులు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.